సాహిత్యంలో విప్లవోద్యమానికి యాభై ఏళ్లు

| సంపాద‌కీయం

సాహిత్యంలో విప్లవోద్యమానికి యాభై ఏళ్లు

- పాణి | 02.07.2019 11:04:06pm

ఉద్యమాల వెంట అక్షరాలు కలిసి నడుస్తాయి. విప్లవాల కోసం కళలు విప్లవీకరించబతాయి. సాహిత్యం ప్రజా పోరాటాలను చిత్రిస్తుంది. వీటన్నిటికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 1970 జూలై 3వ తేదీ అర్ధరాత్రి దాటాక 4వ తేదీ వేకువన జరిగింది ఇంత మాత్రమే కాదు. సాహిత్యంలో విప్లవం ఆరంభమైంది. విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. ఇది కొంత మంది సృజనకారుల ఆశయం, ఆకాంక్ష మాత్రమే అయితే ఎలా ఉండేదో చెప్పలేం. చరిత్ర తన అవసరాన్ని ఆ సాహిత్యకారుల ద్వారా అలా తీర్చుకున్నది. కాలం తన భవిష్యత్‌ గమనానికి సాహిత్యరంగంలో విప్లవ రచయితల సంఘాన్ని వాహికగా చేసుకున్నది.

అందుకే విరసం అనేక సాహిత్య సంస్థల్లో ఒకటిగా మిగిలిపోలేదు. తనవంటి సంఘంగా తానొక్కటే ప్రపంచ ఉదాహరణగా కొనసాగుతున్నది. నక్సలైట్‌ రాజకీయాలను ప్రచారం చేయడమే లక్ష్యమని బాహాటంగా ప్రకటించుకొని ఆరంభమైంది. విప్లవోద్యమంలో అంతర్భాగంగా సాహిత్య సాంస్కృతికోద్యమాన్ని నిర్మిస్తానని ప్రతిన చేసింది. కళా సాహిత్యాల్లో వర్గపోరాటమే తన స్వభావంగా రాటుదేలింది. మానవ జీవితంలో సాహిత్యం ఏ పాత్ర పోషించగలదో గుర్తించి దానికి తగినట్లు తన సృజన శక్తినంతా ధారపోయడానికి సిద్ధమైంది. తద్వారా నూతన జగత్తును నిర్మించుకునే కూలి దండు వెంట నడుస్తానని స్పష్టం చేసింది.

విరసం ఇలా బయల్దేరి యాభైవ ఏట అడుగుపెట్టింది. విరసం ఆవిర్భావం చారిత్రక శక్తుల సంఘర్షణ ఫలితం. విరసం వ్యవస్థాపకులు ఆనాటి కాలాన్ని గుర్తించారు. దాని అవసరాన్ని తెలుసుకున్నారు. కాలం తమలో ప్రేరేపిస్తున్న చారిత్రక కర్తవ్యాన్ని అందుకోడానికి సిద్ధమయ్యారు. చరిత్రను ప్రజలు నిర్మించడం ఆరంభిస్తే, ఆ చరిత్ర తన సాహిత్య సాంస్కృతిక అవసరాలను విరసం ద్వారా తీర్చుకుంటున్నది.

ఈ క్రమమంతా సహజంగానే అనేక కల్లోలాల నడుమ సాగింది. వర్గ పోరాటానికి మినహాయింపు ఏదీ ఉండదు. సాహిత్య రంగంలో వర్గపోరాటానికి సిద్ధమైన విరసం తనలో తాను కూడా వర్గపోరాటాన్ని ఈ యాభై ఏళ్లుగా కొనసాగిస్తున్నది. విరసం శక్తి అంతా అక్కడే ఉన్నది. ఈ మూడు తరాల్లో వందలాది మంది విప్లవ రచయితల్ని తయారు చేసుకున్నది. వేలాది మంది రచయితలను తన ప్రభావానికి గురి చేసింది. కవిత్వ, పాట, కథ, సామాజిక సాహిత్య విశ్లేషణ మొదలైన ప్రతి ప్రక్రియలో వందలాది పుస్తకాలు విడుదల చేసింది.

ఈ రాసిలో కంటే దాని బలమంతా గుణంలోనే ఉంది. సాహిత్య, మేధో రంగాల్లోని భావాలను, ప్రమాణాలను, సంవిధానాలను నిరంతరం విప్లవీకరిస్తోంది. తానే ప్రతిపాదించిన, నిర్ధారించిన అంశాలను కూడా పునస్సమీక్షించి మరింత శక్తివంతమైన పునాది మీద పునర్నిర్మిస్తున్నది. అనేక కొత్త వైఖరులతో, ఆలోచనా క్రమాలతో మేధో రంగాన్ని విస్తరిస్తున్నది. ఇదంతా విప్లవోద్యమంలో భాగం కావడం వల్లే సాధ్యమైంది. ఈ వ్యవస్థను ధ్వంసించి నూతన వ్యవస్థను, సామాజిక క్రమాలను, అంతిమంగా నూతన మానవులను నిర్మించాలనే విప్లవోద్యమ చారిత్రక కర్తవ్యంలో భాగం కావడం వల్ల మాత్రమే విరసం తన పాత్రను నిరంతరం ఉన్నతీకరించుకుంటున్నది. దీని కోసం ఆవిర్భావం దగ్గరి నుంచి నేటి దాకా కాగితం మీది అక్షరానికి బలైపోవడానికి సదా తన సంసిద్ధతను రుజువు చేసుకుంటున్నది. ఈ యాభై ఏళ్లలో విరసం సభ్యులందరూ ఎప్పుడో ఒకప్పుడు రాజ్య నిర్బంధానికి గురైనవాళ్లే. దారుణమైన చిత్రహింసలు అనుభవించిన వాళ్లే. ఏండ్ల తరబడి చీకటి కొట్టలో బంధింపబడిన వాళ్లే. పుస్తకాలు, పత్రికలు నిషేధానికి గురి కావడమే కాక ఏకంగా రాజ్య నిషేధానికి గురైన సంస్థగా కూడా ప్రపంచంలో తానే ఒక ఉదాహరణగా నిలిచింది. నిత్య నిర్బంధాలను, నిషేధాన్ని అధిగమించి, తన ఆశయం కోసం ముందుకు సాగుతున్నది.

ఈ క్రమంలో విరసం అట్టడుగు ప్రజల సన్నిహితమైంది. తన కవిత్వాన్ని, పాటలను, కథలను, మాటలను పోరాట ప్రజల చేతిలో ఆయుధంగా పెట్టింది. లక్షలాది ప్రజలను ప్రభావితం చేసింది. అంతకంటే ఎక్కువగా ఈ యాభై ఏళ్ల ప్రయాణంలో విరసం ప్రజా పోరాటాల నుంచి నేర్చుకుంది. ప్రజల నుంచి, విప్లవోద్యమం నుంచి నిత్య ప్రేరణ పొందుతోంది. వేలాది మంది రచయితలు, బుద్ధిజీవులను మిత్రులుగా తయారు చేసుకున్నది. తన రాజకీయ లక్ష్యం, పోరాట చైతన్యం, వాటికి తగిన సాహిత్య సృజన, విప్లవోద్యమ వైఖరుల వల్ల ఎందరో విమర్శకులు, శతృవులును కూడా ఎదుర్కొంటున్నది. ఇదంతా వర్గపోరాటంలో భాగమే.

విప్లవ రాజకీయాల వల్ల అక్షరాలకు విరసం జ్వలించే లక్షణాన్ని తీసుకొచ్చింది. తన ఆచరణ వల్ల తానే ఒక పోరాటశక్తిగా నిరూపించుకున్నది.

ఇప్పటి దాకా చేసిన దానికన్నా చేయవలసిందే చాలా ఉన్నదనే ఎరుక విరసం భవిష్యత్తుకు చెరగని దారి వేస్తోంది.

ప్రజలు జయించే వరకు, ప్రత్యూషం రెక్క విప్పి దిక్కులనెగరేసే దాకా విరసం సాహిత్య సాంస్కృతిక రంగాల్లో వర్గపోరాటం చేస్తూనే ఉంటుంది.

కార్మికవర్గం తన ప్రపంచాన్ని జయించే వరకూ విరసం తన అక్షరాలను జ్వలింపజేస్తూనే ఉంటుంది.





No. of visitors : 331
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార జూలై - 2019

    చారిత్రక పత్రం
    రచయితలకు సవాల్ !
    మూడు తరాల, యాభై వసంతాల విరసం
    వర్తమాన సంక్షోభాల తాత్విక చిత్రణ - అద్దెప‌ల్లి ప్ర‌భు ʹశ్రీ సూర్యనారాయణʹ
    రూపొందుతున్న కాలానికి తగిన కథన శిల్పం
    తిరిగి వ‌స్తావ‌ని
    నన్నెక్కనివ్వండి బోను
    కవిత్వాన్ని సాయుధం చేసిన చ‌నుబాల ధార‌
    సామాజిక సంఘర్షణల సారం - ప్రస్థానం
    సాహిత్యంలో విప్లవోద్యమానికి యాభై ఏళ్లు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •