అతడి ఆలోచనలు అక్షరాలకే పరిమితం కాలేదు

| సాహిత్యం | వ్యాసాలు

అతడి ఆలోచనలు అక్షరాలకే పరిమితం కాలేదు

- అరుంధతి ఘోష్ | 16.06.2019 10:44:24am

నా ఫోన్ మోగేప్ప‌టికి నేను విమానాశ్రయంలో సెక్యూరిటీ చెక్ ద‌గ్గ‌ర ఉన్నాను. సాధార‌ణంగా విదేశాల‌కు వెళ్లేప్పుడు భార‌తదేశం నుంచి వ‌చ్చే ఫోన్ కాల్స్ మాట్లాడ‌ను. కానీ ఈ ఫోన్ కాల్ నేను మాట్లాడాల్సి వ‌చ్చింది. అవ‌త‌లి నుంచి వినిపిస్తున్న గొంతులో ఆదుర్ధా క‌న‌పించింది. దీనికి మీరు ఎలా ఒప్పుకుంటారు. మీరు నాట‌కాన్ని ఆప‌కూడ‌దు. దీని కోసం నేను ఏం చెయ్య‌గ‌ల‌ను చెప్పండి. ఎవ‌రితో మాట్లాడ‌మంటారు. ఇలాంటి బెదిరింపుల స‌మ‌యంలో గ‌ట్టిగా నిల‌బ‌డ‌క పోతే వారు మనల్ని భ‌య‌పెడుతూనే ఉంటారని యువ‌త‌కు అర్థం కాదు.

ఫోన్ లో అవ‌త‌లి వైపు గిరీష్ క‌ర్నాడ్, ఇండియా ఫౌండేషన్ ఫర్ ది ఆర్ట్స్ ద్వారా మేం మ‌ద్ద‌తు ఇచ్చిన నాటకాల్లో ఒక‌టి త‌మ మ‌త మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసింద‌ని నిర‌స‌న కారులు అడ్డుకున్నారు. ఇది ʹద‌యా సింధూ స‌క్రెప‌ట్నాʹ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ʹశివʹ నాట‌కం. క్వీర్ క‌మ్యూనిటీ, వారి ప్రేమ‌లు, క‌ష్ట న‌ష్టాల గురించిన క‌థ‌.

అవ‌త‌లి వైపునుంచి క‌ర్నాడ్ ఇంకా చెబుతూనే ఉన్నారు. త‌న‌కు ఏ స‌మ‌యంలో అయినా ఫోన్ చెయ్య‌వ‌చ్చ‌ని. అవ‌స‌రం అయితే త‌ను మాతో పాటు వ‌చ్చి అధికారుల‌తో మాట్లాడ‌తాన‌ని చెప్పారు. ఇది విని నాక‌ళ్ళ‌లో కృతజ్ఞత నిండిపోయింది.

జీవితంలో చాలా త‌క్కువ సంద‌ర్భాల్లో గిరీష్ కర్నాడ్ వంటి దృఢ‌మైన వ్య‌క్తుల మ‌ర‌ణం చాలా కుంగ‌దీస్తుంది. నేను ఆయ‌న ర‌చ‌న‌లు చ‌దివాను, నాటకాలు, సినిమాలు చూశాను. సెమినార్లు, చ‌ర్చ‌లు విన్నాను. ఎంతో ప్రభావితం చేసే ఆయ‌న వాద‌న‌ల‌కు ఉద్వేగంతో చ‌ప్ప‌ట్లు కొట్టాను.

ఎంతో మంది కాళాకారులు, న‌టులు, స్కాల‌ర్స్ ఆయ‌న‌కోసం నివాళులు రాసి ఉంటారు. సినిమా, నాట‌క రంగాల్లో ఆయ‌న కృషికి, భార‌త దేశ నాట‌క రంగాన్ని కొత్త పుంత‌లు తొక్కించిన ఆయ‌న ఆలోచ‌న‌ల‌కు, కాల్ప‌నిక‌త‌కు నివాళులు అర్పించి ఉంటారు. నాట‌క రంగంలో అంద‌రి హృదయాల‌ను ఆక‌ట్టుకునేలా స‌మ‌కాలీన క‌ధ‌నాల‌ను, జాన‌ప‌ద క‌థ‌ల‌ను అనుసంధానించ‌గ‌ల ఆయ‌న కౌశలాన్ని కొనియాడి ఉంటారు. యువ ర‌చ‌య‌త‌ల‌ను, నిర్మాత‌ల‌ను ప్రోత్స‌హించ‌డం గురించి రాసే ఉంటారు.

కానీ, నాకు మాత్రం ఇది అత్యంత వ్యక్తిగత నష్టము, నాట‌క రంగం ప‌ట్ల ఆయ‌న గాఢ‌మైన ప్రేమ, ఆయ‌న చివ‌రి వ‌ర‌కూ నిల‌బ‌డ్డ రాజ‌కీయ విలువ‌లు, వాటిప‌ట్ల ఆయ‌న ఆనుబంధాన్ని నేను మిస్ అవుతాను.

బెంగ‌ళూరు రంగశంకర థియేటర్ లేదా మ‌రో చోటో ఆయ‌న తార‌స‌ప‌డిన ప్ర‌తి సారీ... ఆయ‌న ఫౌండేష‌న్ గురించి, నా నాట‌క రంగ కృషి గురించి, మేం మ‌ద్ద‌తు అందిస్తున్న క‌ళాకారుల గురించి అడిగేవారు. నాకు ఎంతో చిన్న‌త‌నంగా అనిపించేది. కానీ ఆయ‌న ఎన్న‌డూ త‌క్కువ ఫీల్ అయ్యేలా చేసే వారు కాదు. మేం నిర్వ‌హించే అన్ని కార్య‌క్ర‌మాల‌కు వ‌చ్చే వారు. త‌న స్నేహితుల‌తో పెద్ద సంఖ్య‌లో టికెట్లు కొనిపించే వారు. క‌ర్నాట‌క లోని అన్ని నాట‌క బృందాల‌కు, క‌ళాకారుల‌కు మ‌ద్ద‌తుగా ఉండే వారు. అన‌కు చేత‌నైన సాయం అందించే వారు. ఆయ‌న మ‌ద్ద‌తు, సాయం మేం కోల్పోయాం.

2015లో క‌న్న‌డ మేధావి, హంపి యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ మ‌లేశ‌ప్ప ఎం క‌ల్బుర్గిని ధార్వాడ‌లోని ఆయ‌న ఇంటి ద‌గ్గ‌ర గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కాల్చి చంపిన‌ప్పుడు గిరీష్ క‌ర్నాడ్, ఇత‌ర మేధావుల‌తో క‌లిసి నిర‌స‌న ప్ర‌ద్శ‌న‌లో పాల్గొన్నారు.

త‌ర్వాత ప్ల‌కార్డులు ప‌ట్టుకుని ఆయ‌న‌తో పాటు నేను నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన్నాను. ఇలాంటి సంద‌ర్బాల్లో నేను గిరీష్ క‌ర్నాడ్ని త‌ప్ప‌కుండా మిస్ అవుతాను. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ఆర్టిస్టులు త‌మ అసలు రంగు బ‌య‌ట‌పెట్టుకుంటుంటే..నిశబ్దంగా త‌మ ప‌క్షం మార్చుకుంటుంటే.. విద్వేష రాజ‌కీయాల‌కు, వివ‌క్షకు, కాషాయీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా గిరీష్ క‌ర్నాడ్ నిర్బ‌యంగా త‌న నిర‌స‌న స్వ‌రాన్ని వినిపించారు. ఆధునిక‌త‌, స‌మాన‌త్వం, సెక్యుల‌ర్ భావాల‌కు మ‌ద్ద‌తు తెలిపారు.

నాకు బాగా గుర్తు, 2012 టాటా లిట‌రేచ‌ర్ లైవ్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న వీఎస్ నయిపాల్ నాట‌కం, భార‌త చ‌రిత్ర వ‌క్రీక‌ర‌ణ, ముఖ్యంగా ముస్లిం, ఇస్లాం సంస్కృతి గురించిన వ‌క్రీక‌ణ‌ల‌పై దాదాపు గంట సేపు విమ‌ర్శ‌నాత్మ‌క ఉప‌న్యాసం ఇచ్చారు. ఇదే కార్య‌క్ర‌మంలో నయిపాల్ కు జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం ల‌భించింది. దీనిపై క‌ర్నాడ్ మాట్లాడుతూ.. భార‌త దేశంలోని ఒక వ‌ర్గం జ‌నాభా మోత్తాన్ని రేపిస్టులు, హంత‌కులుగా చిత్రీక‌రిస్తుంటే..ఈ అవార్డు ఇచ్చే వారు, ఉద్దేశ‌పూర్వ‌కంగా మౌనం వ‌హిస్తున్నారు. బాధ్య‌తారాహిత్యం కంటే మౌనం ప్ర‌మాద‌క‌రం. అని దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు.

చాలా మంది మేధావుల లాగా.. గిరీష్ క‌ర్నాడ్ వాద‌న‌లు, చ‌ర్చ‌లు, టెలివిజ‌న్ పానెల్ లు, సెమినార్ల‌కు ప‌రిమితం కాలేదు. ఆయ‌న త‌ను న‌మ్మిన విలువ‌ల కోసం వీధుల్లోకి వ‌చ్చారు. సెప్టెబంర్ 2018న జ‌రిగిన నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లో ఆయ‌న ఇంగ్లీషు, క‌న్న‌డ భాష‌ల్లో మీటూ అర్బ‌న్ న‌క్స‌ల్ అని రాసి ఉన్న ప్ల‌కార్డు మెడ‌లో త‌గిలించుకుని పాల్గొన‌టం ఐకానిక్ గా నిలిచింది. త‌న ఆనారోగ్యాన్ని సైతం లెక్క చేయ‌కుండా 2017జూన్ లో దేశంలో ముస్లింలు, ద‌ళితుల‌పై జ‌రుగుతున్న దాడుల‌కు వ్య‌తిరేకంగా బెంగుళూరులో జ‌రిగిన తొలి నాట్ ఇన్ మై నేమ్ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన్నారు. నిరాశ నిస్పృహ‌ల్లో ఉన్న వారిని ఇది ఉత్తేజ‌ప‌రిచింది. మా న‌గ‌రం న్యాయం కోసం నిన‌దించిన ప్ర‌తి సారీ ఆయ‌న మాతో క‌లిసి నిబ‌డ్డారు. అది క్వీర్ క‌మ్యూనిటీ కోస‌మైనా, స్టీల్ ఫ్ల‌య్ ఓవ‌ర్ కి వ్య‌తిరేకంగా అయినా, క‌ర్నాడ్ న్యాయం వైపు నిల‌బ‌డ్డారు. బెదిరింపుల‌కు త‌ల‌వొగ్గ‌కుండా త‌న అభిప్రాయాల‌ను సూటిగా స్ప‌ష్టంగా మాట‌లోనూ, ర‌చ‌న‌లోనూ, టీవీ కెమెరాల ముందూ వ్య‌క్తం చేశారు.

తాను ఎదురు నిలిచిన శ‌క్తులు ఎంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌వో క‌ల్బుర్గి, గౌరీ లంకేష్ హ‌త్య‌త‌ర్వాత ఆయ‌న‌కు అర్థ‌మైయ్యే ఉంటుంది. అంతే కాదు హిట్ లిస్టులో ఆయ‌న పేరు కూడా ఉంది. ఆయినా ఆయ‌న తన న‌మ్మ‌కాలకు, వ్య‌క్త ప‌రిచిన అభిప్రాయాల‌కు చింతించ‌లేదు, ఎవ‌రికీ క్షమాప‌ణ చెప్ప‌లేదు, వెన‌క్కి త‌గ్గ‌లేదు. మాలాంటి వాళ్ల‌కు అది ప్రేర‌ణ‌గా నిలిచింది. మేము కలపల్లి శ్మశానవాటిక భవనం బ‌య‌ట నిలబడి మా నివాళులు అర్పించాము. అతని కుటుంబం, సన్నిహితులు బయటకు వస్తున్నారు. క‌ర్నాడ్ భార్య సరస్ మాట్లాడుతూ, "మిమ్మల్ని చూసి అయన గర్వపడేవారు". మేము ఆయనను చూసి గర్వపడుతున్నాం అని చెప్పాము. ఆయ‌న మా న‌గ‌ర‌వాసి కావ‌డం మాకు గ‌ర్వ‌కార‌ణం, ఆయ‌న నిజాయితీకి మేం గ‌ర్విస్తున్నాం, ఆయ‌నతో పాటు న్యాయం కోసం నిబ‌డినందుకు మేం గ‌ర్విస్తున్నాం. పలు కార‌ణాల వ‌ల్ల మేం శివ నాట‌కాన్ని కొన‌సాగించ‌లేక పోయాం. న‌టీ న‌టులు, సిబ్బంది ర‌క్ష‌ణ వీటిలో ఒక కార‌ణం కాదు కానీ.. ఒక ర‌కంగా మేం గిరీష్ క‌ర్నాడ్ ని న‌మ్మ‌కాన్ని విఫ‌లం చేశాం అనిపిస్తోంది. కానీ భ‌విష్య‌త్ లో మేం మెరుగ‌వ్వాల్సి ఉంది.

scroll.in సౌజన్యంతో
అనువాదం : పావని


No. of visitors : 779
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నాపేరు శూర్పణఖ

పావని | 17.03.2019 11:23:38pm

నాకు వంటి రంగు గురించి మరో రకం బాధ మొదలైంది. నేను మరీ అంత చిక్కటి నలుపులో లేననీ.. నా జుట్టు వత్తుగా, నల్లగా ఉన్న మాట నిజమే కానీ.. అది రింగులు రింగులుగా లే.....
...ఇంకా చదవండి

హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ

నవల్ కిషోర్ కుమార్ | 19.11.2019 02:50:44pm

జాతీయ‌త పేరుతో, ఎవ‌రైనా (బ్రాహ్మనీయ శక్తులు) నా సంస్కృతిని చంపేందుకు చూస్తే, పంతి, సువా, క‌ర్మ‌, నా ప్ర‌జ‌ల‌పై మావి కానీ (ఛతీస్ఘడ్ కు సంబంధం లేని) నాట్యం.....
...ఇంకా చదవండి

రాజ్యానికెదురు రాజీలేని పోరు

పి. పావ‌ని | 17.05.2019 12:18:50pm

మావోయిస్టు విముక్తి ప్రాంతంగా పేర్కొనే అబుజ్ మడ్ నుంచి (బుద్ధర్ డివిజన్ నారాయణ్పూర్, బీజాపూర్ జిల్లాల) వేలాది ఆదివాసీలు ఇంద్రావ‌తి వైపు సాగిపోయారు. దారిలో వ...
...ఇంకా చదవండి

ఆ చిరునవ్వుల్ని చిదిమేశారు

పావని | 01.04.2019 01:35:31pm

రాష్ట్రంలో హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను మావోయిస్టుల పేరుతో వేధించ‌డం.. కొన్ని సార్లు ప్రాణాలు తీయ‌డం కొత్త కాద‌ని ఇక్క‌డి హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు చెబుతారు......
...ఇంకా చదవండి

ఢిల్లీ నుండి ప్రేమతో

పావ‌ని | 18.12.2019 12:56:37am

ఎలా ఉన్నారు? జైల్లో ఉన్న వాళ్ల‌ను ఇలాంటి ప్ర‌శ్న వేయ‌టం బాలేదు కానీ... ఉత్త‌రం ఎలా మొద‌లు పెట్టాలో తెలీదు. మీ ఆరోగ్యం ఎలా ఉందో అని చిన్న బెంగ‌. అంత‌కంటే......
...ఇంకా చదవండి

వాళ్లంటే అంత భ‌యం ఎందుకు?

పావ‌ని | 28.08.2019 07:09:33pm

మ‌త‌మో.. దేశ‌మో ఏదో ఒక మూఢ‌భ‌క్తిలో ఉన్న జ‌నాన్ని నిద్ర‌లేపుతారేమో అని భ‌యం. అలాంటి ప్ర‌మాదం వీళ్ల వ‌ల్ల పొంచి ఉంది. అందుక‌ని.. వీళ్ల‌ను భ‌ద్రంగా జైలు గోడ‌ల...
...ఇంకా చదవండి

ఆట‌లూ - దేశ‌భ‌క్తి ప్ర‌ద‌ర్శ‌న‌

పి.పావని | 16.07.2019 07:19:53pm

దేశ‌భ‌క్తి ప్ర‌ద‌ర్శిచ‌డంలో... మహేంద్ర సింగ్ ధోనీ, మేగ‌న్ రెపీనోల మ‌ధ్య ఎంత తేడా ఉందో ఆలోచిస్తే.. ఆశ్చర్యం క‌లుగుతుంది. ప్ర‌జాస్వామ్య విలువ‌ల ప‌ట్ల స‌మాజ.....
...ఇంకా చదవండి

నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు

| 18.12.2019 10:18:58pm

మ‌తం జాతీయ‌త‌ను, పౌర‌స‌త్వాన్ని నిర్ణ‌యించ‌డం ఆమోదించ త‌గిన చ‌ర్య కాదు. శ‌ర‌ణార్తుల‌ను మ‌త‌ప్రాతిప‌దిక‌న విభ‌జించ‌టం స‌రైన‌ది కాదు. ఇది భార‌తీయులు అటే ఎవ‌.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •