మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ

| సాహిత్యం | క‌థ‌లు

మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ

- పలమనేరు బాలాజీ | 03.08.2019 11:39:20pm


ఒక కథ ఉత్తమ కథ అవునా , కాదా అని నిర్దారించేది సగటు పాఠకుడు కాదు, ఉత్తమ పాఠకుడే! నిర్నీత ప్రమాణాల రీత్యా వస్తు, శిల్పాలను బట్టి కథలను బేరీజు వేసి,కథ స్థానాన్ని నిర్ణయించేది ఉత్తమ పాఠకుడే. సాధారణ పాఠకుడు ఉత్తమ పాఠకుడిగా ఎదిగే క్రమంలో తను తప్పకుండా చదివి తీరవలసిన పుస్తకాలను, రచనలను ఎంపిక చేసుకుంటాడు. ఆ ఎంపిక ఆ పాఠకుడి చైతన్య పరిధిని బట్టి , ప్రాపంచిక దృక్పదాన్ని బట్టి మారుతూ ఉంటుంది.

తమ ఆలోచనలను, అవగాహనను మెరుగు పరచుకునే క్రమంలో పాఠకుడు తప్పకుండ చదివితీరాల్సిన కథల్లో ఓక ముఖ్యమైన కథ ʹ ఆఖరి పాట ʹ ( విశాలాంధ్ర దీపావళి 2016 ) . రచయిత్రి సి.సుజాత.గత 35 సంవత్సరాలుగా రచనలు చేస్తున్న సుజాత గారు ʹ సుప్త భుజంగాలు, రాతి పూలుʹ నవలలు, ʹ సుజాత కథలు, రెప్ప చాటు ఉప్పెన, నెరుసు ʹ కథ సంపుటాల ద్వారా తెలుగు పాఠక లోకానికి సుపరిచితులే.

మనం తప్పకుండా చదవాలని వెతికి మరీ చదివే రచయితలు కొందరుంటారు. ఎప్పటికీ మనం మరిచిపోలేని కథలు కొన్ని ఉంటాయి. అలా చదివించే రచయితల్లో సి సుజాత గారు ఒకరు. అలాంటి మరచి పోలేని కథల్లో ఒక మంచి కథ ʹ ఆఖరి పాట ʹ.

ఇదొక అసాధారణమైన కథ . మంచి వస్తువుకు మంచి శిల్పం తోడైనప్పుడు కథ కథనం వేగంగా నడిచినప్పుడు ఆ కథ పాఠకులకు సూటిగా చేరుతుందనటానికి ఈ కథ ఒక మంచి ఉదాహరణ గాచెప్పవచ్చు. కథ చదివాక పాఠకుడు తప్పనిసరిగా తన ఆలోచన పరిధిని విస్తృత పరచుకునే అవకాశాన్ని ఏ స్థాయిపాఠకుడికైనా ఈ కథ కల్పిస్తుంది.

సమాజం లో వచ్చే మార్పులు సాహిత్యంలో తప్పకుండా ప్రతిభింబిస్తాయి. ఈ మార్పుల్ని రచయితలు తన ప్రాపంచిక దృక్పధం, భావజాలం, శిల్ప చాతుర్యం మేరకు కథలో నేర్పుగా చిత్రిస్తారు. అప్పటి వరకూ పైకి చదవటానికి మొదట సాధారణంగా అనిపించే కథలు, సాధారణ పాఠకులు లోతుగా చదివినప్పుడు,ఉత్తమ పాఠకులకు ఆ కథలు అందుబాటులోకి వచ్చినప్పుడు ఆ కథలు సాధారణ కథలు కావని, విలక్షణమైన కథలని, ఉత్తమ కథలని గుర్తిoచబడతాయి.

మనిషికి, మట్టికి మధ్య వున్న అనుభందం విడదీయరానిది . మట్టి మనిషిని చూస్తున్నాం, విoటున్నామని అనుకుంటాం కానీ, నిజానికి మట్టి మనిషిని నిజంగా సంపూర్ణంగా వినడానికి మనుషులకు సమయం చాలదు. శక్తీ చాలదు. అలాంటిది మట్టి మనిషి లోపలి మనిషిని, మనిషి లోపలి ప్రకృతిని అర్థం చేసుకోవాలంటే చాల శక్తి కావాల్సిందే. చాల ఓపిక వుండాల్సిందే. ఇది మనిషి చేసే పని కాదు. మనిషి మనసుతో, స్పృహతో, ఇష్టంగా చేసే పని. ఇది ఇతరులకోసం యధాలాపంగానో, మొక్కుబడిగానో చేసే పని కూడా కాదు.ఇది తానకై తను , తన పట్ల ఇష్టంగా తాను చేసుకునే పని. ఈ కథంతా ఇలాంటి మంచి ప్రయత్నమే !

చాల మామూలుగా పైకి కనపడుతూనే , కథ లోపలి వాతావరణాన్ని సూచనగా చెపుతూ ʹ ఆఖరి పాట ʹ కథ మెల్లగా సున్నితంగా ఇలా మొదలవుతుంది.

ʹ ఏట వాలుగా వున్నా పెద్ద రాయి. దాని కిందుగా ఇంకో చిన్న రాయి. కూర్చునేందుకు వీలుగా వున్నాయి. పేపర్ల ఫైలు వళ్ళో వుంచుకొని అతని వైపు చూశాను.మోకాల్లపైన కూర్చున్నాడు. మురిగ్గా వున్న కాళ్ళు, ముడతలు పడ్డ పంచె, చిరిగినా చేతులున్న గుడ్డ బనీను , మొకాల్లపైనేమో చేతులుo చుకుని రెండు చేతులూ జోడించుకుని ʹ ఊ ʹ అని దీర్ఘం తీసి మధ్యలో కదిలించామాక అన్నాడు. నేను తల ఊపాను.పాట మొదలైంది. ఆకు పచ్చని పొట్టి మొక్కల పైన గుత్తులుగా వేలాడుతున్న మిరప పళ్ళ తోట అది. కను చూపు మేరంతా పరుచుకున్న పచ్చదనం. ʹ

పాట సాగుతుంది . ʹ రైతు కెన్ని తిప్పలంటే ʹ అంటూనే అతడు పాటెత్తుకున్నాడు.
.......
పొలంలో కాలు పెట్టిన రైతు ఎన్ని అగచాట్లు పడతాడో, రాయిరప్పా ఏరి ప్రతి అంగుళం తడిని చూసి , సున్నితంగా గింజ పాలు , గింజకు ఆకలయ్యేంత నీళ్ళే పోసి, ఆ నీళ్ళు పుక్కిట్లో పట్టి ఎలా కూడతీసుకుని, ఒక్క ఊపున చిగురాకుని పైకి తెస్తుందో,ఆ గింజ కడుపు లోంచి చిగురు ఆకై, మొలకై మొక్క ఎంత గర్వంగా రైతు వైపు చూస్తుందో ఆ ఒక్కో మొక్కని చూస్తూ అది పూవు పూయటాన్ని , పువ్వుని రాల్చి మొక్క కాయని సృష్టించటాన్ని రైతు యెంత శ్రద్ధ గా గమనిoచుకుంటాడో.. పాట .
ఏం వచనం ? ఎంత శక్తి వంతమైన పదునైన వాఖ్యం ?

బహుశా ఈ కథలో కథాంశo మొత్తాన్ని ఒక్క వాఖ్యం లో చెప్పటానికి ఇంతకన్నా బలమైన భావ ప్రకటన వేరేది లేదనుకుంటాను.

రైతుకి , పంటకి, రైతుకి, మొక్కలకి మధ్యన ఏదో ఉంటుంది. ఏదో వుండి తీరాలి . అది ప్రకృతి ధర్మం.బలమైన బంధమేదో అక్కడ లేక పోతే ఆ రైతు రైతు కాకుండా పోతాడు. ఆ పంట పంట కాకుండా పోతుంది. ఆ మొక్క మొక్క కాకుండా పోతుంది.

ఆమె మొత్తం తిరిగి చూస్తుంది. అక్కడ పొలాలు వున్నాయి. మొక్కలు, పంటలు వున్నాయి. ఔషద మొక్కలున్నాయి. కానీ అవి ప్రేమతో, హృదయం తో పెంచే మొక్కలు కావు. ఈ మొక్కలతో వీటిని పెంచే వాళ్ళు మాట్లాడరు. రైతుకి పంటకి మధ్యని హృదయం ఏదీ లేదు.

ప్రేమకి హృదయానికి దూరమైన , దూరం కాలేని ఒకే మనిషి లోని వైరుధ్యాన్ని చిత్రిoచిన కథ ఇది. జానపద పాటలను తన రీసెర్చ్ కోసం సేకరిoచుకునేందుకు వచ్చిన ఆమె పైడయ్య పాటలను మాత్రమే సేకరించలేదు. ఆమె అతడి జీవితాన్ని సేకరించుకుంది. జీవిత సత్యాన్ని, రైతు తత్వాన్ని, మనిషి లోపలి ప్రకృతిని భద్రపరచుకుంది.


బతుకు భారమై కొత్త బతుకులు సర్డుకోమంటే అందరూ వలసపోయారు. మరి పైడయ్య ఎక్కడికి పోవాలి? అతని పాటకు ఆలంబన అయిన పుట్టా, చెట్టూ,పురుగు, పిట్టా ఇవన్నీ లేకపోతే పైడయ్య పాట ఎలా బతుకుతుంది?.. ఇప్పుడీ కాస్త నేలా, ఈ కథ పొలం అన్యాక్రాంతం కావటానికి ఎంతో సమయం లేదు.నువ్వేం చేస్తావు అంటే సమాధానం లేదు. అసలు పైడయ్య పొలం లేకపోతే చేసే పనే లేదు.

కథ చివర్లో ఇక భవంతులు కట్టడానికి సిద్ధంగా వున్న, ఆలోగా త్వరగా చేతికి వచ్చేందుకు వేసిన పెసళ్ళు పండుతున్న పొలాన్ని ఆమె ఫోటో తీసుకుంటుంది.
ʹ కొన్నాళ్ళకి ఈ పెసళ్ళు ఎలా పండుతాయి అని ఎవరేనా అడిగితే చూపించేందుకు వుంటాయి కదా ʹ అంటుంది పైడయ్యతో.
ఉలిక్కి పడ్డాడతను. దూరంగా కనపడుతున్న పొలం వైపు పొడి కళ్ళతో చూస్తూ నిలబడ్డాడు.

పాట పాడనా అన్నాడు.. తల ఊపేను. పాట సుళ్ళు తిరుగుతోంది. ముట్టుకోను, ముద్దేట్టుకోను చారెడు నేల కనిపించని దురన్యాయం గురించి . మట్టి మేడలైపోతున్న దుస్థితి గురించి , మట్టిని గుండెలకు హత్తుకునే రైతు పాట అది.

నేను రికార్డ్ చేసుకోవడం మరచిపోయాను.

నావి పైడయ్య లాగా కన్నీళ్ళు కార్చి కార్చి పొడిబారిన కళ్ళు కాదు.ఇంకా నీళ్ళీoకని చెలమలు. నా కళ్ళల్లో నీళ్లురుతున్నాయి. ఆపాలని నాకు లేదు.ఇప్పుడు నాకు పైడయ్య తెలుసు.మట్టి తెలుసు. పురుగు భాష తెలుసు. మాయమైపోతున్న పాటను చూస్తే ఏడుపొస్తోంది .పైడయ్య పాట సాగుతూనే ఉంది. ఆ ఆఖరిపాట అంతం లేకుండా సాగదు కదా...

ఇదీ ఈ కథ ముగింపు.

పొలం , మట్టి, చెట్టు, పిట్టా తెలియని ఒక అమ్మాయికి కథ చివర్లో పైడయ్య మాత్రమే కాదు. తానేమిటో తెలిసి వస్తుంది. పొలం , మట్టి, చెట్టు, పిట్టా తెలిసి వస్తుంది . కొత్తగా స్పృహలోకి వచ్చినట్లయి , రైతు జీవితం పట్ల ఎరుక కలుగుతుంది.

రచయిత పూర్తిగా అంతా అర్థం అయ్యేలాగా కథను చెప్పడం ఒక పద్ధతి . పాఠకుడి పైన గౌరవం తో పొరలుపొరలుగా అల్లికలు అల్లికలుగా కథలు చెప్పడం మరొక పద్ధతి . ఈ కథ ఈ రెండు కోణాల్లో చెప్పబడింది కావడం విశేషం .ఈ కథ లోపలికి వెళ్లే కొద్దీ అనేక చిక్కుముడులు విడిపోతాయి. కథలోపలి తెరలు తొలగిపోతాయి. కథలోని సత్యం, కథా లక్ష్యం ఏమిటో బోధపడుతుంది. అట్లా కథ లోపలికి చేసే ప్రయాణం పాఠకుడి చైతన్యాన్ని మెరుగుపరుస్తుంది . అది అతడి అవగాహనను పెంచుతుంది.

ఈ ప్రయాణంలో కథలోపలి కథను లేదా కథలోపలి విషయాలను పాఠకుడు గ్రహించడం, చైతన్య వంతం కావడం కథ సాధించే అంతిమ విజయం అని భావించవచ్చు. ప్రతి రచయితా తన కథల ద్వారా ఈ ప్రయోజనాన్ని సాధించాలని ప్రయత్నం చేస్తాడు .

రచయిత తన అనుభవాల్ని అధ్యయనాన్ని ఆలోచనల్ని అభిరుచిని అనుసరించి తనదైన తాత్విక దృక్పథం లోంచి కథ చెప్పే ప్రయత్నం చేస్తాడు. పాఠకుడు కూడా తనకున్న అధ్యయనం , లోక పరిజ్ఞానం, దృక్పథం , భావజాలం మేరకు కథను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు.

ఇదే తీవ్ర ప్రయత్నం తో ఇద్దరూ కథ లోపల ఒకరికోసం ఒకరు తచ్చాడుతూ ఉంటారు. పైకి కనపడదు కాని కథ లోపల చాలా విషయాలు నిరంతరం, నిశ్శబ్దంగా జరుగుతూనే ఉంటాయి. పాఠకుడు కథకుడు విమర్శకుడు వేర్వేరు లక్ష్యా లతో కథా ప్రయాణం చేస్తారు.

ఈ క్రమంలో వ్యక్తిగతమైన అభిరుచి, అనుభవం,అధ్యయనం, స్వీయ పరిజ్ఞానం, భావజాలం కథ పట్ల ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిప్రాయాన్ని కలుగచేస్తాయి.

మనిషిలోపలి ప్రకృతి గురించి, మట్టికి మనిషికి మధ్య వుండే అనుభందం గురించి, వలసల నేపథ్యంలో ఖాళీ అవుతున్న పల్లెలు, పొలాలు కారుస్తున్న కన్నీటి గురించి పైన ఉదాహరించిన రచయిత కథనాన్ని కనుక శ్రద్ధగా చదవక పోయినట్లయితే ఈ కథ లోని సారాంశం , పదునైన సత్యం అర్థం చేసుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. నగరపు అలవాట్లు గల ఒక విద్యావంతురాలైన ఆధునిక అమ్మాయి దృష్టికోణం లోంచి ఈ కథను నడిపించడం ద్వారా నగర వాసులకు సైతం వెంటనే కథను చేరువ చెయ్యాలనుకోవడం లో రచయిత శ్రద్ధ తెలుస్తోంది.

అతడి పాటను డబ్బులిచ్చి రికార్డు చేసుకుంటున్న అమ్మాయి కథ చివర్లో అతడ్ని చూస్తూ, అతడ్ని వింటూ , అతగాడి పాటను రికార్డ్ చేసుకోవడం మరచిపోయిందని చెప్పటం ఆ పాత్రలో వచ్చిన మార్పుకు ఉదాహరణ.

కథ ఆద్యంతం కథ పట్ల ఆసక్తిని కలుగ చేయటం , కథ చదివిన కొంత కాలం తర్వాత సైతం పాఠకుడి ఆలోచనల్లోకి ఆ కథని నిలపడం రచయిత శిల్ప చాతుర్యానికి ఒక ఉదాహరణ. అలాoటి శిల్ప చాతుర్యం కలిగిన కథే ʹ ఆఖరి పాట ʹ.

ప్రకృతి లో బ్రతుకుతూ వుండటం వళ్ళ వచ్చిన గొప్ప జీవశక్తి కలిగిన ఒకానొక గ్రామీణ రైతు గురించిన ఈ కథ చదివాక ఒక్కటే అనిపిస్తుంది ! ఈ కథ భారతీయ గ్రామీణ రైతుల సామూహిక సంవేదన.

అయినా వలసల ధాటికి ,కొత్త ఉపాదుల అన్వేషణ ధాటికి చాల మంది రైతులు పల్లెల్ని విడిచి, పొలాల్ని, వ్యవసాయాన్ని విడిచి వెళ్లిపోతుంటే ఇక మిగిలేది ఏమిటి? ఎవరు?No. of visitors : 996
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


పరిమళం , పదును రెండూ వున్నకవిత్వం – చేనుగట్టు పియానో

పలమనేరు బాలాజీ | 04.02.2017 02:37:03am

కవి పాలక పక్షం, రాజ్యం పక్షం, వహించకుండా ప్రజా పక్షం వహిస్తున్నాడని ప్రజల ఆగ్రహాన్ని,ఆవేదనల్ని, ప్రశ్నల్ని,నిరసనల్ని తన గొంతుతో వినిపిస్తున్నాడని .......
...ఇంకా చదవండి

ʹనారుమడిʹ మళ్ళీ మళ్ళీ చదివించే మంచి క‌విత్వం

పలమనేరు బాలాజీ | 18.01.2017 11:47:15pm

కాలం గడచినా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి చదవాలని అనిపించే మంచి కవితా సంపుటాల్లో ʹ నారుమడి ʹ ఒకటి. యెన్నం ఉపేందర్ ( డాక్టర్ వెన్నం ఉపేందర్ )అటు కథకుడిగా , యిటు కవి...
...ఇంకా చదవండి

సాహిత్య విమర్శకు కొత్త బ‌లం

పలమనేరు బాలాజీ | 04.03.2017 09:54:02am

ఈ పుస్తకం లో వ్యక్త పరచిన అభిప్రాయాల్లో రచయిత ఎక్కడా సహనం కోల్పోలేదని, సాహిత్య అంశాల పట్ల రచయితకు గల ఆసక్తి ,నిబద్దత,స్పష్టతే ఇందుకు కారణాలని, విభేదించే...
...ఇంకా చదవండి

ఖాళీ ఇల్లు,ఖాళీ మనుషులు

పలమనేరు బాలాజీ | 01.06.2016 11:57:12am

నమ్ముకున్న కలల్ని గాలికొదలి ఇల్లు వదిలి, ఊరు వదిలి పిల్లల్ని వదిలి, సహచరుల్ని వదిలి...
...ఇంకా చదవండి

మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ

పలమనేరు బాలాజీ | 05.09.2019 01:00:59pm

ʹ వీడికి వందకి వంద మార్కులు రావలసింది , కానీ తొoతొమ్మిదే వచ్చాయిʹ అప్పుడు ఒకే ఒక్క మార్కు కోసం ఇంత హైరానా పడి రావాలా అని ? అని అడుగుతాడు సైకాలజిస్టు......
...ఇంకా చదవండి

స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ

ప‌ల‌మ‌నేరు బాలాజీ | 03.05.2019 03:22:15pm

ఆశావాద దృక్పథంతో మంచి సమాజం కోసం ఒక ఆధునిక స్త్రీ పడే తపనను ఈ కవిత్వం తప్పక చెపుతుంది. పసిబిడ్డల నుండి ముసలివాళ్ళు వరకు అన్ని ప్రాంతాల్లో స్త్రీలపై జరుగ...
...ఇంకా చదవండి

ఒక మంచి రాజనీతి కథ

పలమనేరు బాలాజీ | 16.07.2019 09:19:27pm

వ్యవస్థలో, మనిషిలో పేరుకుపోతున్న రాజకీయాన్ని దళారీ తనాన్ని వ్యాపార తత్వాన్ని నగ్నంగా చూపించిన ఈ కథలో ప్రతి పదం ముఖ్యమైనది, అనివార్యమైనది. ఆయా పదాలు......
...ఇంకా చదవండి

మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ

పలమనేరు బాలాజీ | 16.08.2019 09:24:03pm

సాధారణంగా బిడ్డల వల్ల తల్లులు బాధలు పడే కథలు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి . తల్లి, బిడ్డలకు సంబందించిన కథలు కొన్ని వేల సంఖ్యలో వచ్చింటాయి. వృద్ధాప్యదశకు చేర.....
...ఇంకా చదవండి

వివక్షతని ప్రశ్నించిన కొత్త దళిత కథ : " పైగేరి నారణప్ప కథ..."

పలమనేరు బాలాజీ | 02.08.2020 04:14:44pm

కుల అహంకారాన్ని ప్రశ్నించి, వర్గ రాజకీయాల నుండి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడమనే ఒక మనిషి కథను ఊరు నుండి తన సమాజం నుండి తన వర్గం నుండి దూరంగా ఉంటున్న .....
...ఇంకా చదవండి

కథల గూటి లోని ఒక మంచి కథ నల్లూరి రుక్మిణి గారి "ఎవరిది బాధ్యత"

పలమనేరు బాలాజీ | 02.12.2019 11:35:29pm

థను శ్రద్ధగా చదివే వాళ్ళకి మానవ మనస్తత్వం లోని వైరుధ్యాలను, సంఘర్షణలను రాజీతత్వాన్ని, ప్రశ్నించే గుణాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. వ్యక్తిగత సంపద పట్ల.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •