సామాజిక సంఘర్షణల సారం - ప్రస్థానం

| సాహిత్యం | వ్యాసాలు

సామాజిక సంఘర్షణల సారం - ప్రస్థానం

- సమీర | 02.07.2019 11:10:42pm

"సాహిత్యం అంటే మనకళ్ళముందు ఉండీ మనం చూడని, చూడజాలని విషయాలనేకం ఉంటాయి. కొన్ని భయంవల్ల, కొన్ని అభద్రత వల్ల చూడం. కొన్ని ఒక బలమైన భావజాల ప్రభావం వల్ల మన ఎదుట ఉండీ మనకు కనిపించవు. ఒక్కొక్కసారి మనకు అలవడిన దృక్కోణం వల్ల గానీ, మనం ఎంచుకున్న ధృక్కోణం వల్లగానీ కొన్ని విషయాలు కళ్ళముందే ఉండీ కనిపించవు. వీటిలో విడివిడి విషయాలే కాదు,
సామాజిక క్రమాలు కూడా ఉంటాయి. వీటిని మనకు చూపించడం సాహిత్యం చేసే పనులలో ఒకటి " - కె.బాలగోపాల్

2019 జనవరిలో వెలువడిన సమతా శ్రీధర్ ప్రస్థానం నవల అలాంటి సామాజిక క్రమాలను పరిచయంచేస్తుంది. జీవితంలోని సంఘర్షణను కళ్లముందు ఉంచుతుంది.

ʹతిరగక మగాడు, తిరిగి ఆడది చెడుతారుʹ అన్నది దోపిడి పౌరోహితాధిపత్య మనువాద సమాజ నానుడి. కాని, ఈ ఆధునిక యుగంలో దానినిపుడు మనం, ʹతిరగక ʹ మనుషులెవరైనా చెడతారు అని మార్చు కోవాలి.

శ్రామిక వర్గ వ్యయవసాయ తాత తండ్రుల వారసత్వ శ్రమ మూలాలనుండి ఉన్నత బ్యూరోక్రాట్ స్థాయికి నెదిగిన ఒక తండ్రి, తన కార్యాలయంలో సిబ్బందితో కలిసి పనిలో నిమగ్నమై ఉన్న సమయాన ఒకరోజు, వైద్య విద్యను విజయవంతంగా
పూర్తిచేసి, ఉన్నత విద్యకై అమెరికా వెళ్ళే అంది వచ్చిన అవకాశాన్నీ, అందుకు తన సంసిద్ధతాకాంక్షను, అందుకు అవసరమైన అన్ని ప్రాథమిక పనులన్నీ తనే ముందస్తుగా ఏర్పాటు చేసుకొని మరీ, ప్రయాణానికి 30 రోజులు గడువుండగా, ఆ తండ్రి కార్యాలయానికి వెళ్ళి, వేచి ఉండక తప్పని పరిస్థితుల్లో రెండు గంటలు వేచి ఉండి మరీ, తండ్రి ముందుకు వెళ్ళి, తన డిగ్రీ చదువు పూర్తైన విషయం, తన భవిశ్యత్ ఆకాంక్షను, అందుకు చేసుకున్న ఏర్పాట్లను సంతోషంగా వ్యక్తపరుస్తడు.

తనపుడున్న ఉన్నత బ్యూరోక్రాట్ ... స్థాయికి కారణభూతులైన పూర్వీకుల చుట్టూ ఉన్న వివిధ భిన్న శ్రామిక అస్తిత్వాల మానవ సమాజం, భౌగోళిక ప్రాంతీయ అస్తి త్వాలు నిర్వహించిన పాత్రను విస్మరించని సంస్కారి యైన ఆ తండ్రి. అది విని, క్షణ కాలం మ్రాన్పడి తేలుకొని,నిర్లిప్తంగా సాధారణంగానే ఐనా, ʹఆ హా..అలాగనా... అంతా సిద్ధమైందా, సరే. నాతో ఏం పని.. ఏం మాట్లాదామని.. నావద్దకు వచ్చావుʹ? "అన్న స్పందనతో మ్రాన్పడడం తన వంతైన కొడుకు ʹఅదేంటి ?! మీరు డాడీ కదా... చెప్పాలి కదా...ʹఅట్లా సుదీర్ఘ చర్చాక్రమానుగత చివర్లో, ʹడాడీ ఈరోజు మీరెందుకు ఇట్లా మాట్లాడు తున్నారు!ʹమీకు నన్ను గురించి తృప్తిగా వుండాలంటే... మీరేది కోరితే..అది చేయడానికి...నేను సిద్ధంగా ఉన్నాను ... చెప్పండి డాడీʹ అని అనడంతో, ఆ తండ్రి తన ఆకాంక్షను కొడుకుకు సూటిగా చెప్పకుండా; ʹకన్నా నేనేది చెప్పినా చేస్తావాʹ? అనడిగి, చేస్తాననే హామీని కొడుకు నుండి తీసికొని, ʹకన్నా నీమనసు, డబ్బు సంపాదించ డమే ధ్యేయంగా, దానితో వచ్చిన సుఖాలే జీవిత గమ్యంగా నీ మనసు ట్యూన్ ఐ ఉంది. ఈ దశలో దాన్ని భంగపరిచేట్టు నేనేమి చెప్పినా, నీ అవసరా లను తీర్చే వారధి స్థాయి నుండి విలన్ స్థాయికి దిగడం ఔతుంది. నాకదిష్టం లేదు. పద అంటూ నాగార్జున ఆనకట్ట వద్దకు తీసికెళ్ళి, ఆప్యా యంగా స్నానం చేయించి, ఇక్కడి నుండి కాలి నడకన రాజమండ్రి వద్ద గల గోదావరి నదిదాకా ఎటువంటి నీ నేపథ్య గుర్తింపు నుపయోగించు కోకుండా వెళ్ళి, అక్కడ గోదావరిలో స్నానం చేసి, నాకు ఫోన్చెయ్ నానా. అంతే.స అంటాడు.

తండ్రికోరిక ప్రకారం, యాత్రలో తన ఎదురైన 12 మంది భిన్న సామాజిక నేపథ్యాల మనుషులతో ప్రత్యక్ష అనుభవం, వాళ్ళ గాథలు; ఒక ప్రజా ఉద్యమంతో కలిగిన సాహచర్యం వాళ్ళతో స్వేచ్ఛాయుత చర్చల పిదప, అదివరకే 9 మందితో ప్రత్యక్ష జీవితానుభవాల వ్యక్తీకరణలను అక్షరరూపీకరించి, పుస్తకీకరించినదే ఈ నవల.

ఆ పన్నెండు కథలనుండి మచ్చుకు కొన్ని
1. ఎంకులు చెప్ఫినకథలో.... ʹవెనక వాహనం వేగం తగ్గినట్లుంది, ఆటో అనుకుంటా, "అన్నా, ఎక్కుతవా"...ఎక్కడానికి
సందేలేదు. కనీసం పాతికమందైనా కూచు న్నట్లుంది. కూచోవడం అనేకంటే ఒత్తుకున్నట్లుంది అంటే బాగుంటుందేమో,
...ఎవరు ఎట్లాకూచున్నారో, ఆటో డ్రైవరు తన ఏకాలును ఎటుపెట్టాడో కూడా అర్థం కావట్లేదు. ..."నిజంగా మనుషుల్లో ఎంత సర్దుకుపోయే మన స్తత్వం! ఇదే మానవ సంబంధాలను నిలబెడుతుందేమో!" "మాగురించి తెలుసుకోనీకి గొప్పిసయా లేవుంటయి తమ్మీ,మేమన్నా రెడ్లమా -
రాజ్య మేలనీకి, కమ్మోరివా కబ్జలు సేయనీకి, కర్ణ పోల్లమా కిరికిర్లు సేయనీకె,ఎలమోలమా - మాటలు జెప్పి పబ్బం గడుపుకోనీకె," ʹకడుపు చేత
బట్టుకొని బతకనీకె యాడనుంచో వచ్చినోల్లు కామందు లైండ్రు - కడుపుకోస్రం కష్టపడేటోల్లం బకరాల మైనం.

2. తెలగరాములు కథలో
ʹగిర్రున తిరిగిన బొంగరం కిందపడి ముడ్డెత్తి ఎన్నులేపి జూపినట్టు,ʹ పూర్వ జానపదుల నానుడి,
ʹనీ వారసులని బతికించుకోవని నీకుజెప్పిన గాని... మమ్మల్ని బాగు చేయటానికి నువ్వు ...ఓడిపోవావాలని...నేను అనుకోలేదురా బిడ్డా...ʹఅకాల అన్యాయ మృత్యువాత బడ్డ కొడుకు గురించి ఒక తండ్రి వలపోత.

3. బోడయ్య చెప్పిన కథలో
ʹరాజకీయాలలో ఉన్నవాళ్ళకి హంగు, ఆర్భాటం, హోదా, దర్పం, వెంట మనుషులు, పోలీసు సైరన్, కాన్వాయ్, పేపర్లలో... ...మొన్నీమధ్య బూర్గులరామ క్రిష్ణ అంటే ఎవరని అడిగితే, సెక్రటేరియట్ దగ్గర పెద్ద బిల్డింగ్అద్దెల కిచ్ఛాడే, ఆయనే అనుకుంటా!ఇదీ సమాధానం.ʹప్రయాణం మధ్యలో తండ్రి మాటల జ్ఞాపకాలు... ఒక రాజకీయ ప్రజా ప్రతినిధులకొరకు ఏర్పరిచిన సమావేశంలో
ప్రేక్షకుల నడుమ ముచ్చట్లు కొన్ని,ʹపారటీలు ఏదయునా టేజీమీదున్నో ల్లందరూ ఒకళ్ళకొకళ్ళకి సుట్టబ్బందువులే..
ఇంకోచోట,ʹకుక్కలెక్క వాంతికి సేసుకుంది. ఏరుకొని మల్లీ తినేవాణ్ణేమో గాని, సౌకీదారు నారెక్క పట్టుకొని,గుంజుకపోయి...ʹ,
అదేకథ చివరలో, ʹఏవోఅన్నా!, ఇది పుట్టి పెట్టినోల్ల పెపంచకం, కులవూ డబ్బున్నోల్లదే... ఎప్పటికైనా మాబతుకులు మారత యంటావాʹ...? అనుకుంటూ నిద్రపోయాడు,(బోడయ్య).

4. పూలోజు రామాచారి వడ్రంగి తన కొడుకు గురించి చెప్పిన కథలో ʹకాని వాడికోసం,ఎండి పగుళ్ళుబడిన బూదేవి,తొలకరికోసం ఎట్టా ఎదురు సూస్తదో, అట్టా ఈ ముసలోళ్ళం పేనాలు నిలుపుకొని ఈ కట్టెలను మోత్తన్నావు.బిడ్డా శంకరమా! ఏడున్నావురా నాయినా....అని ఏకధారగా.. పిడికిట మట్టిని ధారగా జారుస్తూ..ʹ
ఆ తండ్రి వేదనట్లుంటే,పర్యాటక వైద్య పట్ట భధ్రుడి ఆలోచనాంతరంగంలో, "కాని వారు నమ్ముకున్న ఆశయం,ఆచరణ సాధ్యంకాక పోతే వారి త్యాగాలన్నీ వృథా అవుతవేమో!

5. భూదేవి ఘటన కథలో
ʹపరి పరి విధాలా ఆలోచించుకుంటూ సాగుతుంటే వెనుకనుంచి... .. ʹమూర్ఖంగా వెళితే ఉన్మాద స్థితిలో ఉన్నవాళ్ళను ఎదుర్కోటం కష్టంʹ.. ..ʹఇంతటి నేరానికి పాల్పడిన వాళ్ళనుశిక్షించడానికి బదులు... ʹప్రశ్నించే సహజమానవ మస్తిష్కానికి మతం అనే మాయతో తలుపులు మూసివేశారు. ...
ʹ
6.మంచికంటి పుల్లయ్య చెప్పిన కథలో ʹఒసే సాయిత్రీ బతికున్నోడిని సచ్చిండని శాప నార్థాలు ఏందే,ఉన్నది
ఉన్నట్లు చెబితే ఏం బోతదే.ʹ...ʹఅల్లుడా ఇది జరిగి ఇప్పటికి పది సమ్మచ్చరాలైంది.ఆనాటినుంచి...కొడుకు పురిట్లనే పోయిందని సెపతంది...ఇదిగో ఈ కుక్కని కృష్ణుడూ అని సాకుతుంది.ʹపుల్లయ్య
పాత్ర మాటలిట్లుంటే,
ʹ ఈ దళిత బడుగు వర్గాలవారు, అటు భూమి మీద గాని,యంత్రాలమీద గానీ, పిడికెడుపొట్ట కోసం ఉత్పత్తికి మర మను షులుగా అయ్యారు.ʹ పథికుడి మనోమథనం.

7. బానోతు భూలి చెప్పిన కథ విన్నతర్వాత, ʹఏ నినాదం వెనుక ఏవర్గ ప్రయోజనాలు దాగున్నయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటరుʹ పథికుడి అంతర్మథనం.

8. నయీం తాత చెప్పిన కథ విన్న పిదప
ʹకులంనుడి బైట పడటానికి,మతం మార్చు కున్నా,పేదవారు పేదవారుగనే ఉంటున్నార నేది,వేయిసంవత్సరాల చరిత్ర.దీనికి సాక్ష్యమేగాక,భారతీయ సమాజంలో అంతర్భాగమైన వీరిని... ...వికృత సామాజిక రాజకీయాలకు ఒక నిదర్శనం.ʹయాత్రికుడికి కలిగిన ఎరుక.

9.ʹమడికం బక్కయ్య కథలో
ʹ అయితే సృష్టిలోని ప్పతి ప్రాణీ, వాటి వాటి కర్తవ్యంతో మనుగడ సాగిస్తున్నపుడు,మీ ప్రభువుయొక్క కృప అవసరం ఏముంటుంది ఫాదర్ʹ?,...ʹతమ్మీ బక్కా మీలాంటి గిరిపుత్రుల కోసం,మీ పునాదిగా సామాజిక విమోచనా దిశలో,జాతుల విముక్తి బాటలో, సమసమాజ
స్థాపనకై పాటు పడుతున్న ఉద్యమం జరుగు... అప్పటివరకు సెలవుʹ బక్కయ్యకు వీడ్కోలు చెబుతూ బాటసారి.

10. ఎన్ కౌంటర్ సంఘటన:
ʹతమ్మీ యాడకు పితున్నవు,ఈదారి పెమాదకరమని ఎరకలేదా?...ʹ,ఏమైనదో ఏమోగాని..ఒక భయంకర విస్ఫోటనం, వీపున ఉన్న చొక్కా పీలికలైంది...గాయాలనుంచి రక్తం ఉబికి వస్తుంది.నన్ను చూసి ఆస్థితిలో కూడా బెల్టుకు ఉన్న పిస్టల్తీయడానికి...ʹఅన్నా నీకు శతృవును కాను,...ʹచావబోయేముందు నాదాహాన్ని తీర్చావు.నేను చేసిన దుర్మార్గాలకి నాకు ఈ ప్రాయశ్చిత్తం...నాతల్లిదండ్రులు,మల్లికంటి రాములు,సావిత్రిʹ,ʹనాకు తెలుసన్నాస!,
ʹతమ్మీ నీకెట్ల తెలుసు?ʹ
ʹఅన్నా మీ అమ్మానాన్నలతో ఒకరోజు మీ ఇంట్లో...ʹ,నా తల్లిదండ్రులపట్ల...(6 వ అధ్యా)
ʹకార్మిక వర్గం చేతిలో ఆయుధంగా ఉండవలసిన మార్క్సిస్టుతత్వశాస్త్రం.. ఆధి పత్యకులాలవారి ఆభరణంగా.. ఒక విశాదపరిణామ క్రమం...ʹ,ʹనీకుఅవకాశంఉంటే..వారికి తెలియజేయిʹ..వేరేమాటకు తావులేకుండా, నన్ను గాఢాలింగనం చేసుకొని,ʹతమ్ముడూ ప్రయాణం జాగ్రత్తʹఅని వెనుదిరకకుండా సహచరులవైపు సాగిపోయాడు.
ఇంకా దొడ్డి ముత్తయ్య చెప్పిన, సరస్వతి చెప్పిన కథ, ఇంకా.. ఇట్లా 16 అధ్యాయాలతో 233 పుటలతో నవల ముగుస్తుందీ నవల

No. of visitors : 274
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నేను నగర మావోయిస్ట్

సమీర | 21.12.2018 01:45:36am

నేను రాజద్రోహినని గడువు లోపు నేనొప్పుకొని తీరాలె ఇంతకూ నేనడిగిందేమి శాంతియుత ఒక నేల తునక కానీ సర్కార్ ఎప్పుడూ విశ్రమించదు నన్ను వేటాడనీకె......
...ఇంకా చదవండి

క‌వితా వ‌చ‌నం

సమీరన్ | 18.02.2019 09:39:57pm

స‌దువుకొన్న మనుషులు సాఫ్ట్‌ వేర్ కంపెనీ కేబిన్ లనో కార్పొరేట్ ఆస్పత్రులు షాపింగ్ మాల్స్ పెంపుడు పెట్ లుగనో కాపలా కుక్కలూ రిసీవింగ్ రిసెప్ష‌నిస్ట్ లో ......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
  జీవితం పరిమళించిన కథలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •