పాతబడిన దేహపు రొద ʹవృద్ధోపనిషత్‌ʹ

| సాహిత్యం | స‌మీక్ష‌లు

పాతబడిన దేహపు రొద ʹవృద్ధోపనిషత్‌ʹ

- డాక్టర్‌ వెల్దండి శ్రీధర్‌ | 16.06.2019 10:11:38am

వృద్ధులరటే
శీగి పొదలు నిండిన
అరణ్య యానంలో
పిల్లబాటలను చెక్కిన కంకణబద్ధులు,
సంసార మహాసాగరంలో
తడిసిపోయిన మమతల ముద్దలు,
జీవన వేదికపై
తల్లీ తండ్రీ
తాతా గురువుల పాత్రలు
నిర్వహిరచిన సిద్ధులు.

ఇప్పుడంతటా మైక్రోఫ్యామిలీసే విస్తరించిన నేపథ్యంలో వృద్ధులకు ఇవాళ ఇంట్లో చోటులేదు. వాళ్లను పాత సామాను కింద జమచేసి వృద్ధాశ్రమాల్లోకి విసిరేస్తున్నాం. ఫలితంగా సమాజం మానవీయ విలువలు లేకుండా, నైతిక విలువలు మర్చిపోయి మృగప్రాయంగా తయారైంది. ప్రతిమనిషి వృద్ధాప్యాన్ని ఒక రోగంగా, నేరంగా భారంగా భావించి వృద్ధాప్యాన్ని ఏవగించుకుంటున్నాడు. కాని ఏ మనిషైనా తప్పనిసరిగా చేరాల్సిన చిట్టచివరి మజిలీ వృద్ధాప్యమే. తెలుగులో బాల్యర మీద వచ్చినంత కవిత్వం వృద్ధాప్యం మీద రాలేదు. అక్కడక్కడ కొరత మంది సీనియర్‌ కవులు ముదిమి మీద కవిత్వం రాయకపోలేదు. కాని ముసలితనంలోని అనేక పార్శ్యాలను తడుముతూ ఒక కావ్యాన్నే రాయడం చాలా అరుదు. దీన్ని బద్దలు కొట్టి వృద్ధుల ప్రపంచంపై డా. ఎన్‌. గోపి రాసిన తాజా కవితా సంపుటి ʹవృద్ధోపనిషత్‌ʹ.

ʹʹఒంటరితనమంటే
తాను కూర్చున్న కుర్చీ
ఒక శిలాజంగా మారిపోవడం
ఎదుటివారు మాట్లాడే ప్రతి మాటా
డొల్లగా మారి
హృదయానికి గుచ్చుకోవటం
ఒక కన్నీటి చుక్క
యేరులై, నదులై
సముద్రమై పొంగిపొర్లటం
చనిపోయిన సహచరి
ఫోటోలోంచి జాలిగా పలుకరించటంʹʹ

రక్తమంతా చల్లబడిపోయి, అవయవాలన్నీ కదలడానికి మొరాయించి, పడక కుర్చీనో, మంచాన్నో నేస్తున్నప్పుడు ఎడారి లాంటి ఒంటరితనాన్ని భరించడం చాలాకష్టమైన పని. గడిచిన జీవితకాలపు జ్ఞాపకాలన్నీ ఒక్కోటి నిద్రలేస్తుంటాయి. వసంతకాలం నాటి రంగులన్నీ మాయమైపోయి ఒక తెల్లని శూన్యం మనసంతా ఆవరిస్తురటుంది. చుట్టూ రాళ్లలాంటి మనుషులెంత మంది ఉన్నా ఒక్క పలకరింపూ లేక నిశ్శబ్దం మెల్లమెల్లగా హృదయాన్ని కోస్తూ వెళ్తుంది. అందుకే ఒంటరితనం ʹవృద్ధాప్యానికి పూచే పిచ్చిపువ్వుʹ అంటాడు కవి.
ʹʹశత్రువులెప్పుడూ లేరు
ఇప్పుడు ముసలితనమే ఓ దుష్మన్‌!
ఎవరిపైనా షికాయత్‌ లేదు
ఉంటే దేవునిపైన
కాని అతడేదీ వినడుʹʹ

శరీరం రోజుక్కొరత శిథిలమవుతూంటుంది. మనం పిలవకుండానే మడతల్లాంటి ముడతలు ముఖం మీదికి వచ్చి కూర్చుంటాయి. కాలం తెచ్చిన మార్పుకు ఎవరి మీద ఫిర్యాదు చేయాలి? చేస్తే గీస్తే కనిపించని దేవునిపైనే చేయాలి. న్యాయదేవతకు కళ్లుండవు కాని చెవులుంటాయి. దేవునికి కళ్లుంటాయి కాని చెవులుండవు. అందుకే అతడేదీ వినడు. ఇక మనకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? అప్పుడు జీవితం బతికి తీరవలసిన విధిగా తోస్తుంది. కానైతే ఇక్కడొక ఇబ్బంది. జీవితమంతా ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, బాధలు, నొప్పులుగానే గడిచిపోతుంది. చివరి మజిలీలోనైనా కాస్త ఊరట దొరకుతుందేమోనని ఆశ. అదీ దొరక్కపోతే గడవాల్సిన క్షణాలన్నీ ముళ్ళుగానే తోస్తాయి.

ʹʹమనల్ని కవులుగా మార్చిన ప్రేమ
ఇప్పటికీ
కరుణకాంతుల్తోనే వుంది.
కాకపోతే
ప్రియురాలి చేతులిప్పుడు
తామర తూడులు కావు.
ముఖంలో చంద్రబింబం లేదు
నడకలోంచి
రాజహంసలు తొలిగిపొయ్యాయి.

ప్రేయసి పాతబడుతుందేమో కాని ప్రేమ పాతబడదు. యవ్వనపు తొలివాకిట్లో నిలబడి నచ్చిన సుందరిని ఎదనిండా నింపుకున్నప్పుడు ఏదో కొత్త వెలుతురు హృదయం నిండా పరుచుకుంటుంది. అప్పుడు మాట్లాడే ప్రతిమాటలో ఎంతో భావుకత తొంగి చూస్తురది. ఆ మూగ ప్రేమలో ఎన్నో మౌనపరిమళాలు. అయితే విషాదం ఏమిటంటే ఆ ప్రియురాళ్లు కూడా ఇప్పుడు మనలాగే ముసలివాళ్లు అయిపోవటం. ʹకాని ఆనాటి మన చిరునవ్వులు ఎప్పటికీ వాడని పువ్వులు. అప్పటి మన ఆత్మలు అఖండంగా వెలిగే దీపాలుʹ. కాలం ఎంత టువైంది? ఆమెకు కూడా ముసలితనాన్ని ప్రసాదించింది. ʹఒకప్పటి నా అందాల సుందరి తరగని అనురాగరాగిణి కూడా ముసల్ది అయిందేʹ అని కవి ఆశ్చర్యపోతుంటాడు. అయినా ఇప్పటికీ ఆమె మీదే ఆధారపడటం ఒక తప్పని జీవన వాస్తవం.

ʹʹఅమ్మాయీ!
గ్లాసు నీళ్లు తెచ్చి పెట్టమ్మా
కోడలికి వినపడిందిగాని
వినబడక పోవటంతో సమానంʹʹ
****
కాస్సేపు
నిశ్శబ్దం రాజ్యమేలింది
ఎవరు నింపారో తెలియదుగాని
అతని కళ్లనిండా నీళ్లు!ʹʹ

ఇంట్లో చాలా చేతులుంటాయి కాని అవి ఏవేవో పనుల్లో బిజీగా వుంటాయి. పలకరిరచకపోతే పలకరించక పోయారు కనీసం గొంతు తడుపుకోవడానికి గుక్కెడు మంచి నీళ్లు కూడా ఇచ్చే తీరిక లేకపోతే ఎట్లా? అరచి అరచీ, కుమిలీ కుమిలీ చివరాఖరికి కళ్లనిండా నీళ్లు తెచ్చుకోవటం మినహా ఏమీ మిగలదు. నిజానికి వృద్ధాప్యం శాపం కాదు. కానీ పట్టిరచుకోకపోవడం వల్లే అది శాపంతో సమానంగా మారిపోతుంది. ఒకప్పుడు ఇంటికి అన్నీ సమకూర్చిన చేయి అది. ఇప్పుడది ఏ ఆసరా లేక లోకం చూపించే నిర్లక్ష్యానికి వణికిపోతుంది. ʹవృద్ధుడంటే ముసలివాడని కాదు. వృద్ధి పొందిన వాడనిʹ ఈ ప్రపంచం ఎప్పుడు తెలుసుకుంటుందో!
ʹʹమొట్టమొదటి సారి కొడుకులు
గద్దల్లా కనిపిస్తున్నారు
వద్దురా!
నా మందులగ్గావాల్రా
ఆకు వక్కలు కొనుక్కురట బిడ్డా!
అని శోకాలు పెట్టింది ముసల్ది
ఎవడు వింటడు!
యముడు ప్రాణాలు లాక్కుపోతున్నట్టు
పైసలు వదలదీసిండుʹʹ

వయసులో సంపాదించిన ధనమైనా ఉండాలి. కొడుకులైనా ఉండాలనేది ఒక జీవన సూత్రం. జనాభాలో తొంభైశాతం పేదరికపు బతుకులే కాబట్టి వాళ్ల దగ్గర డబ్బురడే అవకాశమే లేదు. ఓట్ల కోసమో, వృద్ధుల మీద నిజమైన ప్రేమోకాని ప్రభుత్వాలు గత కొరత కాలంగా ఓల్డేజ్‌ పెన్షన్‌లు మంజూరు చేస్తున్నాయి. వాటినీ ఒలుచుకుపోయే క్రూరమైన కొడుకులున్న కాలం ఇది. పెరుగుతున్న బిపి, షుగర్‌లను తగ్గించుకునేందుకో, బుక్కెడు బువ్వ కోసమో పొదుపుగా వాడుకుంటున్న పెన్షన్‌ కాస్తా కొడుకుల పాలయ్యాక ముసలి ప్రాణానికి మళ్లీఖాళీ చేతులే మిగులుతాయి.

బాల్య, కౌమర, యౌవన, వృద్ధాప్య దశల్లో మనిషి చేరుకునే దయనీయమైన దశ నిస్సందేహంగా వృద్ధాప్యమే! చూస్తూ చూస్తూ ఉండగానే రుతువులన్నీ మారిపోయి శిశిరమొక్కటే మన నెత్తి మీదికి వచ్చి కూర్చుంటుంది. శరీరం పటుత్వం తప్పి ఒక్క అడుగు వేయడం దుర్భరమైపోతుంది. విశాల ప్రపంచాన్ని చుట్టి వచ్చిన కాళ్లు ఒక్క చిన్న గదికో, రేకుల షెడ్డుకో పరిమితమై జ్ఞాపకాలు కాకుల్లా పొడుచుకుతింటాయి. మన అస్తిత్వమే ప్రశ్నార్థకమై భయకంపితుల్ని చేస్తుంది. కూలిపోతున్న శరీరాన్ని మళ్లీ ఎలా కూడదీసుకోవాలో అర్ధంగాక మనసు నరక కూపంలో చిక్కుకుంటుంది. ఎంగిలి విస్తరాకులాంటి ముదుసలి ప్రాణాన్ని ఎట్లా విదుల్చుకోవాలో అర్ధంగాక లోకం తలపట్టుకుంటుంది. కాని వృద్ధాప్యం చాలా విలువైందని, అదొక జీవన సారాంశ దశ అంటాడు కవి ఇందులో. ʹవృద్ధాప్యానికి ఎదురయ్యేసమస్యలు దైహికం, మానసికం, సామాజికం అని స్థూలంగా మూడు రకాలుగా వుంటాయి. ఇంకెన్నో!? వృద్ధులు శారీరక శైథిల్యం, తరాల అంతరం, నిరాదరణ, ఒరటరితనం, నాస్టాల్జియా, మతిమరుపు, మృత్యుభయం వంటి పలుసంక్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకొని వుంటారు. అయినా జీవన పరిణతి, ప్రేమతత్త్వం, సంతృప్తి వంటి వెలుగులు కూడా ఉంటాయి. వృద్ధాప్యదశలోని దైన్యాన్ని ఒకానొక చైతన్యంతో అధిగమించవచ్చునని నా కనిపించింది. ఉన్న కాస్త కాలంలో నిరాశను దగ్గరకు రానీయకూడదనీ, మృత్యువును సహజ ప్రక్రియగా స్వీకరిస్తూ తాత్త్వికంగా కూడా దర్శించవచ్చుʹనంటాడు కవి.

అనుభవాల తేజస్సుతో నిండిన వృద్ధాప్యపు పలు అరచుల్ని ఈ ʹవృద్ధోపనిషత్‌ʹ చాలా మర్యాదగా మన మనస్సుల్లోకి ఒంపుతుంది. వృద్ధులు ఇంటికి వెళ్లాడిన గబ్బిలాలు కాదని సంసారానికి దారిదీపాల్లాంటి వారని ఇందులోని ప్రతి అక్షరం రసార్ద్రంగా చెబుతుంది. ముదిమిని ఇష్టంగా అంగీకరించాలని, దృష్టి మార్చి చూస్తే ʹముదిమి ఒక పగడాలదీవిʹ అంటుంది ఈ కవితా సంపుటి. వయసు శరీరానికే కాని మనసుకు కాదని గొప్ప చైతన్యాన్ని నింపుతుంది. వృద్ధుడంటే మమకారాల చెట్టు అని, శారతిని వెదజల్లే రత్నదీపమని ధ్వనిరపజేస్తుంది. ఈ కావ్యం. మరణశయ్య మీదున్న వృద్ధాప్యాన్ని చీదరించుకోవడం కాదు దాని వెలుతురును ఆవాహన చేసుకోవాలని ప్రతి కవిత ఎలుగెత్తి చాటుతుంది. ʹవృద్ధాప్యం అకస్మాత్తుగా ఊడిపడింది కాదు. శరీర మహారణ్యంలోంచి ఇప్పుడు బయట పడిందంతేʹ అని పండుటాకుల పట్ల మన చూపును సవరించే కావ్యం. ఇప్పటి కాలానికి ప్రతి మనిషికి అత్యవసరమైన ఔషదం.

No. of visitors : 464
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ధిక్కార భాస్వరం ʹఅవుటాఫ్‌ కవరేజ్‌ ఏరియాʹ

వెల్దండి శ్రీధర్‌ | 16.07.2017 08:31:51am

ఈ సంపుటిలోని ప్రతి కథ ఆధిపత్య వర్గాల పునాదులను కదిలించే కథ. ఇప్పుడు రెండే కులాలు ఒకటి ధనిక, మరొకటి పేద అని అనుకుంటాం కాని తెర వెనక కులం పోషించే పాత్రను........
...ఇంకా చదవండి

దు:ఖం చేత దు:ఖం కొరకు దు:ఖం వలన

డా. వెల్దండి శ్రీధర్‌ | 01.10.2018 05:23:40pm

రోజువారి జీవితం చుట్టూ ఇంత ముళ్లకంచె పర్చుకొని ఉందా అని ఆశ్చర్యపోతాం. చాలా సార్లు ఆ వాక్యాల్లో చిక్కుకుపోయి బయటకు రాలేం. ఎందుకంటే ఒక్కో పదం ఎంతో లోతుకు......
...ఇంకా చదవండి

వేయి అంచుల ʹజీవితంʹ

డా. వెల్దండి శ్రీధర్‌ | 21.12.2018 01:31:51am

ప్లవోద్యమానికి ఎంతో మంది తల్లులు తమ బిడ్డల్ని ధార పోశారు. అన్నల్లో కల్సిన తన కొడుకు సంక్రాంతి పండుగకు వస్తడని ప్రతి సంక్రాంతికి కండ్లు కాయలు కాచేలా ఎదురు......
...ఇంకా చదవండి

ముస్లిం జీవితాల వాస్తవిక కథలు

డా. వెల్దండి శ్రీధర్‌ | 20.01.2019 11:40:09am

ఈ దేశంలో బహుజనులంతా అయిదు సంవత్సరాలకు ఒకసారి ఓట్లు వేసే మరయంత్రాల్లానే మిగిలిపోతున్నారు తప్పితే పూర్తి స్థాయిలో రాజ్యాధికారంలోకి రావడానికి ఇంకా చాలా రోజుల....
...ఇంకా చదవండి

దళిత దృక్పథం, ధిక్కార స్వరం

డాక్టర్‌ వెల్దండి శ్రీధర్‌ | 06.12.2018 12:09:20am

ఒక ఆవేదన, ఒక దు:ఖం, ఒక ఆగ్రహం, ఒక ధిక్కారస్వరం, ఒక మెలకువ, ఒక చైతన్యం, ఒక సమ సమాజ అవగాహన, ఒక దళిత దకృథం.. ఇలా ఎన్నింటినో మన రక్తంలోకి, మన మెదడులోకి ఒంపి......
...ఇంకా చదవండి

సమాజ నగ్న చిత్రం ʹమట్టిరంగు బొమ్మలుʹ

డా. వెల్దండి శ్రీధర్‌ | 04.01.2019 10:50:11pm

ఏదో గాయపు సలపరాన్ని గుండె నిండా నింపుకొని కవిత్వమై కదిలిపోతున్నప్పుడు ఆయన కలం నుండి అనేక ఇమేజరీలు దొర్లిపోతాయి. ʹఊపిరి తీరంʹ, ʹనిప్పుటడుగులుʹ, ʹచీకటి... ...
...ఇంకా చదవండి

సాహితీ కృషీవలుడు టి. జి. ఆర్‌. ప్రసాద్‌

డా. వెల్దండి శ్రీధర్‌ | 17.05.2019 09:46:23am

బాలల కథకుడిగా సాహితీరంగంలో అడుగుపెట్టిన ప్రసాద్‌గారు 1980 - 1990 మధ్య సుమారు 510 బాలల కథలను రాసి ఒకనాటి పసి హృదయాలపైన తనదైన ముద్రవేశారు. ఈ కథలన్నీ చదివితే ఇ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
  జీవితం పరిమళించిన కథలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •