ఒక మంచి రాజనీతి కథ

| సాహిత్యం | క‌థ‌లు

ఒక మంచి రాజనీతి కథ

- పలమనేరు బాలాజీ | 16.07.2019 09:19:27pm

తెలుగు కథల్లో రాజకీయ అవగాహనతో వ్యవస్థని చిత్రిస్తూ రాసిన కథలు చాలా ఉన్నాయి. వాటిల్లో రాజకీయ అవగాహన ఉన్న రచయితలకు, లేని రచయితలకు తేడా ఉన్నట్లే వారి రచనల్లో కూడా వారు చూపించిన దృశ్యాలు వేర్వేరుగా ఉంటాయి. పరిణితి చెందిన రచయిత స్పష్టమైన అవగాహనతో రాజకీయ లోతుపాతుల్ని అర్థం చేసుకున్న వ్యక్తిగా సమాజాన్ని చిత్రంచే తీరు సాధారణ కథలకు భిన్నంగా ఉంటుంది. అంతే కాదు, సత్యానికి దగ్గరగా ఉంటుంది. అలాంటి కథలు చదువుతున్నప్పుడు రచయిత కంఠస్వరాన్ని, కథాంశాన్ని, రచయిత వాడినబాషను, ప్రతి పదాన్ని, వాఖ్యాన్ని కనుక స్పష్టంగా అర్థం చేసుకో లేకపోతే ఆ కథలు తప్పుడు సంకేతాలు చూపిస్తాయేమో అని సగటు పాఠకులు భ్రమపడే అవకాశం ఉంది. ప్రతి కథతో రచయితతో పాటు పాఠకుడు కూడా ఎదుగుతాడు. ఇక్కడ కథ అంటే మంచి కథ అని అర్థం. ప్రతి మంచి కథను చదివి రచయిత దృష్టిని కథలో చెప్పిన విషయాలతో పాటు కథలో రచయిత చెప్పని, సూచించిన అనేక విషయాల్ని, కథలో సూచనప్రాయంగా చెప్పిన అంశాలను పాఠకుడు రచయిత కంఠస్వరాన్ని అనుసరించి అర్థం చేసుకోగలుగుతాడు. కొందరు రచయితలు కంఠస్వరాన్ని ప్రతి కథలో మార్చుకుంటూ వెళ్తారు ,మరికొందరు ఒకే కంఠస్వరంతో అనేక కథలు రాసి పాఠకుల్ని మెప్పించిన వారూ ఉన్నారు.

ముఖ్యంగా కథావస్తువు విషయానికి వచ్చినప్పుడు కథల్లోని పాత్రల్ని గమనించినప్పుడు మూస వస్తువులు మూస పాత్రలు చికాకు కలిగిస్తాయి. సాధారణ పాఠకుడు సామాజిక స్పృహ లోపించిన కథల్ని సత్యదృష్టి లేని చవకబారు కథల్ని సహించగలడడు, భరించగలడు, చదివి ఆనందించగలడేమో,కానీ సీరియస్ సాహిత్యాన్ని చదవడానికి అలవాటు పడిన ఏ పాఠకుడు కూడా కంఠస్వరం సవ్యంగా లేని కథల్ని,సామాజిక దృష్టి లోపించిన కథాంశాల్ని భరించలేడు. కొత్త పాటలు కొత్త పాఠకులు కథలను చదివినప్పుడు, కొత్త రచయితలు కొత్తగా చదివినప్పుడు మొదటిసారి ఆయా కథల్ని అర్థం చేసుకోవడంలో వైవిధ్యంగా ఉంటుంది.

ముఖ్యంగా తనకు పరిచయం లేని వ్యవస్థ గురించి తనకు పరిచయం లేని సామాజిక వర్గాల గురించి వ్యక్తుల గురించి కథలు చదివినప్పుడు పాఠకుడు ఒక వాతావరణాన్ని అర్థం చేసుకునే క్రమంలో లో సామాజిక వాస్తవాన్ని గుర్తించే క్రమంలో సరైన దారిలో కనుక వెళ్ళినట్లయితే కథకు దూరంగా దారి తప్పే అవకాశం ఎంతైనా ఉంటుంది. అలాంటప్పుడు అలాంటి పాఠకులు దారి తప్పకుండా తన వెంట సరైన పద్ధతి ద్వారా పాఠకుల్ని నడిపించడం రచయితకు తన శైలి ద్వారా సాధ్యపడుతుంది ఈ నేపథ్యంలో లో రచయిత శైలిని, శిల్ప విన్యాసాల్ని , కంఠస్వరాన్ని పాఠకుడు అందుకోవటానికి రచయిత కథల్ని తెలివిగా, చాకచక్యంగా మెలకువగా నడపడం చాలా కథల్లో గమనించవచ్చు.

కొత్త విషయాలు కొత్త సంఘటనలు, కొత్త పాత్రలు తెలియని వ్యవస్థ తెలియని అంశాలు పాఠకుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అదే సమయంలో కొన్ని కొన్ని అయోమయానికి గురిచేస్తాయి. కొత్త ప్రశ్నలు కొత్త సందేహాలు కొత్త భయాలు కొత్త ఆలోచనలు కొత్త అనుమానాలు పాఠకులకు కలుగుతాయి. వీటన్నిటిని దాటుకుని సరైన సరైన మార్గంలో పాఠకుడు కథను అందుకోవాలంటే వివిధ స్థాయిల కు సంబంధించిన చెందిన అందరికీ అర్థమయ్యే విధంగా రచయిత ఒక మెట్టు కిందకు దిగి రాసినప్పుడు ఆ కథ సాధారణ పాఠకుడికి కూడా కొత్త ఎరుకను , స్పృహను కలిగిస్తుంది.

కథలు పత్రికల్ని బట్టి ఆ పత్రికలకు ఉన్న పాఠకుల్ని బట్టి విభిన్న వర్గాల పాఠకులకు చేరువ కావడం, కాకపోవడం జరుగుతుంది.

అందుకే రచయితలు మంచి కథల కోసం మంచి పత్రికల్ని, మంచి అంతర్జాల పత్రికల్ని ఎలా తపనతో వెతుకుతూ ఉంటారో, అంతకన్నా తపన వున్న రచయితలు తమ కథలకు సరైన స్థానం, సరైన వేదిక కల్పించడానికి రచయితలు కూడా మంచి పత్రికల్ని వెతుకుతూ ఉంటారు. అలా ఎంచుకునే నిరంతర ప్రయత్నం లో కొందరు సఫలం అవుతారు. మరికొందరు విఫలం అవుతారు. ఎంత మంచి కథ అయినా మంచి పాఠకులకు చేరువైనప్పుడే బతుకుతుంది. ఆయా కథలు ఆ తర్వాత కథ సంపుటాలు, సంకలనాల రూపంలో తిరిగి ప్రచురించబడినప్పుడు ఆ కథలు విస్తృతంగా పాఠకులకు చేరువవుతాయి.

అప్పుడు ఆ కథలను చదివి అర్థం చేసుకునే క్రమంలో పాఠకులకు వారు కథను చదివే పద్ధతి కథను అర్థం చేసుకునే విధానం వల్ల వారికి ఆ కథల పట్ల సంతృప్తి లేదా అసంతృప్తి కలుగుతుంది. ఈ క్రమంలో లో శ్రీ యం.వి. రామిరెడ్డి గారు రాసిన ʹ కొండ అద్దమందు ʹ అనే కథను ఇక్కడ పరిశీలించినప్పుడు కథతో, కథకుడి వెంట సరిగ్గా నడవక పోతే వ్యవస్థను ఎలా అర్థం చేసుకోలేడో తెలిసి వస్తుంది.

నిజానికి మన దేశం లో కాంట్రాక్టర్ల వ్యవస్థ విచిత్రమైనది. పైకి కనపడదు కాని ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన పరోక్ష భాగస్వామిగా ఉంటూనే, రాజకీయ నాయకుల ఎదుగుదలకు, తద్వారా తమ ఆర్ధిక స్థాయి పెంపుదలకు ప్రత్యక్షంగా కారణమవుతూ ఉంటుంది.

అభివృద్ధి పేరిట జరుగుతున్నదంతా అభివృద్ధి కాదని అభివృద్ధికి అర్థం ఎవరి పరిధిని బట్టి ఎవరి స్థాయిని బట్టి మారుతూ ఉంటుందని తెలియని వారికి వ్యాపారానికి వ్యవహారానికి రాజకీయానికి మధ్యగల హీనమైన అంతర్గత సంబంధాలు అర్థం అయ్యే అవకాశం లేదు. ఇంజనీర్లు సాధారణ వ్యక్తులను బడా కాంట్రాక్టర్లు గా మార్చగలరు. ఆ కాంట్రాక్టర్లే ఆ తర్వాత రాజకీయ ప్రాపకం కోసం రాజకీయాల్లోకి రావడం, పరోక్ష రాజకీయాల్లో పాల్గొనడం, రాజకీయ నాయకులకు పరోక్షంగా మద్దతు ఇవ్వడం ,అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి కాంట్రాక్టర్లు సునాయాసంగా రావటం , నేటి కాంట్రాక్టర్ రేపటి రాజకీయవేత్త కావటం అనేది ఒక చారిత్రక సత్యం. గుత్తేదారు అంటే కాంట్రాక్టర్, వ్యవహార దక్షత కలిగిన వ్యాపారవేత్త అయిన కాంట్రాక్టరు డబ్బంటే ఆశపడే ఇంజనీరు కలిస్తే ఎక్కడి పనులు వేగంగా సాగుతాయో, ఎక్కడ ఆగుతాయియో, పునః ప్రారంభం అవుతాయో, ఎక్కడ మలుపు తిరుగుతాయియో, ఎక్కడ కొండ ఎక్కుతాయో లేక కొండ దిగుతాయో చెప్పిన కథ "కొండ అద్దమందు..."

పెద్ద ఇంజనీరు పెద్ద గుత్తేదారు కలసి చేసే పనికి రాజకీయ అండదండలు లేకపోతే ఏమవుతుందో కథకుడు కథ చివర్లో చెబుతాడు. అభివృద్ధికి అది అభివృద్ధి అయినప్పటికీ రాజకీయ అండదండలు లేకపోతే , అభివృద్ధి కొనసాగాలంటే అధికారులు కాంట్రాక్టర్లు మాత్రమే సరిపోరని ,అధికారులు కాంట్రాక్టర్లు రాజకీయ నాయకుల మధ్య లోపాయికారి ఒప్పందం కనుక లేకపోతే ఎక్కడికక్కడ ఎలాంటి పెద్ద పనులు అయినా ఎలా ఆగిపోతాయో, అవే అవాంతరాలను కాంట్రాక్టరు తనకు కావాల్సింది , రావాల్సింది పూర్తయ్యాక ఎలా తప్పిస్తాడో ఈ కథలో గమనించవచ్చు.

అధికారుల వల్ల కాని పనిని రాజకీయ నాయకుల అనుమతితో అదనపు మొత్తానికి ప్రభుత్వం ఇచ్చిన అనుమతి పత్రం తెచ్చి చీఫ్ ఇంజనీరు చేతిలో కాంట్రాక్టరు ఇచ్చినప్పుడు అతడి మొహం లో ʹ కొండంత ఆశ్చర్యo ʹఅంటాడు రచయిత.

ఆగిపోయిన పని మళ్ళీ మొదలైంది. 15 రోజుల్లో రోడ్డు పనికి అడ్డు వచ్చిన కొండ నేలమట్టమైంది. అదనపు నిధులు కావాల్సి రావడం మొదటి అవాంతరం కాగా, ఆ అవాoతారాన్ని గుత్తేదారు సునాయాసంగా అధిగమిస్తాడు.ʹ అదనపు మొత్తానికి కావలసిన అనుమతి పత్రాన్ని చీఫ్ ఇంజనీర్ చేతిలో పెట్టగానే అతడి మొహంలో కొండంత ఆశ్చర్యం .

మళ్లీ పని మొదలైంది బాంబులతో కొండను పేల్చడం క్రేన్లతో బండ రాళ్ళను తొలగించడం , వాటిని దూరంగా తరలించడం... ముమ్మరంగా పనులే పనులు.

15 రోజుల్లో కొండ నేలమట్టం అయింది. రెండు చెరువుల మధ్యలోంచి నల్లటి తాచుపాములా నిగనిగలాడే తారు రోడ్డు దూసుకుపోయింది.

అడవి దాటాక ఓ గ్రామంలో భూసేకరణ పూర్తి కాని కారణంగా రోడ్డు పని మళ్లీ ఆగిపోయింది.గుత్తేదారు అధికారులపై ఒత్తిడి తెచ్చాడు. అధికారులు గ్రామానికి చేరుకొని చర్చలు జరిపారు. గ్రామస్తులు వినలేదు ఎదురుతిరిగారు. అయినా ఆందోళన అంతకంతకు పెరిగి పోయింది.

అధికారులు చేతులెత్తేశారు. గుత్తేదారు నవ్వాడు, ఇదీ ఒక సమస్యేనా అన్నట్లు! ఆనక అధికారులకు హితబోధ చేశాడు. వారికి సారం బోధపడింది .ఈసారి ధైర్యంగా వెళ్ళి పక్క గ్రామం లో మకాం వేశారు .అధికార ప్రతిపక్ష నాయకులను విడి విడిగా పిలిచి మాట్లాడారు.

ఆ తర్వాత కులాలవారీగా నలుగురు పెద్దలను పిలిచి చర్చలు జరిపారు. ఫల ప్రదం అయ్యాయి. ఆ గ్రామస్తులు ప్రభుత్వం ఇచ్చే పరిహారం ప్రసాదం స్వీకరించి స్థలాలను వదులుకున్నారు. అధికారులు ఆనందంతో మురిసిపోయారు. గుత్తేదారు స్థితప్రజ్ఞతను కోల్పోలేదు. రహదారి యాత్ర కొనసాగింది.ʹ ఇదీ కథనం .

ఈసారి ఎన్విరో ప్రొటెక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే 400 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న ప్రైవేట్ కంపెనీ ఎండి తనేదో, తన వ్యాపారమేదో చూచుకునే అతడు మొదటిసారి నాయకులను కలసి వచ్చింది బతిమిలాడాడు.

పర్యావరణానికి మేలు చేసే తన వ్యాపారం ద్వారా చాలా మంది ఉపాధి పొందుతున్నారు అని చెప్పాడు అంతకుమించి రహదారుల రహస్యాలు తెలియని అతగాడికి నిరాశే ఎదురైంది.

ఆ రహదారి తన కంపెనీ నుంచి వెళ్లే మార్గాన్ని పక్కదారిపట్టించ లేక పోయాడు. అతను వెళ్లి గుత్తేదారుని కలిశాడు. మా కంపెనీ మూత పడితే వందల కుటుంబాలు రోడ్డున పడతాయి ప్లీజ్ మార్గం చెప్పండి అని బతిమలాడాడు ఎం.డి. గుత్తేదారు కరుణామయ హృదయం కదిలింది ఉపాయం చెప్పాడు.

స్వచ్ఛత గురించి, తెల్లదనం గురించి ఏవేవో మాట్లాడుతూ మధనపడ్డాడు ఎండి.ʹమెట్లు దిగుతూʹ వెళ్లిపోయాడు. కథలోని కీలకమైన మలుపుల్లో ఇదొకటి.

మంత్రిగారి మేనల్లుడిని కలవడంతో వారం తిరక్కుండానే అలైన్మెంట్ మారింది. కంపెనీ కి అవతల వైపు గా రహదారి నిర్మాణానికి అనుమతి లభించింది. ఫలితంగా కిలోమీటర్ల విస్తీర్ణం పెరిగింది. మళ్ళీ వినయంగా ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ మేరకు గుత్తేదారు ధర పెంచుకున్నాడు . మంత్రి గారి మేనల్లుడితో పాటు గుత్తేదారు పట్ల కృతజ్ఞతను కాస్ట్లీగా చాటుకున్నాడు.

ఇక్కడ కాస్ట్లీగా అనే ఒక పదాన్ని అర్థం చేసుకో లేకపోతే పాఠకుడికి గుత్తేదారు నడిపిన రాజకీయం పట్ల అతనికి లభించిన లాభం పట్ల సమాచారం అర్థం చేసుకునే అవకాశం ఉండదు. ఒక పదాన్ని గనుక గమనించనట్లయితే ఈ వ్యవహారం మొత్తంలో డబ్బులు చేతులు మారిందనే విషయాన్ని గమనించే అవకాశం లేదు .

ʹ ఎండి రాజి పడ్డాడు, మెట్లు దిగుతూ వెళ్ళిపోయాడు ʹఅని ఓకే ఒక వాక్యంలో వ్యాపారవేత్త రాజకీయవేత్త కలిసి పన్నిన పన్నాగంలో తన వ్యక్తిత్వాన్ని పక్కనపెట్టి ఎండి రాజీ పడ్డాడు అనే ఒక్క వాక్యాన్ని కనుక అర్థం చేసుకోకపోయినా, మెట్లు దిగుతూ వెళ్లిపోయాడు అనే వాక్యాన్ని గమనించక పోయినా ఎండి తన వ్యక్తిత్వాన్ని చంపుకున్నాడు అనే విషయం పాఠకుడు మిస్ అవుతాడు. కథను చదివే క్రమంలో రచయిత కంఠస్వరాన్ని అర్థం చేసుకోవడంతోపాటు అతడు వాడిన పదబంధాలను సరిగ్గా గమనించాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని పద ప్రయోగాలు ఆ పాత్రలో వచ్చిన మార్పుని సూచిస్తాయి. అలా సూచించడానికి వాక్యాలు వాక్యాలు రాయాల్సిన అవసరం లేదు. రచయిత వ్యాఖ్యానం అసలే అవసరం లేదు. వాచ్యంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పదాన్ని సక్రమంగా అర్థం చేసుకో గలిగితే కథలోని మలుపు పాత్రలోని మార్పు పాఠకుల దృష్టికి ఆనుతుంది. ఒకవేళ గనుక ఆ పదాన్ని గమనించనట్లయితే తన ధోరణిలో తన అవగాహన మేరకు పాఠకుడు కథను అపసవ్యంగా అర్థం చేసుకునే ప్రమాదం ఏర్పడుతుంది.
మళ్లీ ఈ కథ లోకి వస్తే..

కొత్తగా జాతీయ రహదారి ఏర్పాటు అవుతుందని చెబుతూ కొత్త వెంచర్ను ప్రారంభిస్తారు. అంతర్గత రహదారులు వేస్తారు. చెట్లు పెంచుతారు. జనం ఎగబడతారు. సరిగ్గా ఆ ముఖ ద్వారం ఎదురుగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వస్తుంది అన్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. అంతే! అమ్మకాలు నిలిచిపోయాయి. నలుగురు భాగస్వాములు తలలు పట్టుకున్నారు. వాళ్లు కూడా గుత్తేదారు వద్దకు వచ్చి కాళ్లు చేతులు పట్టుకుంటారు.

ఎమ్మెల్యే గారి మనవడి విదేశీ చదువుకి ఫ్లైఓవర్ స్థానచలనానికి లింక్ ఏంటో వాళ్లకు అంతుబట్టలేదు అనే ఒక్క వాక్యం అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది అక్కడ రావాల్సిన ఫ్లైఓవర్ నూతన రహదారి మీద ఎలా ముందుకు జరిగింది అన్న విషయం అర్థం కాదు. ప్రతి సమస్యకు వెనుక అదృశ్యo గా ఉంటాడు.
ఇక్కడ అ ఒక్క వాక్యాన్ని గమనించండి.

"ప్రతి మజిలీలోనూ తన బిల్లుకు పోషకాహారం అందించాడు". అంటాడు రచయిత.

ఎట్టికేలకు రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఫైనల్ బిల్లు కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు గుత్తేదారు. ఎక్కడో పొగ లేచింది. వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ,రహదారి నిర్మాణం పై ఒక సామాన్య పౌరుడు కోర్టుకెక్కాడు. అయితే ఇదే విషయం రాజకీయ నాయకుల మధ్య కూడా అసెంబ్లీ సాక్షిగా చర్చకు దారి తీస్తుంది. అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. నాయకులతో పాటు ప్రజలు కూడా శక్తివంచన లేకుండా ఆ విషయం గురించి మర్చిపోయారు అంటాడు రచయిత.

ఆ తర్వాత ప్రభుత్వం ప్రభుత్వం నుంచి రావాల్సిన చిల్లర పైసలు తో సహా గుత్తేదారు చేతుల్లోకి చేరింది .భారతీయ సమాజం పట్ల తనకున్న వినయ విధేయతలను గౌరవిస్తూ అతను ఈ సారి పైకి నవ్వలేదు - అంటాడు రచయిత

కనిపించని మంచు ఆవరించిన ఆ గదిలో గుత్తేదారు, అతని కొడుకు కూర్చుని ఉన్నారు అంటాడు రచయిత. ఇక్కడ కనిపించని మంచు ఏమిటో అర్థం చేసుకుంటే తప్ప గుత్తేదారు స్వభావం అతడి కొడుకు స్వభావం వాళ్ళిద్దరి పరిస్థితి పాఠకులకు అర్థం కాదు. గదిలో కనిపించని మంచు ఏమిటి ? ఏమిటి ఆ కనిపించని మంచు కథ ?
గుత్తేదారు చేసిన రెండు రాష్ట్రాలను కలుపుతూ నిర్మించిన రోడ్డును ఆ చివర నుంచి చివరి దాకా ప్రతి అంగుళం నెల రోజుల పాటు పరిశీలించిన అతని కొడుకు స్పెషల్ నోట్సును తయారు చేసి తండ్రి ముందు ఉంచుతాడు. కొన్ని సందేహాలు ఉన్నాయి అని అంటే తండ్రి అనుమతి తీసుకొని తన సందేహాన్ని బయట పెడతాడు. మొదట రూపొందించిన రూట్ మ్యాప్ ప్రకారం ఆ రోడ్డు ఎన్విరో ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య నుంచి పోవడం లేదు. అలాగే ఫ్లైఓవర్ రియల్ ఎస్టేట్ వెంచర్ మెయిన్ గేటు దూరంగానే ఉంది. వర్క్ జరగబోయే ముందు రిలీజ్ చేసిన రూట్ మ్యాప్ లో మార్పులు జరిగాయి ఎందుకలా అని ప్రశ్నిస్తాడు. గుత్తేదారు గారు అతని ప్రశ్నలన్నింటికీ చిరునవ్వుతో సమాధానాన్ని అందిస్తాడు.

ఆ కంపెనీ ఎండి మన మంత్రి గారి మాట వినడం లేదు, తన నియోజకవర్గంలో వెంచర్ వేస్తున్నారు కాబట్టి తన కొడుక్కి పార్ట్నర్షిప్ ఇవ్వమని అడిగితే ఆ నలుగురు ఒప్పుకోలేదట దాంతో సదరు ఎమ్మెల్యే గారికి విపరీతమైన కోపం వచ్చింది .ఆ కొడుకు ఇలా తన సందేహాన్ని అడుగుతాడు
" వావ్, అండర్స్తుడ్ డాడ్. కానీ ఆ కొండ విషయమే నాకు మిస్టరీగా ఉంది.."

గుత్తేదారు పెద్దగా నవ్వాడు. కుర్చీలోంచి లేచి కిటికీ దగ్గరగా వచ్చి పగలబడి నవ్వాడు. కొడుకు అయోమయంగా చూశాడు.

ʹప్రతి మన బ్యాంక్ అకౌంట్ లోకి ఆపర్చునిటీ గా మార్చుకోవాలి. ఒక్కోసారి అవాంతరమే ఉండకపోవచ్చు. అయినా మనం సొమ్ము చేసుకోవాలిʹ
అర్థం కానట్టు ప్రశ్నార్థకంగా చూశాడు కొడుకు.

గుత్తేదారు నవ్వడం ఆపి అసలు విషయం చెప్పాడు.

" పిచ్చివాడా.. అసలక్కడ కొండే లేదు"

ప్రజాసాహితీ ఆగష్టు 2016 సంచికలో అచ్చయిన ఈ కథ ʹ వెంట వచ్చునది ʹఎంవీ రామిరెడ్డి గారి కథా సంపుటిలో తిరిగి అచ్చయింది.

ఒకటి రెండు పదాల్ని లేదా పదబంధాన్ని వాక్యనిర్మాణాన్ని అర్థం చేసుకో లేకపోతే ఈ కథంతా కేవలం కాంట్రాక్టరు తెలివి తేటలకు సంబంధించిన కథగా పొరబడే అవకాశం ఉంది. స్పృహతో ఎరుకతో చదివినప్పుడే ఏ కథ అయినా సంపూర్ణంగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. కథను చదివి పద్ధతిలో చదవకపోయినా , సంభాషణల్ని కథనాన్ని జాగ్రత్తగా అనుసరించాల్సినది అనుసరించక పోయినా , ఎక్కడ అప్రమత్తంగా లేకపోయినా రచయితను అందుకోవడం కష్టం అవుతుంది. ఈ కథ నిజానికి వ్యంగ్య ధోరణి తో సమాజంలోని నీతిని ప్రశ్నిస్తూ మొత్తం వ్యాపారమయమై , కుట్రలతో నిండిపోయిన మనిషి మనిషి కాకుండా పోవటం ,మనిషి వ్యాపార వేత్త, దళారి కావటాన్ని సూచించిన కథ.

ఇక్కడ అ కాంట్రాక్టర్ నిజానికి కాంట్రాక్టర్ మాత్రమే కాదు. అతడు రాజకీయ చతురత కలిగిన వ్యూహకర్త. ఒక దళారి, ఒక వ్యాపారవేత్త. ప్రతి దాన్ని వ్యాపారం చేసి తద్వారా లాభం పొందడానికి అలవాటుపడిన స్వార్థపరుడు. సమాజంలోని కుళ్లును రాజకీయం లోని లోతుపాతుల్ని చక్కగా అర్థం చేసుకున్నాడు కనకే రచయిత విమర్శనాత్మకమైన కథనంతో ఆలోచనాత్మకమైన కథను నడిపించగలిగాడు. ఈ కథ ఇక్కడితో ముగియదు. ఎన్నో కథలకు ఇదొక ప్రారంభం అని అని అర్థం చేసుకోగలుగుతాడు పాఠకుడు. పేజీలు అయిపోయాయి కదా అని ఎక్కడా కథలు ఆగవు. మంచి కథకుడు వాచ్యంగా చెప్పడు చూపిస్తాడు, సూచిస్తాడు అని అంటారు. ఈ విధంగా అడుగడుగునా వ్యవస్థలో, మనిషిలో పేరుకుపోతున్న రాజకీయాన్ని దళారీ తనాన్ని వ్యాపార తత్వాన్ని నగ్నంగా చూపించిన ఈ కథలో ప్రతి పదం ముఖ్యమైనది, అనివార్యమైనది. ఆయా పదాలు, ఆయా పాత్రల స్వభావాన్ని, కథ నడిచే విధానాన్ని తెలియ చెప్పిన తీరు ప్రతి పదం విలువని అర్థాన్ని ప్రయోజకత్వాన్ని తెలియజేస్తుంది. కొత్తగా కథలు రాయాలనుకునే పాఠకులు కానీ, కొత్తగా కథలు చదవడం ప్రారంభించిన వారు గాని కథను రాయటానికి ,చూపటానికి గల తేడాని గమనించాలంటే, పదాల పొందికను ఈ కథ అందుకు చక్కటి ఉదాహరణ.

ఇదంతా చదివాక కథ రాయడమే కాదు , శ్రద్దగా చదవడం కూడా ఒక కళేనేమో అనిపిస్తుంది !

No. of visitors : 801
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


పరిమళం , పదును రెండూ వున్నకవిత్వం – చేనుగట్టు పియానో

పలమనేరు బాలాజీ | 04.02.2017 02:37:03am

కవి పాలక పక్షం, రాజ్యం పక్షం, వహించకుండా ప్రజా పక్షం వహిస్తున్నాడని ప్రజల ఆగ్రహాన్ని,ఆవేదనల్ని, ప్రశ్నల్ని,నిరసనల్ని తన గొంతుతో వినిపిస్తున్నాడని .......
...ఇంకా చదవండి

ʹనారుమడిʹ మళ్ళీ మళ్ళీ చదివించే మంచి క‌విత్వం

పలమనేరు బాలాజీ | 18.01.2017 11:47:15pm

కాలం గడచినా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి చదవాలని అనిపించే మంచి కవితా సంపుటాల్లో ʹ నారుమడి ʹ ఒకటి. యెన్నం ఉపేందర్ ( డాక్టర్ వెన్నం ఉపేందర్ )అటు కథకుడిగా , యిటు కవి...
...ఇంకా చదవండి

సాహిత్య విమర్శకు కొత్త బ‌లం

పలమనేరు బాలాజీ | 04.03.2017 09:54:02am

ఈ పుస్తకం లో వ్యక్త పరచిన అభిప్రాయాల్లో రచయిత ఎక్కడా సహనం కోల్పోలేదని, సాహిత్య అంశాల పట్ల రచయితకు గల ఆసక్తి ,నిబద్దత,స్పష్టతే ఇందుకు కారణాలని, విభేదించే...
...ఇంకా చదవండి

ఖాళీ ఇల్లు,ఖాళీ మనుషులు

పలమనేరు బాలాజీ | 01.06.2016 11:57:12am

నమ్ముకున్న కలల్ని గాలికొదలి ఇల్లు వదిలి, ఊరు వదిలి పిల్లల్ని వదిలి, సహచరుల్ని వదిలి...
...ఇంకా చదవండి

మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ

పలమనేరు బాలాజీ | 05.09.2019 01:00:59pm

ʹ వీడికి వందకి వంద మార్కులు రావలసింది , కానీ తొoతొమ్మిదే వచ్చాయిʹ అప్పుడు ఒకే ఒక్క మార్కు కోసం ఇంత హైరానా పడి రావాలా అని ? అని అడుగుతాడు సైకాలజిస్టు......
...ఇంకా చదవండి

మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ

పలమనేరు బాలాజీ | 03.08.2019 11:39:20pm

మనిషికి, మట్టికి మధ్య వున్న అనుభందం విడదీయరానిది . మట్టి మనిషిని చూస్తున్నాం, విoటున్నామని అనుకుంటాం కానీ, నిజానికి మట్టి మనిషిని నిజంగా సంపూర్ణంగా ......
...ఇంకా చదవండి

స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ

ప‌ల‌మ‌నేరు బాలాజీ | 03.05.2019 03:22:15pm

ఆశావాద దృక్పథంతో మంచి సమాజం కోసం ఒక ఆధునిక స్త్రీ పడే తపనను ఈ కవిత్వం తప్పక చెపుతుంది. పసిబిడ్డల నుండి ముసలివాళ్ళు వరకు అన్ని ప్రాంతాల్లో స్త్రీలపై జరుగ...
...ఇంకా చదవండి

మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ

పలమనేరు బాలాజీ | 16.08.2019 09:24:03pm

సాధారణంగా బిడ్డల వల్ల తల్లులు బాధలు పడే కథలు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి . తల్లి, బిడ్డలకు సంబందించిన కథలు కొన్ని వేల సంఖ్యలో వచ్చింటాయి. వృద్ధాప్యదశకు చేర.....
...ఇంకా చదవండి

కథల గూటి లోని ఒక మంచి కథ నల్లూరి రుక్మిణి గారి "ఎవరిది బాధ్యత"

పలమనేరు బాలాజీ | 02.12.2019 11:35:29pm

థను శ్రద్ధగా చదివే వాళ్ళకి మానవ మనస్తత్వం లోని వైరుధ్యాలను, సంఘర్షణలను రాజీతత్వాన్ని, ప్రశ్నించే గుణాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. వ్యక్తిగత సంపద పట్ల.....
...ఇంకా చదవండి

అసహజ మరణాలు సమాజానికి హెచ్చరికలు అంటున్న కథ ʹ డోలిʹ

పలమనేరు బాలాజీ | 17.09.2019 08:46:21am

భారతదేశంలో స్థల కాలాలను బట్టి కులాన్ని బట్టి సామాజిక స్థితిగతులను బట్టి చావుకు అర్థం, విలువ మారిపోతూ ఉంటుంది. అంతో ఇంతో ఉన్నవాడి చావుకి ,గొప్ప వాడి .....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •