గాడిదల దొడ్డి

| సాహిత్యం | వ్యాసాలు

గాడిదల దొడ్డి

- పాణి | 16.07.2019 07:42:12pm

ʹఅదే అహంకారంʹ అని విరసం.ఓఆర్జీ జూన్‌ రెండో పక్ష సంచికలో రాశాను. అప్పటికి ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నిక కూడా కాలేదు. సభ తొలి రోజు ముఖ్యమంత్రి జగన్‌ వ్యవహారం చూసి రాశాను. అది చదివి కొందరు ఫోన్‌ చేశారు. ʹఅప్పుడే అంత తొందరెందుకు?ʹ అన్నారు. ʹవిమర్శించేందుకు ఇంకా టైం ఉంది కదాʹ అని హితవు చెప్పారు.

ʹతొందరేం లేదు. నాలుగు రోజులుంటే మీకే తెలుస్తుందʹని అన్నాను. వాళ్లంతా జగనన్న అభిమానులేం కాదు. క్రిటికల్‌గా ఉండేవాళ్లే. కానీ జగన్‌ను ఏమీ అనొద్దు. అప్పుడే అనొద్దు. మంచి చేస్తాడేమో చూద్దామనే ఆశావాదులు.

ఆశ చెడ్డదేం కాదు. ʹమంచిʹ చేస్తే ఎవరికి చేదు?

పాలకుల మంచి చెడ్డలు వెతికే పని మనమెందుకు పెట్టుకోవాలి? దాన్ని దిన పత్రికలకు వదిలేద్దాం.

అధికారంలోకి వచ్చిన మనుషులు ఎలాంటి వాళ్లో మనం చెప్పాలి. అధికారం వచ్చాక వాళ్లు ఎలా తయారవుతారనేదే మనకు ముఖ్యం. ʹఅధికార భాషʹ ఎలా ఉందో చెప్పకపోతే మన తెలివితేటలు తగలేయడానికి కూడా పనికి రావు.

గత నాలుగు రోజులుగా అసెంబ్లీలో జగన్‌ మాట తీరు అందరూ గమనించే ఉంటారు. ఆయన హావభావాలు చూసే ఉంటారు. టీ బంకుల దగ్గర సవాళ్లకంటే తేడా ఏమీ లేదు. వీధి రౌడీలా కనిపించాడు. ʹఐదేళ్ల నుంచి తెలంగాణలో కాళేశ్వరం కడుతోంటే మీరిక్కడ గాడిదలు కాస్తున్నారా?ʹ అని ప్రతిపక్షనేతను ఉద్దేశించి అన్నాడు. ʹరా చూసుకుందాం..మేం లేస్తే మీరు పారిపోతారు..ʹ ఇదీ ఆయన భాష.

జగనన్న మాటలకు సోషల్‌ మీడియా ఎంత వంత పాడిందో చెప్పలేం. ఫేస్‌బుక్‌ అంతా డ్రైనేజీ కంపు కొడుతోంది. జగన్‌కు అంతు లేని ప్రశంసలు. ఎంత బాగా మాట్లాడాడని జబ్బలు చరుచుకున్నారు. నాయకుడంటే అట్లా ఉండాలని మురిసిపోతున్నారు. రాయలసీమ ʹగ్యాంగ్‌ʹ సంగతి చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబును దెబ్బకు దెబ్బ తీస్తున్న చతురతగా దీన్ని కీర్తిస్తున్నారు.

జగన్‌ మాటలకు చంద్రబాబు సభలో, బైటా నానా గోల చేశాడు. తన వయసుకైనా గౌరవం ఇవ్వడం లేదని ఏడ్చాడు. రాజకీయాలకు ఏ విలువ, ఏ గౌరవం లేకుండా చేసిన ʹపెద్ద మనిషిʹ కడాకు ఇప్పుడు నా వయసునైనా చూడాలి కదా అనే దాకా వచ్చాడు. సభలో గుడ్లురిమి చూడటం, వేలు చూపి బెదిరించడం ఎలాగో చంద్రబాబు కదా జగన్‌కు నేర్పించింది.

ఏదైనా ఇలా చెబితే అలా అల్లుకపోయే కుశాగ్రబుద్ధిశీలి కాబట్టి జగన్‌ ఇట్లాగే మాట్లాడతాడు. పైగా ఆయనకు వారసత్వ రౌడీయిజం ఉండనే ఉంది. పులివెందుల నుంచి ఆయన నేర్చుకున్నది ఇదొక్కటే. ఆయనకది వెన్నతో పెట్టిన విద్య.

వీటన్నిటికి ఇప్పుడు తిరుగులేని అధికారం తోడైంది. ʹమీరు ఇరవై మూడు, మేం నూటాయాభైʹ అని రోజుకోసారైనా అంటాడు. అంతగా విజయోన్మాదం తలకెక్కింది.

చంద్రబాబును తిడితే మనకేమి? అనవచ్చు.

నిజమే వాళ్లలో వాళ్లు సవాలక్ష అనుకుంటారు. మనకెందుకు? దేనికైనా వాళ్లు సమఉజ్జీలు. ఒకరికంటే ఒకరు రెండాకులు ఎక్కువే. ఎవ్వరూ తక్కువ కాదు. అందరిలాగే జగన్‌ అధికార అరాధకుడు. విజ్ఞులు అంటున్నట్లు ఆయన విషయంలో మనమేమీ తొందర పడనక్కర లేదు. తన అధికార వ్యక్తీకరణ ఎలా ఉంటుందో చాటుకోడానికి ఆయనే తొందర పడుతున్నాడు. అధికారం కూడా దాచేస్తే దాగని సత్యం. ఇందులో దాపరికమే లేదు. ఆయనకు దాచుకోనవసరం లేదు. నూటాయాభై సీట్లు వచ్చాయి కాబట్టి తాను ఏమైనా మాట్లాడవచ్చని అనుకుంటున్నాడు. అంతక ముందు చంద్రబాబు చేసిన అవినీతి లెక్కాచారమంతా తనకు తెలుసు.. కాబట్టి ఇప్పుడు తాను ఎలాగైనా వ్యవహరించవచ్చు. ఇదీ ఆయన ధోరణి.

ఇంత వరకే అయితే ఆందోళన అక్కర్లేదు. చట్ట సభల్లో అందరూ ఇట్లే ఉంటారు. ఇదే పని చేస్తారు. ప్రజల్లో తనకున్న అభిమానం గురించి జగన్‌కు ఓ పిక్చర్‌ ఉంది. అది 150 సీట్ల కంటే చాలా ఎక్కువ అని జగన్‌ నమ్మకం. ఇప్పుడు దాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకోవడమే ఆయన లక్ష్యం. ఎన్నికల రాజకీయాల్లోని ఈ ʹజనరంజకత్వానిʹకి అనేక ముఖాలు ఉంటాయి. వాటిలో ఒకటి సభలో చూస్తున్నాం. అంతే.

ఇది ఇక్కడ ఆగేది కాదు. చాలా ముందుకు వెళుతుంది. చంద్రబాబు దగ్గరే కాదు. మీదైనా ప్రయోగించగలడు. చాలా మందితో జగన్‌ గాడిదలు కాయిస్తాడు. ఆయన చుట్టూ ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు అచ్చోసిన ఆంబోతుల్లా అసెంబ్లీలో రంకెలేస్తారు. వీధుల్లో వీర విహారం చేస్తారు. ఆ దృశ్యాలన్నీ మనం చూడాల్సిందే. ఆ రంకెలన్నీ వినాల్సిందే.

ఈ మొత్తానికి సమాజంలోంచే మద్దతు కూడా దొరుకుతుంది. ఇదీ అసలు విషాదం. రాజకీయాలంటే ఇవే అని ఇంత కాలం నేర్పించారు. పత్రికలు ప్రచారం చేశాయి. దీనిపట్ల మౌనం పెరిగితే పాలకులు నిరంకుశంగా తయారవుతారు. మద్దతు దొరికితే ఫాసిజానికి రహదారి వేసుకుంటారు. లెనిన్‌ పార్లమెంట్‌ను పందుల దొడ్డి అన్నాడు. జార్‌ చక్రవర్తి తానే సర్వంసహాధికారిగా ఉంటూ, కార్మికోద్యమాల బెడద తట్టుకోలేక ఏర్పాటు చేసిన పార్లమెంట్‌ అది. దానికి ఏ అధికారాలు లేవు. అందుకే లెనిన్‌ దాన్ని బాతాఖానీ క్లబ్‌ అని కూడా అన్నాడు. ఏ అధికారాల్లేని డ్యూమానే పందుల దొడ్డి అయింది. ఇక శాసనాలు చేసే మన చట్టసభలు గాడిదల దొడ్డిగా మారిపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. దాంట్లో ఎన్నడో పందికొక్కులు కూడా పడ్డాయి. అయితే నెంబర్‌ చాలు, అక్కడ అధికారం చెలాయించడానికి.

జగన్‌కు వచ్చిన ఓట్లు, సీట్ల కన్నా ఆయన మూక పెద్దది. నంబర్‌ వల్ల ఆయనకు అధికారం వచ్చింది. మూక మనస్తత్వం వల్ల ఆమోదం వచ్చింది. రాయలసీమ వాళ్ల జగనానందం వెనుక ఈ మనస్తత్వం ఉంది. నిస్సిగ్గుగా దాన్ని ఎంజాయ్‌ చేస్తున్న వాళ్లున్నారు.

కాస్త సెన్సిబుల్‌గా ఉండే వాళ్లకు ఇది అభ్యంతరమనిపించాలి. ఆ పక్క చంద్రబాబు అనే పరమ నికృష్టుడు ఉన్నాడు కాబట్టి వాళ్లూ వాళ్లూ తన్నుక చావనీ, మనకెందుకు.. అనుకోడానికి లేదు. మనం పట్టించుకోకున్నా వాళ్లు అదే పని చేస్తారు. పత్రికలు ఎలాగూ చెరో పక్షం తీసుకొని ఈ నైచ్యాన్ని చిత్రిక పడతాయి. ఈ అధికార మదం ప్రమాదకరమని చెప్పడానికి నెలలు, సంవత్సరాలు ఎదురు చూడాల్సిన పని లేదు. ప్రజాస్వామ్యంపట్ల గౌరవం ఉన్న వాళ్లెవరికైనా ఇది ఆందోళన కలిగించేదే.

కాబట్టి ఈ అధికార వికృత హావభావాలను చర్చకు పెట్టాలి. అధికార భాషకు ఉన్న అర్థాలు విప్పి చెప్పాలి. ఈ ధోరణి ప్రజలకు ప్రమాదమని వివరించాలి. ప్రజాస్వామ్య విలువలు, సంస్కృతిని అందరూ కలిసి పతనం చేస్తున్నారని హెచ్చరించాలి.

ʹఅధికారంʹ ఎలాంటిదో చెప్పి ముగిస్తాను.

జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక శారదా పీఠానికి వెళ్లాడు. అప్పుడు కొందరు యువకులు తమ మిత్రుడికి ప్రాణాంతక వ్యాధి ఉందని, ఆదుకోవాలని బ్యానర్‌ పెట్టుకొని ఆయన వెళ్లే దారిలో నిలబడ్డారు. జగన్‌ ఆగి మరి వాళ్ల దగ్గరికి వెళ్లాడు. ఆ వ్యక్తి వైద్యానికి సాయం చేస్తానని చెప్పాడు. చేశాడో లేదో నాకు తెలియదు. కానీ పత్రికలు దాన్ని ఎంత ముచ్చటగా అచ్చేశాయో. అది చదివిన వాళ్లు జగన్‌ మానవీయ ముఖ్యమంత్రి అనుకుంటారు. సున్నితమైన మనిషి అనుకుంటారు.

ఇంకో నిజం ఉంది. అది కూడా చెప్పుకోవాలి. అప్పుడు కాని అధికారం అంటే ఏమిటో అర్థం కాదు.

జగన్‌ నివాసం దగ్గర మూడు రోజులుగా చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మరాఠిపురం జనాలు ఆందోళన చేస్తున్నారు. వీళ్లు ఎస్టీలు. తమ పొలాలు ఎవరో ఆక్రమించున్నారని పిల్లా జల్లాతో వచ్చారు. వాళ్లను జగన్‌ పట్టించుకున్న పాపానపోలేదు. వాళ్లను పిలిచి ఒక్క మాట మాట్లాడితే సమస్య పరిష్కారమవుతుంది. ఆయన అధికారం అలాంటిది. కాని ఆయన ఆ పని చేయలేదు.

పైగా సీఎం నివాస ప్రాంతంలో ఆందోళనలను నిషేధించారు. దీనికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని సాకు చూపారు. విజయవాడ ధర్నా చౌక్‌ దగ్గరే ఇలాంటివి చేసుకోవాలని ఆదేశించారు. దానికి కూడా పోలీసుల అనుమతి తీసుకోవాలి. వాళ్లు ఇస్తే మన గోడు చెప్పుకోవాలి. లేకుంటే లేదు. మొండికేస్తే అరెస్టులు. కేసులు. బహుశా ఇంకా గట్టిగా మాట్లాడితే ఇవాళ సభలో చంద్రబాబును అన్నమాటే రేప్పొద్దున జనాన్ని కూడా జగన్‌ అంటాడు. అనుమానమే లేదు. దేనికంటే అట్లా చంద్రబాబు జనాన్ని ఎన్నోసార్లు అన్నాడు కాబట్టి.

No. of visitors : 410
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌
  భారత విప్లవోద్యమంలో చారుమజుందార్ శతజయంతి సదస్సు
  విరసం నాయకుడు జగన్‌పై అక్రమంగా పెట్టిన ఉపా కేసు ఎత్తివేయాలి
  అరుణతార అక్టోబర్ 2019
  మనమూ తేల్చుకోవాల్సిందే
  ఏవోబీ నెత్తురు చిందుతోంది
  అసహజ మరణాలు సమాజానికి హెచ్చరికలు అంటున్న కథ ʹ డోలిʹ
  ఎవరామె?
  స్వైర విహారం
  హిందూత్వసాంస్కృతిక దాడికి వ్యతిరేకంగా సాంస్కృతిక ప్రతిఘటనా దినాన్ని జరుపుకుందాం
  నీకు నేనంటే కోపమెందుకు ?
  రేయి బంగారు మధుపాత్రలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •