ఇదంతా నదీ తీరం కోసమేనా?

| సాహిత్యం | వ్యాసాలు

ఇదంతా నదీ తీరం కోసమేనా?

- పాణి | 27.06.2019 04:26:56pm

ప్రజా వేదిక కూలిపోయినందుకు భూనభోంతరాలు దద్దరిల్లేలా కొందరు ఏడుస్తున్నారు. నిజానికి అది ప్రజా వేదిక కాదు, పాడూ కాదు, అధికార వేదిక, పాలక వేదిక.. అనే నా విమర్శను పక్కనపెట్టండి. దాంతో అందరినీ ఏకీభావం లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ప్రజావేదిక అనే భవనం కూలిపోయిందని ఆవేదన పడుతున్న వాళ్లున్నారు. ఆనందిస్తున్న వాళ్లూ ఉన్నారు. నాకైతే.. అక్రమ కట్టడాలనే పేరుతో రోడ్డు మీదికి జానెడు జరిగి పేదలు కట్టుకున్న ఇళ్లన్నీ కూల్చివేసినప్పటి దృశ్యాలు గుర్తుకు వస్తున్నాయి.

ప్రజావేదిక అక్రమ నిర్మాణమనడానికి కారణం నది తీరంలో నిర్మించడమే కదా? జగన్‌ ఈ మాట మీద నిలకడగా ఉంటాడా? రాష్ట్రంలోని అన్ని అక్రమ నిర్మాణాలను కూల్చేస్తాడా? దీని కోసం అమరావతిలోని అక్రమ కట్టడాల దాకా వెళ్లనవసరం లేదు. నదీ తీరాల్లోని అక్రమ నిర్మాణాలన్నిటినీ కూల్చేస్తే చాలు. నదులు, వాగులు, కుంటలు ఆక్రమించుకొని కార్పొరేట్లు, రాజకీయ నాయకులు కట్టుకున్న భవనాలన్నీ కూలగొట్టాలి. ఆ లెక్కన చంద్రబాబు ఇల్లు కూడా కూలగొడతారా? అని టీడీపీ వాళ్లు కవ్విస్తున్నారు. అక్రమమైతే ఎందుకు కూలగొట్టకూడదు? నిరభ్యంతరంగా పడగొట్టాల్సిందే.

అయితే చంద్రబాబుకే కాదు, కృష్ణాతీరం వెంట నదీ తీరంలో భవంతులు కట్టుకున్న బలిసిన బడా బాబులకు, స్వాములకు మళ్లీ నివాసాలు చూడాల్సిన పని లేదు. పరిహారాలు ఇవ్వాల్సిన పని లేదు. అన్నీ కూలదోయడంతోనే ఇష్యూ పరిసమాప్తం కావాలి. ఉగాది నాటికి లక్షలాదిమందికి ఇండ్ల స్థలాలు ఇస్తానని, ఇండ్లు కట్టించి ఇస్తానని జగన్‌ అంటున్నాడు కదా. ఆ పని తర్వాత. ముందు రాష్ట్రంలో వాగులు, వంకలు, నదులు, చెరువులు ఆక్రమించి కట్టుకున్న భవంతులన్నీ కూలగొట్టాలి.

ఈ మాట అనగానే నదీ తీరాల్లో తలదాచుకున్న పేదల మీద ప్రభుత్వం విరుచుకపడే ప్రమాదం ఉంది. అది చాలా తేలిక. దేనికంటే కృష్ణాతీరంలోనే కాదు, రాష్ట్రంలో చాలా చోట్ల నిరుపేదలు నదీతీరాల్లో గుడిసెలు వేసుకొని జీవిస్తుంటారు. విజయవాడలో కూడా అలాంటి వాళ్లు ఉండే ఉంటారు. ముఖ్యంగా పల్లెల నుంచి బతుకు తెరువు కోసం పట్టణాలకు వచ్చిన వాళ్లకు నిలువ నీడ లేక వాగులు, వంకలు, నదుల అంచుల్లో భయం భయంగా బతుకుతూ ఉంటారు.

జగన్‌ నదీ తీరాన్ని కాపాడాలనుకుంటున్నాడా? అయితే ఈ పేదలను కూడా అక్కడి నుంచి తొలగించాల్సిందే. అంతకంటే ముందు వాళ్లకే గౌరవ ప్రదమైన చోట ఇండ్లు కట్టించాలి. ఆ తర్వాత వాళ్లను నదీ తీరం నుంచి ఖాళీ చేయించాలి.

ఇంతకూ నది కరకట్ట మీద భవంతులు కట్టుకోవడం అక్రమం అని అంటున్న మాట ఎంత లోతైనదో జగన్‌కు తెలుసో లేదో అనుమానం. ఆ మాట నేరుగా ఆయన్ను పర్యావరణ సమస్య దగ్గరికి తీసికెళుతుంది. అక్రమాలు, అనుమతులు, కోర్టులు, చట్టాల కంటే అతి పెద్దదైన పర్యావరణమనే గోదాలోకి జగన్‌ దిగుతున్నాడు.

నిజాయితీగా దిగితే కావాల్సిందేముంది? నదులను కాపాడదల్చుకుంటే కృష్ణా, గోదావరి తీరాల్లోని నగరాల్లోని అక్రమ నిర్మాణాలనే కాదు. రాష్ట్రమంతా ఎన్నో ʹప్రజావేదికలుʹ ఉన్నాయి. వాటిని కూడా విజయవాడలోలాగే ఒకటి రెండు రోజుల గడువు పెట్టి కూలగొడితే అప్పుడు గాని టీడీపీ వాళ్లు అంటున్నట్లు ప్రజావేదిక కూల్చివేతలో రాజకీయ కక్ష లేదని రుజువు అవుతుంది. జగన్‌ దీన్ని నిరూపించుకోవాలని మనమంతా కోరుకోవాలి. అప్పుడు ప్రజావేదిక కూల్చివేతపట్ల ఆవేదన, ఆనందం రెండూ పక్కకుపోయి అసలు కథ బైటికి వస్తుంది. అలాగే నదుల్లోకి, వంకల్లోకి కార్పొరేట్లు విష వ్యర్థాలను వదిలే కార్పొరేట్లపై కూడా జగన్‌ చర్యలు తీసుకోవాలి. లేకుంటే నది మీద జగన్‌ ప్రేమ ఉత్తుత్తిదే అనే అనుమానం కలుగుతుంది. ఇదంతా పాలకవర్గాల దొమ్మీ అని తాజాగా రుజువు అవుతుంది. అంతే.





No. of visitors : 325
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార సెప్టెంబర్ 2019

    దళిత భక్త కవి రవిదాస్‌ సంత్‌ ఆలయం కూల్చివేత హిందూ ఫాసిజంలో భాగమే
    The Destruction of Kashmir is a Deathblow to Democracy in India
    నల్లమల యురేనియం గని కాదు, జీవవైవిధ్య కేంద్రం
    అతడు ఆమె అడవి
    మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ
    కన్ ఫామ్... !
    బందిష్
    రాంగూడ ప్రాంతంలో సమిష్టితత్వం, సహకార పద్ధతి
    కళలన్నా, సాహిత్యమన్నా ఫాసిజానికి భయం
    కవులకు సమర స్ఫురణ

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •