మనం ఇంక శారదా పీఠం నీడలో బతకాల్సిందే

| సాహిత్యం | వ్యాసాలు

మనం ఇంక శారదా పీఠం నీడలో బతకాల్సిందే

- పాణి | 18.06.2019 01:13:36pm

రాజ్యాంగంలో రాజగురువు అనే పోస్టు ఏమీ లేదు. లేకుంటే ఊరుకుంటారా? అందుకే మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు శారదా పీఠాధిపతి రాజగురువు అయ్యాడు. దీన్ని కాదని మీరంటే రాజద్రోహానికి, ఆధ్యాత్మిక ద్రోహానికి పాల్పడ్డట్లే. స్వరూపానందేంద్ర సరస్వతి అపర భగవత్‌ స్వరూపుడు కాబట్టే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను దగ్గర చేయగలిగాడు. మామూలు వాళ్లకు సాధ్యమయ్యేదేనా? నిన్నటి దాకా చంద్రబాబు, చంద్రశేఖరరావు ఎలా ఉండేవారు? ఉప్పు నిప్పులాగా కాట్లాడుకొనే వాళ్లు. వీధుల్లో కోళ్ల పందాలు గుర్తుకు వచ్చేది. ఇరుగు పొరుగు ప్రభుత్వాల మధ్య సయోధ్యకు రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం ప్రమాణం కావాలని మీరనడానికి లేదు. మీ వెర్రిగాని మనకు రాజకీయ ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం వేర్వేరు కానేకాదు. ఇప్పుడు ఆ రెంటికీ అధిపతి స్వరూపానేంద్ర సరస్వతి. ఆయనేదో ఫలానా పీఠాధిపతి మాత్రమే అంటే శిరశ్ఛేదమే. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మిక గురువుగా మన ఇద్దరు ముఖ్యమంత్రులను ధర్మావతారులైన రాజులుగా కీర్తించాడు. దీనికి మనం గర్వించాలి.

రాజులకు మాత్రమే ధర్మస్థాపన అనే రాజకీయ బాధ్యత ఉంటుంది. దాన్ని వాళ్లు సాధించేందుకు రాజగురువులు దిశానిర్దేశం చేస్తారు. సరిగ్గా తాను అ పనే చేశానని శారదా పీఠాధిపతి ప్రకటించేశాడు. చంద్రబాబును ఓడించడం ద్వారా జగన్‌ ధర్మస్థాపన చేశాడనే మాట రాజకీయ వ్యాఖ్యగానే మీకు అర్థమైందంటే మీకు భాష సరిగా రానట్లే. అది స్వామివారికి నప్పే ఆధ్యాత్మిక వ్యాఖ్యే. ఆధర్మాన్ని ఓడించి, ధర్మాన్ని స్థాపించడంలో శారదా పీఠం నిర్వహించిన పాత్రకు మనం ఆశ్చర్యపోకూడదు. విధేయంగా తల వంచి స్వామి వారి పాదుకల వద్ద కైమోడ్చాలి. మీకు ఆ మాత్రం తెలియకపోతే జగనన్నను చూసి నేర్చుకోండి. ఆయన సీఎం కాగానే ఎంత ఒద్దికగా వెళ్లి పీఠాధిపతికి మోకరిల్లాడు. అన్నిటికన్నా ధర్మ సంస్థాపన చాలా విలువైనది. ఇప్పుడు ఆ పని జగన్‌ అనే నరుడి ద్వారా స్వరూపానందేంద్ర సర్వసతి చేశారనే పౌరాణిక జ్ఞానంతో వ్యవహరించాలి. జగన్‌ విజయం వెనుక తమ పీఠం చాలా కాలంగా కృషి చేసిందని స్వరూపానందేద్ర సరస్వతి బాహాటంగా అన్నాక ఇంక మీకు ఏ అనుమానమూ తగదు.

చంద్రబాబుకు అధికారంలో ఉండే నైతిక అర్హత ఏమీ లేదు.. ఆయన్ను మార్చాలనుకుంటే ఆ పని ప్రజలు చేయాలి.. అని మీరు అంటారా? అది ఒట్టి భ్రమ అని స్వామి సెలవిచ్చారు. ఆయన ఏకంగా ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న వాళ్లకు నిజ దర్శనం చేయించారు.

మనల్ని కార్పొరేట్‌ సంస్థలు, మఠాలు చెట్టాపట్టాలేసుకొని పాలిస్తున్నాయనే సత్యాన్ని ఆయన చక్కగా వివరించారు.

కాబట్టి తెలుగు ప్రజలు ఇక శారదా పీఠం చల్లని నీడలో బతికేయవచ్చు.

మామూలుగా అయితే పాపపంకిలమైన దేహ క్రియలకు పాల్పడే మానవులను సన్యాసులు ముట్టుకోరు. కానీ శారదా పీఠాధిపతి మాత్రం జగన్‌ను పదే పదే ముద్దుల్లో ముంచెత్తేశాడు. ఆయన అక్కడితో ఆగలేదు. జగన్‌ నా ఆత్మ అనేశాడు. ఆత్మ.. అందునా సాధుపుంగవుల ఆత్మకు పరమాత్మ హెదా ఉంటుంది. పంచభూతాత్మకమైన దేహానికంటే ఆత్మ, పరమాత్మ ఉన్నతమైనవని ప్రవచనాలు చెబుతుంటారు. అలాంటి పీఠాధిపతి తన ఆత్మ జగనే అని చెప్పాడు. చూడండి జగనన్నకు ముఖ్యమంత్రి హోదానే కాదు, పరమాత్మ హోదా కూడా దక్కింది.

ఈ గోల మనకెందుకు అనుకుంటున్నారా?

మనకు ఇది చాలా అక్కరకు వచ్చే ముచ్చట.

రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఆత్మగా ప్రభుత్వాలు ఉండాలని, ప్రభుత్వాధినేతలు ఉండాలని అనుకొనే అమాయకులు ఇంకా ఈ భూమ్మీద బతికే ఉన్నారు. కానీ స్వామివారేమో జగన్‌ తన ఆత్మ అంటాడు. మరి మనల్ని పరిపాలించేది రాజ్యాంగ బద్ధ వ్యవస్థనా లేద ఆధ్యాత్మిక పీఠమా?

మనబోంట్ల పామరులకు స్వరూపానేందేంద్ర సరస్వతి ఎంత పెద్ద పజిల్‌ పెట్టాడో చూడండి.

ఇంతకూ మన నెత్తిన ఈ సన్నాసిని తెచ్చిపెట్టిన ముఖ్యంత్రుల్ని ఇప్పుడు మనం ఏమీ అనలేం. ఆ స్థాయికి కేసీఆర్‌, జగన్‌ నిస్సిగ్గుగా సిద్ధమయ్యారు. దీన్ని చూసి మనం ముచ్చటపడాల్సిందేగాని ప్రశ్నించేందుకు లేదు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు తమ రాజకీయ ప్రయోజనాలను ఒక సాధువు పాద పీఠం వద్ద నెరవేర్చుకోడానికి బరితెగించాక ఇక ఐదేళ్ల దాకా మనమెవరమండీ మాట్లాడటానికి?

ప్రజా ప్రతినిధులు గుళ్లకు, గోపురాలకు అధికారికంగా వెళ్లడం ఏమిటని అప్పట్లో అభ్యంతరం చెప్పేవాళ్లు. ఆ రోజులు గతించాయి. రాజకీయ కార్యక్రమాలకు, సాధు సంతుల సేవలకు తేడా ఏమీ లేని కాలం ఇది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఆహ్వానానికి కేసీఆర్‌ విజయవాడ రావడం ఒక రాజకీయ పర్యటన. తన రాజకీయ పర్యటనలోకి ʹఆధ్యాత్మికాన్నిʹ తేవడానికి కేసీఆర్‌కు అభ్యంతరం అనిపించలేదు. ఆయనతోపాటు ఇగిలించుకుంటూ వెళ్లేందుకు జగన్‌కు అంతకంటే అభ్యంతరమనిపించలేదు. రాజకీయ అధికారం మతాన్ని బరితెగించి కావలించుకుంటున్న సమయమిది.

జగన్‌కు రోజుకు వందసార్లయినా దేవుని దయను గుర్తు చేసుకునే అలవాటున్నట్లు మాత్రమే మనకు తెలుసు. కానీ ఇప్పుడాయన కేసీఆర్‌నే కాదు, సాధువులను కావలించుకొనే దశకు ఎదిగాడు.

స్వరూపానేంద్ర సరస్వతి అలౌకిక ప్రపంచానికి ప్రతినిధి. మామూలుగా అయితే ధార్మిక కార్యక్రమంలోకి రాజకీయ నేతలు రావడం సాధువులకు అభ్యంతరం ఉండాలి. కానీ ఈ పీఠాధిపతి వాళ్ల సమక్షంలో ఏకంగా రాజకీయ ప్రసంగమే చేశాడు. ఆయన ధర్మానికి, అధర్మానికి ఆయన పెట్టుకున్న ప్రమాణం ఏంటయ్యా అంటే ఏపీలో తెలుగుదేశం ఓడిపోయి వైసీపీ రావడమే. ʹధర్మాధర్మాలుʹ ఎంతగా రాజకీయాల్లోకి జొరపడ్డాయో చూడండి.

కేసీఆర్‌కు మాత్రమే ఈ పీఠాలు, యాగాల యావ ఉందనుకునే వాళ్లం. కానీ ఈ వ్యవహారం వెనుక ఉన్న రహస్యం స్వామీజీ బైటపెట్టాడు. స్వామి ప్రభుత్వాలను మార్చే పనిలో, కొనసాగించే పనిలో ముమ్మరంగా ఉన్నాడు. ఇంకో పదిహేనేళ్లపాటు వీళ్లే అధికారంలో ఉంటారని ఊరకే ఆశీర్వదించలేదు. తన పీఠానికి ఉత్తరాధికారిని నియమించుకున్నట్లే ఈ రెండు రాష్ట్రాల్లో ఆయనే ముఖ్యమంత్రులను పెట్టేయగలడు. కొనసాగించగలడు.

సాధుసంతులకు ఆధ్యాత్మిక నీతి ఉండాలని, ప్రజా ప్రతినిధులకు రాజకీయ నీతి ఉండాలని అనుకొనే మందబుద్ధులకు కేసీఆర్‌, జగన్‌, స్వరూపానందేంద్ర సరస్వతి షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. మా ప్రయోజనాలే మా నీతి అని ముగ్గురూ తేల్చేశారు. కన్యాశుల్కం నాటకంలో మధురవాణి ʹసానిదానికైనా నీతి ఉండాలి కదా పంతులుగారూʹ అంటుంది. ఇంత కాలం ఆమె విజ్ఞతను, నిజాయితీని ఆరాధించిన వాళ్లు.. ఇప్పటికైనా కళ్లు తెరుచుకొని మధురవాని ఎంత అమాయకురాలు అనుకోవాల్సిందే.

చివరాఖరికి ఇంకో ముచ్చట చెప్పుకుంటే నీతిరాహిత్యానికి పరాకాష్ట అర్థమవుతుంది.

మంత్రాలయం పీఠాధిపతి కొన్ని రోజులపాటు ధార్మిక పర్యటనకెళ్లారని పత్రికల్లో వచ్చింది. వెళ్లే ఉంటాడు.

నిన్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే చోట ఉన్నారనే ఆనందంతో కాబోలు, మళ్లీ ఇలాంటి అవకాశం వస్తుందో లేదో అనుకొని ఆయనే ఎగబడి జగన్‌ ఇంటికి వెళ్లాడు. వాళ్లకు దుప్పట్లు కప్పాడు. ఆశీర్వదించాడు. ధార్మికపర్యటనలో ఉన్న నాకు ఇదేం పని? అని ఆయనకు అనిపించలేదు.

అధికారం శారదా పీఠంలో ఉందా? ప్రభుత్వంలో ఉందా? అనే ధర్మ మీమాంస మనకు అక్కర్లేదు.

మన దేశంలో ఆధ్యాత్మికం, అధికారం .. ఈ వ్యవస్థ అనే జంతువుకు ఉన్న రెండు వికృతమైన తలలు.

రాజకీయాధికారం మోకాళ్ల మీద దోగాడుకుంటూ మఠాల దగ్గరికి పోతుంది. ఆ పని రాజకీయాధికారం చేయదేమో అనే అనుమానంతో బరితెగించి పీఠాధిపతులే అధికారం దగ్గరికి వెళతారు.

సరిగ్గా అద్వైత సిద్ధి అంటే ఇదే.

No. of visitors : 814
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
  జీవితం పరిమళించిన కథలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •