ఎవడబ్బసొమ్ము

| సాహిత్యం | క‌విత్వం

ఎవడబ్బసొమ్ము

- శాఖమూరి రవి | 16.06.2019 10:58:07amఎల్లిపొమ్మంటావు ఎల్లిపొమ్మంటావు
ఇల్లుకూలా గొట్టి ఎల్లిపొమ్మంటావు

అడవిలోనా పుట్టి
అడవిలోనా పెరిగి
అడవి ఒడిలోనా బతుకునీడుస్తున్న

ఆకులలములే
ఆహారమయ్యాయి
కందమూలములే
కడుపు నింపినాయి

కంటిని కనురెప్ప కాపాడినట్లు
టేకు వనమునకు నే కనురెప్పనయ్యాను
పంటనూ కంచెట్ల కాపాడుతుందో
ఖనిజ సంపదకు నే కంచెనయ్యాను

బంగారు బాతుపై కన్నేసినోడు
నన్ను నా చట్టాన్ని కాల్చేసినాడు
గురిచూసి అడవిపై హద్దెట్టినాడు

పొమ్మంటె పోనీకె
ఎవడబ్బ సొమ్మని
వాగులన్నీచేరి ఏకమయ్యీనట్లు
నేను నాజాతంత ఏకమౌతున్నాము


No. of visitors : 166
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నేను "అర్బన్ మావోయిస్టు"నే

శాఖమూరి రవి | 17.03.2019 09:28:26am

చారుబాబు వేసిన సాలులో మొలసిన మొక్కల ఉశ్వాస నిశ్వాసాలలో బ్రతుకుతున్న వాణ్ణి అవును -అవును- అవును నేనిప్పుడు రాజద్రోహినే అర్బన్ మావోయిస్టునే...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జూలై - 2019

  చారిత్రక పత్రం
  రచయితలకు సవాల్ !
  మూడు తరాల, యాభై వసంతాల విరసం
  వర్తమాన సంక్షోభాల తాత్విక చిత్రణ - అద్దెప‌ల్లి ప్ర‌భు ʹశ్రీ సూర్యనారాయణʹ
  రూపొందుతున్న కాలానికి తగిన కథన శిల్పం
  తిరిగి వ‌స్తావ‌ని
  నన్నెక్కనివ్వండి బోను
  కవిత్వాన్ని సాయుధం చేసిన చ‌నుబాల ధార‌
  సామాజిక సంఘర్షణల సారం - ప్రస్థానం
  సాహిత్యంలో విప్లవోద్యమానికి యాభై ఏళ్లు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •