దళిత నవలా సాహిత్యంలో ఒక మైలురాయి "నిషిధ"

| సాహిత్యం | స‌మీక్ష‌లు

దళిత నవలా సాహిత్యంలో ఒక మైలురాయి "నిషిధ"

- సమీర | 03.08.2019 11:28:36pm


నిషిధ - ʹఆదిశంబరుడు ఓడిపోలేదుʹ అనే ట్యాగ్ లైన్ తో న‌ల్లూరి రుక్మిణి రాసిన 384 పేజీల నవల ఖాదర్ మొహియొద్దీన్, ʹఈ నవల దళిత సాహిత్యంలోనూ అంతర్భాగంʹ అనే యోగ్యతాపత్రంతో, కేఎన్‌పీఎస్ దుడ్డు ప్రభాకర్, న్యాయ వాది జీఎస్ నాగేశ్వరరావు ముందు మాటలతో ఆగస్టు 2017 లో వెలువడింది. ఈ న‌వ‌ల‌లో 29 విభాగాలు ఉన్నాయి.

నవల ప్రధానాంశం, కులవర్గ ఆధిపత్య వర్గాల, ఉత్పత్తికి, వస్తు సేవలకే పరిమితం చేయబడినా, ద్వితీయ శ్రేణులుగా కొందరినీ, అంట‌రానివాళ్లుగా మరియు కొందరినీ విభజించిన భారతీయ సమాజం లోని మానవ సమూహాల నడుమ ఆత్మ గౌరవ పోరాటాల పోరు. పోరుంది గనుక, అవసర మైన న్యాయస్థానాల, లిఖిత న్యాయసూత్రాల వాటి అమలుతీరుల విధి విధానాల ప్రస్థావన అవసరమైంది.

ఇంత పెద్ద కాన్వాస్ కలిగిన వస్తువు కనుక, నవల అనివార్యంగా పెద్దదైంది. ఇంత పెద్ద నవలకు సమగ్రంగా విమర్శ రాయడానికి ఈ అంతర్జాల పక్ష పత్రిక స్పేస్ నూ, పాఠకుల పరిమి తులనూ దృష్టిలో ఉంచుకొని కూడా, విధిం చుకున్న పరిమితుల దృష్ట్యా అవసరమైతే దాటవేతలతోనైనావీలైనంత క్లుప్తంగానే రాయక తప్పదు. అందుకు విభాగాలవారీ కొన్ని ముఖ్యమైన ఉటంకింపులూ, వెనువెంటే విమర్శరాస్తూ కొన సాగక తప్పదు.

1వ విభాగం: అగ్రవర్ణ ఆధిపత్య పీడనకు హింసకు గురైన ఒక దళితుని ఆవేదన "ఓ దయామయుడైన ప్రభువా, మా కోసం నీ రక్తాన్ని చిందించి, మమ్మలను సజీవులుగా వుంచావా నాయనా...మేం అస్పృశ్యులం.. కానీ మాకాలితో తొక్కి, చేతులతో విత్తి, మేం పండించినవి మీరు తింటరు. వాటికి అంటు లేదు. ఎందుకు? అవి మీ సొంత ఆస్థిగా మారి పోతాయి. అవి తిన్న మీ పిల్లలు విశ్వాసంతో,ధైర్యంతో సమాజంలో తలెత్తుక తిరుగుతారు. సమా జాన్ని శాసిస్తరు.
పై ఆవేదనా ప్రకటనలో, ʹమమ్ములను సజీవులుగా వుంచావాʹ అనకూడదు. ఐనా బైబిల్ అట్లే అంటది. అనిపిస్తది. ఎందుకు?

అది పీడకవర్గాల ప్రయోజన మత గ్రంథం. మనం దాన్ని జీవచ్ఛవులుగా వుంచావా ..ʹ అని సవరించి అనిపించాలి.

2 వ విభాగం: ʹహై కోర్టులో కాయితాలే తప్ప, మనుషుల ముఖాలు కనబడవు. బాధితుల స్వరాలు వినపడవు.ʹ వాస్తవ చురక.

3వ విభాగం: ʹఅప్పటికి పల్లెలో వాళ్ళు పాతిక మంది దాకా, గ్యాంగ్ మెన్ లుగా రైల్వేలో చేరారు. వాళ్ళంతా తమ పిల్లల్ను చది వించాలను కున్నరు. రైల్వే స్టేషన్లోను, పనుల దగ్గర ఆఫీసర్లను చూసి, తమపిల్లలు కూడా అలా ఉండాలని కోరుకుంటున్నారుʹ

ఆంగ్లేయుల‌కు అవసరమైంది. వాళ్ళ కవసరమైన గుమాస్తాలు, అధికార్లే గనుక, ఆ మట్టి అంటని చెమటోడ్చని స్థిరాధాయ‌ పోష్ ఉద్యోగం అపురూపంగానే ఉంటది పీడిత జీవులకు.

4వ విభాగం: ʹఓ ఎంత అమాయకులండీ, అందుకే రచయిత అయ్యారు. ...వాళ్ళ వాళ్ళ ఛానెల్స్ ద్వారా జడ్జీలకు డబ్బులందే కేసులెన్ని? రాజకీయ నాయకులు, రౌడీలు, మర్డర్స్, రేపిస్టులు, కార్పొరేట్ దొంగలు ఒకరేమిటి, అంత భారీ కేసుల్నుండి కూడా ఎట్ల బైటపడి వస్తున్నరు? డబ్బు కాకపోతే మరోరూపం. డబ్బూ కులమూ రాజకీయాలకు న్యాయస్థానాలు అతీతమా ఏమి?ʹ
ʹపేద జనం సుదీర్ఘ కాలం కట్టుబాటుగా ఒకేమాట మీద నిలబడ్డం కష్టం... జీవనం వెదుక్కుంటున్న క్రమంలో శత్రువు కూడా ఎరవేస్తుంటాడు.ʹ లింకన్ అనేపాత్ర, రచయిత రాజుతో. సోకాల్డ్ స్వతంత్ర్య ప్రతిపత్తి గల రాజ్యాంగ మూడోస్థంభం మీద కుల ఆస్తిపర ఆధి పత్యాల ప్రభావ అల్లిక జిగిబిగి, గజిబిజిల వివరణ, అంతిమంగా ఉన్న డొల్లతనం వివరణలు.

5వ విభాగం: సొంతానికి చారెడు నేల యేడాదిలో సగం రోజులకైనా సొంత గ్రాసం లేనివాళ్ళ మాటలు ఎంత గంభీరంగా ఉన్నా, అవి ఆస్తులున్న వారిముందు కుప్పిగంతులుగనే మిగిలి పోవడం సహజం, రచయిత. ఏందే ఎదురుమాట్లడుతున్నావ్! మాచేలో ఏం లేకపోతే మాత్రం మీ గొడ్లను తోలాలని ఉందా? చేను చెట్టూలేనోల్లకు గొడ్లెందుకు? హెచ్చులు కాక పోతే!ʹ... ..., ʹఇప్పుడు అల్లుడి
సంగతెందుకయ్యా, మాట మాట్టాడితే, ʹమీకు ఋఉజ్జోగాలుండయనా, అదనా, ఇదనా, ఆఓర్వలేని మాటలు మాట్లడుతరు..ʹ

రత్తమ్మ ధిక్కారం తిప్పి రెడ్డికి నషాళానికి అంటినట్లైంది.మాటలతో గెలవలేని అతడు,ʹమాల్లంజా మాటకు మాటంటవాʹఅని
రత్తమ్ము చెంపమీద ఒక్కటి లాగి కొట్టాడు.

పైసంఘటన ప్రస్తావనలో స్వంత భూమికీ అహంకారం,ఉద్యోగంతో ఆత్మగౌరవానికీ గల సంబంధం చూపి,మార్క్స్ ఆస్తిపర వర్గపోరాట ఆవశ్యకతనూ ,అంబేద్కర్ నిమ్నకులాలకు రిజర్వేషన్ ప్రతిపాదన,తద్వారా కలిగే నిలిచే ఆత్మగౌరవ సహేతుకతలనూ వివరిస్తారు.

పై సంఘటన తర్వాతి పరిణామ ప్రభావం వల్ల ఆస్తిపర అగ్రవర్ణ దళిత అవర్ణ సమూహం లోని తర్జన భర్జనలు.

ʹమాలదాన్ని కొడితేమాత్రం ఊరిమీదకు వస్తారాʹ మల్లేశ్వర్ రెడ్డి ఆవేశపడ్డాడు.

ʹఆ రాడికల్ పిల్లలు వచ్చిపోయినాక ఈ పిల్లలకు దమ్ము ఎక్కువైంది.లేకపోతే ఊళ్ళోకిపోయి ఆసాములతో గొడవ పెట్టుకునుడేంది?ʹ దళిత రాజయ్య.

6వ విభాగం: ఛీ నీ దేవుడు తగలడా!పాపులంతా మాలామాదిగోళ్ళేనంటారా!ఏదీ ఒక్క సారన్నా!వెయ్యేళ్ళకొక్కసారరన్నా-అట్టా తెరతీసినట్టు భూమిమీదకు ఆదేవుడుండే చోటు చూపించకూడదూ!మనుషులు ఇంకా భయంతో అంతా పున్నెమే చేస్తారుగా!"

7వ విభాగం: ʹఅసలు అంటరానికులం అనేది దానికదే ఒక మహా బ్రహ్మరాక్షసి... దీన్నుంచి తప్పించుకోవడం ఎట్లా నన్న క్షోభ ఎలా ఉంటుందో మరొకడికి అర్థం అయ్యేది కాదు.ʹశేఖర్ ముఖంలో...ʹకులం కలవరం!

8వ విభాగం: అగ్రవర్ణాల పిల్లలకెదురు తిరిగి దాడి చేసిన ఘటనకు బదులుగా,అగ్రవర్ణ కులాల ఆసాములు, పాఠ శాలలోనికి ప్రవేశించి అసలు పల్లె పిల్లలనే బడికి రావొద్ధని బెదిరించి వెళ్ళగొట్టడమే గాక, రానీయొద్దని టీచర్లకు ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేయడం, కుదరదని నచ్చజెప్పబోయిన టీచర్ల తోనూ గొడవ పడడం.

10వ విభాగం: ʹతమచేతులకు తామే సంకెళ్ళు వేసుకొనేట్లు దైవనిర్ణయం పేరుతో మను షులను బానిసలుగా చేయడం ఈభూగోళం మీద ఎవరికి ఎక్కడ సాధ్యమైంది, ఇంతటి పుణ్యభూమిలో తప్ప. ʹఊళ్ళో ఉండడంవల్ల ఆస్తిపర పెద్దకులపోల్లు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ, తరచుగ కయ్యానికి దిగడం పల్లె పిల్లలకూ ఊరివాళ్ళకూ ఘర్శణలు తలెత్తుతున్నయనీ, తలిదండ్రులతో బలవంతంగా తెనాలిికి సమీపంలోని చిర్రావూరికి పంపబడ్డ శేఖర్ బాబు అంతర్మధన ఆవేదన. అతని శరీరం చిర్రావూరిలో,మనుసు పల్లెలో ఉంది.

ఇట్లా ఊరిలోని పెద్ద కులాలకూ బీసీలతో కలిపి; ఇతర ఉద్యోగ చదువుఅవకాశాలు లభ్యత వల్ల స్వయం పోషకత్వం, ఫలితంగా ఆత్మగౌరవ స్పృహ పెరుగుతున్న దళిత కులాల ʹఅంటరానిʹ మాలమాదిగ పిల్లలకూ ప్రతీ సందర్భంలో ఘర్శణలూ పొలీస్ స్టేషన్ లు నిత్యకృత్యమైపోతున్నవి.

12వ విభాగం: ʹఇది అల్లూరకో, నడుము గడ్డకో, కోడూరుకో సంబంధించిన సమస్య కాదు. ప్రతి పల్లెస్వేచ్చ కోసం, గౌరవంకోసం పెనుగులాడుతున్న సందర్భంస‌ అని వాస్తవ సోదాహరణ సంఘటనలతో ఏ ఘటనా సందర్భాన్ని విడవకుండా ఓపికగా విస్తారంగా చెబుతారు రచయిత. ప్రతి సంఘటనా సందర్భం ఉత్కంఠ పూరిత మైనదే.

ʹజులై 17న... కులంపేరుతో కారంచేడులో కమ్మ సామాజిక వర్గంలోని కొందరు పోగై, మాదిగ పల్లెమీద హఠాత్తుగ దాడి చేసి
చిక్కిన వాళ్ళను చిక్కనట్లు పొడిచి... ...ʹ తర్వాత పరిణామాలు అల్లూరులోని దళిత విద్యావంతులైన విద్యార్థి యువకుల చైతన్యానికి ఎట్లా స్ఫూర్తి నిచ్చిందో, తదనంతరం అస్ఫూర్తి పోరాటాలకు ర జ్యాంగ బద్ధ రిజర్వేషన్ ఫలితాలు కూడా తోడై వచ్చిన అవకాశాలు కూడా ఆ ప్రాంత దళితులకైనా సంపూర్ణ స్వేచ్ఛను ఆత్మగౌరవాన్ని ఇవ్వడం అటుంచి కొత్త క‌సితో కూడిన ఘర్ష‌ణను ఎదుర్కోవడం, తద్వారా పోలీసుకేసులు, కోర్టులూ తప్పలేదు.

ఇట్లా ఇలా ఇక 27వ విభాగంనుండి,చివరి 29వవిభాగంవరకు పోలీసు కేసులు,న్యాయస్థానాలు,పబ్లిక్ ప్రైవేటున్యాయవాదులు, బాధితులవైపుసాక్ష్యులను చుట్టుముట్టిన బుజ్జగింపు లు బెదిరింపులు, తత్ఫలిత నిర్వేదాలు నిలదొక్కుకోవడాలు,అందుకు గల ప్రయత్నాలకో మంచి ʹఔనాʹఅనిపించే వింత ఉదాహరణ ఒకటి: "నన్ను నా బెంజిమెనే నిండా ఆవహించి ఉండాలని కోరుకున్న,అందుకే ఇంటికి పోయి నాచొక్కా విప్పేసి, వాడిదే ఈ చొక్కా,ఇది వేసుకున్నా.ఇది వేసుకున్న దగ్గరనుండి, వాడు నాభుజం మీద పడుకోని ఉన్నట్టుగా, నా వీపుమీద ఎక్కి ఆడుకున్నట్టుగా ఉందని, వాడిపుడు నావీపుమీదున్నడు, అందుకే వాడిని చూస్తూ సాక్షం చెప్పాʹడైలాగులు కండ్లను తడి చేస్తవి.

ఐనా,స్వయంగా న్యాయవాది యైన నవలా రచయిత,4వ విభాగంలో చెప్పిన ప్రభావాలన్ళీ పనిజేసి బాధితులకు,అగ్రవర్ణ న్యాయ మూర్తి చివరకుఅన్యాయ తీర్పే వెలువరించారు.

ఖిన్నులైన అంటరాని కులస్థులకు,సంపద సృష్టికర్తలకు నిస్పృహే మిగిలింది. అమాయక నిరక్ష్యరాస్యులకు దేవాలయ కొత్త రూపం, చర్చే,అందులో ప్రభుప్రార్థనే ప్రత్యామ్నాయ ఉపశమన కేంద్రమైంది.

భౌతిక వాస్తవమే ఐనా,ఇది చెప్పనీకె సాహిత్త్యమే ఎందుకు! కాల్పనికమే ఐనా, కాల్పనికత యెటువంటిదైనా ఆశాజనిక ముగింపు ఉండక పోతే ఎట్లా?!

ముందు మాట రాసిన వాళ్ళలో ఒకరైన ఖాదర్ మొహియుద్దీన్ కితాబు ఇచ్చినట్లగా ఈ నవల దళిత నవలా సాహిత్యంలో ఒక మైలురాయే.

ముగింపు రీత్యా దళిత విప్లవ సాంస్కృతిక నవల కాదు.

ఐనా ఇది ఆంగ్ల భాషలోనికి తర్జుమా ఐ విస్తృత గ్లోబల్ ప్రపంచంలోనికి పోవలసిన వాస్తవికతకు అద్దంపట్టిన(non fiction) నవల.

No. of visitors : 384
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..
  ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీల జీవితాలు మారుతాయoటున్న శీలా సుభద్రాదేవి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •