నిశ్శబ్దంగానో, నిర్మాణంగానో

| సాహిత్యం | క‌విత్వం

నిశ్శబ్దంగానో, నిర్మాణంగానో

- కేక్యూబ్ | 03.08.2019 11:34:43pm

ఇప్పుడు కవిత్వం కావాలి కవిత్వం. ఇదొక నినాదంగా చాలా రోజులుగా తెలుగు నేలపై వినిపిస్తోంది. నిజంగా మనకు కవిత్వమే కావాలా? అవును కవిత్వం కావాలి. కానీ కవిత్వంతో పాటుగా జీవితమూ కావాలి. జీవితంతో ముడిపడని కవిత్వం కవిత్వం అవుతుందా? కాదు అన్న వాదాన్ని నొక్కేసే గొంతులూ ప్రబంధాల కాలం నుండీ ఎగసిపడ్డాయి. కానీ జీవితాన్ని పెనవేసుకోని కవిత్వం కవిత్వంగానే మిగిలిపోయింది. జీవితంతో ముడివేసుకున్న కవిత్వం ప్రజలకు చేరువవుతూనే వుంది. ఇక్కడ జీవితమంటే కూడా మరల మనం వర్గ సంబంధాలని ఎరుకలో వుంచే చూడాల్సిన అవసరముంది. అణగారిన పీడిత తాడిత వర్గాల పక్షాన నిలిచే రచన అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ అవసరమే. ఇది రచయిత దృక్పధాన్ని తన దృష్టికోణాన్ని తెలియచేస్తుంది. సాహిత్య సాంస్కృతిక రంగంలో విప్లవ చైతన్యంతో పనిచేసే కార్యకర్తలుగా మిగిలిన వర్గాలనుండి వేరు చేసేదిగా వున్నా సరే ఇది అవసరం. ఇలా అదే చైతన్యంతో రాసే కవులు రచయితలను కలుపుకు పోవాల్సిన సందర్భమిది. ఎందుకంటే ఇప్పుడు రెండు శిబిరాలే మిగిలే కాలం కనుక. మైనార్టీగా కనిపించినా సరే ప్రజల చైతన్యం పెల్లుబికినప్పుడు లక్షలాదిగా కదిలే ప్రజా సైన్యం మట్టికాళ్ళ మహా రాక్షసిని ఓడిస్తుంది.

రాజ్యం ప్రశ్నించడాన్ని భరించలేకపోతోంది. ఏమాత్రం తనను ప్రశ్నించినా వారిని దేశ ద్రోహులుగా కొత్తగా అర్బన్ నక్సల్ అన్న పేరొకటి ప్రాచుర్యంలోకి తెచ్చి మిగిలిన బుద్ధి జీవులనుండి వేరు చేస్తూ నిర్బంధిస్తూ హత్యలు చేస్తూ దాడులు చేస్తూ వేళ్ళ మీద లెక్క పెట్ట గలిగిన వాళ్ళని కూడా ప్రజల వైపు లేకుండా చేసే పెద్ద ఎత్తున విరుచుకు పడుతోంది. ఈ సందర్భంలో ఏ చిన్న మాటైనా పెద్ద భరోసానిస్తుంది. ఎక్కడ ఓ చిన్న ప్రకటన అదీ ఓ ట్విట్టర్ లో మాటైనా కార్టూన్ అయినా ఒక స్వాంతనగా మిగులుతోంది. అలా అలా ఈ మాటలూ రాతలూ ఈ చీకటి వాతావరణంలో ఓ చిన్న వెలుగు రేఖలా మారి రేపటి ఉదయాన్ని హామీనిస్తాయి.

అలాంటి హామీనిచ్చే ఓ కవిత యువకవి బాలసుధాకర్ మౌళి నీళ్ళలోని చేప కవితా సంపుటిలోని "నిశ్శబ్దంగానో, నిర్మాణంగానో" కవితలోని వస్తువు మనల్ని ఆకట్టుకుంటుంది. ఇందులోని వస్తువుతో పాటుగా కవి నిర్మాణ పద్ధతి కూడా మనకు కొత్త అనుభూతినిస్తుంది. తనెంచుకున్న వస్తువును దాటి పోకుండా సరళమైన భావ చిత్రాలతో చీకటి వాతావరణంలోని తీవ్రతను తెలియ చేస్తూనే కవిత్వాన్ని చేయడం మన హృదయాన్ని దాటిపోదు. ప్రవాహంలా తన గొంతును వినిపిస్తూ రేపటిపై భరోసాను కలిగిస్తాడు. ఈ సందర్భంలో బయటి నుంచి వచ్చే ఈ చేతులిచ్చే హామీ కావాలి. ఇలా చెప్పడం కవిని వేరు చేసి చెప్పడం కాదు. కవి ప్రజలతో పాటుగా ప్రయాణం చేస్తున్నాడని గుర్తించడమే.

ప్రశ్నని
కూల్చివేస్తున్న సందర్భంలో
బతుకుతున్నాం

ఈ వాక్యం మొత్తం కవిత యొక్క ఆత్మని పట్టిస్తుంది. అయితే ఈ సందర్భాన్ని బద్దలు కొట్టడానికి కవి ఏం చేస్తున్నాడో చెపుతున్నాడు

ఒక కొనని అందుకుని
ఎగబాకుతున్నాను
తెగిన తీగలను
ముడి వేస్తున్నాను
ఒక అవిచ్ఛిన్న రాగాన్ని ఎత్తుకుని
అవిశ్రాంతంగా ప్రవహిస్తున్నాను
బతుకు చీకటి సొరంగంలోంచి
రెండు లేత కళ్ళని బయటకు పెట్టి
భూమిని
తనివితీరా హత్తుకుంటున్నాను

ఇది కవి కవిత్వం చేయాల్సిన పనికదా? విడిపోతున్న గొంతులను పెనవేసుకుంటూ వారితో పాటుగా ప్రయాణిస్తూనే తనది కాకుండా పోతున్న భూమిని దానిపై హక్కును కాపాడుకోవడానికి దేహమంతా చేతుల్ని చేసి హత్తుకుని నిలబడడం. ఈ నిలబడడం అవసరమిప్పుడు. ప్రజలతో పాటుగా నిలిచి పోరాడే శక్తుల అవసరాన్ని వైయక్తికంగా మొదలుపెట్టి సమూహంతో పాటుగా కలిసిపోవాలన్న కాంక్షను వ్యక్తం చేయడం ఇక్కడ గమనించ వచ్చు. చిలీ కవి అన్నట్టుగా చీకటి కాలంలో చీకటిని గానం చేసే గొంతు కావాల్సిన సందర్భమిది. సరళమైన పదాలతో ఒక గొప్ప వ్యక్తీకరణను సాధించడమే నేటి కవిత్వ లక్షణం కదా?

నిశ్శబ్దంగానైనా
నికార్సైన ఒక వాక్యాన్ని పేని
సమూహంలో నిలబెడతాను

బారులు తీరిన పాదాల్లోంచి
భూమి మొలకెత్తుతుంది

నిజమే కదా పాద రక్షలు కూడా లేని రైతు పాదాలు వేలాదిగా నెత్తురోడుతూ కదిలి రాజ్యాన్ని భయకంపితుల్ని చేయడం మనమిటీవల చూసాం. ప్రజలే చరిత్ర నిర్మాతలు అనేది ఎప్పుడూ రుజువవుతూనే వుంది. ఒక వెల్లువలా కదిలే ప్రజా సమూహం ముందు ఎన్ని మరతుపాకులైనా ఓడిపోవాల్సిందే అన్నది చరిత్రలో నిరూపితమైంది. ప్రజల పట్ల వున్న నమ్మకమే చైతన్య ప్రవాహమవుతుంది. ప్రజలలో అంతర్లీనంగా నిశ్శబ్దంగా రగిలే నిప్పుని రాజేసే కవిత్వం నేటి అవసరం. కవి అక్షరాన్ని పొందికగా అల్లి వాక్యాన్ని హామీగా ప్రజలకు ఇవ్వగలగాలి. బాలసుధాకర్ మౌళి తనదైన శైలిలో తన కవిత్వంతో హామీ పడుతున్నారు. ఈ కవిత ఆసాంతం ఒకసారి గానం చేద్దాం.

నిశ్శబ్దంగానో, నిర్మాణంగానో

ప్రశ్నని
కూల్చివేస్తున్న సందర్భంలో
బతుకుతున్నాం

ఒక కొనని అందుకుని
ఎగబాకుతున్నాను
తెగిన తీగలను
ముడి వేస్తున్నాను
ఒక అవిచ్ఛిన్న రాగాన్ని ఎత్తుకుని
అవిశ్రాంతంగా ప్రవహిస్తున్నాను
బతుకు చీకటి సొరంగంలోంచి
రెండు లేత కళ్ళని బయటకు పెట్టి
భూమిని
తనివితీరా హత్తుకుంటున్నాను
వేల వేల కన్నుల్లో
ప్రతిబింబిస్తున్న నన్ను నేను
వేల వేలసార్లు
నిలబెట్టుకునే రహస్యాన్ని
ఛేదిస్తున్నాను

నిశ్శబ్దంగానో, నిర్మాణంగానో
నా రక్తనాళాలను
నేను పేనుకోకపోతే
అంతే నిశ్శబ్దంగా
అంతమైపోవాలి

ప్రశ్నగా
రూపొందాల్సిన సందర్భంలో
ఎక్కడో
ఏ చీకటి సొరంగంలోనో
అదృశ్యమైపోవాలి

నిశ్శబ్దంగానైనా
నికార్షైన ఒక వాక్యాన్ని పేని
సమూహంలో నిలబెడతాను

బారులు తీరిన పాదాల్లోంచి
భూమి మొలకెత్తుతుంది

ఒక వాక్యం
మరొక వాక్యం
ఇంకొక వాక్యం
వాక్యాల ధార, ప్రవాహం
భూమంత పద్యాన్ని అల్లి
భూమి ముందే నిలబెడతాను

విత్తనం
మొలకెత్తుతున్న సందర్భంలో
బతుకుతున్నాం

No. of visitors : 337
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆకు క‌ద‌ల‌ని చోట వ‌ర్షించిన క‌విత్వం

కేక్యూబ్ వ‌ర్మ‌ | 20.10.2016 12:53:32am

ఒకమారుమూలపాఠశాలఉపాధ్యాయుడు ఈ నిశ్శబ్దాన్నిభరించలేక ఈ ఉక్కపోతనుధిక్కరిస్తూతనచుట్టూవున్నఆకుకదలనితనాన్నికవిత్వంగామనముందుఆవిష్కరించినదే ఈ సంకలనం.......
...ఇంకా చదవండి

ఆ పావురాలు!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 02.01.2017 11:39:40pm

ఒలికిన నెత్తురు అద్దిన జెండానందుకుంటూ గుంపుగా ఆ పావురాలు! ...
...ఇంకా చదవండి

తెలవారని ఆకాశం!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 07.12.2016 11:52:30am

కొన్ని మంచు బిందువులేవో రాతిరి కురిసిన వాన చివుళ్ళ నుండి రాలుతూ రెక్కల చాటున ముఖం దాచుకున్న పక్షి టపటప రెక్కలల్లారుస్తూ ఎగరబోతూ...
...ఇంకా చదవండి

నమస్కరిస్తూ..

కేక్యూబ్ వ‌ర్మ‌ | 04.09.2017 11:18:59am

కళ్ళకు గంతలు కట్టుకొన్నదని మీ న్యాయ దేవత ముందు నగ్నంగా నిలబడిన ఆ పదముగ్గురూ విడిచిన లజ్జను మీ మఖంపై నెత్తుటి ఉమ్ముగా ఊసి!...
...ఇంకా చదవండి

జీవ‌సూత్రాన్ని చెప్పే చింతా అప్పలనాయుడు ʹదుక్కిʹ

కెక్యూబ్‌ వర్మ | 16.06.2018 09:22:29am

కవితలనిండా రైతు జీవన చిత్రమే. ఒక దు:ఖార్తితో కొనసాగుతుంది. కురవని వానలు కలసిరాని కార్తెలు అప్పుల ఊబిలు కాడెద్దులను దూరం చేసే యంత్రాల దాష్టీకం అక్కరకు రాని ప...
...ఇంకా చదవండి

దక్షిణ యాత్ర

కెక్యూబ్ వర్మ | 04.06.2017 01:12:22pm

నీ ఒంటి రంగును హేళన చేసి నిన్ను బానిస చేసుకో చూస్తున్నాడు నీకంటూ మిగిలిన ఆఖరి అవకాశం నిన్ను నువ్వు జెండాగా ఎగురవేయడమే!!...
...ఇంకా చదవండి

గులాబీ!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 17.04.2017 11:32:19am

వాడెంత విధ్వంసం చేసినా నీ పసివాడి చేతిలో గులాబీ విచ్చుకుంటూ వాడిని భయపెడుతూనే వుంది!!...
...ఇంకా చదవండి

కుందాపన

కెక్యూబ్ వర్మ | 04.01.2018 01:31:58pm

ఈ కవిత్వం నిండా పరచుకున్న దాహం ఒంటరితనం.సమూహంలో తను నిలబడ్డ చోటు ఒంటరిగా ఒక దీపపు సమ్మెకింద నీడలా వెంటాడడాన్ని మనకనుభవంలోకి తెస్తుంది.కలసి నడవాల్సిన దారు......
...ఇంకా చదవండి

మస్వాల్..

కెక్యూబ్ వ‌ర్మ‌ | 03.09.2016 12:37:26am

మరుగుతున్న మంచు తెరలుగా విడిపోతూ రాలిపోతున్న మస్వాల్ పూలెన్నో ఇప్పుడిక్కడ ఒకటే హృదయ ఘోష ఆజాదీ ఆజాదీ .......
...ఇంకా చదవండి

ఒంటరి వెన్నెల

కేక్యూబ్ వ‌ర్మ‌ | 07.05.2016 08:29:33am

ఈ ఇప్ప పూల వనం రాలిపోతూ నిబ్బరాన్ని వదిలి నివురు కప్పుకుంది తూరుపింకా తెలవారక నీ పేరు తలుస్తూ పొలమారుతొంది...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  వాళ్ల స్వేచ్ఛ కోసం పోరాడదాం
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •