రచయితలకు సవాల్ !

| క‌ర‌ప‌త్రం

రచయితలకు సవాల్ !

- విశాఖ విద్యార్థులు | 03.07.2019 11:45:22pm

1970 ఫిబ్రవరి ఒకటి, రెండు తేదీల్లో శ్రీ శ్రీ షష్టిపూర్తి సందర్భంగా విశాఖపట్నం పానగల్ బిల్డింగ్స్ లో ఆయనకు సన్మానం జరిగింది. ఆ సన్మాన సభలో ఫిబ్రవరి - ఒకటి ఉదయం విశాఖ విద్యార్థులు ప్రచురించిన రచయితలకు సవాల్ అనే కరపత్రాన్ని చదివి పంచారు. తెలుగు సీమలో ఆ తర్వాత జరిగిన విప్లవ సాహిత్య సంచలనానికి ఇది ఒక నాంది.

రచయితలకు సవాల్ !

తెలుగు కవిత్వాన్ని ప్రబంధాల బంధాల్లోంచి బయటకు లాగి, ఊర్వశుల ఊహల్లోంచి తప్పించి, శనిదేవత రథచక్రపు టిరుసులలో పడి నలిగిన దీనుల కోసం, దగా పడిన తమ్ముళ్ళ కోసం, ఆయుధంగా చేసి అందేంచిన మహాకవికి ఆయన ముప్పై ఏళ్ళ క్రితం ప్రారంభించిన మరో ప్రపంచపుʹ యుగానికి ఈ వేళ సన్మానం చేయ్యడానికి వచ్చిన అందరు ఆంధ్ర కవులకూ, రచయితలకూ స్వాగతం. ముప్పై ఏళ్ళగా సాహిత్యం ఏం చేస్తోంది ? ఎటు వెళ్తోంది ? మీరంతా ఎందుకోసం రాస్తున్నారు ? ఎవరి కోసం రాస్తున్నారు ? అని చూసుకోవడానికి మీరంతా సమావేశం అవుతున్నందుకు మరీ సంతోషం.

సాహిత్యం ఆనందం కోసమనీ, ప్రభువులకీ, మంత్రులకీ, తారలకీ అంకితాలివ్వడం కోసమని, ఆందలాలెక్కడం కోసమనీ, సన్మానాలు, బిరుదులూ పొందడం కోసమనీ ఒకప్పుడు కొందరు అనుకునే వారనీ, వారినందరినీ శ్రీశ్రీ వచ్చి నడ్డి విరగొట్టాడని సంతోషించాం. - ఆభ్యుదయ కవిత్వం అనగానే కవులూ, రచయితలూ ప్రజల సంగతి పట్టించుకుని వాళ్ళ కన్నీళ్ళ కౌరణం ʹతెసుకొని, ఆ కారణము వాళ్ళకి చెప్పి, ఆసలు దొంగల్ని బయలు పేడతారని ఆందరమూ అనుకున్నాం. మత్తు మందు సాహిత్యాన్ని మసిచేసి, కన్నీటి సాహిత్యాన్ని వదిలేసి, కళ్ళని తెరిపించే కొత్త నెత్తురిచ్చే సాహిత్యాన్ని సృష్టిస్తారని ఎదురు చూశాం.

కానీ, అభ్యుదయం పేరుతో గోంతు చించుకొని అరిచిన వాళ్ళంతా ఆ పేరుతో కవిత్వాన్ని Cash చేసుకుంటున్నారు. సాహిత్యాన్ని సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. ప్రజా కవిత్వం సినిమాలకు Passport మాత్రమే అయింది. అభ్యుదయం ఆకాశవాణికి అడ్డుదారి మాత్రమే అయింది. భావకవిత్వపు భోగం కవుల్లా ప్రజా కవులనుని చెప్పుకునే వాళ్ళు కూడా ఒకరికన్నా మరొకరు పేరు తెచ్చుకోడానికి నానా గడ్డీ కరవడం, ఒకర్ని చూసి ఒకరు ఈర్ష్యపడ్డం, అధికారంలో ఉన్న ప్రతీ అడ్డమైనవాడి కాళ్ళు పట్టుకోవడం, ఆకాడమీలో ఆధిపత్యం కోసం నానా అగచాట్లు పడ్డం - యిదీరాక యింకేమన్నా చేస్తున్నారా ? ,

అభ్యుదయ సాహిత్యంకన్నా ʹమదనలూʹ, ʹమన్మధలూʹ నిత్యం పారాయణ గ్రంథాలు కావడం, నాగేశ్వరరాపులూ, రామారావులూ ఆదర్శ దైవాలు కావడం ఎందుచేత జరుగుతోంది ? ʹశ్రీ శ్రీʹ అంటే ఎవరు ? ఆ డబ్బింగ్ సినిమాలకి రాస్తారూ ఆయనేనా ? అని అడిగే దుస్థితికి ప్రజలు దిగజారిపోవడం ఎందుకు జరుగుతోంది ? ఈ వేళ శ్రీ శ్రీ మొదలు పెట్టిన ప్రచండోద్యమానికి సన్మానం జరపడం అంటే వీటన్నిటికీ సనూథానాలు వెతకడం. మీమ్మల్ని మీరు తిరిగి చూసుకోండి. ʹదొంగ లంజకొడుకులసలే మెసిలే ఈ లోకంలోʹ మీరు కూడా భాగస్వాములై పోతున్నారు జాగ్రత్త.

జీవిత వాస్తవాల్లోంచి పుట్టి తిరిగి జీవితాన్ని చైతన్యవంతం చేయగలిగేదే సాహిత్యం. కదిలేది కదిలించేది, మారేదీ మార్పించేది, పెనునిద్దర వదిలించి మున్ముందుకు నడిపించేదే సాహిత్యం. సామాజిక జీవితంలోని కొలుష్యాన్ని, ఆవ్యవస్థనీ ఎత్తిచూపి విప్లవకర మార్పుల్ని ఆహ్వానించేదే సాహిత్యం. ఇలాంటి సాహిత్యాన్ని సృష్టించి పదివేల సంవత్సరాల క్రితం విశృంఖలంగా ఉన్న వర్ణవ్యవస్థలో నిజమైన సాహిత్యం ఉందనే హాహా హూహూల్నీ, ప్రేయసి కన్నుల నీలినీడల్లో నిజమైన సాహిత్య విలువలున్నాయనే పడుపు కవుల్నీ, దేశభక్తి గీతాలతో ప్రజల్ని మభ్య పెట్టి ప్రక్క తోవలు పట్టించే కవితా వంచకుల్నీ చీల్చి చెండాడవల్సిన తరుణంలో మీలో ఎందుకింత స్తబ్దత ?

ʹభావ విప్లవం రాకుండా సాంకిక విప్లవం రాదుʹ అన్నారు కుటుంబరావు గారు. శ్రీ శ్రీ తన ప్రచండ కవితా శక్తితో ఆంధ్ర సాహిత్యంలో భావ విప్లవానికి ముప్పై ఏళ్ళ క్రితమే నాంది పలికాడు. అదృష్టవశాత్తూ దేశంలో యిప్పటికి నిజమైన సాంఘిక విప్లవ పరిస్థితులు ఏర్పడ్డాయి. తుపాకీ దెబ్బకి వెరవకుండా, విప్లవ పంథాలో జసం పెల్లువలా విరుచుకు పడుతున్నారు. ధైర్యంగా చెరసాలలకీ, ఉరి కొయ్యలకీ ఆహుతి అవుతున్నారు. ʹగోడల్ని పగులగొడుతున్నారుʹ ఇంతటి ఉత్సాహపూరితమైన సమయంలో శ్రీ శ్రీ కలలుగన్న మరో ప్రపంచాన్ని వాస్తవం చేసే ఈ ప్రయత్నంలో ఆభ్యుదయం పేరుతో Commit అయిన మీ సాహిత్య కంఠం ఎందుకు నిశ్శబ్దంగా ఉండిపోయింది ?

స్పానిష్ విప్లవంలో ప్రాణాలు పోగొట్టుకున్న సాహిత్యకారుడు క్రిస్టఫర్ కాడ్ వెల్ʹలా తను రాసిన ప్రతి పద్యం గిరిజనుల నోట ఊతపదంగా చేసి శ్రీకాకుళ విప్లవ పోరాటంలో వీరమరణం చెందిన సుబ్బారావు పాణిగ్రాహిలా, సాహిత్యాన్ని జీవితాన్ని మార్చే శక్తిగా మీరెందుకు చెయ్యలేరు ?

నమ్మిన ఆదర్శలకోసం పట్టుదలగా నిలబడిన ఓ కుటుంబరావులా, ఓ రావి శాస్త్రిలా, ఓ కాళీపట్నంలా, ఓ బీనాదేవిలా విప్లవాన్ని రెండు చేతులా ఆహ్వానిస్తూ జనాన్నీ మేల్కొల్పగలిగేదీ మీలో ఎంతమంది ? "

ʹసాయుధ విప్లవ మే మా లక్ష్యంʹ, ʹహింస విప్లవానికి నాందిʹ అని ధైర్యంగా ప్రకటించి, విప్లవ కవులుగా శ్రీ శ్రీ వారసత్వాన్ని తీసుకుని, సాహిత్య సందేశాన్ని ముందుకు తీసుకుపోయే దిగంబర కవుల సాహసం మీలో కన్పించదేం ?

ఈ దీనం శ్రీ శ్రీ కి ప్రశంసోత్సవ దీనం. అందుచేత ఈ వేదికను నిజమైన విప్లవ వేదికగా మేం భావిస్తున్నాం. ఈ వేదిక మీదనుండి యువకులు మీనుండి తక్షణం స్పష్టమైన సమాధానాన్ని అడుగుతున్నారు. మీరు ఎటున్నారు ? ముందుకు నడిచేవాళ్ళలోనా ? వెనక్కి పోయేవాళ్ళలోనా ? ʹఅభిప్రాయాలకోసం బాధలు లక్ష్యపెట్టని వాళ్ళలోనా ?ʹ ʹఆభిప్రాయాలు మార్చుకొని సుఖాలు కామించే వాళ్ళలోనా ?ʹ

ఈవేళ వీటికి గుండెమీద చెయ్యి వేసుకొని సమాధానం చెప్పుకోండి. చేతనయితే రండి. నిజాన్ని నిర్భయంగా రాయండి. మేం వున్నాం. మీవల్ల ఉత్తేజితులమయి, మీరు చూపించే దారిపట్టి మీరూహించే మరో ప్రపంచాన్ని వాస్తవం చేస్తాం.

లేదా వెళ్ళండి. వారపత్రికల మోచేతుల కింద గంజి తాగండి. పెద్దింటివాళ్ళ ఉంపుడు కవులుగా, సినిమా హీరోల బూట్లు తుడుస్తూ కూర్చోండి. మిమ్మల్ని మేమూ, చరిత్ర కూడా క్షమించం.

-విశాఖ విద్యార్థులు

No. of visitors : 739
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

International Seminar on Nationality Question

AIPRF | 20.11.2018 11:30:05pm

AIPRF - International Seminar on Nationality Question | Delhi | 16 - 19 Feb 1996| William Hinton | Saibaba | Varavararao | Ngugi |Noam Chomsky...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..
  ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీల జీవితాలు మారుతాయoటున్న శీలా సుభద్రాదేవి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •