నిర్భంద చట్టాలు - ముసిరిన చీకట్లు

| సంపాద‌కీయం

నిర్భంద చట్టాలు - ముసిరిన చీకట్లు

- క్రాంతి | 03.08.2019 09:12:35pm

ఏ అర్థ‌రాత్రో నువ్వు ఘాడ నిద్ర‌లో ఉన్న‌ప్పుడు... ఊహించ‌ని విప‌త్తు వ‌చ్చి ప‌డుతుంది. తెల్ల‌వారేలోపు... ప‌త్రిక‌ల్లో అర్బ‌న్ మావోయిస్టుగా నీ ముఖచిత్రం ప్ర‌చురిత‌మ‌వుతుంది. నీ ఒంట్లోంచి అడ‌వి వాస‌నొస్తోంద‌ని ద‌ర్యాప్తు సంస్థ‌లు ప్ర‌క‌టిస్తాయి. చెర‌సాల‌తో నీ చెలిమి మొద‌ల‌వుతుంది.

నువ్వు... గొంతు చించుకుంటావు. వినికిడి లోప‌మున్న‌ న్యాయస్థానం ముందు నినాదాల్ని ఎగ‌రేస్తావు. నువ్వు విసిరిన ప్ర‌శ్న‌ల‌న్నీ వాయులీన‌మౌతాయి త‌ప్ప‌... వాడి చెవికి సోక‌నే సోక‌వు. రేపొద్దున మ‌రో ప్రశ్న నీ జ‌త‌కొచ్చి చేరుతుంది.

ఇదీ... వ‌ర్త‌మాన భార‌తం. అస‌మ్మ‌తిపై అమ‌ల‌వుతున్న అణ‌చివేత విధానం. ప్ర‌శ్న‌ను శిలువేసేందుకు... త‌ర‌గ‌తి గ‌దిలో వినిపించే పాఠాన్ని... లైబ్ర‌రీలో కొలువుదీరిన పుస్త‌కాన్ని.. కాగితం మీద పూసిన అక్ష‌రాల‌ని.. స‌భ‌లో వినిపించిన గీతాన్ని... అడ‌విలో ప‌దునెక్కుతున్న ఆలోచ‌న‌ల్ని ఖైదు చేస్తున్న కాలం.

పార్ల‌మెంటు ముందుకు కొత్త కోర‌ల‌తో ఓ క్రూర చ‌ట్టం వ‌చ్చి నిల‌బ‌డుతుంది. వంద కోట్ల ప్ర‌జ‌ల ప్రాథ‌మిక హ‌క్కుల్ని హ‌రించేందుకు నేను సిద్ద‌మంటుంది. ఏ శ‌ష‌బిష‌లూ లేకుండా చ‌ట్టవ్యతిరేక కార్యకరలాపాల నియంత్రణ (Unlawful Activities (Prevention) Act) సవరణ బిల్లుకు రాజ‌ముద్ర ప‌డుతుంది.

కిక్కిరిసిన జైళ్ల‌లో కుక్కేందుకు ప్ర‌శ్నించే గొంతుల వేట వేగిర‌మ‌వుతుంది. రాత్రికి రాత్రి ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో ఇద్ద‌రు సామాజిక కార్య‌క‌ర్త‌లు అక‌స్మాత్తుగా అర్బ‌న్ మావోయిస్టులైపోతారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ విద్యార్థి ఉన్న‌ప‌ళంగా చ‌త్తీస్‌ఘ‌డ్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాడు.

అవును... ఉత్త‌రప్ర‌దేశ్‌కి చెందిన ఇద్ద‌రు సామాజిక, రాజ‌కీయ కార్య‌క‌ర్త‌లు మ‌నీష్ శ్రీవాత్స‌వ్‌, అమిత‌లను జూలై 9న‌ భోపాల్‌ ఏటీఎస్ అరెస్టు చేశారు. మ‌నీష్, అమిత‌లు మావోయిస్టు గెరిల్లాల‌తో మాట్లాడుతున్న వీడియో త‌మ వ‌ద్ద ఉందంటూ ఎప్ప‌టిలాగే ఓ క‌ట్టుక‌థ‌ను వినిపించారు పోలీసులు.

అమిత‌, మ‌నీష్‌లు ఉన్న‌త విద్యావంతులు. మనీష్ గోరఖ్ పూర్ విశ్వవిద్యాలయంలో ఏం.ఏ చేశాడు. అమిత అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఓరల్ హిస్టరీలో పీహెచ్‌డీ చేసింది. వీరిరువురూ విద్యార్థి జీవితం నుంచే సామాజిక‌, రాజ‌కీయ కార్య‌క‌లాపాల్లో క్రియాశీల‌కంగా పాల్గొన్న‌వారు. అమిత వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. క‌వి, ర‌చ‌యిత్రి, గాయ‌ని. అమిత‌, మ‌నీష్ ఇరువ‌రూ అనువాద‌కులు కూడా. ప‌లు పుస్త‌కాల‌ను ఆంగ్లం నుంచి హిందీలోకి అనువ‌దించారు. ఇప్పుడు... వారి సామాజిక కార్యాచ‌ర‌ణ‌ను, సాహిత్య కృషిని రాజ్యం చ‌ట్టవ్యతిరేక కార్యకరలాపాల్లో చేర్చింది. అర్బ‌న్ మావోయిస్టుల ముద్ర‌వేసి బంధీఖానాకు నేస్తుల‌ను చేసింది.

స‌రిగ్గా వారం రోజుల‌ వ్య‌వ‌ధిలో హైద‌రాబాద్‌లో పోలీసులు కిడ్నాప్ చేసిన‌ ఉస్మానియా విశ్వ‌విద్యాల‌య విద్యార్థి ఒగ్గే భ‌ర‌త్‌పై చ‌త్తీస్‌ఘ‌డ్‌లో అక్ర‌మ కేసు న‌మోదైంది. భ‌ర‌త్ జేఎన్‌టీయూలో ఎంటెక్‌, ఉస్మానియాలో జియో ఇన్ఫ‌ర్మేటిక్ పూర్తి చేశాడు. పీహెచ్‌డీకి సిద్ధ‌మ‌వుతున్న భ‌ర‌త్‌ను జూలై 16న హైద‌రాబాద్‌లో తెలంగాణ పోలీసులు కిడ్నాప్ చేశారు. తెల్ల‌వారే స‌రికి.. రాష్ట్ర స‌రిహ‌ద్దులు దాటించి చ‌త్తీస్‌ఘ‌డ్ పోలీసుల‌కు అప్ప‌గించారు.

జూలై 18న... తాళ్లగూడెం పరిధిలో పెట్రోలింగ్ నిర్వ‌హిస్తున్న త‌మ‌కు అనుమాన‌స్ప‌దంగా భ‌ర‌త్ తార‌స‌ప‌డ్డాడ‌ని, విచార‌ణ‌లో భాగంగా మావోయిస్టు పార్టీకి క‌మ్యూనికేష‌న్ రంగంలో అత‌డు స‌హ‌క‌రిస్తున్న‌ట్లు గుర్తించామ‌ని చ‌త్తీస్‌ఘ‌డ్ పోలీసులు మీడియాకు వెల్ల‌డించారు. భ‌ర‌త్ వ‌ద్ద నుంచి ఎలక్ర్టానిక్ డివైస్‌లు, విప్ల‌వ సాహిత్యం స్వాధీనం చేసుకున్న‌ట్లు ప్ర‌క‌టించి అత‌డిపై ఊపా యాక్ట్ కేసు న‌మోదు చేసి జ‌గ‌ద‌ల్‌పూర్‌ జైలుకు పంపారు.

హైద‌రాబాద్‌లో భ‌ర‌త్‌ని కిడ్నాప్ చేసిన పోలీసులు మూడు రోజుల పాటు తీవ్ర చిత్ర‌హింస‌ల‌కు గురిచేశారు. త‌నకు తెలియ‌ని, సంబంధం లేని విష‌యాల‌ను ఒప్పుకోవాలంటూ వేధించారు. చివ‌ర‌కు జైలులో సైతం జాతీయ ద‌ర్యాప్తు సంస్థ అధికారుల వేధింపులు కొన‌సాగుతున్నాయి.

భ‌ర‌త్ సైన్స్ విద్యార్థి. పుస్త‌కాల్లో చ‌దువుకున్న జ్ఞానాన్ని స‌మాజానికి అన్వ‌యించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌వాడు. ఉద్య‌మాన్ని పాఠ‌శాల‌గా చేసుకున్న‌వాడు. అత‌డు చేసిన నేరం... ప్ర‌పంచాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకునేందుకు య‌త్నించ‌డం. ప్ర‌శ్న‌ను వెంటేసుకొని తిరిగ‌డం. భ‌ర‌త్‌లో ఒక వివేక్ క‌నిపిస్తాడు. త‌న అంత‌రాల‌ను తాక‌ని దేన్నీ.... తాను అంగీక‌రించ‌డు. అధ్య‌యనంలో నిగ్గుతేలే వ‌ర‌కూ.. ఏ త‌ర్కాన్నీ త‌లొగ్గ‌డు. ఎంత‌టి నేరం ఇది? రాజ్యానికి భ‌యం క‌ల్పించేది ఈ త‌ర్క‌మే క‌దా? అందుకే.. క్రూర చ‌ట్టం కోర‌లు చారి భ‌ర‌త్‌ని క‌బ‌ళించిది.

ఉగ్రవాద నిర్మూలన పేరుతో గ‌తంలో టాడా, పోటా లాంటి నిర్భంద చ‌ట్టాల‌ను ప్ర‌జ‌ల‌పై ప్ర‌యోగించిన రాజ్యం ఇప్పుడు ఊపాను ఎక్కుపెట్టింది. పార్ల‌మెంటు ఆమోదించిన తాజా స‌వ‌ర‌ణ‌ల‌తో ఇప్పుడు... దేశంలోని ప్ర‌తి వ్య‌క్తి మెడ‌మీదా ఊపా క‌త్తి వేలాడుతోంది. అనుమానం పేరుతో... ఎప్పుడు ఎవ‌రినైనా ఈ క‌త్తి బ‌లితీసుకోవ‌చ్చు. రాష్ట్రాల స‌రిహ‌ద్దులు దాటి ఏ అనుమతులు లేకుండానే... ఎవ‌రినైనా ఎత్తుకెళ్లొచ్చు. ఉగ్ర‌వాదుల ముద్ర వేసి... నేర‌స్తుల‌ను చేయొచ్చు. నిన్ను నువ్వు దేశ‌ద్రోహి కాద‌ని నిరూపించుకోవ‌ల్సిందే.

ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా వేలాది మంది ఆదివాసులు, ముస్లింలు జైళ్ల‌లో మ‌గ్గుతున్నారు. ఇప్పుడు అర్బ‌న్ మావోయిస్టుల పేరుతో వంద‌లాది ర‌చ‌యిత‌లు, క‌వులు, క‌ళాకారులు, విద్యార్థులు, సామాజిక కార్య‌క‌ర్త‌ల‌ను చెర‌సాల పాలు చేస్తున్న రాజ్యం.. రేపొద్దున ప్ర‌తి ఇంటి త‌లుపూ త‌ట్టి... ఒక్కొక్క‌రిపై ఉగ్ర‌వాది ముద్ర వేస్తుంది. మీ జేబులో ఎర్ర‌సిరా పెన్ను క‌నిపించినందుకే కావ‌చ్చు... టోపీ పెట్టుకొని బ‌స్టాండ్ నిల‌బ‌డ్డ నేరానికి కావ‌చ్చు.. గ‌డ్డం పెంచుకొని లైబ్ర‌రీ మెట్లు ఎక్కినందుకు కావ‌చ్చు. అందుకే.. హక్కుల కోసం నిల‌బ‌డి... క‌ల‌బ‌డాల్సిన స‌మ‌యం ఇది.

No. of visitors : 401
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

సంఘ‌ర్ష్‌ | 18.11.2016 12:59:34pm

అక్క‌డ‌ బాల్యం భ‌యంలో... య‌వ్వ‌నం నిర్బంధంలో గ‌డిచిపోతుంది. ఇంటి నుంచి బ‌య‌ట‌కెళ్లిన పిల్ల‌లు తిరిగి వ‌స్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక‌...
...ఇంకా చదవండి

బోధ‌నా హ‌క్కు కోసం మ‌రో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్‌.సాయిబాబా

ఇంట‌ర్వ్యూ : క్రాంతి | 01.06.2016 12:44:47pm

1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట...
...ఇంకా చదవండి

దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజం

సుబోజిత్ బాగ్చీ (అనువాదం : క‌్రాంతి) | 17.06.2016 09:33:33am

సామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే........
...ఇంకా చదవండి

మ‌రో ఆదివాసీ యువ‌కుడు...

క్రాంతి | 03.09.2016 03:22:46pm

17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువ‌కుడిగా త‌ప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జ‌వాన్లు చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన అంబులెన్స్ ........
...ఇంకా చదవండి

పొట్ట‌కూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారు

| 20.10.2016 03:21:04pm

తాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్ట‌య్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన‌ మ‌నోహ‌ర్ శ‌వ‌మై తిరిగి వ‌చ్చాడు. "ఎన్‌కౌంటర్" క‌థ రిపీట్ అయ్యింది....
...ఇంకా చదవండి

వెలివాడే తొలిపొద్దై పుస్త‌కావిష్క‌ర‌ణ‌

ఫొటోలు : క‌్రాంతి | 17.07.2016 12:15:31pm

రోహిత్ వేముల స్మృతిలో విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం వెలువ‌రించిన వెలివాడే తొలిపొద్దై పుస్త‌కాన్ని రోహిత్ త‌ల్లి వేముల రాధిక ఆవిష్క‌రించారు. మార్చి ...
...ఇంకా చదవండి

సంత‌కు వెళ్లిన వాళ్లు.. శ‌వాలై వ‌చ్చారు

సంఘ‌ర్ష్‌ | 20.02.2017 11:52:50am

ఏకంగా ఇర‌వై రోజుల నుంచి మృత దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌కుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళ‌న చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క అధికారి కూడా ఈ విష‌యంలో స్పందించ‌క‌పోవ...
...ఇంకా చదవండి

అధికారం నీడ‌లో.... అంతులేని హింస‌

క్రాంతి | 05.10.2016 03:32:08pm

మోదీ ప్ర‌భుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను వేదాంత‌, ఎస్సార్‌, టాటా, జిందాల్ వంటి బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడుతోంది. అందుకు......
...ఇంకా చదవండి

ఆ చెట్టుకు నోరుంటే ..

క్రాంతి | 03.01.2017 09:49:29am

ఆట‌పాట‌ల్లో మురిసిపోయే ప‌సివాడు ఉట్ట‌న్న‌ట్టుండి న‌క్స‌లైట‌య్యాడు. క‌సిగా గుచ్చుకున్న బ‌యోనెట్ మొన వాడి మొర ఆల‌కించ‌లేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల...
...ఇంకా చదవండి

ఆర‌ని మంట‌లు...

| 02.11.2016 09:05:19am

2011 మార్చిలో చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జ‌రిగిన మార‌ణ‌హోమం పోలీసుల ప‌నే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెష‌ల్ పోలీస్...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..
  ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీల జీవితాలు మారుతాయoటున్న శీలా సుభద్రాదేవి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •