చరిత్ర కన్న శిశువు - చరిత్రకు మార్గదర్శి

| సాహిత్యం | వ్యాసాలు

చరిత్ర కన్న శిశువు - చరిత్రకు మార్గదర్శి

- పాణి | 03.08.2019 11:16:13pm

కా. చారుమజుందార్‌కు నూరేళ్లు. ఆయన నిర్మించిన విప్లవ పార్టీకి యాభై ఏళ్లు. ఆయన ఆరంభించిన నక్సల్బరీకి యాభై రెండేళ్లు. ఆయన జీవించింది యాభై మూడేళ్లు మాత్రమే. ఇది చారుమజుందార్‌ శతజయంతి సంవత్సరం. ఈ జూలై 27 నుంచి శతజయంతి కార్యక్రమాలు ఆరంభమవుతున్నాయి. చరిత్రలో ఆయన వేలాది విప్లవకారుల మూర్తిమత్వంగా రూపొందారు. చారుమజుందార్‌ నక్సల్బరీ నిర్మాత మాత్రమే కాదు. ఆయన ఆలోచనలు భారత విప్లవోద్యమంలో నేటికీ కొనసాగుతున్నాయి. ఆయన కలలు బీజరూపంలో వాస్తవమవుతున్నాయి.

ఆధునిక భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావశీల వ్యక్తి చారుమజుందార్‌. భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ఆయనలాంటి వ్యక్తి ఆయన ఒక్కడు మాత్రమే. ఆయన దేశ చరిత్రను ఒక పెద్ద మలుపు తిప్పారు. భారత కమ్యూనిస్టు ఉద్యమాన్ని వర్గపోరాట పట్టాల మీదికి ఎక్కించారు. ఈ ప్రయాణంలో అంతులేని సంక్షోభాలు ఉన్నాయి. లెక్కలేనన్ని ఒడుదొడుకులు ఉన్నాయి. కానీ కొనసాగింపు ఉన్నది. విస్తృతి ఉన్నది. విప్లవ తీక్షణత ఉన్నది. వీటన్నిటి వెనుక చారుమజుందార్‌ ఉన్నారు.

ఆయన గురించి చెప్పే ఏ మాట అయినా చారిత్రక విశ్లేషణకు లోబడి ఉండాలి. చరిత్రతో సంబంధం లేకుండా చారుమజుందార్‌ను అర్థం చేసుకోలేం. నక్సల్బరీకి ముందు పార్టీలో ఆయన జిల్లా స్థాయి నాయకుడు. కాకపోతే అప్పటికే ఆయనకు తెభాగా ఉద్యమ అనుభవం ఉన్నది. పార్టీ చరిత్రలో ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న కామ్రేడ్స్‌ వందలాది మంది ఉన్నారు. దీనికి భిన్నమైన వ్యక్తిగా చారుమజుందార్‌ రూపొందారు. మిగతా వాళ్లకంటే భిన్నమైన పాత్ర పోషించారు. దాన్నంతా వ్యక్తిగా ఆయన ప్రత్యేకతల్లోకి కుదించడానికి లేదు. అలాంటి ప్రత్యేకతలు అందరికీ ఉన్నట్లే ఆయనకూ ఉన్నాయి. వాటిని గుర్తిస్తూనే ఆయన పాత్రను చరిత్రలో భాగంగా చూడాలి. చరిత్ర నిర్మాణంలో భాగంగా చారుమజుందార్‌ వ్యక్తిత్వ నిర్మాణాన్ని కూడా చూడాలి.

నిజానికి ఏ చారిత్రక వ్యక్తినైనా ఇలాగే చూడాలి. చరిత్రతో సంబంధంలేని వ్యక్తి గుణ గానం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఏ కొత్త విషయమూ తెలియదు. చరిత్రలో వాళ్ల నిజ పాత్ర అర్థం కాదు. ఈ దృష్ట్యా ఆయన్ను స్థూలంగా రెండు ప్రాతిపదికలపై పరిశీలించవచ్చు. ఒకటి: నక్సల్బరీ పంథా నిర్మాతగా ఆయన పాత్రను అంచనా వేయాలి. రెండు: ఈ యాభై ఏళ్ల విప్లవోద్యమ చరిత్రలోంచి ఆయన ప్రాసంగికతను ఎత్తి చూపాలి. ఆయన శత జయంతి సందర్భంలో విప్లవ శక్తులు చేయాల్సిన కనీసమైన పని ఇది. ఈ చారిత్రక రాజకీయ ప్రాతిపదికల మీది నుంచి సాహిత్య సాంస్కృతిక మేధో రంగాలపై ఆయన వేసిన ప్రభావాన్ని పరిశీలించవచ్చు.

అయితే చారుమజుందార్‌ను చారిత్రకంగా అర్థం చేసుకోవడానికి కూడా రెండు పెడ ధోరణులు అడ్డం ఉన్నాయి. దీనికీ చరిత్రలోనే కారణాలు ఉన్నాయి. ఆయన సొంత వ్యక్తిత్వంలో కూడా ఉన్నాయి. ఆయన ఎంత ప్రభావశీలమైన నాయకుడంటే ఈ తరానికీ ఆయన విప్లవ కథా నాయకుడు. బహుశా విప్లవ శిబిరంలో భగత్‌ సింగ్‌ తర్వాత అంత ప్రజ్వలనశక్తి చారుమజుందార్‌కే ఉన్నది. అదే సమయంలో ఆయన మీద ఒక హేతుబద్ధ విమర్శను కూడా సహించలేనివాళ్లు ఇప్పటికీ ఉన్నారు. అలాంటి ఉద్వేగ స్థితి విప్లవ శిబిరంలో ఉంది. మూడు తరాల తర్వాత కూడా అది ఉన్నదంటే ఆయన పాత్ర ఏమిటో తెలుసుకోవచ్చు. ఆయన విప్లవ ప్రభావం ఏమిటో గమనించవచ్చు. అందుకే చరిత్రలో ఆయన నిత్య పునర్జీవన శక్తి. చరిత్ర ప్రజల భౌతిక ఆచరణను మాత్రమే భవిష్యత్‌ తరాలకు అందించదు. ఆ ఆచరణలోని ఉద్వేగాలను కూడా నిత్యం సరఫరా చేస్తుంది. అదే తిరిగి భౌతిక ఆచరణకు పురికొల్పుతుంది. అంటే చరిత్రలో మానవ అనుభవం మాత్రమే ఉండదు. దాని చుట్టూ పోగుపడిన ఉద్వేగాలు కూడా చరిత్రలో భాగమే. దీన్ని అర్థం చేసుకోలేకపోతే చరిత్రలోని చాలా విషయాలు విస్మరణకు గురవుతాయి. అయితే విస్తారమైన ప్రజా ఆచరణలో భాగమైన చారుమజుందార్‌లాంటి వ్యక్తులను ఉద్వేగాల నుంచి సక్రమంగా అంచనా వేయలేం. చరిత్ర-చారుమజుందార్‌ అనే ఫ్రేంవర్క్‌లో పరిశీలించాలి. లేకపోతే హేతుబద్ధత లోపించే ప్రమాదం ఉంది.

అలాగే ఆయన చుట్టూ చాలా వివాదాలు ఉన్నాయి. అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పరస్పర విరుద్ధమైన అంచనాలు ఉన్నాయి. ఇవి ఇప్పుడు వచ్చినవి కావు. ఆయన ఒక ఉత్తేజపూరిత నాయకుడిగా జీవించి ఉన్న రోజుల్లోనే ఈ వివాదాలు తలెత్తాయి.

ఆ వివరాల్లోకి ఇప్పుడు వెళ్లనవసరం లేదు. అయితే ఒకటి రెండు మాటలు చెప్పుకుంటే సరిపోతుంది. భారత విప్లవోద్యమం ఇప్పుడీ దుస్థితిలో ఉండటానికి చారుమజుందార్‌ నాయకత్వంలో నక్సల్బరీ మొదలు కావడమే కారణం అనే వాళ్లున్నారు. అనేక పరిస్థితుల వల్ల ఆ ఉద్యమానికి ఆయన నాయకుడు కావడం తటస్థించి ఉండవచ్చు.. కానీ భారత విప్లవోద్యమానికి నాయకత్వాన్ని అందించే స్థాయి ఏ రకంగానూ ఆయనకు లేదు.. అందుకే ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టం విఫల సన్నివేశంగా మారిపోయిందనే వాళ్లూ ఉన్నారు. ఈ కారణం వల్లే నక్సలైట్‌ ఉద్యమంలోని త్యాగనిరతిని గౌరవిస్తాం..కానీ ఆ మార్గాన్ని అంగీకరించలేమని అంటూ ఉంటారు. అసలు నక్సల్బరీ పంథా విప్లవ మార్గమే కాదని తేల్చేసేవాళ్లనూ చూస్తుంటాం. ఇదొక చారిత్రక అంధత్వం.

ఈ రెండు పెడ ధోరణులు ఇప్పటికీ మన చుట్టూ ఎంతో కొంత బతికే ఉన్నాయి. చారుమజుందార్‌ను చారిత్రకంగా అంచనా వేసేటప్పుడు వీటిని మర్చిపోడానికి లేదు. అలాగే ఈ యాభై ఏళ్లలో విప్లవోద్యమంలో చాలా మార్పులు వచ్చాయి. మన వ్యవస్థలో తీవ్రమై మార్పులు జరిగాయి. వ్యవస్థ పని తీరు మారింది. రాజ్యం విస్తరించింది. అనేక కొత్త ఉద్యమాలు రంగం మీదికి వచ్చాయి. ఈ వ్యవస్థ సహజంగానే తనకు తగిన ఒక కొత్త తరాన్ని ఇప్పుడు తయారు చేసుకుంది. దానితో కలిసి నడుస్తోంది. ఈ కొత్త తరం మానసికతలో వ్యవస్థ ప్రతిబింబిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక కొత్త సామాజిక చారిత్రక భావజాల ప్రపంచంలో విప్లవం చేస్తున్నాం. దాని లోతుపాతులను అన్వేషిస్తున్నాం. ఈ కొత్త ప్రపంచంలో విప్లవోద్యమం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. సవాళ్లు విప్లవోద్యమం ముందుకే వచ్చి నిలబడతాయి. వర్గపోరాటమే అన్ని సవాళ్లను పరిష్కరిస్తుంది. కాబట్టి ఇదేమీ ఆశ్చర్యకరం కాదు. అయితే ఇదొక కొత్త సంక్షోభం. దీని అర్థం ఏమిటో తెలుసుకుంటూ విప్లవోద్యమం పురోగమిస్తోంది.

ఇప్పుడున్న ఈ సంక్షోభాన్ని విప్లవ సంక్షోభంగా మార్చడం ఎలా అనేదే ఇవాళ కార్మికవర్గం ముందున్న సవాలు. ఈ సంక్షోభ తీవ్రతను చూపి నిన్నటి దాకా గడించిన విప్లవోద్యమ అనుభవాలను తక్కువ చేసేవాళ్లుంటారు. ప్రజలు గడించిన ఆచరణాత్మక జ్ఞానాన్ని తిరస్కరించే వాళ్లుంటారు. పనిలో పనిగా నక్సల్బరీ ఆరంభకుడైన చారుమజుందార్‌ను తప్పుగా అర్థం చేసుకొనే వాళ్లుంటారు. వీటిని పూర్వపక్షం చేస్తూ చారుమజుందార్‌ గురించి మాట్లాడుకోవాలి. ఆయన గురించి చర్చించుకోవడమంటే వర్తమాన సంక్షోభాన్ని విస్మరించి గతంలోకి జారిపోవడం కాదు. ఆనాటి ఒకానొక వ్యక్తిని స్మరించుకోవడం కాదు. అప్పటి ఉత్తేజంతో వర్తమాన ప్రపంచంలో చేయాల్సిన విప్లవాన్ని ఊహించడం కాదు. కాల్పనికంగా వర్ణించడం కాదు.

ఈ అప్రమత్తతతో చారుమజుందార్‌ చారిత్రక పాత్రను అంచనా వేయాలి. ఆయన ప్రాసంగికతను విశ్లేషించాలి.

(చారుమజుందార్‌ శతజయంతి సందర్భంగా జూలై 27న కలకత్తాలో జరిగిన సదస్సు పత్రం నుంచి కొంత భాగం )


No. of visitors : 462
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సాహ‌సోపేత జీవితం
  నలబై వసంతాల దండకారణ్యం
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •