గతం నుంచి గెంతు వేయాల్సిన సమయమిదే!

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

గతం నుంచి గెంతు వేయాల్సిన సమయమిదే!

- రివేరా | 16.06.2019 10:36:30am

కొందరుంటారు. వాళ్లు లేకపోతే కొన్ని పనులు ముందుకే పోవు. క్రాంతితో ఉన్న స్నేహపరంగానే కాదు, ʹదండకారణ్య సమయంʹ పాఠకుడిగానూ నా అభిప్రాయం ఇదే. విరసం వెబ్‌సైట్‌లో పక్షానికి ఒకసారి పోస్టు అవుతున్న ఈ కాలమ్‌ మంచి ఆదరణ పొందుతోంది. ఈ కాలమ్‌ కోసం మిగతావారూ రాసినా, ఎక్కువ వ్యాసాలు వేరే పేర్లతో క్రాంతి అందిస్తున్నాడు. తన అనుభవాలు, స్పందనలు, అనువాదాల్లోంచి 18 వ్యాసాలను యేర్చికూర్చి ʹఅనగనగా అడవిలో.. హిడ్మే మరికొందరుʹ పేరిట వ్యాస సంపుటి వెలువరించాడు.

రాజ్యహింస, ప్రతిఘటనల పరంపర అటు శబరికి, ఇటు ఇంద్రావతికి మధ్య అవిచ్ఛిన్నంగా సాగిపోతున్న నేల దండకారణ్యం. ఆమాటకొస్తే ఈ ప్రాంతం ఒక కాల్పనిక అద్భుతంగా ఉన్నప్పటినుంచీ ధ్వంసమవుతూనే ఉంది. ఇరు సాయుధ శక్తుల మధ్య అది రావణకాష్టంలా మండుతోందని మీడియా మాట్లాడుతుందిగానీ, ఏనాడూ దండకారణ్యం రావణుడి పాలనలో లేదు. కానీ, ఇక్కడి మూలవాసులను లంక అంచుల దాకా రామాయణం కాలంలోనే తరిమికొట్టినట్టు జీవ నైసర్గిక, భాషా ఆనవాళ్లు తెలుపుతున్నాయి. తమిళనాడులో మత్స్యకారులు, ఇతర వృత్తి సమూహాలు మాట్లాడే భాష, ఛత్తీస్‌గఢ్‌ గోండుల పలుకుకు దగ్గరగా ఉండటాన్ని గమనించవచ్చు. క్రాంతి చెబుతున్నట్టు దండకారణ్యంలో నడుస్తున్న పార్టీ పాఠశాలల్లో ఆదివాసీ పిల్లలకు హిందీ లిపిని అలవాటు చేస్తున్నారు. ఆ భాషలో రాయడం నేర్పిస్తున్నారు. చరిత్ర, సామాజికం, వైజ్ఞానిక విజ్ఞానాన్నంతా హిందీ పాఠ్యపుస్తకాలుగా అందిస్తున్నారు. గోండుల వాడుకకు దగ్గరగా ఉండి, బాగా అభివృద్ధి చెందిన భాషా కుటుంబాల్లో ఒకటయిన ద్రవిడాన్ని మాత్రం ఎందుకనో తెలియదుగానీ విప్లవ పాఠశాలల్లో ప్రోత్సహించడం లేదు.

మధ్యభారత జనజీవనంపై హిందీకున్న అధికారాన్ని నిరాకరించడానికి లేదని గుర్తిస్తూనే, ఇక్కడే ఒక విషయం గమనించాలి. ఉత్పత్తి, ప్రయోగం, యుద్ధం అనే త్రైవర్తుల విప్లవ క్రమంలోనే పోరాడే ప్రజలకు, వారికి నాయకత్వం వహించే పార్టీకి అనుభవం, జ్ఞానం, సృజనాత్మకత అలవడతాయి. మాతృభాషకు దగ్గరగా ఉండే మాధ్యమంలో సాగించే బోధన..సృజనాత్మకతను పెంచి, క్రాంతి పేర్కొన్నట్టు, ప్రత్యామ్నాయ ఆలోచనలను పురిగొల్పే ఒక ప్రాతిపదికను ఏర్పాటు చేయగలుగుతుంది. ఈ దిశగా జరగాల్సిన చర్చకు క్రాంతి రచనలు దోహదం చేస్తే సంతోషమే!

క్రాంతికి యాభై ఏళ్ల నక్సల్బరీ గతంపై అచంచల విశ్వాసం ఉంది. చరిత్ర పట్ల అలాంటి భరోసా ఉండటం వల్లనే గుండెలు పిండేసే దండకారణ్యం వ్రణ దేహాన్ని మనముందు ఇంత ధైర్యంగా పరచగలిగాడు. మంద్రస్థాయి యుద్ధంతో తలపడుతున్న డేనియల్‌లను పరిచయం చేశాడు. ఈ శ్రవ్య ధ్వనిలోని బీభత్సరావాన్ని హెడ్మే కథ చెప్పి, మన అనుభవంలోకి తెచ్చాడు. హక్కుల హననం, వ్యవస్థీకృత అమానవీయతలకు సంబంధించిన ఇటీవలి ఉదంతాలను క్రాంతి ఒక క్రమంలో రాస్తూపోయాడు. ఈ ఉదంతాల్లో అనేకం సామాజిక కార్యకర్తల చొరవ, కోర్టు తీర్పుల కారణంగా మీడియాలో బాగా వ్యాప్తిలోకి వచ్చాయి. హిడ్మే హత్య ఉదంతంలో అయితే కోర్టు ఒక కమిషన్‌ను కూడా నియమించింది. ఇలాంటి కొన్ని కంటితడుపు ఊరటలను మినహాయిస్తే, ఇంద్రావతిలో చంపి పడేసిన నలభై మందికిపైగా గ్రామస్థులు, మావోయిస్టుల్లో తెలియని పేర్లు.. వారు చంపబడి ఏడాది దాటిపోతున్నా, ఇంకా మిగిలే ఉన్నాయి. పచ్చిగాయం కావడాన ఇంద్రావతి ప్రస్తావన ఈ వ్యాసాల్లో పలు చోట్ల కనిపిస్తుంది. నలభై ఏళ్ల క్రితం దండకారణ్యంలోకి అప్పటి పీపుల్స్‌వార్‌ ప్రవేశించేనాటికి ఆదివాసీల గరిష్ఠ ఆయు:ప్రమాణం 30-35 ఏళ్లు. 20 ఏళ్లు కూడా నిండకముందే యుద్ధరంగంలోకి పిల్లలను తోసేస్తున్నారని మాట్లాడేవారు ముఖ్యంగా ఈ విషయం గమనించాలి. ఇప్పుడు సగటు ఆదివాసీ జీవన రేటు ఎంత?పీపుల్స్‌వార్‌, ఆ తరువాత మావోయిస్టు పార్టీ వెళ్లి అక్కడి జీవనంలో తెచ్చిన మార్పులు ఆ రేటును పెంచాయా? తగ్గించాయా? పోలీసులు, మావోయిస్టుల సంకుల సమరంలో ఆదివాసీలు సమధిలవుతున్నారనేవారు ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని చర్చ చేస్తే బాగుంటుంది. హెర్పర్‌ లీ ʹ టూ కిల్లింగ్‌ ద మాకింగ్‌ బర్డ్‌ʹ నవలలో స్కౌట్‌ అన్నట్టు, ఏదైనా బోధించడం, నేర్చుకోవడం ఏమిటసలు? అది యుద్ధమయినా, ధిక్కారమయినా! భాషకు సంబంధించి హెర్పర్‌ లీ భావాలను మినహాయిస్తే, ఆమె స్టేట్‌మెంట్‌ను కొట్టివేయడం కష్టమే.

క్రాంతి చాలావరకు రాజ్యహింసకు సంబంధించిన తాజా గాయాలను రేపినా, కొన్ని ప్రత్యామ్నాయ ఆలోచనలూ చేయకపోలేదు. ʹప్రజా ప్రత్యామ్నాయంʹ అనే వ్యాసం ఈ సంపుటిలో ఉంది. రాజకీయ అర్థంలో ప్రత్యామ్నాయాలకు మన సమాజంలో కొదవే లేదు. భగవంతుడిని నమ్మనివాడు కూడా.. కేంద్రంలో ఈసారి మోదీ రాకూడదని గట్టిగా మొక్కుకోవడం ఒక ప్రత్యామ్నాయమే. తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఓడి, జగన్‌ గెలవడమూ, ఇలాంటి నాయకుల్లో గాంధీనో, అంబేడ్కర్‌నో, మార్క్స్‌నో, లోహియానో వెతుక్కోవడమూ అలాంటిదే. ఝార్ఖండ్‌లో కొన్ని గ్రామాలు ప్రభుత్వాన్ని బహిష్కరించాయని ʹపథల్గడి తొవ్వʹ వ్యాసంలో క్రాంతి చెప్పాడు. పెసా చట్టం అమలు కోరుతూ, ఆ గ్రామాలవారు ఎంచుకొన్నదీ ఒకరకమైన ప్రత్యామ్నాయమే. ఊరుకు కరెంటు లేదు, రోడ్డు లేదు, వైద్యశాల లేదంటూ ఎన్నికలను బహిష్కరిస్తున్న గ్రామాల కథల్లో ధ్వనించేదీ అలాంటి భావమే. కానీ, రాజకీయార్థిక అర్థంలో మాత్రం ప్రత్యామ్నాయం అంటే ఇన్ని రకాల ఉదంతాలు, సంచలన ఘటనలకు తావే లేదు. మానవ శ్రమ ప్రాతిపదికగా ఏర్పడిన సమాజంలో చివరకు బందీగా మారిన ఆ శ్రమను విముక్తి చేయడమే ఏకైక ప్రత్యామ్నాయం. నక్సల్బరీ యాభై ఏళ్ల క్రితం సమాజంలోనూ, సాహిత్యంలోనూ ఒక గెంతు తీసుకొని.. ఆవిష్కరించిన పోరాట వాస్తవికత ఇది. యాభై ఏళ్ల తరువాత ఇప్పుడు దండకారణ్యం మరో గెంతుకు సిద్ధమవుతుందా? గతం నుంచి తెగదెంపులు చేసుకొని, తనదైన దేహాన్ని అది ధరించగలుగుతుందా? ఈ ప్రశ్నకు కాలం ఎలాంటి సమాధానం ఇస్తుందనేదే ప్రియమైన భారత సమాఖ్య భవిష్యత్తును నిర్దేశించబోతోంది. ఇలాంటి ప్రశ్నలన్నెంటినో ప్రోది చేయడంలో క్రాంతి రచనలు చాలాభాగం సఫలీకృతం కాగలిగాయి.

చివరిగా ఒక్క చిక్కు ప్రశ్న! కల్పన, వాస్తవాల అద్భుత కలయిక అయిన దండకారణ్యం ఎంత గొప్ప కావ్య వస్తువో కదా! కానీ, ఇప్పటిదాకా ఇంటర్వ్యూలు, ప్రయాణ అనుభవాలు, క్షేత్రస్థాయి విశ్లేషణలు, జీవ నైసర్గిక, సంస్కృతిని పట్టిచ్చే వ్యాసాలు వచ్చాయే గానీ క్లాసిక్‌ అనదగ్గ ఒక్క కాల్పనిక రచన కూడా దండకారణ్యం పై ఎందుకు రాలేదు? బహుశా, ఇలాంటి ఆవిష్కరణ కోసమే దండకారణ్యం ఒక గెంతులా తన గతాన్ని దాటి రావాలని మనమంతా కోరుకోవాలేమో!

No. of visitors : 450
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


మంద్ర‌స్థాయి యుద్ధం - ప్ర‌జా ప్ర‌తిఘ‌ట‌న : రివేరా

రివేరా | 10.06.2016 01:10:40am

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధం - ప్ర‌జా ప్ర‌తిఘ‌ట‌న పై రివేరా ఉప‌న్యాసం.......
...ఇంకా చదవండి

చేజారిన జాడల్లోంచి మైదానాల్లోకి..

రివేరా | 16.07.2016 11:50:45am

పుస్తకాల సంచిని గిరాటేసి రోడ్డుపైకి దూసుకెళ్లిన జ్ఞాపకం వెనుక నుంచి పిలుస్తున్న తల్లివైపు స్నేహితుల భుజాలపైనుంచి నవ్వుతూ చూడటమే చివరిచూపు.......
...ఇంకా చదవండి

ఏప్రిల్ పండు II రివేరా

రివేరా | 24.04.2016 11:08:03pm

పిల్లలు లేని ఇల్లు, ఇది హైదరాబాద్, ఊరేగింపు, ఏప్రిల్ పండు,...
...ఇంకా చదవండి

సాయంకాలం వాన‌!

రివేరా | 20.12.2016 11:48:01pm

దుప్ప‌టి కింద‌, దిండు అడుగున‌ పిల్ల‌లు చూడ‌కుంటా క‌ప్పెట్టుకొన్న వ‌ర‌ద‌గూడుని మెలిపెడ‌తావేమో...
...ఇంకా చదవండి

భ‌యం చుట్టూ భ‌యం..

ఎడార్డో గెల‌నో | 04.02.2017 01:18:19am

వీళ్లెక్క‌డ చంపుకుతింటారోన‌ని ఆడ‌వాళ్ల‌కు భ‌యం భ‌యంలేని ఆడ‌వాళ్లంటే మ‌గ‌వాళ్ల‌కు మ‌హా భ‌యం దొంగ‌లంటే భ‌యం, పోలీసుల‌న్నా మ‌రి భ‌య‌మే తాళాలు లేని త‌లుపులంటే భ...
...ఇంకా చదవండి

రెప్పని కప్పని నిద్దుర

రివేరా | 16.08.2016 09:26:54am

ఒకే రాత్రిని కప్పుకొన్న మనకి ఒక్క నిద్దుర చాలదా? చుక్క కలని పొదువుకోడానికి ఈ ఒక్క దేహ వర్షం చిలకదా?...
...ఇంకా చదవండి

నో, ఐ డోన్ట్‌ లైక్‌ టమాట

రివేరా | 17.09.2016 10:14:09am

టమాట రంగు సరే, రసాలూరే సరస్సులేమీ.. కొంచెం కరిచిపట్టుకొన్న మిలమిలా మీనాలేమీ.. పైకి కిందకి మునకలేసే గత్తరబిత్తర గోళాలేమీ.......
...ఇంకా చదవండి

ఈ రాక్ష‌స గీతి వింటారా?

రివేరా | 02.11.2016 10:23:06am

మ‌నం నిల‌బ‌డిపోయిన చోట నుంచే మ‌న న‌డ‌క‌ల‌ను మోసుకెళుతున్నారు మ‌నం ఆపేసిన రాగాల‌నే తీగ‌లుగా సాగిపోతున్నారు మ‌న గొంతునీ, మ‌న వంతునీ మ‌న‌క్కిచ్చేసి వెళుతు...
...ఇంకా చదవండి

అద్గ‌దీ...

రివేరా | 20.10.2016 12:13:15am

అటో ఇటో వేటో పోటో ప‌డిపోవాల్సిందే! పాల‌కులంతా ప్ర‌జాస్వామిక‌వాదులై ప్రజ‌లేమో నియంత‌లైతే ఏమి చేస్తాం?...
...ఇంకా చదవండి

సబ్కా జవాబ్ వెతికుతున్న కవి రివేరా

మహమూద్ | 04.05.2017 10:49:39am

విప్లవకవిత్వాన్ని ఈసడించుకునే వర్గాన్ని కూడా ముక్కుమీద వేలేసుకునేలా రివేరా ఓ మంచి కవి అని అందరి చేత అనిపించుకోవడం వాస్తవానికి విప్లవ సంస్కృతి విజయమే.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
  జీవితం పరిమళించిన కథలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •