విప్లవ వ్యక్తిత్వం

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

విప్లవ వ్యక్తిత్వం

- పద్మకుమారి | 16.07.2019 08:07:17pm

నేను అజ్ఞాత ఉద్యమంలో ఉన్నప్పుడు కా.దుబాసి శంకర్‌ మెదక్‌ రమేషన్నగా తెలుసు. 1994లో ఒకసారి భారతిని కలవాల్సిన పనిపడింది. కానీ ఏవో ఇబ్బందుల వల్ల ఆమె కలవలేదు. ఆ తర్వాత కొంతకాలానికి నా అరెస్టు, ఐదేళ్ల జైలు. విడుదలై హైదరాబాదుకు వచ్చేసరికి ఆమె చైతన్యమహిళా సంఘం కార్యకర్తగా పరిచయం అయింది.

ఈ పుస్తకంలో చాలా మంది ఆమెతో తమ స్నేహం, కలిసి చేసిన పోరాటాలు, ఆమె ధైర్యసాహసాల గురించి రాశారు. ఆ వ్యాసాలన్నీ చదువుతుంటే భారతి మరింత బాగా అర్థంమవుతోంది. విప్లవోద్యమం కోసం ప్రాణాలు ధారపోసిన అమరులందరి గురించి ఇలాంటి పుస్తకాలు వస్తే వాళ్ల మహోన్నత వ్యక్తిత్వం అందరికీ తెలుస్తుంది.

భారతిలాంటి దిగువ మధ్యతరగతి మహిళలు భర్త ఎడబాటుతో చాలా యాతనలుపడాల్సి వస్తుంది. పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. అత్తింట్లో, పుట్టింట్లో పడే అవమానాలు అనుభవించితే తప్ప అర్ధం చేసుకోలేము. ముక్కుపచ్చలాని పెండ్లి పిల్లగా భారతి మనకు పరిచయం అవుతుంది. పెండ్లి కొడుకును పీటల మీద చూసుకున్న ఆ చిన్నారి తల్లికి ఆ క్షణంలో ఏమనిపించిందో ఊహించలేం.

తన కుటుంబాన్ని, ఊరునే కాదు చివరికి తన పేరును కూడ వదులుకుంది. సంప్రదాయబద్ధంగా సంసార జీవితంలోకి అడుగుపెట్టినా భారతి తన జీవితంలోకి మనుధర్మం ఛాయలు రానివ్వలేదు. విప్లవోద్యమంలోకి సహచరుడు వెళ్లిపోవడం వల్ల ఆమె సగటు మహిళల్లాగా కుటుంబ జీవితం గడపలేదు. ఆ తర్వాత ఆమె ఎంచుకున్న జీవితం వల్లే ఇవాళ భారతిని మనం గుర్తు చేసుకుంటున్నాం.

మొదటి దశలో ఆమె భర్త సహచర్యంలోంచే విప్లవోద్యమాన్ని అర్థం చేసుకుంది. ఆ తర్వాత బాబు బాధ్యతనే కాదు, పెద్దక్కగా తమ్ముళ్ల సంసారాలను చక్కదిద్దే బాధ్యత కూడ తనకుందని అనుకుంది. పక్షవాతంతో మంచాన పడ్డ తల్లిని చూసుకుంటూనే మహిళా ఉద్యమంలో క్రియాశీలంగా పని చేసింది. ఇది రెండో దశ. ఇక మూడో దశలో అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని అజ్ఞాత విప్లవోద్యమంలోకి వెళ్లిపోయింది.

ఆమె చైతన్య మహిళా సంఘంలో పని చేస్తున్నప్పుడు చాలా దగ్గరిగా గమనించాను. నాలుగు పదులు దాటిన వయసు, అనారోగ్యం. పెండ్లిడుకొచ్చిన కొడుకు. మామూలుగా అయితే కొన్ని పరిమితులు ఏర్పడుతాయి. కానీ భారతి అలా వుండేది కాదు. చైతన్యం వల్ల తన కార్యరంగాన్ని మరింత విస్తరించుకోవాలనుకుంది. గొప్ప నిర్ణయం తీసుకొని విప్లవోద్యమంలోకి వెళ్లిపోయింది. భర్త విప్లవోద్యమంలో వున్నందుకు ఆమె లోపలికి వెళ్లలేదు. తానుగా విప్లవోద్యమంలో పని చేయాలని దానికి తగిన నిర్ణయం తీసుకోగల చైతన్యం ఆమె పొందింది.

ఆమె అమరత్వం తర్వాత కుటుంబాన్ని కలిశాను. మహిళా సంఘంలో పనిచేసిన రోజుల్లో చాలా మందికి తెలిసిన భారతి వ్యక్తిత్వంతో పాటు, ఆమె సుతిమెత్తని మనసు, దయాగుణం ఆమె పుట్టింటి వాళ్ల మాటల్లో తెలిసింది. ముఖ్యంగా ఆమె మరదలు పద్మ చాలా అపురూపంగా భారతి జ్ఞాపకాలను పదిలపరుచుకుంది. ఆమె మరదళ్లు భారతిని తోడబుట్టిన దానికంటే ఎక్కువగా ఇష్టపడతారు. తమ కుటుంబాన్ని ఎంత బాధ్యతతో నెట్టుకొచ్చిందో వాళ్లు వలపోసుకున్నారు. బాధ్యత లేని తమ్ముళ్ల నుండి కుటుంబం విచ్ఛిన్నం కాకుండా మరదళ్లకు తన అనుభవాలు పంచి నిలబెట్టుకుంది.

బిడ్డ కష్టాలను గుర్తు చేసుకుంటూ... ఏ రోజూ నా బిడ్డ సుఖంగా బతికింది లేదు. ఏం రాత రాసుకొచ్చుకున్నదో నా బంగారుతల్లి....తెలిసి..తెలిసి సుడిగుండంలో దూకింది అని తల్లి చంద్రమ్మ మనసులో గూడుకట్టుకున్న వ్యథనంతా వలపోసుకుంది.

భారతి అమరత్వం తర్వాత కలిసినప్పుడు శంకరన్న వాళ్లన్నయ్య దుబాషి యాదయ్య తన జ్ఞాపకాలు పంచుకున్నాడు. చిన్నారి యాదమ్మ ఆ కుటుంబంలో హక్కుల కోసం ఆమె పడిన ఘర్షణ, ఆ ఇంటి కోడలుగా అందరికీ ఆమె పంచిన ప్రేమానురాగాలను ఆయన తలపోసుకున్నాడు.

బాబను వదిలి వెళ్లిపోతే పడ్డ ఇబ్బందుల వల్ల ఆమెను మళ్లీ ఇంటికి తీసుకొచ్చామని విషాదంలో కూడా ఆమె జ్ఞాపకాల్ని పదిలంగా నా పరిచాడు. యాదయ్య భార్య లక్ష్మి మాట్లాడుతూ తోడి కోడలు వెళ్తూ వెళ్తూ తన కొడుకును నా చేతుల్లో పెట్టినట్లయింది అంది. కొడుకు పెండ్లి చేసేదాకా అయినా ఉంటే బాగుండేది. నేను మా ఆయనా ఇద్దరం తల్లీదండ్రీ అయి పెండ్లి చేసినం. కొడుకును కని పెంచి పెండ్లి చూడలేకపోయిందని కన్నీళ్లు పెట్టింది.

హైదరాబాదులో ఉండే కుటుంబం నుంచి వచ్చిన భారతి ఒక మామూలు అమ్మాయిగా సహజంగానే జీవితం గురించి అనేక కలలు కన్నది. విప్లవోద్యమ ప్రభావం ఉన్న గ్రామాలవి. భర్త విప్లవ కార్యకర్తగా మారి తనను, బాబును వదిలి విప్లవోద్యమంలోకి వెళ్లిపోయాడు. ఆ తరంలో తెలంగాణలో వందలాది కుటుంబాల్లోని అడపిల్లల జీవితాలు ఇలాంటి సంక్షోభంలో పడిపోయాయి.

అసలెందు భర్త ఈ పనులు చేస్తున్నాడు? అనే ప్రశ్న భారతికి ఎదురైంది. అందరికంటే భిన్నంగా తన జీవితం ఉంది. దాన్ని అర్థం చేసుకోక తప్పలేదు. అతను చెప్పిన మాటలు, చుట్టుపక్కల గ్రామాల్లో జరుగుతున్న ఉద్యమాలు ఆమె ఆలోచనలను ప్రభావితం చేసాయి. ఊళ్లలోని పేదలంతా పోరాటాల్లో భాగమౌతున్నారు. ప్రజా పంచాయతీల్లో సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. ఆ పక్కనే ఇందుప్రియాల్‌ దళం కా. రాధక్క నాయకత్వంలో పని చేస్తోంది. పీడితవర్గం రాధక్కను సమర్ధురాలైన విప్లవ నాయకత్వంగా అంగీకరించి అక్కున చేర్చుకున్న కాలమది. విప్లవకారులు ప్రజల కోసం ఇదంతా చేయడం మంచిదే కదా అనిపించిదామెకు.

అందరిలాగా భర్త, పిల్లలు, సంసారం అనుకోడానికి, ఉద్యమాల వైపు నుంచి జీవితాన్ని అర్థం చేసుకోడానికి ఉన్న తేడా కూడా ఆమెకు తెలిసింది. పసిగుడ్డులా ఉన్న బాబును తల్లి దగ్గర వదిలేసి దళంలోకి వెళ్లిపోయింది. కొద్ది నెలలయ్యాక పరిస్థితి అంతా మారిపోయింది. నిర్బంధం వల్ల బాబును పుట్టింటి వాళ్లుగాని, అత్తింటి వాళ్లుగాని ఉంచుకోలేకపోయారు. విధిలేని పరిస్థితుల్లో వాళ్లు బాబు కోసం భారతిని ఇంటికి తీసుకొని వచ్చారు.

ఆమె కొడుకు కోసం బైటికి వచ్చిందిగాని తన అభిప్రాయాలు మార్చుకోలేదు. ప్రజా జీవితాన్ని వదులుకోదల్చుకోలేదు. అక్కడ ఆమె చైతన్యవంతమైన మహిళగా నిరూపించుకుంది. పిల్లల బాధ్యత నెరవేర్చడమంటే చాలా మంది మహిళల్లాగా నాలుగు గోడలకు పరిమితం కావడమని అనుకోలేదు. బాబు బాధ్యత, రాజకీయ బాధ్యత మధ్య ఆమె తేడా చూడలేదు. కాయకష్టం చేసి కొడుకును చూసుకుంది. ఈ క్రమంలో మహిళగా తల్లి పడ్డ కష్టాలను దేవేందర్‌ ఉద్వేగంగా...ʹఒంటరిదాని గానేకాక చక్కటి రూపం మూలంగా అమ్మ పనిచేసిన చోట కూడ ఇబ్బంది పడిందిʹ అని బాధపడ్డాడు.

ఒంటరి మహిళగా కుమిలిపోయి ఉంటే ఇవాళ మనం ఆమెను ఇంతగా తలపోసుకోడానికి ఏమీ ఉండేది కాదు. ఎవ్వరి మీద ఆధారపడకుండా కష్టపడి జీవించింది. దాని వల్ల ఆమె స్వతంత్య్రంగా ఆలోచించే మహిళగా రాటుదేలింది. ఉద్యమం లోపల ఉన్న భర్తతో అనుబంధాన్ని నిలబెట్టుకోవడంలో కూడా ఆమె ఇదే స్ఫూర్తిని ప్రదర్శించింది. భార్యా భర్త సంబంధాల్లో స్త్రీలు ఆధారపడే పరిస్థితి నుంచి సొంత వ్యక్తిత్వంతో వ్యవహరించేలా ఎదగాలి. పిల్లల బాధ్యత అంటే జీవితాన్నంతా వాళ్లకే ధారపోయడం కాదు. అనేక పనుల్లో అది కూడా ఒక పని అనుకోవాలి. భారతి దీన్ని సాధించింది. కొడుకు నాజూకుగా ఎదిగి, బాగా చదువుకొని ఉద్యోగం చేసి సంపాదించుకునే వాడు కావాలని కూడా ఆమె అనుకోలేదు. ఆలోచన ఒకటి ఆచరణ మరొకటిగా జీవించలేదు. కొడుకు ప్రజా ఉద్యమాల్లో బాధ్యతగల కార్యకర్త కావాలని అనుకుంది. దానికి తగినట్టే దేవేందర్‌ను పెంచింది.

ఇల్లు, కొడుకు, సొంతం.. ఏవీ ఉద్యమానికి బైట వేరుగా చూసుకోకపోవడం వల్లే ఆమె ఆ వయసులో తిరిగి విప్లవోద్యమంలోకి వెళ్లిపోయింది. కొడుకు తనంతకు తాను బతికే వయసులోకి వచ్చాడు కాబట్టి ఉద్యమంలోకి వెళ్లిపోయిందని అనడం ఆమె చైతన్యాన్ని తక్కువ చేయడమే. అప్పటికి ఆమె మధ్య వయసులోకి చేరుకుంది. కొడుకు కోసమే ఆమె ఉద్యమం నుంచి బైటికి వచ్చి ఉంటే ఆ కొడుకుతోనే నాలుగు గోడల మధ్య ఉండిపోయేది. కొడుకును చూసుకుంటూ మిగతా జీవితం గడిపేది. అలాంటి కుటుంబ చట్రానికి ఆమె పరిమితి కాలేదు. ఆ రోజు కొడుకు కోసం ఉద్యమం నుంచి బైటికి రావడం విధిలేని పరిస్థితి. పసివాడిపట్ల ఉండే నైతిక బాధ్యత. దాన్ని ఆమె నెరవేర్చింది. అప్పుడు మహిళా ఉద్యమంలో ఆమె నిర్వహించిన బాధ్యతను గుర్తు చేసుకోవాలి. ఏ పనినైనా భారతి అలాగే చూడటం ఆమె చైతన్యానికి గుర్తు. రాజకీయ అవగాహన ఉన్న మహిళలు కుటుంబ జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేదానికి భారతి గొప్ప ఉదాహరణ. పిల్లల బాధ్యత చూసుకోవడమంటే రాజకీయ జీవితాన్ని ఒదులు కోవడం కాదని, రాజకీయ నిబద్ధ్దత కలిగిన వారికి పిల్లలు, సంసారం పరిమితులు కాకూడదని భారతి నిరూపించింది.

నిర్బంధం వల్ల విప్లవోద్యమం అనేక ఆటుపోట్లకు గురి కావచ్చుగాని అనేక రకాల ఉదార్తమైన మనుషులను అది తయారు చేస్తోంది. కామ్రేడ్‌ భారతి(యాదమ్మ) ఇప్పుడు కామ్రేడ్‌ అమ్మగా చరిత్రలో మిగిలిపోయింది. ఆమె అమరత్వాన్ని కన్న కొడుకు ఎత్తిపడుతున్నాడు. కామ్రేడ్‌ అమ్మ అని మాతృత్వానికి, మహిళకు ఆమె కొత్త నిర్వచనం చెబుతోంది. కామ్రేడ్‌ నవత(సులోచన) గురించి కూడా మనం చదువుకున్నాం. ఆమె కన్న బిడ్డలు ఆమెకు విప్లవ సహచరులయ్యారు. వాళ్లతో ఆమెకు ఉన్న సంబంధం మాతృత్వ సంబంధం కాదు. కామ్రేడ్లీ సంబంధం వాళ్ల మధ్య ఏర్పడింది. ఆ మార్గంలో రాటుదేలిన గెరిల్లా అమ్మల్లో భారతి ఒకరు. ఇప్పుడు భారతి కోరుకున్నట్లు ప్రజా ఉద్యమాల్లో కార్యకర్తగా పని చేస్తున్న దేవేందర్‌ అనుబంధంలోంచి ఈ అమ్మను స్మరించుకుందాం.

ఈ వ్యవస్థ వల్ల నాలుగు గోడలకు పరిమితమైన అమ్మ పాత్రను ఆమె ఎంతో చైతన్యవంతం చేసింది. తనను తాను చైతన్యవంతమైన గెరిల్లాగా తీర్చిదిద్దుకుంది. ఈ వీరవనితకు బంధుమిత్రుల సంఘం వినమ్రంగా నివాళ్లు అర్పిస్తోంది. విప్లవ జోహార్లు చెబుతోంది.

( కామ్రేడ్ అమ్మ పుస్తకానికి ముందుమాట. జూలై 18న అమరుల బంధు మిత్రుల సంఘం సభ సంధర్బంగా రాంగూడ అమరురాలు కామ్రేడ్ భారతి స్మృతిలో పుస్తకావిష్కరణ ఉంటుంది. )

No. of visitors : 1736
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆ శిరస్సు, స్తనాలు ఏమయ్యాయి?

పద్మకుమారి, కార్యదర్శి, అమరుల బంధుమిత్రుల సంఘం | 18.11.2016 11:48:02am

మర్మాంగాలను ఛిద్రం చేస్తున్న చోట, పాలిచ్చే వక్షోజాలను కోసి పారేస్తున్న చోట, తలెత్తి పోరాడమని ప్రజలకు నేర్పిస్తున్న వాళ్ల తలలు మాయం చేస్తున్నచోట, శవాన్ని ప...
...ఇంకా చదవండి

‌మానని గాయమూ, తీరని ఆగ్రహమూ వాకపల్లి..

పద్మకుమారి | 17.06.2016 10:57:58am

వాకపల్లి పాతపడిపోయింది. కొత్తగా భల్లుగూడ కూడా మన ముందుకు వచ్చిపోయింది. ఛత్తీస్‌ఘడ్‌లో రోజూ ఇలాంటి అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. అన్నీ పోలీసులు, పారా........
...ఇంకా చదవండి

ఉండవలసిన తీరు

పద్మకుమారి | 15.05.2016 01:51:20pm

ʹఅమ్మా నువ్వే ఇట్లన్నవంటే.. వాల్లు ఇంకెట్లంటరో ఆలోచించు. అది చూడు ఎంత బాధపడుతున్నదో. ఇంతకూ బాబును వదిలి వెళ్లడానికి ధనాలు సిద్ధంగా ఉందా? దాన్ని ఒక్క మాట అడగ...
...ఇంకా చదవండి

పయనించిన పాట

పద్మకుమారి | 21.12.2016 12:01:15am

బిడ్డల గురించి తల్లులకు ఇలాంటివి ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని ఆరాటాలు, ఎన్ని ఎదురు చూపులు. ఇవి తీరేవేనా? ఈ దు:ఖం ఆగిపోయేదేనా? ప్రభా తల్లి ఒక్కరే కాదు. అమరుల ...
...ఇంకా చదవండి

పాల్గుణ

ప‌ద్మ‌కుమారి | 11.05.2016 01:21:15pm

ఇప్పుడు పాల్గుణ అంటే మేఘ‌మే కురుస్తుంది త‌ప్ప పిడుగు రాల‌దు.పిడుగు రాలినా పిడుగంచు విద్యుత్ వెలుగై మ‌నసులోకి ఇంకుతుంది. ...
...ఇంకా చదవండి

ఉండవలసిన తీరు -2

పద్మకుమారి | 01.06.2016 10:37:59am

కమాండర్‌ వెనక్కి తిరిగి మనం దగ్గరికి వచ్చేశాం. ఇది మనకు బలమైన ప్రాంతం. ఇంకో అరగంటలో గ్రామం అంచులోకి చేరుకుంటాం. ప్రయాణం ఒక రోజు లేటైనా రెండో రోజు ఏపీటీకి...
...ఇంకా చదవండి

త్యాగాల పరంపర

పద్మకుమారి | 17.07.2016 12:35:14am

కుప్పగా పోసిన శవాల్లో తమవాళ్లను గుర్తించి ఏరుకోవడం ఎంత హృదయ విదారకం. సృజన మనసు చాల సున్నితమైనది. పట్టుదలగల అమ్మాయి. మేము ఇలా ఎప్పుడో ఒకప్పుడు చూస్తామని......
...ఇంకా చదవండి

దారులు

ప‌ద్మ‌కుమారి | 15.05.2016 01:10:40pm

ఎక్కడివీ బాటలు ఎవరి జాడలు వెంట పరిగెడుతున్నాయి నీవేనా ? అవి నీవేనా ?...
...ఇంకా చదవండి

రమాకాంత్‌ వాళ్లమ్మ

పద్మకుమారి | 17.11.2019 10:25:42am

ʹఆ రోజు అన్నను చంపేసినప్పుడు మన సంగం లేదు కాబట్టి శవాన్ని చూడ్డానికి కూడా కాలేదు. ఇప్పుడు ఎక్కడెక్కడికోపోయి మనోల్ల శవాలను తెస్తున్నారు. మన సంగం ఉండాలి .....
...ఇంకా చదవండి

వాకపల్లి ఇప్పుడు ఎం చెబుతోంది?

పద్మకుమారి | 04.09.2017 08:58:57am

వాకపల్లి ఒక్కటే కాదు. విప్లవోద్యమ ప్రాంతాల్లో మహిళల రాజ్యం దారుణంగా దాడి చేస్తోంది. బైటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించీ వింటున్నాం. చిన్న ప...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •