NIGHT MARCH

| సాహిత్యం | వ్యాసాలు

NIGHT MARCH

- సమీర | 17.07.2019 10:01:18am

" NIGHT MARCH"
A journey in to Indiaʹs NAXAL HEARTLANDS
__ALPA SHAH

2018 లో వెలువరించిన ఈ 327 పేజీల పుస్తకం,ఒక నవలో,కథా కవితా సంకలనమో కాదు. ఒక సాహిత్య సృజన అని కూడా అనజాలని ఒక ప్రత్యక్షానుభవ శుద్ద (dry) నివేదిక.కథాకథనం. పందొమ్మిదవ శతాబ్దంలో పుట్టి ʹపెరుగుతున్నʹ ఇంకా రెండు శతాబ్ధాల జన్మ దిన సంరంభాలు కూడా చేసుకోని శిశువు, మార్క్సిస్టు తత్వశాస్త్రం,సాయుధ వర్గ పోరాట రాజకీయాలూనూ శిశువని ఎందుకనవలసి వస్తుందంటే...

వేన వేలసంవత్సరాల క్రితం పుట్టి ఆధిపత్య పౌరోహిత శ్రమదోపిడీ పాలక వర్గాలచేత అల్లారు ముద్దుగ పోషింపబడిన మత సంబంధమైన తాత్విక, రాజకీయాలే, తత్ నిర్మాణాలే కొన్ని, పూర్తిగ మరణించి పోయి పురాతత్వ మ్యూజియంలో మమ్మీలై మగ్గిపోగా,మరికొన్ని కాగితాలకే పరిమితై పోయి,దోపిడీ వర్గాల ప్రయోజనాల పరి రక్షణకు,ఆధునిక పుస్తక పబ్లిసిటీ సాధ నాలుగా,బాబా యోగుల ప్రసంగ గోష్టులుగా ఉనికిలో ఉండి, కొనసాగించడానికి అప సోపాలు పడుతూంటే...మొన్న మున్నటి శ్రామిక వర్గ ప్రజా పక్షపాతి శిశువు, మార్క్సిజం,పడిలేస్తూ నడక నేర్చు కుంటున్న తాత్వికత, పైన ఉటంకించిన సహస్రాబ్ధాల కాలప్రమాణ వయసు గల తాత్వికలతో పోల్చినపుడు శిశువనడం సబబే కద.ఆ శిశువు కప్పుడే కాలం చెల్లిందనీ, మరణిం చిందని రాస్తూ,ప్రచారం చేస్తూ నమ్మించడానికి చెమటోడ్చు తున్నరు.దోపిడీ వర్గ మూతులు నాకుతున్న పాదసేవ చేస్తున్న భట్రాజ ప్రతినిధులు.

ఇదిట్లుంటే, మధ్య భారతంలోనే గాక, మరికొన్ని భారత ఉపఖండ ఆదివాసీ ప్రాంతాలలో.. సామ్రాజ్యవాద పెట్టుబడికార్పోరేట్ దోపిడీవర్గాలకు ఊడిగం చేసే,దళారీ పాలకుల అత్యాధునిక ఆయుధసంపత్తిని సమకూర్చుకున్న సైన్యాల దాడి,వేటలకు వ్యతిరేకంగా నిలబడి,అలుపెరుగనిపోరాటంచేస్తున్నఆసలుసిసలుమార్క్సిస్టుతాత్వికరాజకీయ నిర్మాణమైన మావోయిస్ట్ పార్టీపోరాటాలు,ప్రపంచ స్థాయిమేధావుల దృష్టిన మరల్చుకుంటూ,ఉత్ఖంఠను రేపుతూ,వాళ్ళ తాత్వికాధార ప్రత్యామ్నాయ రాజకీయాల నిర్మాణాలను,వాటి పోరాటాల వైపు,చూడక తప్పని పరిస్థితిని కలిపిస్తున్నది.

అటువంటి ఆకర్శణకు, పరిశోధనాకాంక్షకు గురైన లండన్ స్కూల్ అఫ్ ఎకనాక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ లోని ఒక యువ ప్రొఫెషనల్ ఆచార్యురాల( ప్రొఫెసర్)యిన పడతి, అల్ఫాషా ʹతాజాʹ ఏడురాత్రీ పగళ్ళ సాహస యాత్రానుభవ పరిశీలనానుభవ నివేదికనే,ఈ పుస్తకం.

ఈ ఏడు రోజుల తాజానుభవం వెనుక,షా కున్న సుదీర్ఘ చైతన్య వంతమైన,సంపన్న కుటుంబ నేపథ్యమూ,సంవత్సరాల తరబడి ఆదివాసీల ప్రాంత నడుమ నివాసాను భవమూ ఉన్నది. ఆమె ఈ అనుభవ కథా కథన నిర్మాణ శిల్పం లేదా శైలీ నైపుణ్యం పరిశీలనార్హమూ నేర్చుకోవలసినార్హమూ ఐనది. ఈ రచన లోని అన్ని వాక్యాలు, పేరాలు,పేజీలు, సంఘటానాత్మక దృశ్యీకరణ చిత్రాలూ. ఉత్కంఠ భరితమే,విస్మరించ రాని ప్రాధాన్యత గలవే ఐనా,మచ్చుకు కొన్ని.
రచయిత్రి ముందుమాటలలో..

ʹజార్ఖండ్ రాష్ట్రంలోని దట్టమైన అటవీ అడివీ పర్వతాల నడుమ,2008 డిశంబర్ మాసం.రక్త మాంసాలు గడ్డకట్టే చలిలో, మూడు సెంట్రీపోస్ట్ లు దాటి,గ్రామానికి సుదూరంగా,ఒంటరి మట్టిగుడిసెకు చేరేసరికి, అందులో జుట్టు పలుచబడి బట్టతల అనిపించే టట్లున్న, మృదు భాషియైన,ఒక మధ్యవయస్కుడున్నడు.ʹ

ʹఆదివాసీ పదాతి(foot)సైనికుల యుద్ధం, వాళ్ళ నాయకుడి అమూర్త ఆదర్శాల వంటిది కాదు. వాటికి భిన్నంగా,పీడన అమానవీయ నిరంకుశ వివక్షల వ్యవస్థలకు వ్యతిరేకంగా, ఆదివాసీ స్వయం పాలనకోస్రం.ʹ

మొదటి విభాగం(going under ground) :
ʹరాంచీనుండి మొదలైన నా ప్రయాణానికి ముందురోజు రాత్రి,ఫోన్ మోగి,"రేపు సాయం రెండుగంటలకు"అన్నమాటతో ఆగిపోయింది. మావోయిస్టు కేంద్ర కమీటీలోని ఒక సభ్యుడు,ముప్పై ఏళ్ళకుపైగా అజ్ఞాతంగా ఉన్నతనితో ఇంటర్వ్యూ కొరకు నేను సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్నసందర్భం.ʹ

రెండవ ఉప అధ్యాయంలో:

ʹదళిత నాయకుడు భీమారావ్ అంబేద్కర్ అధ్వర్యంలో,అంగీకరించి ఆమోదింపబడిన రాజ్యాంగ ఫలితంవల్ల,అంటరానితనం రద్దుచేయబడినా, నిమ్నకుల,తెగలకు విద్యారంగ సంస్థలల్లో, పాలనారంగ శాఖలల్లో, చట్టసభల్లో కొన్ని రిజర్వుడ్ ఉన్నత స్థానాలు అందుబాటులోనికి వచ్చినా, ఆధునిక అర్థిక అభివృద్ధి రంగం క్షేత్రంలో కుల తెగ వివక్ష అణిచి వేత కొనసాగుతూనే ఉన్నది. ముఖ్యంగా, ఆదివాసీ సమాజంలో సామూహిక వేట, అటవీ ప్రకృతి సిద్ధ ఆహార సేకరణ,పంపిణీ,పరస్పర శ్రమశక్తి పంపిణి సహకారం ,ఉదాహరణకు, ʹనా ఇల్లు కట్ఠడంల ఈరోజు నీవు నాకు పని చేయ్, రేపు నీ ఇంటి నిర్మాణానికి నేనూచేస్త. ʹఅట్లాఆదివాసీలు తమ సమిష్టి సహకార సహజీవనం కొనసాగిస్తున్నరు. ఇంకా, ఇంటిపనులలో మగ వాళ్ళు కూడా, వంటపని, బట్టలు తుకడం, నీళ్ళుతేవడం, పిల్లల సంరక్షణ పోషణవంటివీ, ఇంకా, పండుగ పబ్బాల సంతోష సందర్భల్లో ఆడామగా తేడా లేకుండా స్వయం ఉత్పాద మైన ఇప్పసారా తాగడం,తినడం ఆటాపాట లలో పాల్గొనడం సాధారణమే.

మూడవ భాగం లో:ʹఎన్నికలల సమయంలో ఓట్లనెట్లా కొంటరో,బలమైన పార్టీలగూండాలు ఎట్లా బ్యాలెట్ బాక్స్ లనెట్లా దొంగిలించు కెళతరో నా కంట పడింది.ʹ
రెండవ అధ్యాయం:
ʹఒకరోజు రాత్రి చందమామ వెలుగులో, హఠాత్తుగ ఒక ఏకే 47 ధరించినఒక ఎత్తైన నీడ,దాన్ననుసరించి,సుమారు పది పదకొండు మంది నీడలూ ప్రత్యక్షం ఐనవిʹ-ʹనక్జలైట్ల వద్దకు వచ్చిన చాలామంది పిల్లలలాగే, ప్రషాంత్,వాళ్ళ సాంస్కృతిక శాఖలో భాగ మైండు.ఆ సాంస్కృతిక శాఖ ఆయుధాలు కల్గిఉండదు. ఆ ప్రాంతీయ భోజ్ పురి భాషలనే రాయడం చదవటం నేర్వడమేగాక,పాటలు రాయడం, బాణీలుకూర్చడం,కొద్దిగాహిందీ,ఆంగ్లభాషలతో పరిచయమూ పెంచుకున్నడు.

5వ విభాగంలో:

ʹగ్యాన్ జీ నాకొక,వాడి ఖాళీచేసిన నూనెదో లేదా ఆలూ చిప్స్ దో పాలిథిన్ ప్యాకెట్ ఇచ్చిండు,అందులో నీళ్ళు పట్టి మలవిసర్జనానంతరం కడుగుకున్న పిదప,ప్యాకెట్ ను భధ్రపరుచుకోవాలె.ʹ ʹమావోయిస్టు పార్టీ నాయకత్వ నమ్మక మేమంటే,తమ యుద్ధం భవిష్యత్ లో వాళ్ళు స్థాపించబోయేకుల,వర్గ రహిత ఊహాత్మక(utopian) సామాజిక వ్యవస్థ యొక్కసూక్ష్మ ప్రతిరూప మోడల్ నుతయారుచేయడానికే.ʹ అతడు(గ్యాన్ జీ)అన్నదేవిటంటే ʹకాలక్రమంలో మాకందరికీ తెలిసిందేమంటే, మేం చేసే యుద్ధఫలితాలను మాజీవిత కాలంలో మేం చూడం,మాకందవు. ప్రపంచం చాలా వేగంగా మారు తున్నది.సమ సమాజ స్థాపననేది ఎన్నడూ చేరజాలని సుదూర గమ్యం లాగా కని పిస్తున్నది.ఐనాఈ స్వప్నాన్ని నిత్య నూతనంగా,సజీవంగాఉంచడం మా బాధ్యత, విధాయక కర్తవ్యం. మా పిల్లలు కాకున్నా,వాళ్ళతర్వాత తరాల కైనా అందాలె.అంది తీరాలె. ప్రత్యామ్నాయ మింక వేరేలేదు.ʹ

పుస్తకంలోని ఈ ఉటంకింపులన్నీ , పుస్తకంలోని 89 పుటల వరకే. చివరి నుండి రెండవపేరాలోని రచయిత్రి అభిప్రాయాన్ని చూస్తే,ఆవిడ మార్క్సిస్టు కాదని అనిపిస్తది.ఐనా, ఒక మానవీయశాస్ర ఆచార్యిణిగా,ఆమె అంతరాంతరాల్లో,ప్రపంచ వ్యాప్త,ఈ భిన్న రకాల వివక్షాపూరిత, హింసాత్మక వర్గ దోపిడీ వ్యవస్థల పట్ల అసంతృప్తి ఆగ్రహాలాంటివేవో ఉన్నవి.ఈ అమానవీయ వ్యవస్థను మార్చే ప్రత్యా మ్నాయరాజకీయాలకోస్రం అన్వేషణ, అందుకు తప్పనిసరియైనది ఐన సాయుధ ప్రతిఘటనేదో అనివార్యం.ఇప్పటికైతే అది మావోయిస్టు తాత్విక వర్గ పోరాటరాజకీయ నిర్మాణంగా మాత్రమే అగుపిస్తున్నదనే స్పష్టత ఒకటి ఆమెకున్నదనేది స్పష్టం.

No. of visitors : 400
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..
  ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీల జీవితాలు మారుతాయoటున్న శీలా సుభద్రాదేవి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •