నెల త‌క్కువ భాష‌

| సాహిత్యం | క‌విత్వం

నెల త‌క్కువ భాష‌

- కొండేపూడి నిర్మ‌ల‌ | 16.07.2019 08:59:08pm

ఎవ‌డి ఆయువుప‌ట్టు అయినా
నోటిమాటే క‌దా!
చూస్తూ ఉండ‌గానే నా నాలుక
నాకు ప‌రాయిది కావ‌డ‌మేమిటి?
నా గ్రామాలు, తిండిగింజ‌లు, మ‌ట్టీ, ప‌గిలిన ఉట్టీ
న‌న్ను మాట్లాడ‌డం మానేసి
ప‌ట్టుమ‌ని ముప్పై అక్ష‌రాలైనా లేని
నెల‌త‌క్కువ భాష‌లో ఇకిలించ‌డ‌మేమిటి?
ఆక‌లితో అల‌మ‌టించే నోటికీ
అభివృద్ధి ప‌థ‌కాల‌కీ మ‌ధ్య‌
ఈ భాషా విక‌లాంగ‌త ఎప్ప‌టిది?
ఆత్మ‌ను ప‌లికించే భాష‌
ఆత్మ‌గౌర‌వం చిప్పిల్లే భాష‌
ఇక దింపుడు క‌ళ్ల దుఃఖ‌మేనా?
స‌మ‌స్త స‌మాచార స్ర‌వంతికి
ఈ తెల్ల‌మ‌ట్ట పురుగుల కాటుపోదా?
ఏ జాతిని మ‌ట్టుపెట్ట‌డానికైనా
సాంస్కృతిక దోపిడీకంటే
బ‌ల‌మైన విధ్వంసం ఇంకేదైనా ఉందా?
ఐదేళ్ల‌కోసారి పుట్టిగిట్టే
కుక్క‌మూతి ప్ర‌యోగాల‌కి
నా జ‌నం ఎల‌క‌ల్లా కుందేళ్ల‌లా
భ‌య‌ప‌డి ప‌రుగెడుతున్నారే...
న‌ల్ల‌చ‌ర్మంగా త‌ప్ప‌
డ‌ర్టీ ఇండియాగా త‌ప్ప‌
ఇంకోలా పిల‌వ‌నివాడిప్పుడు
ఏ కార‌ణంగా నావాడ‌కొచ్చాడో తెలీదు
రోజుకూలి న‌ష్టంతో అయినా విందామ‌ని కూచుంటే
వాడి అగంత‌క భాష చేసే శ‌బ్ధహింస‌
నా చెవుల్ని శ‌వాల్ని చేసి బ‌ట్ట క‌ప్పుతుంది
తెరిచిన వాడి నోరూ
లాప్ టాపూ ఒక్క‌లాగే ఉంటాయి
వాటి దంతాల మ‌ధ్య నా గ్రామాలు
నెత్తురోడుతూ క‌నిపిస్తాయి
ఎల‌క‌తోక‌ను ప‌ట్టుకొని
నా పేద‌రికాన్ని కొల‌వాల‌ని వాడు చూస్తాడు
నేనిప్పుడు ఆక‌స్మికంగా
దంతాల భాష అభ్య‌సించ‌డం త‌ప్ప‌
గ‌త్యంత‌రం లేనిదాన్న‌య‌య్యాను
ఎన్ని ప్ర‌మాద సూచిక‌లుంటే
అన్ని ప్రాజెక్టులూ, లాప్‌టాపులూ
తెరుచుకుంటాయి క‌దా
ఆక‌లి చావుల‌కీ, అత్యాచారాల‌కీ
దోమ‌లు కార‌ణ‌మ‌ని,
అంగ‌వైక‌ల్యానికి, అవ‌మానాల‌కి
గోళ్ల‌లో మ‌ట్టి దూరడం కార‌ణ‌మ‌ని
జాతి చైత‌న్య‌మంతా క‌లిసి
పొదుపులు క‌ట్ట‌డానికే ప‌రిమిత‌మ‌ని
గిరిజ‌నుల స‌ర్వావ‌స‌రాలు
పాయిఖానా ప‌థ‌కంతో తీరుతాయ‌ని
వాడు చెబుతున్న కొద్దీ
చెవులున్నందుకు మ‌ర‌ణించాల‌నిపిస్తోంది
రెండు పిల్లుల రొట్టెముక్క‌ల త‌గాదాలో
ల‌బ్దిపొందిన కోతుల కిట‌కిట‌
ఇవాళ నా గ్రామాల్లోకి విస్త‌రిస్తోంది.





No. of visitors : 197
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌
    భారత విప్లవోద్యమంలో చారుమజుందార్ శతజయంతి సదస్సు
    విరసం నాయకుడు జగన్‌పై అక్రమంగా పెట్టిన ఉపా కేసు ఎత్తివేయాలి
    అరుణతార అక్టోబర్ 2019
    మనమూ తేల్చుకోవాల్సిందే
    ఏవోబీ నెత్తురు చిందుతోంది
    అసహజ మరణాలు సమాజానికి హెచ్చరికలు అంటున్న కథ ʹ డోలిʹ
    ఎవరామె?
    స్వైర విహారం
    హిందూత్వసాంస్కృతిక దాడికి వ్యతిరేకంగా సాంస్కృతిక ప్రతిఘటనా దినాన్ని జరుపుకుందాం
    నీకు నేనంటే కోపమెందుకు ?
    రేయి బంగారు మధుపాత్రలు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •