ఆట‌లూ - దేశ‌భ‌క్తి ప్ర‌ద‌ర్శ‌న‌

| సాహిత్యం | వ్యాసాలు

ఆట‌లూ - దేశ‌భ‌క్తి ప్ర‌ద‌ర్శ‌న‌

- పి.పావని | 16.07.2019 07:19:53pm

జూలై మొద‌టి వారం క్రీడా ప్ర‌పంచంలో రెండు ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. ఒక వైపు ఇంగ్లండ్ లో క్రికెట్ ప్ర‌పంచ క‌ప్ జ‌రుగుతుంటే.. అటు ప‌క్క‌నే ఫ్రాన్స్ మ‌హిళ‌ల ఫుట్ బాల్ ప్ర‌పంచ క‌ప్ కి వేదిక‌య్యింది. మ‌న మీడియాకు క్రికెట్ త‌ప్ప మ‌రో క్రీడ ప‌ట్ట‌దు కాబ‌ట్టి.. అదీ మ‌హిళ‌ల ఆట‌లు అస‌లే ప‌ట్టవు కాబ‌ట్టి.. క్రికెట్ గురించి స్పెష‌ల్ పేజీలు కేటాయించే ప‌త్రిక‌లు కూడా మ‌రో క్రీడ‌కు చోటివ్వాల‌ని అనుకోవు. అయితే ఇప్పుడు చ‌ర్చ అది కాదు..

ప‌క్క‌ప‌క్క‌నే ఒకే స‌మ‌యంలో జ‌రిగే ఈ ఆట‌ల్లో రెండు అంశాలు ఆస‌క్తిగా అనిపించాయి. భార‌త్ ప్ర‌పంచ‌క‌ప్ లీగ్ ద‌శ‌లో ఉన్న‌ప్పుడు బ‌హుశా రెండో మ్యాచ్ జ‌రుగుతున్న‌ప్పుడు అనుకుంటా ఒక చ‌ర్చ మొద‌లైంది. టీమిండియా త‌ర‌ఫున ఆడుతున్న మ‌హేంద్ర సింగ్ ధోనీ త‌న కీపింగ్ గ్లౌజుల‌పైన ఒక చిహ్నాన్ని ధ‌రించాడు. అది తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న భార‌త సైనిక ద‌ళాల చిహ్నం అయిన బ‌లిదాన్. క్రికెట్ కి సంబంధించి అమిత మేధావిగా పేరు పొందిన సీనియ‌ర్ ఆట‌గాడు ఐసీసీ రూపొందించిన సాధార‌ణ నియ‌మాలు తెలీక చేశాడ‌నుకోవ‌డం పొర‌పాటే.

ఐసీసీ నియ‌మాల ప్ర‌కారం ప్ర‌పంచ క‌ప్ లాంటి టోర్న‌మెంట్ ల‌లో ఐసీసీ వ్యాపార ప్రయోజ‌నాల‌కు విరుద్ద‌మైన లోగోల‌ను, మ‌త‌, సైనిక చిహ్నాల‌ను ధ‌రించకూడ‌దు. దీనికి అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ఒప్పుకునే ప్ర‌పంచ క‌ప్ ఆడేందుకు బ‌య‌ల్దేర‌తాయి. ఈ విష‌యం దేశానికి 28ఏళ్ల త‌ర్వాత ప్ర‌పంచ క‌ప్ అందించిన వాడికి తెలీదా? అయితే ఇప్పుడు చ‌ర్చ అత‌ను అలా ఎందుకు ధ‌రించాడు? అస‌లు అలా చెయ్య‌వ‌చ్చా? చెయ్య‌కూడ‌దా? అని కూడా కాదు. చ‌ర్చ దేశ భ‌క్తి. దాన్ని ఆయ‌న ఎలా ప్ర‌ద‌ర్శించాడు అనేదే.

ఎందుకంటే.. పొరుగునే మ‌హిళా ఫుట్ బాల్ ప్ర‌పంచ క‌ప్ లో ఒక ¨త‌ల‌పొగ‌రు మ‌హిళా క్రీడాకారిణి¨(ఇది బీబీసీ నుంచి ఫాక్స్ న్యూస్ దాకా మీడియా ఇచ్చిన బిరుదే) త‌న దేశ‌భ‌క్తిని మ‌రోలా ప్ర‌ద‌ర్శించ‌డ‌మే కార‌ణం. ఆ ఫుట్ బాల‌ర్ పేరు మేగ‌న్ రెపీనో.. ఆమె దేశ‌భ‌క్తి ప్ర‌ద‌ర్శ‌న ఏంటంటే..సాధార‌ణంగా ఆట మొద‌లయ్యేప్పుడు వ‌చ్చే ఆదేశ జాతీయ గీతాన్ని.. పాడ‌న‌ని నిర‌స‌న తెలియజేయ‌ట‌మే.

ఇది మ‌నకు కాస్త వింత‌గా అనిపించేదే.. ఒక వైపు నిషిద్ధ గుర్తుల‌ను ధ‌రించ‌డం దేశభ‌క్తిగా మ‌న మీడియా ఊద‌రగొడుతుంటే.. సినిమా హాళ్ల‌లో జాతీయ గీతాల‌కు లేచి నిల‌బ‌డ‌లేదంటూ జ‌నాన్ని చావ చిత‌క కొడుతుంటే.. ఆవిడ అలా పాడ‌ను అంటూ బాహాటంగా అంటే ఊరుకుంటారా..? ఎందుకు ఊరుకుంటారు..? అమెరిక‌న్ మీడియా మ‌న‌కంటే నాలుగు ఆకులు ఎక్కువే చ‌దివింది క‌దా.. రెపీనో నిర‌స‌న మీద దుమ్మెత్తి పోశారు. అంత‌ర్జాతీయ వేదిక మీద ఆమె త‌మ దేశ ప‌రువును పోగొడుతోంద‌ని అక్క‌డి మీడియా గ‌గ్గోలు పెట్టింది. అయితే దీనికి జ‌వాబుగా రెపీనో..¨ జాతి, శ‌రీర‌పు రంగు, జీవ‌న విధానం, పుట్టిన ప్రాంతాల‌ను బ‌ట్టి ప్ర‌జ‌ల ప‌ట్ల విద్వేషం వ్య‌క్తం చేసే, అస‌లైన ప్ర‌జాస్వామ్యాన్ని, ప్ర‌జ‌లంద‌రికీ స‌మాన గౌర‌వాన్ని అందించని దేశం ప‌ట్ల తాను గ‌ర్వించ‌లేన‌నీ.. అలాంటి దేశానికి ప్రాతినిధ్యం వ‌హించే జెండాని చూస్తూ సంతోషంగా జాతీయ గీతాన్ని పాడ‌లేనని¨ స్ప‌ష్టం చేసింది. అమెరికాలో ప్ర‌జ‌లంతా... ముఖ్యంగా ఆఫ్రిక‌న్ అమెరిక‌న్స్(న‌ల్ల‌వాళ్లు), ఎల్జీబీటీక్యూ(వివిధ లైంగిక మైనారిటీలు) వ‌ర్గాలపై జ‌రుగుతున్న విద్వేష‌పూరిత దాడులు ఆగిపోయి.. అంతా నిర్భ‌యంగా అమెరికాలో బ్ర‌తక‌గ‌లిన నాడే తాను.. స‌గౌర‌వంగా జాతీయ గీతాన్ని పాడ‌తాన‌ని అన్నారు.

రెపీనో పై ఏకంగా ఆదేశ అధ్య‌క్షుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.ఈ ఆగ్ర‌హానికి రెపీనో జంక‌క పోగా.. ప్ర‌జాస్వామ్యవాదుల‌తో గొడ‌వ‌కు దిగ‌టం త‌మ దేశాధ్య‌క్షుడికి మామూలే అని కొట్టి ప‌డేసింది. ఒక‌వైపు మీడియ ట్రోలింగ్, ఏకంగా దేశాధ్య‌క్షుడితో వాగ్వాదం, త‌న స్పాన్స‌ర్ల ఒత్తిడులు త‌ట్టుకుని కూడా.. త‌న నిర‌స‌న కొన‌సాగించింది. ఇక‌పై కూడా కొన‌సాగుతుంద‌ని ప్ర‌క‌టించింది. అంతే కాదు.. త‌న అధ్బుత‌మైన ఆట‌తీరుతో జ‌ట్టుకు ప్ర‌పంచ క‌ప్ అందించింది.

అయితే ఎవరు గెలిచారు? ఎవ‌రు ఓడారు? అనేది ప‌క్క‌న పెట్టి అస‌లు విష‌యంలోకి వ‌స్తే... దేశ‌భ‌క్తి ప్ర‌ద‌ర్శిచ‌డంలో... మహేంద్ర సింగ్ ధోనీ, మేగ‌న్ రెపీనోల మ‌ధ్య ఎంత తేడా ఉందో ఆలోచిస్తే.. ఆశ్చర్యం క‌లుగుతుంది. ప్ర‌జాస్వామ్య విలువ‌ల ప‌ట్ల స‌మాజంలోని ప్ర‌ముఖుల‌కు (సెల‌బ్రిటీలు) ఉండాల్సిన వైఖ‌రి ఈ రెండు ఉదంతాల్లో స్ప‌ష్ట‌మైతుంది. దేశ మంటే, దేశానికి ప్రాతినిధ్యం వ‌హించ‌డం అంటే.. కేవ‌లం జాతీయ జండాలు, జాతీయ గీతాలు, చిహ్నాలేనా? లేదా ఆ దేశ ప్ర‌జ‌లందరికీ ప్రాతినిద్యం వ‌హించ‌డ‌మా అనే చిన్న విష‌యం మేగ‌న్ రెపీనోకి అర్థమైన‌ట్లు చాలా మందికి అర్థం కాలేద‌నిపించింది.





No. of visitors : 216
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


రాజ్యానికెదురు రాజీలేని పోరు

పి. పావ‌ని | 17.05.2019 12:18:50pm

మావోయిస్టు విముక్తి ప్రాంతంగా పేర్కొనే అబుజ్ మడ్ నుంచి (బుద్ధర్ డివిజన్ నారాయణ్పూర్, బీజాపూర్ జిల్లాల) వేలాది ఆదివాసీలు ఇంద్రావ‌తి వైపు సాగిపోయారు. దారిలో వ...
...ఇంకా చదవండి

ఆ చిరునవ్వుల్ని చిదిమేశారు

పావని | 01.04.2019 01:35:31pm

రాష్ట్రంలో హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను మావోయిస్టుల పేరుతో వేధించ‌డం.. కొన్ని సార్లు ప్రాణాలు తీయ‌డం కొత్త కాద‌ని ఇక్క‌డి హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు చెబుతారు......
...ఇంకా చదవండి

నాపేరు శూర్పణఖ

పావని | 17.03.2019 11:23:38pm

నాకు వంటి రంగు గురించి మరో రకం బాధ మొదలైంది. నేను మరీ అంత చిక్కటి నలుపులో లేననీ.. నా జుట్టు వత్తుగా, నల్లగా ఉన్న మాట నిజమే కానీ.. అది రింగులు రింగులుగా లే.....
...ఇంకా చదవండి

అతడి ఆలోచనలు అక్షరాలకే పరిమితం కాలేదు

అరుంధతి ఘోష్ | 16.06.2019 10:44:24am

చాలా మంది మేధావుల లాగా.. గిరీష్ క‌ర్నాడ్ వాద‌న‌లు, చ‌ర్చ‌లు, టెలివిజ‌న్ పానెల్ లు, సెమినార్ల‌కు ప‌రిమితం కాలేదు. ఆయ‌న త‌ను న‌మ్మిన విలువ‌ల కోసం వీధుల్లోకి.....
...ఇంకా చదవండి

వాళ్లంటే అంత భ‌యం ఎందుకు?

పావ‌ని | 28.08.2019 07:09:33pm

మ‌త‌మో.. దేశ‌మో ఏదో ఒక మూఢ‌భ‌క్తిలో ఉన్న జ‌నాన్ని నిద్ర‌లేపుతారేమో అని భ‌యం. అలాంటి ప్ర‌మాదం వీళ్ల వ‌ల్ల పొంచి ఉంది. అందుక‌ని.. వీళ్ల‌ను భ‌ద్రంగా జైలు గోడ‌ల...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌
    భారత విప్లవోద్యమంలో చారుమజుందార్ శతజయంతి సదస్సు
    విరసం నాయకుడు జగన్‌పై అక్రమంగా పెట్టిన ఉపా కేసు ఎత్తివేయాలి
    అరుణతార అక్టోబర్ 2019
    మనమూ తేల్చుకోవాల్సిందే
    ఆత్మీయ కలయిక
    కరవాలం చెప్పిన రహస్యం
    కాశ్మీరు మనది!
    మంచి కథ ఎప్పుడూ పాఠకుల ఆలోచనలకు పదును పెడుతుంది
    అక్షర సాహసులకు చైతన్య స్ఫూర్తి విరసం
    విరసం తో నా అనుబంధం - అనుభవం
    కులం - విప్లవోద్యమ అవగాహన, ఆచరణ - 2

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •