సాహిత్యం, శ్రామిక సంస్కృతి సహబాటసారులు

| సంభాషణ

సాహిత్యం, శ్రామిక సంస్కృతి సహబాటసారులు

- ప్రజావాణిʹ (కన్నడ) పత్రిక | 16.07.2019 11:13:00pm


బళ్ళారిలో ʹబండాయ సాహిత్య సంఘటనʹ నిర్వహించిన ʹజనం- కన్నడ సాహిత్యంʹ గురించిన రాష్ట్రవ్యాప్త వర్క్‌షాప్‌కి వచ్చిన నవలా రచయిత్రి నల్లూరి రుక్మిణి ʹప్రజావాణిʹ ఆదివారం సంచికతో మాట్లాడారు.

ʹʹజనం శ్రమ నుంచే సాహిత్యం పుట్టింది. ఆదిమానవుని తొలి అభివ్యక్తి నుండే కళ, నాట్యం, సంగీతాలు వచ్చాయి. వారు చెప్పుకున్న మూగభాషే లిపికి నాంది అయింది. భాషే సరిగ్గా ఏర్పడని ఆ కాలంలో జనానికి సంస్కృతి, సాహిత్యం అన్న ఊహే లేదు, అయితే వారినుండి పుట్టిందే సాహిత్యం. ఆ కాలం, ఈ కాలం, ఏ కాలమైనా సాహిత్యం ఎప్పుడూ ప్రజాక్షేమం కోరుతూ రావాలి. జనం నుంచి, జనం కోసం వుంటేనే ఆ సాహిత్యానికి విలువ.ʹʹ

తెలుగునాట విరసంకి చెందిన రుక్మిణిగారు స్పష్టంగా చెప్పిన మాటలివి. సాహిత్యం, శ్రామిక సంస్కృతి సహబాటసారులనే నమ్మికతోనే ఆమె జీవిస్తున్నారు.

ʹʹసాహిత్యం ఎల్లప్పుడూ ప్రజాస్వామ్య ఆశయాలను ఎత్తి చూపించాలి. సాహిత్యం రాసేసి ఊరకుంటే చాలదు. సమకాలీన ప్రజా సమస్యలకి స్పందించకపోతే దానివల్ల ఎవరికి ఏం లాభమనే ప్రశ్న పదేపదే పుడుతూనే వుంటుంది.ʹʹ

ప్రజావాణి : రచయిత కాకముందు మీ పోరాటం ఏ విధంగా వుంది?


రుక్మిణి : ప్రకాశం జిల్లా చీమకుర్తి నా పుట్టినూరు. నల్లూరి మా ఇంటిపేరు. అక్కడే 8వ తరగతిదాకా, తర్వాత గుంటూరులో మెట్రిక్‌ వరకూ చదివాను. అక్కడే ప్రభుత్వ మహిళా కళాశాలలో చేరాక వామపక్ష ఆలోచనలు నన్ను ప్రభావితం చేసాయి.

హోటళ్లలో పదార్థాల అధిక ధరల గురించి, త్రిభాషా సూత్రం అమలుకి విరుద్ధంగా జరిగిన ఇలాంటి అనేక పోరాటాలలో ఆనాడు పాల్గొన్నాను.

కమ్యూనిస్టు ఉద్యమాలలో భాగం వహించాను. గూడవల్లి నాగేశ్వరరావు, సాంబయ్య, కె. నారాయణ నా సమకాలికులు. కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి విభాగంలో పనిచేసాను. నేను సిపిఐ, ఎఐఎస్‌ఎఫ్‌ కార్యకర్తని. క్రమంగా తరవాత కాలంలో విప్లవ కార్యకర్తగా మార్పు చెందాను.

ప్రజావాణి : పోరాటంలోనే మీ వివాహం అయిందికదా?


రుక్మిణి : అవును, నా పోరాట సహచరుడు సి.యస్‌.ఆర్‌. ప్రసాద్‌నే పెళ్లాడాను. తను విరసంలో సీనియర్‌ సభ్యుడు. అప్పటికి నాకు 19 సం||లు, తనకి 25 సం||లు.

కులవ్యవస్థను, కట్నాలను వ్యతిరేకించే మా ఆలోచనలు ఒకటయ్యాయి. అయితే మా ఇళ్లలో మా వివాహానికి ఒప్పుకోలేదు. గుంటూరులో దండలు మార్పిడి పెళ్ళి నిరాడంబరంగా జరిగింది. కె.వి.రమణారెడ్డి, బీనాదేవి నేతృత్వం వహించారు. పెళ్లయ్యాక అమరావతిలో కాపురం పెట్టాం. ఒక ఏడాదిలోగానే గుంటూరు వచ్చాం. మా ఇద్దరు పిల్లలు వర్గీస్‌, రాహుల్‌ కులాంతర వివాహం నిరాడంబరంగా చేసుకున్నారు. మాది దండలపెళ్లి కుటుంబం.

ప్రజావాణి : కార్యకర్తగా వున్న మీరు రచయిత్రి ఎలా అయారు? ఏమిటి ప్రేరణ?


రుక్మిణి : నేను రచయిత్రి అనుకోటంకన్నా కార్యకర్తనని చెప్పుకోవటానికే, అలా వుండటానికే ఇష్టపడతాను. చాలా కాలం కార్యకర్తగా పనిచేసినా సాహిత్యం ఎక్కువగా ఏమీ చదవలేదు. అయితే ఒకమారు గట్టిగా అనిపించింది. నేనింత పనిచేసినా, ప్రజలలో రచయితలకు మాత్రమే ఎక్కువ గుర్తింపు వుంది. కనక నేనూ ఏదైనా రాయాలని!

అయితే ఏం రాయాలీ, ఎలా రాయాలీ అన్నది తెలియలేదు. ఆనాటికి స్త్రీవాదం ఆరంభదశ. మహిళలు అణిచివేతకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. అప్పుడు నేను రాత ఆరంభించాను. నా పోరాట జీవితమే నాకు రాసే తోవనీ, వస్తువునీ యిచ్చింది. పోరాటంలో ఎదురైన అనుభవాలే నా కథ, నవల, కవిత్వం.

ప్రజావాణి : మీ మొదటి కథ ʹగీతలకావలʹ గురించి చెప్పండి.


రుక్మిణి : ఆ కథ ఒక ఆశ్చర్యకరమైన సందర్భంలో పుట్టింది. మా ఇంటి పక్కన కడుతున్న ఇంటి వాచ్‌మాన్‌, అతని భార్య ప్రేరణ అయ్యారు. ఆమె మధ్యతరగతి, బాగా చదువుకున్న స్త్రీలా వుంది. అతను దళిత కులానికి చెందినవానిలా వున్నాడు. నాకు కుతూహలం కలిగింది. ఆమె అతనిని రెడ్డిగారూ అని పిలిచేది. అతను ఆమెను పేరుపెట్టి పిలిచేవాడు. వాళ్ళిద్దరు గమ్మత్తుగా వున్నారనిపించింది, వెళ్ళి మాట్లాడాను.

ఆ తర్వాత తెలిసింది. రెడ్డికి వయసు మీరడం వల్ల పెళ్ళి అవలేదు. ఆమెకి భర్త చనిపోయాడు, ఇద్దరు పిల్లలు. ఆ ఇద్దరూ కలిసి బతకాలి. అయితే సమాజం ఆ రకమైన సంబంధానికి ఒప్పుకోదు. అయినా వారిద్దరూ నిజమైన భార్యాభర్తలలా కలిసి బతుకుతున్నారు.

అదో వింత సంబంధం. ఆ కథకి మంచి గుర్తింపు వచ్చింది. నా మొదటి కథా సంపుటానికి ఆ పేరే పెట్టాను. మొదటగా, కొంతవరకు నాకు తెలిసిన, నా చుట్టూవున్న లోకం గురించి రాసాను. క్రమంగా నేను పాల్గొన్న పోరాటాలలో కనిపించినవీ, ఎదురైనవీ, సమస్యల గురించీ రాసాను.

ప్రజావాణి : విరసం ఆశయాలతో రాసిన మీ మొదటి నవలకి ʹనర్రెంక చెట్టుకిందʹ అనే పేరెలా పెట్టారు?


రుక్మిణి : అవును! ʹనర్రెంక చెట్టు కింద నరుడో భాస్కరుడోʹ పాట ఆ రోజుల్లో వి.ర.సం. ఆశయాలకు ప్రేరణగా వుండేది. గుంటూరు జిల్లాలో విప్లవపోరాటంపై నవల అది. శ్రీకాకుళ పోరాటంలో ఎన్‌కౌంటర్లో మరణించిన చాగంటి భాస్కర్రావుది గుంటూరు జిల్లా పరుచూరు గ్రామం. ఆయన స్మృతిలో శివసాగర్‌ రాసిన పాట అది. అందుకే ఆ నవలకు ఆ పేరు పెట్టాను.

ʹఒండ్రుమట్టిʹ నా రెండవ నవల. కారంచేడు గ్రామంలో దళితులమీద జరిగిన దౌర్జన్యానికి సంబంధించింది. ఆ గ్రామంలో 1985 జులై 17న ఆరు మంది దళితులను అగ్రకులంవాళ్ళు చంపారు. అది ఆంధ్రాలో జరిగిన మొట్ట మొదటి కుల ఘర్షణ. అయితే నవలలో అంతే రాయలేదు. ఆ దాడి జరగటానికి ముందు ఆ గ్రామంలో ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక మార్పులు ఎలా పరిణామం చెందాయో- దాని పర్యవసానంగా దాడికి దారితీసిన నేపథ్యం చారిత్రికంగా వివరించాను.

1930లో బకింగ్‌హాం కాలవ వచ్చే వరకూ అక్కడ కరువే వుండేది. దాని తర్వాత భూములు సారవంతమైనాయి. వ్యాపార పంటలు పెరిగాయి. దళితుల స్థితిగతులూ మారాయి. పాత ఫ్యూడల్‌ అర్థబానిస లొంగుబాటును దళితులు అంగీకరించలేదు. అయితే దాన్ని భూస్వాములూ ఒప్పుకోలేదు. దానితో గ్రామంలో ఘర్షణలు మొదలయి, చివరకు దళితుల మీద దాడులు జరిగాయి. దానితో నవల ముగించాను.

మూడవ నవల ʹనిషిధʹ చుండూరులో జరిగిన దళితుల మీద దాడికి సంబంధించినది. దీనిలో దాడికి ముందు, దాడి తరవాత దళితుల ప్రతిఘటనను చూపించాను. కోర్టులూ, చట్టాలూ మొత్తంగా రాజ్యం దళితులపట్ల చూపించే వివక్షను వివరించాను.

ప్రజావాణి : మీరు పురస్కాలు ఎందుకు పుచ్చుకోరు?


రుక్మిణి : నాకు వాటిపై ఆసక్తి లేదు. ఎందుకు అంటే ఖచ్చితంగా చెప్పలేను. పురస్కారాలలో చాలా రాజకీయాలు నడుస్తుంటాయి. అవన్నీ వద్దనుకున్నా!. మొదటిసారి అనంతపురం జిల్లా చిలుకూరి దేవపుత్ర స్మారక పురస్కారం తీసుకున్నాను.

ప్రజావాణి : కర్నాటకకి ఇంతకు ముందు వచ్చారా?


రుక్మిణి : లేదు. నన్ను రచయితగా గుర్తించి ఆహ్వానించటం ఇదే మొదటిసారి. నా నవలలు అనువాదం కాకపోవడం వల్ల- నన్ను గుర్తించే అవకాశం తక్కువ కావడమే దీనికి కారణం.

ప్రజావాణి : కర్నాటకలోని దళిత, బండాయ సాహిత్య ఉద్యమం గురించి మీ అభిప్రాయం?


రుక్మిణి : ఇక్కడ దళిత, బండాయ సాహిత్య ఉద్యమం వుందని తెలుసు అంతే, అంత పరిచయం లేదు. నిరంజనగారి ʹచిరస్మరణʹ నాకు నచ్చిన నవల.

బైరప్పగారి నవలలూ చదివాను. ʹపర్వʹ మహాభారతాన్ని చారిత్రక దృష్టితో రాసిన విశిష్ట కృతి. అయితే ఆయనలో సాంప్రదాయపు దృష్టి ఎక్కువ.

కన్నడ సాహిత్యంలో చాలా మంచి నవలలు వచ్చాయి. తెలుగులో కవిత్వ సంపుటాలు ఎక్కువ. కన్నడంలో నవలాసాహిత్యం ఎక్కువ. అందువల్లే కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు కూడా ఎక్కువ లభించాయి.

ప్రజావాణి : సాహిత్యం అంటే ఏమిటి?


రుక్మిణి : జనం మంచికోరేదే సాహిత్యం. ప్రజాస్వామ్యం అంటే జనం యొక్క, జనం కోసం, జనం చేత- ప్రజలకోసం సాహిత్యమూ ప్రజలచేత, ప్రజల యొక్కగా వుండాలి.

ప్రజావాణి : ఈనాటి సాహిత్యం అలాగే వుందా?


రుక్మిణి : లేదు. సాహిత్యాన్ని భావజాల నియంత్రణకి వాడుకోటం ప్రభుత్వం నేర్చింది. మనుస్మృతి ద్వారా నియంత్రించడంతో మొదలయి ఈనాడు అనేక పద్ధతులు కొనసాగిస్తున్నారు. భారతీయ సంస్కృతి భావజాలం మీద అనాదిగా తన పట్టును బిగించింది. జనమే జనం కోసం సాహిత్యం సృజించుకోవాలి. రచయితలు జనం పక్షాన వుంటేనే అది నిజమైన సాహిత్యమవుతుంది. సమాజాన్ని ముందుకు అడుగు వేయించేదే పురోగామి సాహిత్యం.

--- --- ---
ఆంధ్రాలో ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో ఆరుగురు దళితులని చంపేక ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ లిబర్టీస్‌ కమిటీతో నిజ నిర్ధారణ కోసం వెళ్లినవారిలో నల్లూరి రుక్మిణి ఒకరు. ఆ అనుభవాలతో తమ ʹఒండ్రుమట్టిʹ నవల రాసారు.

విభజనానంతరం ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణం కోసం విజయవాడ, గుంటూరులలోని వేలాది మంది రైతులని నిర్వాసితులను చేసే ప్రయత్నాలకి విరుద్ధంగా గొంతెత్తారు.

ప్రజాసాహిత్య ఉద్యమాలలో పాల్గొన్న ఆమె నవలలు తెలుగేతర భాషలలో అనువాదం కాకపోవడంవల్ల, విప్లవ సాహిత్యం, దళితుల మీద దౌర్జన్యాలకి వ్యతిరేకంగా నడుస్తున్న పోరాటాలలో ఆమె భాగస్వామ్యం ఆంధ్రేతరులకి ఎక్కువగా తెలియదు. వారి నవలల గురించి అంతర రాష్ట్రీయ పత్రికలలో వ్యాసాలు వచ్చాయి. అనువాదకులు నగరగెరె రమేశ్‌ ఇప్పుడు ʹనిషిధʹ నవలని అనువదించబోతున్నారు

ʹప్రజావాణిʹ (కన్నడ) పత్రికలో నల్లూరి రుక్మిణి ఇంటర్వ్యూ


No. of visitors : 468
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...

  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
  మనిషిని బంధించినంత మాత్రాన....

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •