మూడు తరాల, యాభై వసంతాల విరసం

| సంభాషణ

మూడు తరాల, యాభై వసంతాల విరసం

- పి.వరలక్ష్మి | 03.07.2019 11:24:32pm

నవయవ్వన తేజానికి యాభై ఏళ్లు వస్తున్నాయి. యాభైలోనూ యవ్వనోత్సాహమే. తెలుగునేల నుండి దిక్కుల్ని మండించిన వేడి నెత్తుటి అక్షరాలు, సంకెళ్లతో స్వేచ్ఛారావం వినిపించిన విప్లవ కలాలు కల్లోలాలను తట్టుకుంటూ అలసిపోక, విశ్రమించక, బెదిరిపోక, తలవంచక, రాజీపడక కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీకాకుళ పోరాటపు అగ్గిని, విప్లవ విద్యార్థుల సవాలును స్వీకరించి, ʹరాజీలేని వైఖరి రచయితకు తప్పనిసరి అని, నిజాన్ని వెల్లడించడంలో రచయితలు భయసంకోచాలను విడిచి ప్రజలకు బాసటకావలని, తమ కలాలను కత్తులుగా, కాంతులుగా మార్చుకోవాలనిʹ ప్రకటిస్తూ వలస, భూస్వామ్య, ధనస్వామ్య అవశేషాలను తొలగించి, నూతన ప్రజాస్వామ్య స్థాపన కోసం పాటుపడతామని, సోషలిజం మా లక్ష్యమని 1970 జులై 3-4 అర్ధరాత్రి చరిత్ర ఎదమీద సంతకం చేసి హామీ పడింది విప్లవ రచయితల సంఘం. ఆనాడు సంతకం చేసిన పద్నాలుగు మంది రచయితల్లో వరవరరావు నేడు తన ఎనభై ఏళ్ల వయసులో ఆశయానికి కట్టుబడి జైల్లో ఉన్నారు. ఆనాడు సంతకం చేసిన యవతరం పునర్జీవిస్తున్నట్లు యాభై ఏళ్ల విరసంలో నేడు పాతికేళ్లలోపు యువకులు ఇప్పటి కల్లోలంలోనూ సృజనాత్మక ధిక్కారం వినిపిస్తున్నారు.

మూడు తరాల ప్రాతినిథ్యంతో నవనవోన్వేషణ, ఎప్పటికప్పుడు ఎదురొచ్చే సామాజిక, రాజకీయార్థిక అంశాలపై సునిశిత పరిశీలన, సైద్ధాంతిక విశ్లేషణ, వందలాది రచయితల్ని ప్రభావితం చేసిన సాంస్కృతికోద్యమ కార్యకర్తృత్వం ప్రపంచంలో విరసానికి మాత్రమే సాధ్యమైందనంటే అతిశయోక్తి కాదు. వర్గపోరాట శాస్త్రీయ అవగాహనతో, విప్లవ సృజనాత్మక వికాసంతో సమాజానికి తాను ఎంత అందించిందో సమాజం నుండి అంత నేర్చుకుంది. లేకపోతే ఈ కొనసాగింపే ఉండేది కాదు.

విరసంలో అందరికన్నా పెద్దవయసు ఉన్న కామ్రేడ్‌కు ఎనభై అయిదేళ్ల వయసు ఉండొచ్చనుకుంటాను. ఈ ఏడాది విరసం సభ్యత్వం తీసుకున్న కామ్రేడ్‌కు ఇరవై మూడేళ్లు. మొదటి అధ్యక్ష, కార్యదర్శుల తరం దాటి రెండో తరం, మూడో తరం నాయకత్వం సంస్థకు ఎదిగి వచ్చింది. సుమారు పదిహేనేళ్ల క్రితం సీనియర్‌ సభ్యులెవరూ విరసం కార్యవర్గంలో ఉండకూడదని నిర్ణయం తీసుకుని పూర్తిగా కొత్తతరానికి నాయకత్వ బాధ్యతలు అప్పగించి తామంతట తాముగా సాధారణ సభ్యులుగా కొనసాగతూ ఉండడం సంస్థ సజీవత్వానికి ఒక కొత్త నమూనా, భవిష్యత్తుకు గొప్ప భరోసా. ఒక సంఘం బతికి ఉండడమంటే ఇది. ఒక ఆశయం కొనసాగడమంటే ఇది. బహిరంగ సభలు, ధర్నా శిబిరాలు, ఊరేగింపులు, నిజనిర్ధారణలు, క్షేత్రస్థాయి పర్యటనల నుండి సాహిత్య వర్క్‌ షాప్‌లు, సైద్ధాంతిక చర్చలు, సెమినార్ల దాకా, గోడ మీది నినాదం నుండి అద్భుత కాల్పనిక కథ, నవల దాకా విస్తరించిన జీవనది విరసం.

1970లాగా ఇప్పడు కాలం విప్లవాలకు ప్రతికూలం కావొచ్చు. ఉద్యమాలు గాయపడిఉండొచ్చు. ఫాసిజం కోరలు విప్పి ప్రజా ఉద్యమాల ఉనికిని మింగివేయాలని బుసలు కొడుతూ ఉండొచ్చు. విరసం ఇంకా బతికి ఉంది. రాజ్యాన్ని ధిక్కరిస్తూనే ఉంది. ప్రజల పక్షానే స్థిరంగా నిలబడి ఉంది. విరసంలో ఉండడమంటే బాధ్యతతో కూడిన సాహసం కలిగి ఉండడం. విరసంతో ఉండడమన్నా ఎంతో కొంత ఇంతే. విరసం సభ్యుల కన్నా విరసం మిత్రులు ఎన్నో రెట్లు ఎక్కువ అని మొదటి మహాసభల నుండి నేటి వరకు కార్యదర్శులు ప్రకటిస్తూనే ఉన్నారు. విరసం బలం ఇది మాత్రమే కాదు. యాభై ఏళ్లుగా ప్రతిరోజూ విమర్శిస్తున్న వాళ్లు ఉండడం (సహేతుకంగా కావొచ్చు, అహేతుకంగా కావొచ్చు) కూడా ఒక సంఘానికి ఎంత బలం!

No. of visitors : 956
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.

పి.వరలక్ష్మి | 19.11.2019 08:06:37pm

నాగప్పకు బొత్తిగా బాలేదు. ఇరవై రోజుల క్రితం కింది నుండి తొడల భాగం దాకా విపరీతంగా బొబ్బలోస్తే పులివెందుల గవర్నమెంట్ ఆస్పర్తిలో చేర్చారట. రెండు రోజులుండి వచ్...
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..
  ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీల జీవితాలు మారుతాయoటున్న శీలా సుభద్రాదేవి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •