ఒక్క మాట అడుగుతున్నా

| సంభాషణ

ఒక్క మాట అడుగుతున్నా

- కెక్యూబ్ వర్మ | 16.06.2019 10:22:48am

ఈ కాలమ్ ద్వారా నచ్చిన కవితలను పరిచయం చేయమని సంపాదకవర్గం అడిగింది . ఇది అనుకున్నంత ఈజీ కాదని రాద్దామని కూచుంటే తెలిసింది. ఎందుకంటే కవిత చదవగానే మనకు బాగుందనో కొత్త అభివ్యక్తులతో విషయాన్ని చెప్పారనో ప్రభావితం చేసారనో మనసులో అనిపిస్తుంది. మరల మరల చదవాలనిపిస్తుంది. మనసులో సుళ్ళు తిరుగుతాయి ఆ వాక్యాల భావాల జడి. దేహమంతా పాకుతుంది అక్షరాల కాంతి. కానీ అది కాగితంపై పెట్టడమే కష్టం అనిపిస్తోంది నావరకు. ఎందుకంటే నేనంత చేయితిరిగిన రాతగాన్ని కాదు. అయినా నా ప్రయత్నం చేద్దామని ఒప్పుకున్నా.

గత ఐదేళ్ళుగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపీ ప్రభుత్వం కేంద్ర నిఘా సంస్థల నుండి పారా మిలటరీ దళాధిపతుల వరకు దేశంలో తమ సర్వీసులలో అత్యంత కౄరమైన అధికారులను నియమిస్తూ వాళ్ళ ద్వారా ఉద్యమ ప్రాంతాలపై తన పట్టును బిగించి ఆదివాసీ ప్రజలను ఉద్యమాల నుండి దూరం చేయడానికి విప్లవకారులపై నిరాయుధులుగా వున్న సమయంలోనో అప్రమత్తంగా లేని చోటనో తన నాజీలను మించిన రహస్య నెట్ వర్క్ ద్వారా పొందిన సమాచారంతో అత్యంత పాశవికంగా దాడులు చేస్తూ రాకెట్ లాంచర్లను, ఇజ్రాయిల్ నుండి దిగుమతి చేసుకున్న అత్యంత ఆధునిక ఆయుధాలతో హెలికాప్టర్లతో ముప్పేట దాడి చేస్తూ ఒకే సారి ముప్పై నలభై మందిని సామూహికంగా హత్య చేస్తూ వస్తోంది. వీరిలో పసివాళ్ళూ, అమాయక ఆదివాసీ స్త్రీలూ పెద్ద ఎత్తున వుంటున్నారు. అయినా సరే వారి శవాలు కూడా దొరకకుండా మొసల్లున్న నదులలో పారవేస్తూ తన కౄరత్వాన్ని ఉద్యమాల పట్ల తన ఏహ్య భావాన్ని చూపిస్తూ భయభ్రాంతులను చేయ చూస్తోంది. ఇది మనకందరకూ ఎరుకలోని విషయమే. ఈ నేపథ్యాన్ని మనకు సుపరిచితులైన కవీ జర్నలిస్టు మిత్రులు ప్రసాదమూర్తి గారు ʹఒక్క మాట అడుగుతున్నాʹ కవితలో ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు బదులిచ్చే వారెవరూ లేని కాలమిది.

ఈ కవితలో చాలా సున్నితమైన సరళమైన భాషలోనే మనకు బూటకపు ఎదురు కాల్పులల్లే రాజ్యం తన చేతకానితనాన్ని నిస్సిగ్గుగా ఎలా నిరూపించుకుంటుందో తన భావోద్వేగ పద చిత్రాలతో మనముందుంచుతారు కవి. ఎదురు కాల్పులంటే శవాల లెక్కలే తప్ప వారి అమరత్వంతో మరింత రాటుదేలే ఉద్యమ ప్రజల గమనాన్ని ఆపలేవని రాజ్యానికి చెపుతారు. కోల్పోయిన వారి వలన ఏర్పడిన ఖాళీ మనల్ని ఒక దు:ఖ సందర్భంలోకి నెట్టి వేస్తుంది. అంతులేని నిరాశకు గురవుతాం. కానీ ఈ కవిత చదివితే తిరిగి తిరిగి చిగురించే మొక్కవోని ఆత్మస్థైర్యాన్నిస్తుంది. ఇది నేటి సమయానికి అవసరమైనది. కవి తన మార్క్సిస్టు ఆలోచనా ధారలోంచి ఒక ఆశా కిరణాన్ని మనకందిస్తారు. కవితా నిర్మాణంలో తనెంచుకున్న పద చిత్రాల వైశాల్యం చాలా విశాలమైనది. ఇలాంటి నిర్మాణం యువ రచయితలు అలవర్చుకోవాలి. సరళమైన పదాలతోనే కవిత అందరికీ అర్థమయ్యేలా చదవగానే మనలో కదలిక ఏర్పడేలా రాయడం ప్రసాదమూర్తి గారికి చాలా సులువుగా అలవడిన శిల్పం. తను సమకాలీన సందర్భాలన్నింటిపై స్పందించే తీరు మనము నిత్యం చదువుతుంటాం. ఈ కవిత నిజానికి మూడు నాలుగు పేజీలు రాసినా తరగని వస్తువు. మరొక సారి కవి నుండి ఒక దీర్ఘ కవితను ఆశిద్దాం. ఈ కవిత కవి "దేశం లేని ప్రజలు" కవితా సంకలనంలోది.

ఒక్క మాట అడుగుతున్నా

నాలుగు తుపాకులు..
గంపెడు సాహిత్యం..
మందుగుండు సామగ్రి..
అంతే కదా
ఒక్క పాటనైనా పట్టుకున్నారా?
ఒక్క కలనైనా పట్టుకున్నారా?
ఒకటి.. రెండు..
పది.. పద్దెనిమిది..
ఆయుధాలనీ..మృత దేహాలనీ లెక్కపెట్టుకుంటున్నారు-
చివరి కిరణాలను చిరు రెక్కల్లో పొదువుకుని
ఎగిరిపోయిన ఒక్క పిట్టనైనా పట్టుకున్నారా?
అడవుల్ని జల్లెడ పడతారు-
ఇక్కడ కన్నుమూసి ఆకాశంలో కన్ను తెరిచే
ఒక్క నక్షత్రాన్నయినా పట్టుకున్నారా?
అస్తమయాలను ఉత్సవంలా జరుపుకుంటారు-
పొద్దుపొడుపు కడుపులో ప్రాణం పోసుకుంటున్న
పిల్లల గుప్పిళ్ళలో విచ్చుకునే ఒక్క నవ్వునైనా పట్టుకున్నారా?
రాలిన ఆకుల మీద కాలం రాసే కవితల్ని పట్టుకున్నారా?
ఒక మాట అడుగుతున్నాను అంతే.

కెక్యూబ్..

No. of visitors : 255
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార సెప్టెంబర్ 2019

  మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ
  మేఘాలొస్తాయి
  న్యాయ ప్రక్రియే శిక్ష అయితే!?
  Justice in deep slumber
  ఎర్ర పిడికిలి
  వేకువ గానం
  అతడేమన్నాడు
  వాళ్లంటే అంత భ‌యం ఎందుకు?
  ఎరవాడ జెయిలులో ఈ వేకువ
  రాజ్య‌మే కుట్రదారు అయిన‌ప్పుడు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •