ʹఅస‌మ్మ‌తిʹపై ఎక్కుపెట్టిన అస్త్రం

| సాహిత్యం | వ్యాసాలు

ʹఅస‌మ్మ‌తిʹపై ఎక్కుపెట్టిన అస్త్రం

- ఎన్‌. నారాయణ రావు | 03.08.2019 11:06:41pm

ఉగ్రవాదం ద్వారా జరిగే మారణ హోమాన్ని ఎవరూ సమర్ధించరు. కానీ క్రూరనిర్బంధ చట్టాల వల్ల సమస్య పరిష్కారం కాదు. రాజకీయంగా, ప్రజాస్వామిక పద్దతిలో ఉగ్రవాద సమస్యను పరిష్కరించాలి. ప టాడా, పోటా చట్టాల ఉద్దేశాలను ప్రస్తుత ఊపా సవరణ చట్టం 2008లో దొడ్డిదారిన తీసుకొచ్చారు. రైల్వే స్టేషన్‌ ల్లోను, బస్టాండ్‌ ల్లోను, సినిమాహాళ్ళు, హోటళ్ళమీద కాల్పులు జరిపి అమాయకులను చంపిన దుండగలను కఠినంగా శిక్షించడం కోసం చెప్పే ఉ.పా. చట్టాం అమాయకులను వేధించడానికి ఉపయోగ పడుతోంది. ఖలిస్తాన్‌ వాదులు చేసే హింసను చూపి ఉగ్రవాదాన్ని నిరోధించడానికని మొదటి సారిగా 1985లో టెర్రరిస్టు మరియు విచ్ఛిన్నకర కార్యకలాపాల నిరోధక చట్టం టాడాను తెచ్చారు. పంజాబ్‌ కు చెందిన ఖలిస్తాన్‌ వాదుల కోసమని తెచ్చిన టాడా చట్టాన్ని దేశంలో చాలా రాష్ట్రాల్లో అమలుచేశారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ లో కొన్ని వందల మంది పై ఈ చట్టాన్ని ప్రయోగించారు. రైతుల మీద, రైతు కూలీల పైన, కార్మికుల పైన ప్రజాఉద్యమ కారుల పైన నక్సలైట్లకు భోజనం పెట్టిన వారి పైన ఇలా అనేకమంది అమాయకుల పైన టాడా చట్టాన్ని ప్రయోగించారు. 1987 నుండి 1991 వరకు వరంగల్‌ జిల్లాలో ఈ చట్టాన్ని ప్రయోగించి ఎందరో అమాయకులను జైళ్లకు పంపారు. టాడాదుర్వినియోగం దేశ వ్యాప్తంగా జరిగింది. టాడా ఆ దుర్వినియోగాన్ని నిరసిస్తూ హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు, మేధావుల ఆధ్వర్యంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనా కార్య క్రమాలు చేపట్టారు. దాని ఫలితంగా 1997లో టాడాని ఉప సంహరించారు.

2002లో పార్లమెంట్‌ పై ఉగ్రవాదులు దాడి చేశారు. కాశ్మీర్లో హింసాకాండ, పార్లమెంట్‌ పై ఉగ్రవాదులు దాడిని సాకుగా చూపి యన్టీఏ ప్రభుత్వం పోటాను తెచ్చింది. ఉగ్రవాద నిరోధక చట్టం పోటా అమలులోకి వచ్చిన తరువాత దేశ వ్యాప్తంగా అనేక మంది అమాయక ముస్లింల పైన ప్రయోగించారు. మన రాష్ట్రంలో పోటా కింద 400 మందిని నిర్భందించారు. వారంతా ప్రజా సంఘాలకు చెందిన కార్యకర్తలే. టెర్రరిస్టులతో సంబంధాలు న్నాయనీ, టెర్రరిస్టు దాడుల్లో పాల్గొన్నారని ఆరోపిస్తూ అక్రమంగా నిర్శంధించారు. కానీ వారిపై మోపిన నేరాలను నిరూపించడానికి తగిన సాక్ష్యాలు లేవని కొన్నేళ్ల తరువాత కొందరిని వదిలి పెట్టారు. పోటాను రద్దు చేయాలని కోరుతూ దేశ వ్యాప్తంగా ప్రజలు ఉద్యమించారు. పోటా కింద పెట్టిన కేసులను సమీక్షించి ముద్దాయిలను విడుదల చేయడానికి కేంద్రం ఒక సమీక్షా సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది కాని సమీక్షా సంఘం ఆశించినంతగా పనిచేలేదు. ప్రజల ఒత్తిళ్లకు తలొగ్గిన యుపిఏ ప్రభుత్వం పోటా చట్టాన్ని ఉపసంహరించింది.

టెర్రరిస్టు, చర్యలకు ఉ.పా.లో పొందుపరిచిన నిర్వచనాలను పరిశీలిద్దాం.

1. నేర స్థలంలోగానీ, నేర ప్రక్రియకు సంబందించిన ఏ వస్తువు పైనగానీ ఒక వ్యక్తికి సంబంధించిన ఏ వస్తువుగానీ, ఒక వ్యక్తికి సంబంధించిన చిహ్నం (వేలి గుర్తులు) లభించినా అతనే నేరం చేసినట్లు కోర్టు భావిస్తుంది. నేరం చేయలేదని ముద్దాయి నిరూపించుకోవాలి.

2. పోలీసుల కథనం ప్రకారం ముద్దాయి నేరం చేశారని ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని జడ్జి గారు భావిస్తే బెయిల్‌ నిరాకరిస్తారు. ప్రాసిక్యూషన్‌ బెయిల్‌ వ్యతిరేకిస్తే చాలు జడ్జిగారు బెయిల్‌ మంజూరు చేయరు.

3. సాధారణ నేర విచారణ చట్టం ప్రకారం ముద్దాయిని రెండువారాలు జుడిషియల్‌ కస్టడీకి ఇస్తారు. 90 రోజుల్లో పోలీసులు ఛార్జిషీట్‌ వేయాలి. కాని ఈ సవరణ చట్టం జుడిషియల్‌ కస్టడిని 180 రోజులకు పెంచింది. ఈ మధ్య కాలంలో ఎన్నిసార్లయినా పోలీస్‌ కస్టడీకి తీసుకునే అవకాశం కల్పించింది.

4. సాధారణ నేరచట్టం ప్రకారం నేరం నిరూపించాల్సిన బాధ్యత ప్రాసిక్యూష వారిది. కాని ఈ చట్టం ప్రకారం నేరం చేయలేదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యతను ముద్దాయి పై పెట్టింది. నిర్భంధంలో ఉండి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించి కోర్టుకు సమర్పించే అవకాశం ముద్దాయికి ఉండదు

5. కోర్టు విచారణ జరిగి శిక్ష పడేంత వరకు ముద్దాయి అమాయ కుడు అని భావించడం క్రిమినల్‌ విచారణలో ప్రాథమిక సూత్రం. కాని ఈ చట్టం ప్రకారం నేరం చేసినట్లు పోలీసులు చెప్పినా, జడ్జిగారు భావించినా విచారణ జరపకుండానే నేరస్తునిగా భావించడం జరుగుతుంది. నేరం చేయలేదని ముద్దాయి నిరూపించుకోవాలి.

6. ముద్దాయిలకు సంబంధించిన ఆస్తులను, విలువైన పత్రాలను జప్తు చేసుకునే అధికారం ఈ చట్టం కల్పించింది.

7. టెర్రరిస్టు నిరోధక కార్యక్రమాల్లో పాల్గొనే పోలీసులు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినా వారి పై కేసునమోదు చేయడానికి వీలు లేకుండా రక్షణ కల్పిస్తుంది.

8. టాడా, పోటాలను అమలు కాలపరిమితిని నిర్ణయించారు. కానీ ఈ చట్టం పర్మినెంట్గా ఉండిపోతుంది. ఉగ్రవాద నిర్మూలన సాకుతో తెచ్చిన గత టాడా, పోటాల అమలు తీరును గమనించిన తర్వాత ఉ.పా. అంతకంటే ప్రమాదకారిగా అమలవుతుందని స్పష్టంగా చెప్పవచ్చు. హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామిక విలువల కోసం పనిచేసే ఉద్యమ శక్తులను అణచివేయడానికి ఈ చట్టం రాజ్యానికి బాగా ఉపకరిస్తుంది. ముఖ్యంగా ముస్లిం మైనార్టీలను అణచి వేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో బిజెపి కంటే మేం ఎంత మాత్రం తీసిపోమంటూ యూపీఏ ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చింది. ఉగ్రవాదాన్ని తావే బాగా అణచివేశామని నిరూపించుకోవడం కోసం యూపీఏ ప్రభుత్వం ఈ చట్టాన్ని అమాయకుల పై ప్రయోగించే అవకాశముంది. కేంద్రంలో రేపు బిజెపి అధికారంలోకి వచ్చినా రాకపోయినా తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లిం మైనార్టీల పై ఉ.పాని ప్రయోగించి తీవ్రంగా అణచివేస్తుంది. జులై 24 న కేంధ్ర హోం శాఖా మంత్రి ఆమిత్‌షా ఉపా చట్టానికి అమేండ్‌మేంట్‌ చేస్తు మూడు ప్రతిపాదనలు చేసారు. దోషుల అస్తులను జప్తు చేయడానికి ఇప్పటి వరకు రాష్ట్రల డి.జి.పిలకు అధికారం వుండేది. కానీ నేడు దాని స్థానంలో నేషనల్‌ ఇన్విస్టిగేషన్‌ ఎజెన్సికి చేందిన సి.ఐ స్థాయి అధికారికి అధికారం ఇచ్చారు. ఇది రాష్ట్రల ఫెడరల్‌స్ఫూర్తికి వేతిరేకంగా కేంద్ర ప్రభుత్వ అజామాయిషి కానిపిస్తుంది. ఉపా చట్టాం ఇప్పటి వరకు సంస్థనే నేరస్తులుగా చుసేవారు ఇప్పుడు వ్వక్తులను కూడా నేరస్తులను చేస్తు ఉపా చట్టాం దాడి చేసె స్థితినికలిపించారు. ఇది ఎవరు ప్రశ్నించినా, నిరసించినా ఉపా చట్టానికి బలికావాల్సిన పరిస్థిని ప్రభుత్వం కల్పించింది.

ఒకవైపు నిర్బంధాల ద్వారా ప్రజా ఉద్యమాలను బలహీనపరుస్తూనే, మరోవైపు ఇంకా అతి క్రూర నిర్బంధ చట్టాలతో ప్రభుత్వం దాడి కొనసాగిస్తున్నది. నిర్బంధ చట్టాలే కాదు, నిర్బంధ పోలీసు విభాగాలు కూడా ప్రజల్ని భయపెట్టడానికి, వారి హక్కుల్ని అణచివేయడానికి ఉపయోగపడుతున్నాయి. ఎపి, తెలంగాణలో గ్రేహౌండ్స్‌ బలగాలు, మహారాష్ట్రలో జ. 60 బలగాలు క్యూ బ్రాంచీ బలగాలు ఒరిస్సా చత్తీస్‌గడ్‌లలో కోబ్రా, డిఆర్‌జి బలగాలు ప్రజల ప్రాథమిక హక్కుల్ని సైతం అణచివేస్తున్నాయి. దానికి ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక చట్టాలు ప్రధానంగా ఊపా చట్టం చాలా బాగా ప్రభుత్వానికి ఉపకరిస్తున్నది. ఇప్పటికే మూడింట 2వంతులు ఆదివాసులు ఊపా నిర్బంధ చట్టాన్ని ఎదుర్కొంటున్నారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం 67 శాతం ఊపా కేసులో నిర్దోషులుగా మరియు కేసులు కొట్టివేయబడే స్థితిని మనం చూస్తున్నాం. 2017లో 76 కేసుల్లో 65 కేసులను ఊపా నిందితులు నిర్దోషులగా విడుదల కాబడ్డారు.

2016 ఏడాది చివర్లో జాతీయ నేర విభాగ బ్యూరో లెక్కల్లో 75 శాతం నిర్దోషులుగా విడుదలయ్యారు. దేశంలోని ఇపుడు ఏ నేరం చేయని గౌతమ్‌నవలాఖ, సురేంద్ర గాడ్లింగ్‌, సుధా భరద్వాజ్‌, సోమాసేన్‌, అరుణ్‌ ఫరారే, వెర్నాన్‌గుంజల్వాస్‌, ఆనంద్‌ తేల్‌తుంబ్డె, వరవరరావు, సాయిబాబా, ప్రశాంతి రాహి, హేమ్‌ మిశ్రాలతో పాటు అనేకమంది ఆదివాసీలు ఈ కేసులో ఇరుక్కుంటున్నారు. ప్రజా ఉద్యమకారుల అందరిపై ఊపా కత్తి వేలాడుతూనే ఉంది. 1975 ఎమర్జెన్సీ ఎంతటి దారుణమో నేటి ఊపా చట్టమే అంతటి ఎమర్జెన్సీని నిర్బంధాన్ని కొనసాగిస్తున్నది. ఊపా చట్టాన్ని రద్దుచేసి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులైనా అధికారణం 19, 21లను ఖచ్చితంగా అమలుచేస్తేనే ప్రజాస్వామ్యం కొనసాగుతుందని భావిస్తున్నాం.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న వారందరూ అనుమానితులుగా, కుట్రకారులుగా, దేశద్రోహులుగా పరిగణించే స్థితి ప్రభుత్వాలకు ఏర్పడింది. ఇది ప్రభుత్వంలోని అప్రజాస్వామికతకు చిహ్నం. ఏ ప్రభుత్వమైనా సామ్రాజ్యవాద విధేయుడుగా ఉండకపోతే దేశంలో అధికారం కోల్పోవలసి వస్తుంది. ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించినా మావోయిస్టు ముద్రను ఎదుర్కొవల్సి వస్తుంది. దానికి రాహుల్‌, దిగ్విజయ్‌, ప్రకాశ్‌రాజ్‌లు ఎవరూ మినహాయింపు కాదు. ప్రభుత్వం పెడుతున్న ఊపా కేసుల్లో తాము నిందితులను కామని తామే నిరూపించుకోవాల్సిందే. దానికి ఏళ్ళకు ఏళ్లు కాలం తీసుకునే లాగా ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ప్రభుత్వం కుట్రపూరితంగానే బెయిల్‌ రాకుండా చేయడం, చివరకు జైళ్లోనే మరణించాలే చేయడమే ఊపా కేసు లక్ష్యంగా మారుతుంది. ఆ స్థితిలోకి నేడు ఉన్న ప్రొ. సాయిబాబా, వరవరరావులను నెడుతున్నవి. ఈ ఎమర్జెన్సీ స్థితిలో ప్రజాస్వామికవాదులందరినీ రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది.

మానవ హక్కుల కార్యకర్తలను, ప్రజాస్వామిక వాదుల అరెస్టులు కేవలం మావోయిస్టు ఉద్యమాన్ని బలహీనపరచడానికి జరగలేదు. భారతీయ జనతాపార్టీ రాష్ట్రీయ స్వయం సేవక్ల లక్ష్యమైన హిందూ రాజ్యస్థాపనకు అడ్డుతగులుతున్న శక్తులను తొలగించికోవడం. నాలుగున్నర సంవత్సరాలుగా బిజెపి అమలుచేస్తున్న ఆర్థిక విధానాలు స ష్టించిన సామాజిక సంక్షోభం, ప్రజల్లో అభద్రత, అసమానతలు, సాంస్క తిక విధ్వంసం పట్ల ప్రజల్లో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ప్రజా ఉద్యమాలు నిరసనలు బిజెపిని కలవరపెడుతున్నాయి. రోజురోజుకు నరేంద్రమోడీ ప్రభావం తగ్గిపోతున్నది. దేశవ్యాపితంగా దళిత ఉద్యమం బలం పుంజుకుంటున్నది. ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడానికి వ్యూహరచనలో భాగమే అర్బన్‌ మావోయిస్టులనే శత్రువును స ష్టించింది బిజెపి ప్రభుత్వం. మావోయిస్టుల బూచిని చూపి ప్రజా ఉద్యమాలను, ప్రజల నిరసనను అణచివేయడానికి, మానవహక్కుల కార్యకర్తలను ప అరెస్టు చేస్తున్నది. దుర్మార్గమైన అప్రజాస్వామికమైన ఉపా చట్టాన్ని ఆయుధంగా వాడుతున్నది. ప ఉపా చట్టం ప్రభుత్వంపై అసమ్మతిని రాజకీయ అభిప్రాయాన్ని నేరంగా పరిగణిస్తుంది. భావప్రకటనా స్వేచ్ఛను, సంఘటితమయ్యే హక్కును చట్టవ్యతిరేకంగా భావిస్తుంది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు ఈ చట్టం వ్యతిరేకం. రాజకీయ సంస్థలను నిషేధించడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. కేవలం ఆటంకవాదులు, తీవ్రవాదులనే అనుమానం పేరుతో జైళ్ళలో నిర్బంధించడానికి అవకాశం ఉంది. ఈ చట్టం నేర న్యాయవ్యవస్థ (Criminal Justice System) మూలసూత్రాలను నిరాకరిస్తుంది. ఆగష్టు 28న జరిగిన అరెస్టులను కాంగ్రెస్‌ పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ఖండించాయి. కానీ ఈ ఖండనలు, మండనలు సరిపోవు. వచ్చే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మానిఫెస్టోలో ఉపా చట్టాన్ని రద్దుచేస్తామని ప్రజలకు హామీ ఇవ్వాలి. అప్పుడే రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు ప్రజాస్వామ్య మనుగడకు అవకాశం ఉంటుంది. ప ప్రజాస్వామ్య మనుగడకు, హక్కులు అవసరం. ప్రభుత్వ విధానాల పట్ల అసమ్మతి తెలియజేయడం, నిరసన తెలపడం భావ ప్రకటనా స్వేచ్చలో భాగమే. భావ ప్రకటన స్వేచ్ఛ సమాజానికి ఆక్సిజన్‌ లాంటిది. హక్కులు లేని సమాజం నిర్జీవంగా మారుతుంది. నియంత త్వానికి దారి తీస్తుంది. ఫాసిజం సులభంగా అమలవుతుంది. ప్రత్యేకించి బిజెపి పాలనలో పౌర, ప్రజాస్వామిక హక్కులు లౌకిక భావనలు, విలువల అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడింది. చరిత్రలో ప్రజలు నియంతలకు వ్యతిరేకంగా పోరాటాలు, త్యాగాలు చేసి హక్కులు సాధించుకున్నారు.

అనుభవాల నుండి పాఠకులు పాఠాలు నేర్చుకొన్నట్లుగా అధికరణం 352 ఉపయోగించకుండానే ప్రాథమిక హక్కుల్ని ఎలా రద్దుచేయగలమనే ఆలోచనకే మరో రూపం ఊపా చట్టం. పోటా చట్టం తర్వాత నవంబర్‌ 26,2008 ముంబాయి దాడుల తర్వాత, అన్‌ లా ఫుల్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌ 1967ను మళ్లీ అమెండ్‌ చేయబడింది. ఈ అమెండ్‌ మెంట్లో ఊపా 180 రోజుల పాట బెయిల్‌ రాకుండా ఉంచవచ్చు. ఊపా చట్టం పోలీసులకు విస్త మైన అధికారాలు ఇచ్చింది. అరెస్టుచేయడానికి, బూటకపు కేసులు నమోదు చేయడానికి ఈ చట్టం ద్వారా అవకాశాలు పొందారు. ఆర్టికల్‌ 19, ఆర్టికల్‌ 21లు ఈ చట్టం ద్వారా ఉల్లంఘించబడుతున్నాయి. అందుకే ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టం. ఎలాగైతే ʹగ్రేహౌండ్స్‌ʹ చట్ట వ్యతిరేక నిర్మాణంగా ప్రకటిస్తున్నామో ఊపా చట్టం కూడా అదే స్థాయిలో ఉంది. అందుకే ఊపా చట్టాన్ని వెంటనే రద్దుచేయాలి.

ప్రధాని ఇందిరాగాంధీ అధికార సంక్షోభం 1975 ఎమర్జెన్సీ కారణమైతే, సామ్రాజ్యవాద సంక్షోభం వివిధ దేశాలలో, ముఖ్యంగా ప్రజాఉద్యమాలు బలంగా ఉన్న దేశాలలో క్రూర నిర్బంధ చట్టాల ఏర్పాటుకు అవకాశం ఇచ్చింది. మన దేశంలో కూడా ప్రజా ఉద్యమాలు కూడా బలంగా కొనసాగే రాష్ట్రాలలో ఊపా చట్టం కంటే ముందుగానే ప్రత్యేక నిర్బంధ చట్టాలు చాలా అమలులో ఉన్నాయి. అందులో భాగంగానే 2005లో చత్తీస్గఢ్‌ ప్రత్యేక పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కొనసాగుతున్నది. ఈచట్టం ద్వారా కూడా ఆర్టికల్‌ 19 ఉల్లంఘన జరుగుతూనే ఉన్నది. దేశంలో ఉన్న పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ లన్నీ, పబ్లిక్‌ సేఫ్టీ యాక్ట్‌ (PSA) కూడా ఇటువంటి రాజ్యాంగ ఉల్లంఘనకే దారి తీస్తున్నాయి. ఈ పబ్లిక్‌ సేఫ్టీ యాక్ట్‌ కాశ్మీర్‌ ఈశాన్య రాష్ట్రాలలో అమలై ప్రాథమిక హక్కులను తీవ్ర స్థాయిలో అణచివేస్తున్నాయి. కాశ్మీర్‌ లో ప్రధానంగా బుర్హాన్‌ ఎన్‌ కౌంటర్‌ తర్వాత అందరినీ అనుమానితులుగానే పరిగణిస్తూ ఈ చట్టం కొనసాగుతున్నది. దీనికి తోడు అస్సాంలో, కాశ్మీర్లో అమలవుతున్న ఆస్పా (AFSPA) ప్రజల జీవించే హక్కుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. ప్రజాస్వామ్యం స్థానంలో ఫాసిజం అమలుకావడం అంటేనే ఎమర్జెన్సీ. పెరుగుతున్న ప్రజాఉద్యమాలకు సమాధానం ఇవ్వలేని ప్రభుత్వాలు అణచివేతకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ అనేక నిర్బంధ చట్టాలను తీసుకువస్తున్నాయి.

ఒకవైపు నిర్బంధాల ద్వారా ప్రజా ఉద్యమాలను బలహీనపరుస్తూనే, మరోవైపు ఇంకా అతి క్రూర నిర్బంధ చట్టాలతో ప్రభుత్వం దాడి కొనసాగిస్తున్నది. నిర్బంధ చట్టాలే కాదు, నిర్బంధ పోలీసు విభాగాలు కూడా ప్రజల్ని భయపెట్టడానికి, వారి హక్కుల్ని అణచివేయడానికి ఉపయోగపడుతున్నాయి. ఎపి, తెలంగాణలో గ్రేహౌండ్స్‌ బలగాలు, మహారాష్ట్రలో ష. 60 బలగాలు తమిళ్‌నాడులో క్యూ బ్రాంచీ బలగాలు ఒరిస్సా చత్తీస్గడ్లలో కోబ్రా, డిఆర్జి బలగాలు ప్రజల ప్రాథమిక హక్కుల్ని సైతం అణచివేస్తున్నాయి. దానికి ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక చట్టాలు ప్రధానంగా ఊపా చట్టం చాలా బాగా ప్రభుత్వానికి ఉపకరిస్తున్నది. ఇప్పటికే మూడింట 2వంతులు ఆదివాసులు ఊపా నిర్బంధ చట్టాన్ని ఎదుర్కొంటున్నారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం 67 శాతం ఊపా కేసులో నిర్దోషులుగా మరియు కేసులు కొట్టివేయబడే స్థితిని మనం చూస్తున్నాం. 2017లో 76 కేసుల్లో 65 కేసులను ఊపా నిందితులు నిర్దోషులగా విడుదల కాబడ్డారు. 2016 ఏడాది చివర్లో జాతీయ నేర విభాగ బ్యూరో లెక్కల్లో 75 శాతం నిర్దోషులుగా విడుదలయ్యారు. దేశంలోని ఇపుడు ఏ నేరం చేయని గౌతమ్నవలాఖ, సురేంద్ర గార్లింగ్‌, సుధా భరద్వాజ్‌, సోమాసేన్‌, అరుణ్‌ ఫరారే, వెర్నాన్గుంజల్వాస్‌, ఆనంద్‌ తేల్తుంబ్లె, వరవరరావు, సాయిబాబా, ప్రశాంతి రాహి, హేమ్‌ మిశ్రాలతో పాటు అనేకమంది ఆదివాసీలపై ఊపా కేసును బనాయిస్తున్నారు. ప్రజా ఉద్యమకారుల అందరిపై ఊపా కత్తి వేలాడుతూనే ఉంది. 1975 ఎమర్జెన్సీ ఎంతటి దారుణమో నేటి ఊపా చట్టం కూడా అంతటి ఎమర్జెన్సీని నిర్బంధాన్ని కొనసాగిస్తున్నది. వందలాదిగా ఆదివాసీలు ఊపా కేసులో ఏళ్లకు ఏళ్లు జైళ్లల్లో మగ్గుతున్నారు. ఖైదీలుగా ఉండి జీవించి ఉన్నారో, చనిపోయారో ఆచూకి లేకుండా ఆదివాసీలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ప్రాణాలతో పట్టుకుంటే ఊపాతో జైలు, కాల్చి చంపేస్తే ఎన్‌ కౌంటర్లో మావోయిస్టు హతంగా వారి జీవితం కొనసాగిస్తున్నది. గ్రామాల్లో జీవించాలంటే ప్రాణాలకు తెగించి బ్రతకాల్సిందే. 1975లో 21నెలల పాటు మాత్రమే మనుషుల లెక్కలు గల్లంతు అయ్యేవి. కానీ నేడు 2005 సల్వాజుడుం మొదలుగా గ్రీన్హంట్‌, సమాధాన్లతో ఆదివాసీ జీవితాలు నిత్యం గల్లంతు అవుతూనే ఉన్నాయి. అడవిలోని ఆదివాసీలకు గత 15 ఏళ్లుగా ఎమర్జెన్సీ కొనసాగుతూనే ఉంది. నూతనంగా ఊపా చట్టం వచ్చిచేరి నిర్బంధాన్ని తీవ్రతరం చేసింది. ఊపా చట్టాన్ని రద్దుచేసి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులైనా అధికారణం 19, 21లను ఖచ్చితంగా అమలుచేస్తేనే ప్రజాస్వామ్యం కొనసాగుతుందని భావిస్తున్నాం.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న వారందరూ అనుమానితులుగా, కుట్రకారులుగా, దేశద్రోహులుగా పరిగణించే స్థితి ప్రభుత్వాలకు ఏర్పడింది. ఇది ప్రభుత్వంలోని అప్రజాస్వామికతకు చిహ్నం. ఏ ప్రభుత్వమైనా సామ్రాజ్యవాద విధేయుడుగా ఉండకపోతే దేశంలో అధికారం కోల్పోవలసి వస్తుంది. ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించినా మావోయిస్టు ముద్రను ఎదుర్కొవల్సి వస్తుంది. దానికి రాహుల్‌, దిగ్విజయ్‌, ప్రకాశ్‌ రాజ్లు ఎవరూ మినహాయింపు కాదు. ప్రభుత్వం పెడుతున్న పాపా కేసుల్లో తాము నిందితులను కామని తామే నిరూపించుకోవాల్సిందే. దానికి ఏళ్ళకు ఏళ్లు కాలం తీసుకునే లాగా ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ప్రభుత్వం కుట్రపూరితంగానే బెయిల్‌ రాకుండా చేయడం, చివరకు జైల్లోనే మరణించాలే చేయడమే ఊపా కేసు లక్ష్యంగా మారుతుంది. అందుకే... ఉపా చట్టం ర‌ద్దు కోసం, ప్రాధమిక హక్కులైన ఆర్టిక‌ల్ 19ని రక్ష‌ణ కోసం ఐక్యంగా ఉద్య‌మించాల్సి త‌క్ష‌ణం అవ‌స‌రం ఎంతైనా ఉంది.

ఎన్‌. నారాయణ రావు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పౌరహక్కు సంఘం


No. of visitors : 421
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
  మనిషిని బంధించినంత మాత్రాన....
  జి.యన్. సాయిబాబా, వరవరరావుల విడుదలను కోరుతూ ప్ర‌పంచ‌ మేధావుల విజ్ఞప్తి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •