స‌మాజ ఉన్న‌తీక‌ర‌ణ కోసం విద్య‌

| సాహిత్యం | స‌మీక్ష‌లు

స‌మాజ ఉన్న‌తీక‌ర‌ణ కోసం విద్య‌

- సమీర | 16.06.2019 10:05:05am

అక్ష‌రం ప్ర‌జ‌ల ప‌క్షం వ‌హించాలి. ర‌చ‌యిత సామాజిక బాధ్య‌త‌ను గుర్తెర‌గాలి. స‌మాజ పురోభివృద్ధిలో ర‌చ‌యిత భాగం కావాలి. స‌మాజం నుంచి స‌మాజానికి జ్ఞానాన్ని... అందించే క్ర‌మంలో ఎంద‌రో ర‌చ‌యిత‌లు అక్ష‌రాల్ని ఆలంబ‌న చేసుకున్నారు. అలాంటి ర‌చ‌న‌ల‌ను ʹఅక్ష‌ర స‌మీరాలుʹ కాల‌మ్ ద్వారా ప‌రిచ‌యం చేస్తున్నారు స‌మీర‌. విర‌సం ఆన్‌లైన్ మ్యాగ‌జైన్ ప్రారంభించిన ఈ కాల‌మ్‌లో... ఈ సారి ఆకుల భూమ‌య్య ʹశాస్త్రీయ విద్యా విధానంʹ పుస్త‌కాన్ని ప‌రిచ‌యం చేస్తున్నారు

ʹʹ ʹదేశ‌ భవిష్య‌త్తు త‌ర‌గ‌తి గ‌దిలో నిర్మాణం అవుతుందిʹ అనే మాటలు తరచుగా వింటుంటాం. ఈ మాటలను సమాజా భివృద్ధిని కాంక్షించే వారే కాదు అభివృద్ధి నిరోధకులూ అంటుంటారు.ʹ అనే నలమాస కృష్ణ‌ పరిచయ మాటలతో ఆకుల భూమ‌య్య రాసిన‌ ʹశాస్త్రీయ విద్యా విధానంʹ పుస్త‌కాన్ని తెలంగాణా విద్యార్థి వేదిక ప్రచురించించింది.

మార్క్సిస్టు తాత్విక రాజకీయ ఆలోచనా ధారచే ప్రభావితుడైన ఉపాధ్యా యుని ఆలోచనలలో నుండి ఆవిర్భవించినదే ఈ ʹశాస్త్రియ విద్యా విధానంʹ సంకలనం.

ఉపోధ్ఘాతంలో.. ʹమన భారతదేశంలో ప్రాచీన కాలం నుండి మధ్య యుగాల వరకు, విద్యకు పరమార్థం మోక్షసాధనగానే ఉంది. ఇందుకు ఉదాహరణ: భాగవతంలో ప్రహ్లాదుడు తండ్రితో ʹనే చదివినవి పెక్కుంగలవు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీʹ ఆ మర్మము మోక్ష సాధనే. మొగల్ సామ్రజ్య కాలంలో కూడా మతవాద విద్యే, బ్రటిష్ వారు వ్యాపార నిమిత్తం వచ్చినపుడైనా, కంపెనీ వ్యవహారాల నిర్వహణకోసం, తమ పాలనకోసం నమ్మకంగా నిర్వహించే బ్యూరోక్రాట్ల కోసం, ఇంగ్లీషు విద్యను ప్రవేశపెట్టడంతో ఫార్మల్(నియత) విద్యావిధానం ప్రారంభమై హిందూ పురోహిత, అగ్రవర్ణ, ముస్లిం సంపన్నవర్గాలు ప్రభుత్వ అధికారులుగా, ఉద్యోగులుగా స్థిరపడి ʹజీవికను చూసుకోవడంʹ ప్రారంభమైంది.ʹ అన్నారు. ఇక్క‌డ జీవిక‌ను చూసుకోవ‌డం అనే మాటలు పొసగలేదు. జీవిక కోసం కాదు, మత అగ్రవర్ణ పురోహితవర్గ స్వభావమే,ʹఅందితే జుట్టు అందకుంటే రాజీʹ అనే స్వభావమే.

ʹమొత్తం మీద మోక్షసాధన నుండి లౌకిక అవసరాలకు విద్య అనేభావన, ఫార్మల్ విద్యావిధానం ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యానికి ఊడిగం చేయడానికే ఉపయోగపడిందిʹ అనే వాక్యంలో కూడా ʹఅవసరాలకుʹ అనే మాట స్థానంలో సౌకర్యలకు విలాసాలకు అనే మాట ఉపయుక్తంగా ఉండేది.

తర్వాత విద్యా లక్ష్యాలు పౌరలౌకిక ఐహిక ప్రయోజమనాలకు, బ్రతుకుదెరువుకు విద్య అనేది స్పష్టమైపోయిందనే మాటలు అక్షర సత్యాలు.

ʹ1947 తర్వాతనైనా దేశ అవసరాలేమి? వనరులేమి? అనే విషయాన్ని శాస్త్రీయంగా విశ్లేశించి మనదేశ అవసరాలను సామాజిక ప్రయోజనాలను ప్రతిబింబించే విద్యావిధానాన్ని ఏర్పరచడానికి బదులుగా పాతవిధానాన్నే కొనసాగించడం జరిగింది. 20 సంవత్సరాలలోనే దానిలోని సంక్షోభం బట్టబయలై, లక్షలాది యువకులు నిరుద్యోగులుగా వీధులవెంట తిరగడం, పేదరికం పెరిగి పోవడం... అన్ని రంగాలలో పరాధీనత పెరిగి పోయిందిʹ అనేమాటలు మనకు 1970-80 వ దశకంలోని రెండు సినిమాపాటలు..ʹగాంధి పుట్టిన దేశమా ఇది.. అర్హతలేని ఉద్యోగాలకు లంచం.. ఓ యస్స‌, ʹ సాపాటు ఎటూలేదు.. డిగ్రీలు పట్టుకొని చిప్పచేత బట్టుకొని దేహీ దేహీ అంటున్నాముʹ గుర్తుకు తెస్తవి.

ఇట్లా మధ్య, పూర్వ యుగాలనుండి స్వాతంత్ర్యానంతరం తరువాత కూడా, మత సంస్థలైన క్రిస్టియన్ మిషనరీలు, శిశుమందిర్ లు, ముస్లిం మైనారిటీ సంస్థలకు విద్యాలయాల స్థాపనకు అనుమతులిచ్చి, మత ఛాందసా భిప్రాయాలను, క్రిస్టియన్ మతసంస్థల విద్యాలయాలయాల్లో ఉన్నతవర్గ స్థాయి పిల్లలకు ఆంగ్లభాషతో పాటు దోపిడీ పద్ధతుల, పాశ్చాత్య సంస్కృతి అలవర్చిన విధానాలు నేటికీ కొనసాగుతున్న అశాస్త్రీయ విద్యావిధాన దుష్ఫలితాలు వివరిస్తూ, శాస్త్రీయ విద్యావిధానాల గురించి వివరిస్తారు.

ప్రత్యేక పాఠశాలల వలన విద్యార్థుల మనసులల్లో, ఈర్శ్యాద్వేశాలు తద్వారా ఘర్శణలకు దారితీస్తాయని గుర్తుచేసి, కమ్యునిటీ, ప్రభుత్వ అధ్వర్యంలో నెలకొల్పే common school system ఎట్లా మెరుగో వివరిస్తారు. విద్యార్థుల్లో సామాజిక ఐక్య‌త స్పృహ, దృక్ప‌తాలు ఏర్పడతా యంటరు. ఈ ఒకే రకమైన విద్యా సంస్థలను ప్రభుత్వమే ఖర్చు భరించి, పై నుండి కింది స్థాయిదాకా, విద్యార్థులు - ఉపాధ్యాయులు - విద్యాభిమానులు - విద్యావేత్తలు - తల్లిదండ్రుల సంఘాలు సమపాళ్ళ భాగస్వామ్యం ఉండే స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన విద్యాబోర్డుల యాజ మాన్యంలోనే విద్యాబోధన సాగించాలంటరు.

సిలబస్, కరిక్యులం అమలు కు సంబంధించి, CABC, CASE, NCERT, SCERT లాంటి సంస్థలుండగా, ప్రైవేటు యాజమాన్యాలకు తమ ఇష్టం వచ్చిన, సిలబస్ కరిక్యులం అమలు పరిచే స్వేచ్ఛ కల్పన సరికాదంటారు ర‌చ‌యిత‌.

యశ్‌పాల్‌ కమిటీ 1993లోనే సూచించిన విధంగా గాక, విద్యార్థి పాఠశాలలోనే రోజుకు 7/8 గంటలు గడిపే విధానం సరికాదని, చిన్నతనంలో వేరేభాషలు నేర్పడం సరికాదనే పిల్లల మనస్తత్వ నిపుణుల అంచనాను గుర్తు చేసి, మాతృభాషలోనే అన్ని పాఠ్యాంశాలు నేర్పాలని, లేతవయసులో పరభాషా ఉచ్ఛరణకు vocalcards ఎదగవనీ, అందువల్ల వాళ్ళు చాలా ప్రయాస పడవలసి వస్తుందనే నిపుణుల అభిప్రాయాన్నిగుర్తుచేస్తారు.

విద్యాలయాలలో వ్యాయామ విద్యప్రాముఖ్యత గురించి ప్ర‌స్తావిస్తూ.. ʹసమాజాన్ని, దేశాన్ని,జాతిని రక్షించుకోడానికి మంచి దేహధారుఢ్యం కలిగిన యువకులు సైన్యం అవసరమౌతవి. అన్యాయాన్నెదుర్కొనే ధైర్య స్థైర్యాలు, వ్యాయామంవల్ల ఒనగూరుతవి. మేధోశ్రమ చేయాలంటే కూడా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం అనివార్యంస‌ భాష, శాస్త్రాల బోధన విషయంలో దేనిదారి అదే అనే వైఖరి కాకుండా, వైరుధ్యాలు, తికమకలకు తావివ్వని విధంగా సమగ్ర సహ సంబంధం ఉండాలిస‌ అని సోదాహరణంగా వివరిస్తారు.

ఐతే, ʹచంద్రుడు ఆటవస్తువని చెప్పాలా? ఉపగ్రహమనిచెప్పాలా?ʹ అన్నమాటల్లో తుంటరి తనం ఉంది. ఇది ప్రసంగ ఔన్నత్యాన్ని పలుచబార్చింది. విజ్ఞాన శాస్త్రాల బోధన కృత్యాధారంగా, సామాజిక శాస్త్రాలైన, భూగోళ, అర్థ, పరిపాలనా శాస్త్రాల బోధనలో వీలైనంత మేరకు పర్యటన సందర్శనలు, అధికార్ల తో ప్రత్యక్ష విషయానుభవాలకు సంబంధించి ఇంటర్వూల రూపంలో, అట్లే స్థానిక అందుబాటులోని పరిశ్రమల సందర్శన యాజమాన్య విధానాలు, ఒక యంత్ర నిర్మాణానికిగాను, శ్రమవిభజన, కూర్పు సమన్వయాల సహ సంబంధాలను చూపించి, మొత్తంగా ఉత్పత్తి అనేది సమిష్టి సమన్వయ సహకారాలేనే అవగాహన స్పష్టపరచాలి.

ఆవిధంగా వ్యవసాయంతోపాటు అన్ని ఉత్పత్తులు, సమిష్టి కృషి ఫలితాలేనే స్పృహ కల్గించి సమిష్టి జీవన ఉత్పత్తి, నాగరికతాభివృద్దిలో సమిష్టిత్వంలోని సౌకర్యం వేగాలను వివరించాలి అంటారు భూమ‌య్య‌.

ఇక జీవ వృక్ష శాస్త్రాల అధ్యనంలో కూడా క్షేత్ర ప్రత్యక్షానుభవంతోనే సమాంతర బోధన జరగాలని అంటారు. వైద్యశాస్త్రం, నర్సింగ్ లు, పాథాలజి కూడా డిగ్రీ స్థాయివరకు అందరికీ స్థూల అవగాహన ఉండేలా సిలబస్ కరిక్యులం రూపొందించా లని, ఇప్పటి లాగా ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ స్థాయిల నుండే కంపార్ట్ మెంటలైజ్ సరికాదనీ, అందువల్ల ఏ అభ్యసమైనా మరొకదాని కంటే పెద్ధదని లేదా చిన్నదనే భావం, inferior/superior భావాలకు తావివ్వకుండా ప్రతి అభ్యసనమూ సమిష్టి సామాజికాభివృద్ధికనే సంస్కారాన్ని పెంపొందించాలనే విధంగా, సమగ్ర మానవ రూపకల్పన నిర్మాణ దిశగా, విద్యాశిక్షణ లుండాలనీ, స్పెషలైజేషన్లు మాత్రం వాళ్ళవాళ్ళ ఆసక్తి ప్రతిభల స్థాయిని అంచనా వేసి, బోధనా సిబ్బంది తగు విచక్షణాయుత సూచనతో ప్రోత్సహించి కల్పించాలి అనీ అంటారు.

విద్యావిధానంలో పోల్చే, పోటీ తత్వాలకు తావివ్వకుండా, స్త్రీ పురుష లింగ భేదాలనేవి సృష్టి, ప్రతిసృష్టి కవసరమైన ప్రకృతి సిద్ధ నిర్మాణాలేయనీ, సామర్థ్య హెచ్చు,తగ్గులలో తేడా ఉండవనే విషయాన్ని అతి జాగరూకతతో బోధనాభ్యసన ప్రక్రియ ఉండాలనీ, ప్రతి వ్యక్తీ సమూహం కోసం, సమూహం వ్యక్తికోసమనే సోషలిస్టు తరహా సామాజిక వ్యవస్థ నిర్మాణ దిశగా విద్యా శిక్షణ ఉండాలనీ సారాంశీకరిస్తారు.

No. of visitors : 397
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దేశం ప్రశాంతంగానే వుంది

వీరబ్రహ్మాచారి | 16.04.2019 12:18:31pm

ʹవాడు నన్ను కలం పట్టొద్దన్నాడు ఒళ్ళు మండి పోయింది చల్లబడ్డాక ఆలోచించాను... ఇప్పుడు పట్టాల్సిది కలం కాదని!ʹ ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
  జీవితం పరిమళించిన కథలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •