జాబిలి వర్షం

| సాహిత్యం | క‌విత్వం

జాబిలి వర్షం

- కెక్యూబ్ | 16.07.2019 09:10:57pm

"Therefore, let the moon shine on thee in thy solitary walk; And let the misty-mountain winds be free to blow against thee" - William Wordsworth.

కవిత్వం ఇప్పుడు యుద్ధ భాషను సొంతం చేసుకుంటోంది. జీవితం రాజకీయానికి దూరం కానప్పుడు రాజకీయంలో ప్రజల పక్షాన పోరాడే ప్రత్యామ్నాయ రాజకీయాలకి ఒక ప్రత్యేక స్థానం వుంటుంది. పోరాటం తప్ప ఇంకో మార్గం లేని ప్రజల పక్షాన నిలిచి మాటాడే కవికి యుద్ధాన్ని గానం చేయడం తప్పదు. త్యాగాల బాట పట్టిన వారి కలలను సొంతం చేసుకుని వాటిని నినదించక తప్పదు. కవిత్వ రచన వృత్తిగానో ప్రవృత్తిగానో చేసే కవికి ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచన తన మార్గమైనప్పుడు దానిని అభివ్యక్తీకరించే శైలి దానికదే సరళీకరించబడుతూ వస్తుంది. అడవి యుద్ధ కేంద్రంగా మారి రాజ్యాన్ని ఎదిరించే కార్యక్షేత్రంగా ప్రతిఘటించే సమయాన త్యాగాలు నిత్యకృత్యంగా మారి నెత్తురోడుతున్న నేల నింగినంటిన జాబిలికి దు:ఖాన్ని వర్షించే సమయమవుతుంది. ఇది సమయ స్వచ్చతను మనకు కనుల ముందు నిలుపుతుంది. ఎవరు ఎవరో ఎవరికెవరో అన్న గీతను స్పష్ట పరుస్తుంది. ఈ గతితార్కికతను మర్మాన్ని ఎరిగిన విప్లవ కాల్పనికతను అరసవిల్లి కృష్ణ గారి కవిత్వంలో పరిమళిస్తుంది. ఈ విప్పవనాల గాలి మనకు అనుభూతమవుతుంది. జూలై 2019 అరుణతార ముఖ చిత్రాన్ని అలంకరించిన జాబిలి వర్షం కవిత చదవగానే ఇది మనలోకి ఇంకుతుంది.

అవును ఎవరామె. తానెందుకు పోరాడి అమరురాలైంది. ఎవరికోసం తన భద్రమయ జీవితాన్ని త్యాగం చేసి యుద్ధాన్ని జీవితంగా మలచుకుంది. వందలాది మంది ఆదివాసీల జీవితాలలో వారి ఆలోచనా దృక్పథాలలో మార్పునెందుకు కోరుకుంది. వారిని కార్యోన్ముఖులను చేస్తూ తను సాయుధంగా వారితో పాటు వందల కిలోమీటర్లు నడిచి పోరాటబాట పట్టింది. ఇది ఈ నేలకు కొత్త కాదు. కానీ కోట్లాదిమందికి లేని ఆలోచన తనలాంటి వారి సొంతమయి మట్టికాళ్ళ మహారాక్షసిని ఓడించి ప్రత్యామ్నాయ సంస్కృతిని, జీవన విధానాన్ని కావాలని కలలు కనడంతోనే ఆగిపోక వాటిని సాకారం చేసేందుకు తను ఆకుపచ్చ చందమామలా రాత్రీ పగలూ నడయాడి అత్యంత కౄరమైన రాజ్యాన్ని ఎదిరించాలనుకుంది. ఇది నేటి యువతకు తప్పక తెలియాల్సిన విషయం. ఆ కామ్రేడ్ అమరత్వాన్ని తన ప్రత్యేక శైలిలో గానం చేసారు అరసవిల్లి.

కవిత్వంలో మార్మికతను ఎంతలా వాడుకోవాలో తెలిసిన కవి. అదే సమయంలో కవితా వాస్తవికతను కూడా వస్తువు దాటిపోకుండా అంతే సరళంగా చెప్పగలగాలి. లేకపోతే శిల్పం వస్తువును మింగేసే ప్రమాదం పొంచి వుంటుంది. దేనికది సమతూకంగా నడపగలిగిన నాడు కవిత్వంలో వస్తువును పాఠకుడు అనుభూతించగలుగుతాడు. ఈ కవితలో దానిని సాధించారు అరసవిల్లి.

తడి తెలియని
జాబిలి వర్షం కింద తడుస్తున్న సమయాన
వెలిగించిన అగ్గిపుల్ల కాంతిలో
నిజానికి ఎవరామె.

అవును నిజానికి ఆ బూటకపు ఎదురుకాల్పుల సంఘటన సమయంలో తనకేదీ పట్టనట్టు ఆకాశాన్నంటిన జాబిలి కురిపించే వర్షంలో అచేతనంగా పోరాడి పడిన ఆ దేహం ఎవరిదో శతృవుకు తప్ప ఎవరికీ తెలియదు. ఆ ఛిద్రమైన దేహంలో మూసుకున్న కను రెప్పల వెనకాల చెదిరిన కలల జారిన నీటిబొట్టును ఒడిసి పట్టేదెవరు.

భూమిని తొలుస్తున్న తొలిపాదంలా
నల్లటి శరీరాన్ని ఎర్రమందారమై తాకుతున్న
ఎవరామె

కవిత్వంలో మెటఫర్ లకు వున్న ప్రాధాన్యత కవికి ఎరుకలో వుండాలి. వస్తువును సౌందర్యవంతంగా చెప్పడంలో ప్రతీకలకు మించిన సాధనం లేదుకదా. అమరురాలైన ఆమె తను మొదటి వ్యక్తి కాకపోయినా ఆమె పోరాటాన్ని ఎత్తిపట్టేందుకు కవి ఈ గొప్ప ప్రతీకతో దానిని వ్యక్తం చేయడం వలన మన మనసు లోలోపలికి ఆ గాఢత ఒలుకుతుంది. విప్లవ కవిత్వంలో కవిత్వానికి అభిభాష విప్లవమే కదా? ఇది కవియొక్క సహానుభూతిని తన మమేకతను తెలియచేస్తుంది. ఇది ఏదో పదాల సాధన ద్వారా లభ్యమయ్యేది కాదు. విప్లవ జీవితాన్ని అధ్యయనం చేస్తూ అందులోని గాఢతను అనుభూతిస్తూ తన వ్యక్తిత్వంలో దానిని సొంతం చేసుకున్న కవికి ఇది సులువుగా చేతికందుతుంది అని అనుకుంటున్నా.

ఆకాశంపై
అగ్ని సంతకం చేసిన ధీశాలి
మా చేతుల్లో
మా హృదయాలలో
మా పూరిళ్ళలో
సూర్యుడు మరణించాడు.
.....
జాబిల్లి
మరణించడం నీకంటే
విస్తరించిన వెలుగు కదా

అమరత్వం ద్వారా తను ప్రజా పోరాట చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించబడుతుంది. తనిప్పుడు సర్వనామమయింది. ఆమె లేని లోటు మనందరి హృదయాలలో కనులలో కోల్పోయిన కాంతిని కవి సూర్యుని అస్తమయంతో పోలుస్తూ చెప్పడం కవిత నిర్మాణంలో కొత్తగా ఆ గాఢతను మనకు తెలియచేసారు. తన అమరత్వంతో తన ఆచరణను ఆయుధాన్ని అందించడం ద్వారా తన వెలుగు మరింతగా నలుదిశలా విస్తరిస్తుంది. ఈ అభివ్యక్తి మనల్ని వెంటాడుతుంది.

విప్లవ కవిత్వంలో వచ్చిన మార్పు విమర్శకులకు అందనంతగా ఎదుగుతోందనడానికి ఈ కవిత ఒక తార్కాణం. విప్లవ రచయితగా నిబద్ధత నిమగ్నత కలిగిన జీవన శైలి గల కవి చూపులో ప్రతిఫలించిన ఈ పద చిత్రాల పొందిక అందరం అందుకోవాల్సిన అవసరం వుంది. మరింత గాఢమైన కవిత్వాన్ని ఆశిస్తూ కవితను ఆసాంతం ఒకసారి చదువుకుందాం.

తడి తెలియని
జాబిలి వర్షం కింద తడుస్తున్న సమయాన
వెలిగించిన అగ్గిపుల్ల కాంతిలో
నిజానికి ఎవరామె

భూమిని తొలుస్తున్న తొలిపాదంలా
నల్లటి శరీరాన్ని ఎర్రమందారమై తాకుతున్న
ఎవరామె

నాకు తెలియని
నన్ను ప్రశ్నించని
పసిపాప మృత్యు ఒడిలోంచి
నాలోకి ప్రవహిస్తున్న
నడిచే ఆయుధమా
ఎవరామె

శరీరమంతా
గాయాల కన్నీళ్ళను దాచుకున్న
రుధిరానికి నిండు కుండయిన
ఎవరామె

జీవనది నుండి అదృశ్యమై
వనవాసుల కాలివేళ్ళను వెతికిన
ఎవరామె

ఎగురుతున్న విమానం వంక చూసి
నేరేడు చెట్టు కింద
వెలుగు రవ్వలలో
ఆరిన ఊపిరులను లెక్కిస్తున్న
ఎవరామె

జ్నాపకం రాలేదా
మనుషుల బండిలో
శరీరాల స్పర్శలో
రహదారులు మరణిస్తున్నప్పుడు
బతుకు చక్రం వదిలి
మనుషులలోకి నడిచిన
ఎవరామె

ఆకాశంపై
అగ్ని సంతకం చేసిన ధీశాలి
మా చేతుల్లో
మా హృదయాలలో
మా పూరిళ్ళలో
సూర్యుడు మరణించాడు
గాడాంధకారంలో
ఆకాశం వంక చూస్తున్నప్పుడు
నిఠారుగా దీపాన్ని
ఎలా గుర్తించగలుగుతాం తల్లీ
ముక్క చెక్కలయిన మహావృక్షంలో
కన్నీటి బొట్టును
ఎలా వెతుకుతాం

బాటసారికి దాహార్తిగా వున్నప్పుడు
ఆకు చివర రాలిన మంచు బిందువు నీవేనా
ఆకలి మేఘం ఉరిమినప్పుడు
కంచంలో రాలిన నాలుగు మెతుకులు నీవేనా

జాబిల్లి
మరణించడం నీకంటే
విస్తరించిన వెలుగు కదా

గిరిజనుల
కమిలిన దేహాలపై దిగిన
బాక్సైట్ గునపాన్ని ముక్కలు
చేసిన సాహసి
ఒకానొక అమరత్వం
బహుళ అస్తిత్వాలను తుడి చేయవచ్చు
దిక్కులేని జనం
ఆశ్రయ ప్రపంచాన్ని వెతుక్కుంటూ
తిమింగలం నోరు తెరిచి దాహం అనవచ్చు
అమరత్వం
నీటిబొట్టు కాదు
జనం కనుల నుండి
ఉబికే జలపాతం
జ్వలించే నీ నేత్రంలో
చిగురిస్తున్న మేఘపు
తొలి వర్షం

ఆకాశం నీపై వాలుతుంది

(కితుబా అమరురాలు కామేశ్వరికి)

No. of visitors : 218
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆకు క‌ద‌ల‌ని చోట వ‌ర్షించిన క‌విత్వం

కేక్యూబ్ వ‌ర్మ‌ | 20.10.2016 12:53:32am

ఒకమారుమూలపాఠశాలఉపాధ్యాయుడు ఈ నిశ్శబ్దాన్నిభరించలేక ఈ ఉక్కపోతనుధిక్కరిస్తూతనచుట్టూవున్నఆకుకదలనితనాన్నికవిత్వంగామనముందుఆవిష్కరించినదే ఈ సంకలనం.......
...ఇంకా చదవండి

ఆ పావురాలు!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 02.01.2017 11:39:40pm

ఒలికిన నెత్తురు అద్దిన జెండానందుకుంటూ గుంపుగా ఆ పావురాలు! ...
...ఇంకా చదవండి

తెలవారని ఆకాశం!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 07.12.2016 11:52:30am

కొన్ని మంచు బిందువులేవో రాతిరి కురిసిన వాన చివుళ్ళ నుండి రాలుతూ రెక్కల చాటున ముఖం దాచుకున్న పక్షి టపటప రెక్కలల్లారుస్తూ ఎగరబోతూ...
...ఇంకా చదవండి

నమస్కరిస్తూ..

కేక్యూబ్ వ‌ర్మ‌ | 04.09.2017 11:18:59am

కళ్ళకు గంతలు కట్టుకొన్నదని మీ న్యాయ దేవత ముందు నగ్నంగా నిలబడిన ఆ పదముగ్గురూ విడిచిన లజ్జను మీ మఖంపై నెత్తుటి ఉమ్ముగా ఊసి!...
...ఇంకా చదవండి

మస్వాల్..

కెక్యూబ్ వ‌ర్మ‌ | 03.09.2016 12:37:26am

మరుగుతున్న మంచు తెరలుగా విడిపోతూ రాలిపోతున్న మస్వాల్ పూలెన్నో ఇప్పుడిక్కడ ఒకటే హృదయ ఘోష ఆజాదీ ఆజాదీ .......
...ఇంకా చదవండి

గులాబీ!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 17.04.2017 11:32:19am

వాడెంత విధ్వంసం చేసినా నీ పసివాడి చేతిలో గులాబీ విచ్చుకుంటూ వాడిని భయపెడుతూనే వుంది!!...
...ఇంకా చదవండి

దక్షిణ యాత్ర

కెక్యూబ్ వర్మ | 04.06.2017 01:12:22pm

నీ ఒంటి రంగును హేళన చేసి నిన్ను బానిస చేసుకో చూస్తున్నాడు నీకంటూ మిగిలిన ఆఖరి అవకాశం నిన్ను నువ్వు జెండాగా ఎగురవేయడమే!!...
...ఇంకా చదవండి

జీవ‌సూత్రాన్ని చెప్పే చింతా అప్పలనాయుడు ʹదుక్కిʹ

కెక్యూబ్‌ వర్మ | 16.06.2018 09:22:29am

కవితలనిండా రైతు జీవన చిత్రమే. ఒక దు:ఖార్తితో కొనసాగుతుంది. కురవని వానలు కలసిరాని కార్తెలు అప్పుల ఊబిలు కాడెద్దులను దూరం చేసే యంత్రాల దాష్టీకం అక్కరకు రాని ప...
...ఇంకా చదవండి

కుందాపన

కెక్యూబ్ వర్మ | 04.01.2018 01:31:58pm

ఈ కవిత్వం నిండా పరచుకున్న దాహం ఒంటరితనం.సమూహంలో తను నిలబడ్డ చోటు ఒంటరిగా ఒక దీపపు సమ్మెకింద నీడలా వెంటాడడాన్ని మనకనుభవంలోకి తెస్తుంది.కలసి నడవాల్సిన దారు......
...ఇంకా చదవండి

ఒంటరి వెన్నెల

కేక్యూబ్ వ‌ర్మ‌ | 07.05.2016 08:29:33am

ఈ ఇప్ప పూల వనం రాలిపోతూ నిబ్బరాన్ని వదిలి నివురు కప్పుకుంది తూరుపింకా తెలవారక నీ పేరు తలుస్తూ పొలమారుతొంది...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌
  భారత విప్లవోద్యమంలో చారుమజుందార్ శతజయంతి సదస్సు
  విరసం నాయకుడు జగన్‌పై అక్రమంగా పెట్టిన ఉపా కేసు ఎత్తివేయాలి
  అరుణతార అక్టోబర్ 2019
  మనమూ తేల్చుకోవాల్సిందే
  ఏవోబీ నెత్తురు చిందుతోంది
  అసహజ మరణాలు సమాజానికి హెచ్చరికలు అంటున్న కథ ʹ డోలిʹ
  ఎవరామె?
  స్వైర విహారం
  హిందూత్వసాంస్కృతిక దాడికి వ్యతిరేకంగా సాంస్కృతిక ప్రతిఘటనా దినాన్ని జరుపుకుందాం
  నీకు నేనంటే కోపమెందుకు ?
  రేయి బంగారు మధుపాత్రలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •