కవిత్వాన్ని సాయుధం చేసిన చ‌నుబాల ధార‌

| సాహిత్యం | స‌మీక్ష‌లు

కవిత్వాన్ని సాయుధం చేసిన చ‌నుబాల ధార‌

- కెక్యూబ్ వర్మ | 02.07.2019 11:48:30pm

విప్లవ కవిత్వమంటే అప్పటివరకూ వున్న అభిప్రాయాన్ని బద్దలు చేస్తూ ఉద్యమ కార్యక్షేత్రం నుండి ఒక నవయవ్వన గొంతు వినపడింది. కవిత్వానికి చనుబాలు తాపి అమ్మతనాన్ని అద్ది అదే సమయంలో కార్యోన్ముఖున్ని చేసే ధీరోదాత్తమైన కవితలను సృజించారు అమరుడు కామ్రేడ్ కౌముది. తను చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా చెప్తూనే తను తిరుగాడిన ప్రకృతితో మమేకమైన ప్రతీకలతో తన ఎడతెరిపిలేని స్వప్నాలను ఆవిష్కరించారు. తన కలం ద్వారా ఒక గొప్ప హామీనిస్తూ సాహిత్య రంగంలో బయట వస్తున్న విమర్శలకు జవాబుగా గొప్ప శిల్ప నైపుణ్యంతో వస్తు వైవిధ్యంతో కవిత్వాన్ని సాయుధం చేసారు చనుబాలధార కవితా సంపుటిలో. ఒకింత స్తబ్ధతకు నిరాశకు లోనయినప్పుడు మరొకసారి తన కవిత్వం చదివితే మనలో ఆ తడి ప్రవహించి క్రొంగొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఇన్నేళ్ళ తర్వాత కూడా తన కవిత చదివితే మనలో ప్రేరణ కలిగిస్తుంది. గుండెల్లో సుళ్ళు తిరిగే నినాదమవుతూ పిడికిలి బిగింపచేస్తుంది. ఇది కామ్రేడ్ కౌముది సాధించిన విజయం. మనకందించిన కవితా భాస్వరం.

ఈ సంపుటిలో మొదటి కవిత ʹమీకోసం నేనో పద్యం రాస్తానుʹ అంటూ తను హామీ పడ్డ విధానం చాలా కొత్తగా వుంటుంది. అంత వరకు ఎవరూ ఎత్తుకోని కొత్త ఎత్తుబడి ఇందులో సాక్షాత్కరిస్తుంది. మనిషిలో దాగిన మానవీయతను తట్టి లేపేందుకు దానిని ఉద్యమ పథం వైపు మళ్ళించేందుకు తనెంచుకున్న పద చిత్రాలు కానీ, అక్షరాలను సాయుధం చేసిన విధానం సరికొత్తగా వుంటుంది.

నేలను చీల్చుకుని
ఆకాశానికి నమస్కారం చేసే మొక్కలా
మీకు నమస్కారం చేసే పద్యం రాస్తాను అంటూ మనల్ని తన కవితలోని మూడ్ లోకి తీసుకుపోతాడు కవి. ఈ చరణం చదవగానే మనలోకి లోలోపలికి ఒక సజీవ ప్రాకృతిక పచ్చదనంతో కూడిన పరిమళం మన చుట్టూ అల్లుకుంటుంది. నమస్కారం చేసే పద్యం అంటూ ఒక తాత్విక చింతనలోకి కవి లాక్కుపోతాడు.

పూలవనం విచ్చుకుంటున్న సవ్వడిలాంటి
మీ చిరునవ్వివ్వండి
నవ్వడమే మరిచిపోతున్న
సగటుమనిషి ఇంటి గుమ్మం పై పద్యం రాస్తాను అంటూ అసమానతలతో ఇబ్బందులతో నిర్బంధాల మధ్య అనుక్షణం తాననుభవించే వేదనతో నవ్వును మరిచిపోయిన సగటు మనిషికి తన ప్రస్థానం ద్వారా వారి జీవితాలలో వెలుగయ్యే నవ్వును కవి హామీ ఇస్తాడు. ఇలాంటి ప్రతీకలు రావాలంటే నిజానికి తను పయనిస్తున్న మార్గం పట్ల వున్న నిబద్ధత రేపటిపై ఆశ కవి అక్షర బద్దం చేయగలిగాడు. ఇలాంటి కొత్త ప్రయోగ పూర్వక పదబంధాలను కౌముది మనకు పరిచయం చేసారు తన సృజనలో.

రాజ్యం యొక్క కౄర స్వభావం మనకందరికీ అనుభవైకవేద్యమే. అది నేడు మరింత తీవ్రరూపం దాల్చింది. మాటా పాటా బంద్ అయి ఆసేతు హిమాచలం ఒక అసహన మేఘమావరించి స్వేచ్చా కాంక్షను హరించ చూస్తోంది. ఏ చిన్నపాటి వ్యతిరేకతను కూడా సహించలేనంత ఫాసిస్ట్ బుద్ధి మాంద్యానికి లోనయి వేలాదిమందిని నిర్బంధిస్తు మైనారిటీ మతం కులం అణగారిన వర్గాలపై దాడులు చేస్తూ ప్రశ్నించే గొంతులపై తూటాలు కురిపిస్తూ జైళ్ళో నిర్బంధిస్తూ అప్రకటిత ఎమర్జెన్సీని తలపోస్తోంది. అటువంటి రాజ్యంతో నిర్బంధాన్ని సడలించేందుకు ఒక సామరస్య వాతావరణాన్ని ఆశించే కవి ఇలా అంటున్నాడు

మీ గాయాలనుండి స్రవిస్తున్న
మానవీయ అక్షరాలనివ్వండి
రాజ్యం గరుకు పెదవులపై సుతారంగా సున్నితంగా పద్యం రాస్తాను అని.

కవిత్వంలో తను సాధించిన సరళత్వం సున్నితత్వం అక్షరాలలో ప్రవహించే మానవసారం కవి యొక్క మెచ్యూరిటీని నిలబెడతాయి. ఇది కౌముది కవిత్వంలో మనకు కనిపించే అజేయ పదబంధం. వస్తువులోని గాఢతను నిలబెడుతూ ఒక కొత్త శిల్పం ద్వారా కవిత్వాన్ని ప్రవహింప చేయడం మనం అధ్యయనం ద్వారా సాదించాల్సిన అత్యవసర విషయం. కవిత మొత్తం ఒకసారి చదువుకుందాం..

నేలను చీల్చుకుని
ఆకాశానికి నమస్కారం చేసే మొక్కలా
మీకు నమస్కారం చేసే పద్యం రాస్తాను

పొద్దుటిపూట నుంచుని
గాఢంగా కౌగిలించుకునే తొలి సూర్యకిరణంలా
మిమ్ముల కౌగిలించుకునే పద్యం రాస్తాను

చావుదేముంది
బతకడం శాశ్వతమైతే కదా!
క్షణకాలం బతికినా సరే-
పరిమళభరితంగా బతకడం!
చుట్టూ ప్రపంచాన్ని పరిమళభరితం చేయడం!

పూలవనం విచ్చుకుంటున్న సవ్వడిలాంటి
మీ చిరునవ్వివ్వండి
నవ్వడమే మరిచిపోతున్న
సగటుమనిషి ఇంటి గుమ్మం పై పద్యం రాస్తాను

పద్యాన్ని ఊరేగింపు తీసి
నడిబజార్లో జెండా ఎగరేసాను
ఎవరో అవ్వ చేతులు చాచి
కొంగుపరచి పద్యాన్నడుక్కుంది
నాకు ఆకలేసినపుడు
మా అవ్వ కడుపార చనుబాలు తాపించింది
నేను సాయుధమైనట్టుగానే
నా పద్యం సాయుధమే

మీ గాయాలనుండి స్రవిస్తున్న
మానవీయ అక్షరాలనివ్వండి
రాజ్యం గరుకు పెదవులపై సుతారంగా సున్నితంగా పద్యం రాస్తాను

ఎవడైనా స్వప్నిస్తూ మేఘంలా వర్షిస్తే
స్వప్నాన్ని సాకారం చేస్తూ
నా పద్యం నదిలా ప్రవహిస్తుంది.
(10-01-1998).

No. of visitors : 320
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆకు క‌ద‌ల‌ని చోట వ‌ర్షించిన క‌విత్వం

కేక్యూబ్ వ‌ర్మ‌ | 20.10.2016 12:53:32am

ఒకమారుమూలపాఠశాలఉపాధ్యాయుడు ఈ నిశ్శబ్దాన్నిభరించలేక ఈ ఉక్కపోతనుధిక్కరిస్తూతనచుట్టూవున్నఆకుకదలనితనాన్నికవిత్వంగామనముందుఆవిష్కరించినదే ఈ సంకలనం.......
...ఇంకా చదవండి

ఆ పావురాలు!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 02.01.2017 11:39:40pm

ఒలికిన నెత్తురు అద్దిన జెండానందుకుంటూ గుంపుగా ఆ పావురాలు! ...
...ఇంకా చదవండి

తెలవారని ఆకాశం!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 07.12.2016 11:52:30am

కొన్ని మంచు బిందువులేవో రాతిరి కురిసిన వాన చివుళ్ళ నుండి రాలుతూ రెక్కల చాటున ముఖం దాచుకున్న పక్షి టపటప రెక్కలల్లారుస్తూ ఎగరబోతూ...
...ఇంకా చదవండి

నమస్కరిస్తూ..

కేక్యూబ్ వ‌ర్మ‌ | 04.09.2017 11:18:59am

కళ్ళకు గంతలు కట్టుకొన్నదని మీ న్యాయ దేవత ముందు నగ్నంగా నిలబడిన ఆ పదముగ్గురూ విడిచిన లజ్జను మీ మఖంపై నెత్తుటి ఉమ్ముగా ఊసి!...
...ఇంకా చదవండి

జీవ‌సూత్రాన్ని చెప్పే చింతా అప్పలనాయుడు ʹదుక్కిʹ

కెక్యూబ్‌ వర్మ | 16.06.2018 09:22:29am

కవితలనిండా రైతు జీవన చిత్రమే. ఒక దు:ఖార్తితో కొనసాగుతుంది. కురవని వానలు కలసిరాని కార్తెలు అప్పుల ఊబిలు కాడెద్దులను దూరం చేసే యంత్రాల దాష్టీకం అక్కరకు రాని ప...
...ఇంకా చదవండి

గులాబీ!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 17.04.2017 11:32:19am

వాడెంత విధ్వంసం చేసినా నీ పసివాడి చేతిలో గులాబీ విచ్చుకుంటూ వాడిని భయపెడుతూనే వుంది!!...
...ఇంకా చదవండి

దక్షిణ యాత్ర

కెక్యూబ్ వర్మ | 04.06.2017 01:12:22pm

నీ ఒంటి రంగును హేళన చేసి నిన్ను బానిస చేసుకో చూస్తున్నాడు నీకంటూ మిగిలిన ఆఖరి అవకాశం నిన్ను నువ్వు జెండాగా ఎగురవేయడమే!!...
...ఇంకా చదవండి

మస్వాల్..

కెక్యూబ్ వ‌ర్మ‌ | 03.09.2016 12:37:26am

మరుగుతున్న మంచు తెరలుగా విడిపోతూ రాలిపోతున్న మస్వాల్ పూలెన్నో ఇప్పుడిక్కడ ఒకటే హృదయ ఘోష ఆజాదీ ఆజాదీ .......
...ఇంకా చదవండి

కుందాపన

కెక్యూబ్ వర్మ | 04.01.2018 01:31:58pm

ఈ కవిత్వం నిండా పరచుకున్న దాహం ఒంటరితనం.సమూహంలో తను నిలబడ్డ చోటు ఒంటరిగా ఒక దీపపు సమ్మెకింద నీడలా వెంటాడడాన్ని మనకనుభవంలోకి తెస్తుంది.కలసి నడవాల్సిన దారు......
...ఇంకా చదవండి

ఒంటరి వెన్నెల

కేక్యూబ్ వ‌ర్మ‌ | 07.05.2016 08:29:33am

ఈ ఇప్ప పూల వనం రాలిపోతూ నిబ్బరాన్ని వదిలి నివురు కప్పుకుంది తూరుపింకా తెలవారక నీ పేరు తలుస్తూ పొలమారుతొంది...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •