రూపొందుతున్న కాలానికి తగిన కథన శిల్పం

| సాహిత్యం | స‌మీక్ష‌లు

రూపొందుతున్న కాలానికి తగిన కథన శిల్పం

- పాణి | 03.07.2019 12:01:23am

కూర్మనాథ్‌ కథలంటే నాకు ఎందుకు ఇష్టమో ముందు చెప్పాలి.

మామూలుగా చాలా కథలు అంతరించి పోతున్న, లేదా పోగల సామాజిక విశేషాలు ఇతివృత్తంతో ఉంటాయి. అట్లని వాటిని తక్కువ చేయడం లేదు. అంత మంది అన్ని వందల వేల కథలు రాస్తున్నారంటే వాటి అనుభవం ఎంత లోతైనదో, గాఢమైనదో ఊహించుకోవచ్చు. అవి ఎంత మొండిగా మానవ జాతి చూరు పట్టుకొని వేలాడుతున్నాయో గుర్తించవచ్చు. మనుషుల గుండెలపై గునపాలై గాయం చేస్తున్నాయో తెలుసుకోవచ్చు. అలాంటి వాటి గురించి ఇంకా చాలా పెద్ద పోరాటాలే చేయాలి. ఇంకా పదునుగా కథలు రాయాలి.

అయినా సరే కూర్మనాథ్‌ దాదాపుగా అలాంటి వాటి గురించి రాయలేదు. అదే ఆయన ప్రత్యేకత. అలాంటి కథలు రాయనందుకు ఆయనంటే ఇష్టమని అర్థం చేసుకునేరు. అందుకు కానే కాదు. కూర్మనాథ్‌ రూపొందుతున్న కాలాన్ని కథ చేస్తున్నారు. అందుకే ఆయన కథలంటే ఇష్టం.

ఈ రూపొందుతున్న కాలాన్ని, జీవితాన్ని, వ్యవస్థను చిత్రించే కథలను నేను ఎలా అర్థం చేసుకుంటున్నానో నలుగురికి చెప్పాలనే తహతహ వెంటాడుతోంది. దేనికంటే మన ముందు నిర్మాణమవుతున్న ఈ కొత్త సామాజిక వాతావరణం గురించి ఏదైనా రాజకీయార్థిక వ్యాఖ్యానం చేయడం కంటే ఇలా కథా విశ్లేషణ చేయడమే బాగుంటుంది. మారుతున్న కాల స్వభావం ఏమిటి? దాని అంతర్థాలు ఏమిటి? అవి ఎలా జీవితానుభవంలోంచి వ్యక్తమవుతున్నాయి? వాటి సారం ఏమిటి? ఇలా ఎన్నో ప్రశ్నలు వెంటాడుతుంటాయి. ఏమీ మారడం లేదనుకుంటే నిశ్చింతగా ఉండొచ్చు. కానీ మన ముందున్న దృశ్యాలు వేపుకుతింటూ ఉంటాయి. అవి చాలా వేగంగా, జటిలంగా మారుతూ ఉంటాయి. వాటిని ఇలా కథల్లో చదువుకోవడం చాలా బాగుంటుంది. అందుకని కూర్మనాథ్‌ కథలంటే ఇష్టం.

ఇంకో అందుకు కూడా ఇష్టం. దేన్నయినా సాపు చేసి, నేలబారుగా, సుమతి పద్యంలాగా, పెద్దబాల శిక్షలాగా, లేదా ఎక్కాల పట్టీలాగా మార్చేసే మేధో వాతావరణం అనివార్యంగా కమ్ముకొస్తోంది. అలాంటి వాటి అవసరాన్ని కాదనేది లేదు. కానీ ఎక్కాల పట్టీని ఎంత బట్టీయం పట్టినా కళ్ల ముందు నిర్మాణమవుతున్న కాలాన్ని ఒడిసిపట్టడం ఎవ్వరి వల్లా కాదు. ఎక్కాల పట్టీలోని లాజిక్‌ అన్నిటికీ సరిపోతుందనుకోవడం ఎందుకో మరి నిజం కాదనిపిస్తోంది. కూర్మనాథ్‌కు కూడా అలాగే అనుకుంటారు కావచ్చు. అందుకే ఆయన కథన పద్ధతి బాగా నచ్చుతుంది.

ఉదాహరణకు అనగనగా ఒక ఆవు ఆడవికి వేటకు వెళ్లి పులికో, సింహానికో చిక్కిపోతుంది. చివరి సారిగా ఇంటికి వెళ్లి దూడకు పాలు ఇచ్చి వస్తాను.. ఆ తర్వాత తిందువుగాని అని చెప్పే కథ అయినా కూర్మనాథ్‌ అలాగే రాయరు. అవి పాత కాలపు ఆవు, పులి. అడవి కూడా పాతదే. కానీ ఇప్పుడు ఆడవులు బొత్తిగా అలా లేవు. ఎన్నో కల్లోలాలు, విధ్వంసాలు, నిర్మాణాలు. కాబట్టి కూర్మనాథ్‌ ఒకవేళ అలాంటి సరళ ఇతివృత్తం తీసుకున్నా సరళంగా కథ చెప్పరు. ఎందుకంటే ఇది సరళంగా కథ నడిచే కాలం కాదు. అలాంటి వస్తువులు ఈ రూపొందే వ్యవస్థలోంచి ఎంచుకోవడం దుర్లభం. సరళ ఇతివృత్తాలనే సరళంగా రాయని కూర్మనాథ్‌ సంక్లిష్ట ఇతివృత్తాలను అనగనగా ఒక రాజు.. రాజుకు ఏడుగురు కొడుకులు లేదా కూతుళ్లు అనే పద్ధతిలో ఎందుకు రాస్తారు?

కొత్త కాలానికి తగిన ఇతివృత్తం, కథనం ఉంటాయి కాబట్టి వస్తువులాగే శిల్పం కూడా కడు తాజాగా ఉంటాయి.

ఈ పద్ధతిలో రాస్తారు కాబట్టి కొత్తదనం కోసం గారడీలను ఆయన ఆశ్రయించరు. ప్రతి కథన పద్ధతిలోనూ అత్యంత బాధ్యతగా ఉంటారు. అలవోకగా పాఠకులకు కనెక్ట్‌ కావడానికే ఆయన ప్రయోగాలు చేస్తారు. ప్రతి కథలోనూ కొత్త శిల్పాన్ని ఎంచుకుంటారు. అయితే ఆయన పాఠకులకు సులభంగా ఎలా చెప్పాలనే దగ్గర ఆరంభం కారు. అక్కడ మొదలైతే ఇంకేముంది? నిరంతర జనరంజత్వమే సరిపోయేది. దానికి ఒడిగట్టకపోవడమే కూర్మనాథ్‌ కథా విస్తృతిని కాపాడుతోంది.

ఇదంతా ఆయన ప్రయోగం మీది మోజుతో అనుకుంటే ఈ కథలు మనకు అర్థం కానట్టే. పదిహేనేళ్ల కింద ఈ కుక్కను ఆయన మనకు తన ప్రయోగ కాంక్షను తీర్చుకోడానికే రాశారని అనుకోగలమా? అది ప్రయోగమా? శిల్పమా? కానే కాదు కదా. పూర్తిగా వాస్తవం. మన కళ్ల ముందు చాలా రూపభ్రాంతికి లోనుచూసే వాతావరణం తయారైపోతోంది. అదే జీవిత సారమైపోతోంది. ఈ రూపభ్రాంతి గుట్టు విప్పి చెప్పకపోతే ఆ ఇతివృత్తం మీద కథలు రాసి ఏం ప్రయోజనం ? అంటే నిర్మాణమవుతున్న తాజా సంక్లిష్టమైన వాస్తవికతను కళ చేయకపోతే ఏమి లాభం?

సాహిత్య ప్రయోజనం మీద అపారమైన నమ్మకం ఉన్న కథకుడు కూర్మనాథ్‌. వస్తువును వెతకడంలో, దానికి తగిన శిల్పాన్ని ఎంచుకోవడంలో విప్లవమే గీటురాయి. బహుశా చాలా సాదాసీదా ఇతివృత్తమో, ఒకానొక పాత జీవితానుభవమో అయితే తప్పక అలాంటి కథనాన్నే ఎన్నుకునే వారు. ఇందులో ఏ సందేహమూ లేదు. దానికి కూడా ఈ సంపుటంలోంచే ఉదాహరణలు చొప్పవచ్చు. ఉదాహరణగా మా క్లాస్‌మేట్‌ పద్మ కథనూ, మా హైదరాబాదు ప్రయాణం కథనూ చదవండి. మీకే తెలుస్తుంది.

కాబట్టి ఆయన శిల్ప ప్రయోగం శిల్పం కోసం కాదు. వస్తువు కోసం. వస్తువులోని సంక్లిష్ట ఆచ్ఛాదనలన్నీ విప్పేసి అట్టడుగున ఏమున్నదో, ఆ జీవితానుభవ సారం ఏమిటో ఎత్తి చూపడం తన ఉద్దేశం. అంటే దృక్పథమే ఏకైక గీటురాయి. కాబట్టి ప్రతి కథా కూర్మనాథ్‌ ఉద్దేశం వల్లే అలాంటి శిల్పాన్ని ఎంచుకున్నది. ఆ మేరకే ఆ కథ అలా తయారైంది. ఆ ఉద్దేశం ఏమిటంటే వస్తువులోకి సునాయాసంగా పాఠకులు వెళ్లడం. కాబట్టి ఇంత ప్రయోగం, కొత్తదనం ఉన్నప్పటికీ ఆయనకు అవి బలహీనతలు కావు. అవే ఆయన బలం. దేనికంటే శిల్ప వైచిత్రి దేనికంటే వస్తువు బాగా అర్థం కావడానికి తప్ప మరెందుకూ కాదు. చాలా బాధ్యతాయుతంగా, సునిశితంగా నడుపుతారు. దానికి గత సంపుటంలోని ఎర్రగౌను పిల్ల, ఈ సంపుటంలోని .. కథ మంచి ఉదాహరణలు.

ఈ శిల్పం వెనుక ఇంకో ముఖ్యమైన వ్యవహారం ఉంది. అదేమంటే.. రూపొందుతున్న ఒక పెద్ద సామాజిక ఇతివృత్తంలోంచి సాహిత్య ఇతివృత్తాన్ని గుర్తించి ఎన్నుకోవడం. ఉదాహరణకు రాజుగారి పులి స్వారి, గుడ్డివాడి వర్ణచిత్రాలు, రాజుగారి బట్టలు మొదలైనవి చూడండి. ఎంత క్లుప్తంగా ఆ సామాజిక ఇతివృత్తాన్ని వివరించాలన్నా పేజీలు పేజీలు రాయాల్సిందే. కథ గురించి బాగా తెలిసిన రచయితలు ఆ సామాజిక ఇతివృత్తంలో ఏది సాహిత్యమవుతుందో, కళ అవుతుందో పట్టేయగలరు. కూర్మనాథ్‌ సరిగ్గా అలాంటి పాయింట్‌ను పట్టుకొని ఆ మానవానుభవాన్ని మూడు నాలుగు పేజీల చిన్న కళాత్మక నిర్మాణంగా పునర్నిర్మించారు.

కూర్మనాథ్‌ ఈ పని ఎంత బాగా చేశారో తెలియాలంటే ఈ సంపుటంలోని కథల్లోని సాహిత్య ఇతివృత్తం ఏమిటో గుర్తించగలగాలి. ప్రతి కథలోనూ కథాంశం ఫోకస్‌ కావడానికి అద్భుతమైన స్మార్ట్‌ మెథడ్‌ను ఎంచుకుంటారు. దీని గురించిన ఎరుక, నైపుణ్యం, వస్తు నిబద్ధత, ప్రతి వస్తువులోనూ దానిదైన ప్రత్యేకతను గుర్తించడం వల్ల కథలోకి కొత్తదనం వస్తుంది. ఇంకో వైపు నుంచి చూస్తే ప్రతి కథనాన్ని ముగించడానికి రచయిత పెద్దగా అలిసిపోయినట్టు అనిపించదు. విపరీతమైన భావోద్వేగాలతో, భిన్న తలాల్లోని అనుభవాల సంఘర్షణతో పాత్రల లోపలి నుంచి, వాతావరణం లోపలి నుంచి కథ నడపరు కాబట్టి కథ తేలికగా నడిచిపోతుంది.

అయితే కథ అలా తయారు కావడం వెనుక కొత్తదనం కోసం ఏం చేశారో, ఆ కొత్తదనాన్ని ఎలా వెతికి పట్టుకున్నారో తెలుసుకోలేకపోతే ఈ కథలు దాదాపుగ అర్థం కానట్టే. లేదా రచయిత ఏమి ఉద్దేశించారో అక్కడికి పాఠకులు చేరనట్టే.

అందువల్ల ఈ కథలకు వాచక విమర్శ చాలా అవసరం. చాలా సున్నితంగా ఒక అనుభవ శకలాన్ని కథ పాఠకుల అనుభవంలో భాగం చేస్తుంది. ఆ తర్వాత అందులో ఉంటే విశేషాలన్నీ తెలుసుకోడానికి అవసరమైన ప్రతీకలు, పోలికలు, అర్థాలు అందుబాటులోకి వస్తాయి. రచయిత చాలా జాగ్రత్తగా, ఒక పథకం ప్రకారం ఈ పని చేస్తారు. ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఉంటారంటే, ఒక పక్క ఓపెన్‌ ఎండెడ్‌గా ఉంచుతూనే, ఇంకో పక్క తాను ఉద్దేశించే దిశగా కథ నడుపుతారు.

ఇది కత్తి మీది సాము. విప్లవ దృక్పథం వల్లే కూర్మనాథ్‌ ఇలాంటి శ్రమకు సిద్ధమయ్యారు. సామాజిక ప్రయోజనం, దృక్పథ నిబద్ధత శిల్ప ప్రయోగాలకు ఆటంకమనే కూట వాదం ఇటీవల మరీ చెలరేగిపోతోంది. తెలుగు ఆధునిక, ప్రగతిశీల, విప్లవ సాహిత్యంలో ఎన్నో కథలను, ఎందరో కథకులను దీనికి విరుగుడుగా ఎత్తి చూపవచ్చు. నిజానికి సామాజిక ప్రయోగం చేయగల సత్తా ఉన్న శక్తులకే అత్యవసరమైన సాహిత్య శిల్ప ప్రయోగాలు చేసే శక్తి ఉంటుంది. ప్రజల మధ్య ప్రత్యామ్నాయ ప్రయోగాలు చేయగలిగిన వాళ్లే నేల మీద నిలబడి అపార వైవిధ్యభరిత కొత్త పద్ధతులను కళారంగంలోకి తీసుకొని రాగలరు. దీనికి ఈ కాలానికి తగిన కొత్త దనాన్ని విప్లవ కథకు కూర్మనాథ్‌ అందిస్తున్నారు. ఈ క్రమంలో తన విప్లవ దృక్పథాన్ని ఎక్కడా పలుచన చేసుకోకపోగా, కథలో విప్లవ దృక్పథాన్ని, రాజకీయాన్ని అనేక దృక్కోణాల్లో తీర్చిదిద్దుతున్నారు. అసలు ఈ కథల ఇతివృత్తం, వాతావరణం అంతా రాజకీయమే. అందులోంచి కథను కళాత్మకంగా కూర్మనాథ్‌ ఎత్తి చూపగలరు. రాజకీయార్థిక విషయాలను కథ ఎలా చేయవచ్చో ఆయన కథలన్నీ అద్భుత నమూనాలే. అపారమైన కథా సాహిత్య అధ్యయనం వల్ల కథ కాగల, చేయగల విద్య కూర్మనాథ్‌ సొంతమైంది. ఈ మొత్తం విప్లవ దృక్పథం వల్లే సాధ్యమైంది.

No. of visitors : 355
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •