తిరిగి వ‌స్తావ‌ని

| సాహిత్యం | క‌విత్వం

తిరిగి వ‌స్తావ‌ని

- శేషు కొర్ల‌పాటి | 02.07.2019 11:57:24pm


కామ్రేడ్….
నడిరాత్రి దొంగల్లా
నీ ఇంట దూరి
నిన్నేత్తుకు పోయారా

కామ్రేడ్..
కుట్ర కేసు పెట్టి
కటకటాల్లోకి నెట్టి
క్రూరంగా హింసిస్తున్నారా

ఏంటి కామ్రేడ్
ఇప్పుడు అయ్యో అనాలా
నీ మీద జాలి చూపించాలా
నిన్ను తలుచుకుని కన్నీళ్లు పెట్టాలా

తొలి రోజే
అనుకున్నావ్ కదా
ఇవన్నీ నిన్ను కదపలేవని

ముందే ఉహించావ్ కదా
కుట్ర కేసులు
కుతంత్రాలు
నీకు సత్కారాలని

కామ్రేడ్
జైలు గోడల మధ్యనున్నా
జన జీవనంలోనున్నా
నీ పోరాటం ఆగలేదు

నీడను చూసి భయపడే
మనుషుల మధ్య
నిప్పుల కొలిమితో
పోరాడుతున్న ధైర్యం కదా నీది

ఎప్పుడైనా
నిన్ను చూడ్డానికి వస్తే
నిన్ను చూసి కన్నీళ్లు కారిస్తే
మా భుజం తట్టి
కాస్త ధైర్యం ఇచ్చి పంపు

ఈ జాలి మాటలు
కన్నీటి మూటలు
చూసి నవ్వుకోకు
తిరిగి వస్తానని చెప్పు
ఇంకోతరాన్ని
తయారు చేస్తానని చెప్పు.

(అక్రమంగా జైళ్లలో మగ్గుతున్న వేలాది విప్లవకారుల కోసం)

No. of visitors : 421
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఎలా కలవాలి ?

శేషు కొర్లపాటి | 30.09.2018 11:13:18pm

వొందల కవర్ పేజీలు చేసిన నువ్వే ఓ కవర్ పేజీ అవుతావని ఎప్పుడైనా ఊహించావా స్వేచ్ఛగా ఉన్న నీ చేతులే కదా అందరికి కనిపించేది సంకెళ్లు పడ్డ నీ జీవితం ఎందరు చూడ.....
...ఇంకా చదవండి

స్వేచ్చా స్వప్నం

శేషు కొర్లపాటి | 04.01.2019 10:55:17pm

ఎక్కడ ప్రశ్న మొదలైతే అక్కడ నోరు నొక్కబడుతుంది, గొంతు గెంటేయబడుతుంది , ప్రాణం పోతుంది.దేశంలో ఇప్పుడున్న పరిస్థితి ఇదే......
...ఇంకా చదవండి

కిటికీ పిట్ట వెలుతురు పాట‌

శేషు కొర్లపాటి | 20.01.2019 12:07:47pm

ఖైదు క‌విత్వం కిటీకి పిట్ట‌. ప్ర‌పంచ ప్ర‌సిద్దినొందిన పికాసో లాంటి చిత్ర‌కారుల‌ను, వాళ్ల సృజ‌నాత్మ‌క‌త‌ను తెలుగు నేల‌కు అత్యంత ద‌గ్గ‌ర‌గా ప‌రిచ‌యం చేసిన......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార సెప్టెంబర్ 2019

  మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ
  మేఘాలొస్తాయి
  న్యాయ ప్రక్రియే శిక్ష అయితే!?
  Justice in deep slumber
  ఎర్ర పిడికిలి
  వేకువ గానం
  అతడేమన్నాడు
  వాళ్లంటే అంత భ‌యం ఎందుకు?
  ఎరవాడ జెయిలులో ఈ వేకువ
  రాజ్య‌మే కుట్రదారు అయిన‌ప్పుడు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •