రాంగూడ ప్రాంతంలో సమిష్టితత్వం, సహకార పద్ధతి

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

రాంగూడ ప్రాంతంలో సమిష్టితత్వం, సహకార పద్ధతి

- భూమి | 16.08.2019 08:44:26pm

విశాఖ జిల్లాలోని పెదబయలు ఏరియా, మల్కనగిరి (ఒడిషా) జిల్లాలోని కటాఫ్‌ ఏరియాలో గత 3 సంవత్సరాలుగా మెజారిటీ గ్రామాలలో (ప్రజా వ్యతిరేకులను మినహాయించి) ప్రజలు శ్రమ సహకార గ్రూపులుగా ఏర్పడి, వ్యవసాయం చేస్తూ వస్తున్నారు. ఈ సహకార గ్రూపులు మొదట 5 నుండి 15 కుటుంబాలు, ఒక్కొక్క గ్రూపుగా ఏర్పడి, పని చేసాయి. కొన్ని గ్రామాలలో భూముల స్థాయి ఆధారంగా, కుటుంబాలు గ్రూపులుగా ఏర్పడగా, మరికొన్ని గ్రామాలలో భూములు వున్నవారు, భూమిలేని వారిని కలుపుకొని గ్రూపులు ఏర్పాటు చేసారు. ఎలా ఏర్పడినా, పండిన పంటను సమాన వాటాలుగా పంచుకునేవారు. దీనిపై ప్రతి సంవత్సరం సమీక్షా సమావేశాలు జరుపుకున్నారు. ఈ పద్ధతికి ముందు కొన్ని కుటుంబాలలో, భూమి ఉండి కూడా వ్యవసాయ ఉపకరణాలు (పశువులు, నాగళ్ళు)లేకా, కొన్ని కుటుంబాలలో భర్తలు(పని చేసేవారు) చనిపోయినప్పుడు మహిళలు వితంతువులుగా మారి, వ్యవసాయ పనులు చేయలేకా, వర్షాధారంపై ఆధారపడిన వ్యవసాయం కనుక, సకాలంలో దుక్కి దున్నకా - ప్రతి గ్రామంలో కొంత భూమి భీడు భూమిగా వుండి పోయేది. అంటే భూమి వుండి కూడా మొత్తం భూములను సాగులోకి తేలేకపోయేవారు. సకాలంలో పంట వేసుకున్నవారికి కూడా, ఎవరికి వారు సాగు చేసుకోవడం వలన పంట దిగుబడి తక్కువగా వచ్చేది. అదే సమయంలో గ్రామంలో భూమిలేని కుటుంబాలకు పనులు దొరకక ఇతర ప్రాంతాలకు వలసపోయేవారు. ఈ సమస్యలన్ని పార్టీ నాయకత్వంలో చేపట్టిన విప్లవ సంస్కరణలవల్ల కొంత మేరకు పరిష్కారమైనాయి.

శ్రమ సహకార గ్రూపులుగా ఏర్పడి, వ్యవసాయం ప్రారంభమైన తర్వాత పైన ఎదుర్కొన్న 4 సమస్యలను పరిష్కరించగలిగారు. శ్రమ సహకార గ్రూపులు ఏర్పర్చుకున్న తర్వాత, వ్యవసాయ ఉపకరణాలు ఉన్నవారు, అవి లేనివాళ్ళ భూములను కూడా సాగు చేసారు. అందరు కలిసి, ఎక్కువ గంటలు పని చేసి, మొత్తం భూములను సాగులోకి తెచ్చి, సకాలంలో పంటలు వేశారు. దానితో గ్రామంలో, మొత్తం పంట దిగుబడి గతం కన్న కొన్ని రెట్లు పెరిగింది. భూమిలేని వారికి కూడా పని కల్పించబడింది. భూమిలేనివారు, భూమి ఉన్న వారితో సమానంగా పంటను పొందడంవలన, వలసలు వెళ్ళే సమస్య, ఆర్ధాకలి సమస్య చాలా వరకు పరిష్కారం అయింది. భూములు వున్నవారు, అందులో ఎక్కువ భూములు ఉన్నవారు గతంలో వ్యక్తిగతంగా (విడి కుటుంబంగా) సాగు చేసుకున్నప్పుడు వచ్చిన ఆదాయం (దిగుబడి) కన్న, ఈ పద్ధతి ద్వారా కొంత ఎక్కువగనే పొందారు. కనుక వారికి ఆర్థికంగా నష్టం జరుగలేదని సమావేశంలో సమీక్షించారు. ఈ సహకార పద్ధతి మరింత విస్తరించి, ఒక గ్రూపులో పంట దెబ్బతిన్నప్పుడు, పంట ఎక్కువ వచ్చిన గ్రూపులు వాళ్లు తమకు పండిన పంట నుండి కొంత భాగం సహాయం అందించడం ప్రారంభమైంది. ఈ సహకార ధోరణి, మరింత అభవృద్ధి చెంది, పంటలు దెబ్బతిన్న పక్క గ్రామాలకు సహాయం అందించే స్థాయికి ఎదిగింది. ఈ సంవత్సరం కటాఫ్‌ ఏరియాలో, సుమారు 20 గ్రామాలలో మొత్తం భూములను సమిష్టి వ్యవసాయ క్షేత్రాలుగా మార్చివేశారు. ఆ భూములలో ప్రజలంతా సమిష్టిగానే శ్రమ చేయడం, పండిన పంటను ప్రతి కుటుంబానికి (జనాభా ప్రాతిపదికన) సమానంగా పంపిణీ చేయడం జరుగుతున్నది. అయితే ఈ గ్రామాలన్ని పూర్తిగా ఆదివాసీ గ్రామాలు, వర్గ, భూ అసమానతలు సాపేక్షికంగా తక్కువ స్థాయిలో వున్న గ్రామాలు, సహకార వ్యవసాయాన్ని, సమర్థవంతంగా నడపడంలో అనుభవం వున్న గ్రామాలే.

పెదబయలు ఏరియాలోని, చిట్టెంగరువు ఆదివాసేతర పీడిత ప్రజల గ్రామం. అయితే వీరు ఆంధ్రప్రదేశ్‌లో, ఆదివాసీలుగా గుర్తింపు పొందారు. ఒడిషాలో వారికి ఆదివాసీలుగా గుర్తింపు లేదు. ఈ గ్రామంలో 30-35 కుటుంబాలున్నాయి. అందరూ వ్యవసాయం మీద ఆధారపడే జీవిస్తున్నారు. కానీ ఈ గ్రామంలో వ్యవసాయ కూలి, పేదరైతాంగం అధికంగానే ఉన్నారు. అయితే గ్రామ పెత్తందారు (నాయక్‌) చేతిలో 50 ఎకరాలకు పైబడిన మెరుగైన సాగు భూములు ఉన్నాయి. అందులో కూలీల ద్వారా పని చేయించి, వారి శ్రమను దోపిడీ చేయడం ద్వారా, ఆర్థికంగా అభివృద్ధి చెంది, రాజకీయంగా ప్రజలపై ఆధిపత్యాన్ని చలాయించేవాడు. అందులో కొంత భూమిని సాగు చేయకుండా బీడుగా వదిలేసి, దానిపై తన హక్కును నిలుపుకున్నాడు తప్ప, భూమిలేని పేదలకు సెంటు భూమి కూడా సాగు చేయడానికి అనుమతి నివ్వలేదు. వయస్సు పెరిగి, ముసలితనంతో అతడు చనిపోతే, ఆ భూములపై హక్కు మాదేనంటూ అల్లుడు యజమానిగా ముందుకు వచ్చాడు. ఈ గ్రామంలోని విప్లవ రైతు కూలి సంఘం, ఆ భూముల స్వాధీనం కోసం ప్రజలకు పిలుపునిచ్చింది. దీంతో ప్రజలు సంఘ నాయకత్వంలో, భూస్వామిని ప్రజా పంచాయితీకి లాగి, ఆ భూమిపై భూమిలేని పేదలకే హక్కు వుందని తీర్పు చెప్పారు. భూస్వామి ప్రజల తీర్పును ఆమోదిస్తూ, అంగీకరించక తప్పలేదు. ఆ తర్వాత 15 ఎకరాల పొలం భూమిని, 20 ఎకరాల చెలక భూములను సంఘం నాయకత్వంలో స్వాధీనం చేసుకొని, గ్రామంలో భూమిలేని పేదరైతాంగానికి చెందిన, 20 కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. ఆ భూములను ప్రజలు సమిష్టి శ్రమ ద్వారా సాగుకు యోగ్యంగా తయారు చేసుకొని, పంటలు వేసుకున్నారు. ఈ పోరాటం ద్వారా భూమిని సాధించుకోవడమే కాకుండా, తదుపరి విప్లవ ప్రజా కమిటీని ఏర్పర్చుకొనేందుకు సమాయత్తమవుతున్నారు.

కోరుకొండ ఏరియాలోని, రోళ్ళగడ్డ (పంచాయితీ)గ్రామం పూర్తిగా ఆదివాసీ గ్రామమే. చాలా సంవత్సరాలుగా పంచాయితీ గ్రామంగా వున్నప్పటికీ, కనీస అభివృద్ధికి ఆమడ దూరంలో వుంది. ఈ పంచాయితీకి చెందిన గ్రామాలపై కూడా ఆదివాసేతర పెత్తందారుల, రాజకీయ నాయకుల ఆధిపత్యం చలామణిలో వుంటూ వస్తున్నది. గ్రామంలో ఈ నాటికి భూమిలేని పేదలు, కూలి పనులపై ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో గ్రామ పెత్తందారు స్వాధీనంలో వుండి, సాగు చేసుకున్న పోలం భూమిని (గ్రామానికి దూరంగా వుంది) కొంతకాలం తర్వాత వదిలివేయడంతో, బీడుగా మారింది. కానీ దానిని ప్రజలెవ్వరు సాగు చేసుకోవడానికి అనుమతి నివ్వకుండా అడ్డుకుంటు వస్తున్నారు. గ్రామంలోని విప్లవ రైతుకూలి, విప్లవ మహిళా సంఘాల నాయకత్వంలో 10 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని, భూమిలేని 15 కుటుంబాలకు పంపిణీ చేసారు. ఈ భూమిని సాగు చేసుకోవడానికి వీలుగా గ్రామంలోని ప్రజలు అన్ని రకాలుగా వారికి సహకరించారు. గతంలో ఈ గ్రామంపై పోలీసులు అనేకసార్లు దాడులకు దిగి, సంఘ కార్యక్తలను అరెస్ట్‌ చేసి, ప్రజలను భయబ్రాంతులకు గురి చేసారు. ప్రజలకు భూమిపై హక్కు, రాజకీయ అధికారం దక్కాలంటే ప్రజలు సాయుధం కావాల్సిందేనని పార్టీ ఇచ్చిన పిలుపునందుకొని, వాళ్ళు సాయుధం అవుతున్నారు.

కోరుకొండ ఏరియాలోని, సువ్వపల్లి గ్రామంలో, మొత్తం కువ్వి తెగకు చెందిన ఆదివాసి ప్రజలు నివసిస్తున్నారు. అన్ని తెగలలోలాగానే, ఈ తెగలో కూడా తెగవ్యవస్థ, దానికి తెగ పాలక వర్గం బలంగా వుండేది. గత 10 సంవత్సరాల క్రితమే, తెగ నాయక్‌ రాజకీయ ఆధిపత్యానికి వ్యతిరేకంగా, సంఘ నాయకత్వంలో పోరాటం జరిగింది. కాని తెగ పెద్ద, సంఘంలో బంధుత్వాన్ని ఉపయోగించుకొని, చీలికలు సృష్టించి, కుట్రలకు పాల్పడి, సంఘ నాయకుడి ఇంటిపై దాడి చేయించి, హత్య చేయాలని చూసాడు. ఒకవైపు ప్రభుత్వదాడి, మరొకవైపు తెగ పెద్ద కుట్రలకు తట్టుకోలేక, సంఘ నాయకుడు గ్రామం వదిలి వెళ్ళిపోయాడు. తెగ పెద్ద కొత్త అవతారమెత్తి, క్రిష్టియన్‌ సంఘ పెద్దగా మారి, ప్రజలను మత, అంధ విశ్వాసాలలో ముంచి, అహింస, శాంతి పేరుతో, పోరాటం స్థానంలో వర్గ సామరస్యాన్ని బోధించి, తన అధికారాన్ని నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాత తెగ పెద్ద మరిన్ని ఆస్తులు కూడగట్టాడు. రాజకీయ పెత్తనం చలాయిస్తూ, ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు పెంచుకున్నాడు. చుట్టు పక్కల గ్రామాలలో జరుగుతున్న వ్యవసాయక విప్లవ పోరాట ప్రభావం, ఈ గ్రామ ప్రజలపై పడి వారు చైతన్యంతో, నాయక్‌ను ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ ప్రభావం పక్కనున్న కొక్కులగడ్డ గ్రామంపై కూడా పడింది. దీంతో వారు సంఘ నాయకత్వంలో సంఘటితపడి, తెగపెద్ద స్వాధీనంలో వున్న అటవీ భూములను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత సువ్వపల్లి గ్రామ ప్రజలు, తెగ పెద్ద స్వాధీనంలో వున్న చెరువును స్వాధీనం చేసుకొని, సమిష్టి శ్రమ ద్వారా మరమత్తులు చేసుకున్నారు. పశువులు ఎండాకాలం నీళ్ళు త్రాగడానికి వీలుగానూ, సీజన్లలో పంట సాగుకు ఉపయోపడే విధంగానూ, చేపల పెంపకానికి అనువుగాను దీనిని అభివృద్ధి చేసుకున్నారు. ఈ సంవత్సరం సీజన్‌లో చేపల పెంపకం కూడా మొదలు పెట్టరు. దీనితో తెగపెద్ద ప్రజల సంఘటిత పోరాటం ముందు లొంగిపోక తప్పలేదు.

కటాఫ్‌ ఏరియాలోని జొంత్రి గ్రామం, బలిమెల రిజర్వాయర్‌ నీటి అంచున వుండే ఆదివాసీ గ్రామం. బలిమెల డ్యాంను నిర్మించడానికి ముందు, ఈ గ్రామంలోని ప్రజలందరికి దున్నుకోవడానికి సరిపడ సాగు భూములుండేవి. కాని డ్యాం నిర్మాణం తర్వాత, సాగు భూములన్ని నీటి ముంపుకు గురయ్యాయి. ప్రభుత్వం, ఇక్కడి ప్రజలకు కోల్పోయిన భూములకు నష్టపరిహారం చెల్లించడం గానీ, ఉపాధి మార్గం చూపడం గాని చేయలేదు. ఈ గ్రామానికి రెండు వైపులా నీరు, ఒక వైపు ఎతైన కొండలు వుండటరతో, కొత్తగా సాగు చేసుకునే భూములు అందుబాటులో లేవు. కొన్ని కుటుంబాలు గ్రామాన్ని వదిలి, కూలీ పనులు వెతుక్కుంటు వెళ్ళారు. మరి కొన్ని కుటుంబాలు పుట్టిన ఊరిని వదులుకోలేక అక్కడే వుండిపోయారు. గ్రామంలోని మెజారిటీ భూములు ముంపుకు గురికాగా, మిగిలిన భూములను కొందరు పెత్తందారులు, తెగపెద్ద కుటుంబాలు, ప్రజలను బెదిరించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో కూలీ పనులు కూడా దొరకని కొన్ని కుటుంబాలు, సీజన్‌లో చేపల వేట మీద ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామ తెగపెద్ద కుటుంబం చేతిలోనే సాగుకు యోగ్యమైన మెజారిటీ వరిపండే భూములున్నాయి. ఈ గ్రామంలో సంఘ నాయకత్వంలో గ్రామ పెత్తందారులకు, ప్రజా వ్యతిరేకులకు, వ్యతిరేకంగా జరిగిన వర్గపోరాటంలో, కొందరు పెత్తందారులు భయపడి, గ్రామాన్ని వదిలి వెళ్ళగా, మరికొందరు సంఘానికి లొంగిపోయి, గ్రామంలోనే వుండిపోయారు. గ్రామంలో సంఘానిదే పై చేయి అయ్యింది. దీంతో గ్రామంలో భూమి సమస్యను పరిష్కరించేందుకు, వున్న భూములన్నింటిని సాగులోకి తెచ్చేందకు, మొదట భూమిలేని, భూమి కల్గిన కుటుంబాలను కలిపి, శ్రమ సహకార గ్రూపులుగా ఏర్పాటు చేసి, పండిన పంటను అందరికీ సమానంగా పంచారు. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత గ్రామంలో మొత్తం భూములను కలిపి, సమిష్టి వ్యవసాయ క్షేత్రంగా మార్చారు. తెగపెద్ద కుటుంబాన్ని మాత్రం, శ్రమ సహకార గ్రూపులలో కలుపుకోలేదు. ఈ సంవత్సరం (2018) సంఘ నాయకత్వంలో తెగపెద్దకు చెందిన 15 ఎకరాల భూములను స్వాధీనం చేసుకొని, సమిష్టి వ్యవసాయ క్షేత్రంలో కలిపివేశారు. భూస్వామి అయిన తెగపెద్ద ప్రజల నిర్ణయానికి ఆమోదం తెలుపక తప్పలేదు. శ్రమలో ఆ కుటుంబం భాగస్వాములయితే, అన్ని కుటుంబాలకు లాగానే, ఆ కుటుంబానికి కూడా పంటలో వాటా యిస్తామని, సంఘం ప్రకటించింది.

కటాఫ్‌ ఏరియాలోని, ఒండ్రుపల్లి పంచాయితీ, కోడిగొంది గ్రామంలో భూమిలేని పేదల సమస్యను పరిష్కరించడం, సాగు చేయకుండా బీడుగా వుంటున్న (పశువుల కొరత, కుటుంబాలలో శ్రమ చేసే వాళ్ళు లేక) భూములను సాగులోకి తెచ్చే లక్ష్యంతో, గత సంవత్సరం గ్రామంలోని మొత్తం కుటుంబాలను కొన్ని గ్రూపులుగా విభజించి, శ్రమ సహకార టీంలను ఏర్పాటు చేశారు. ఎక్కువ భూములున్న కొన్ని కుటుంబాలు, ఈ గ్రూపులలో లువకుండా, విడి కుటుంబాలుగానే సాగు చేసుకున్నారు. అసలే భూమిలేని వాళ్ళ సమస్యను పరిష్కరించడంలో భాగంగా, భూ అసమానతలను తొలగించడానికి సంఘం ప్రజలతోనూ, ధనిక, మధ్య తరగతి రైతు కుటుంబాలతో చర్చించింది. దానితో ధనిక, మధ్య తరగతి నుండి కృష్ణ, రూప అనే రైతులు తమ భూముల నుండి 7ఎకరాల భూమిని ఇవ్వడానికి ముందుకు వచ్చారు. విప్లవ భూ సంస్కరణలలో భాగంగా, సంఘ నాయకత్వంలో భూమిలేని 7 కుటుంబాలకు భూ పంపిణీ చేసింది. ఇదే ఏరియాలోని తోటగూడ గ్రామంలో గత 3 సంవత్సరాల క్రితం, సాగునీటి కోసం ప్రజలు సమిష్టిగా శ్రమించి, చెక్‌డ్యాంను నిర్మించుకున్నారు. దాని కింద వున్న భూములను సాగులోకి తేవడం కోసం, ఈ సంవత్సరం (2018) ఒక నెల రోజులు గ్రామ ప్రజలంతా సమిష్టిగా భూమి చదును కార్యక్రమం చేపట్టి, 15 ఎకరాలు సాగులోకి తెచ్చి, సమిష్టి వ్యవసాయ క్షేత్రంలో కలిపివేశారు. అలాగే మర్రిబెడ, కొండంజరి గ్రామాలలో కూడా, భూమిని చదును చేసి, సాగుకు యోగ్యంగా తయారు చేసి, భూమిలేని 6 కుటుంబాలకు పంపిణీ చేశారు.

గతంతో పోల్చితే పంటల మార్పిడిని అనుసరిస్తున్నారు. భూములను సాగుకు అనుకూలంగా తయారు చేసుకుంటున్నారు. మార్కెట్‌పై ఆధారపడకుండా స్వయంగా కూరగాయ తోటలు వేసి పండిస్తున్నారు. పశువుల సంరక్షణలో భాగంగా, అంటువ్యాధులు ప్రబలకుండా పశుశాలలను శుభ్రంగా వుంచడం, వర్షాలలో తడిసిపోకుండా చూడడం లాంటి చర్యలు చేపట్టి, పశుమరణాల రేటును తగ్గించారు. క్రమంగా స్వావలంబనతో కూడిన అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. ఈ మార్పు వెనుక ప్రజలు చేసిన పోరాటం, పార్టీ చేసిన రాజకీయ కృషి వుంది. అదే ఉత్పత్తి సబంధాలలో, ఉత్పత్తి శక్తుల అభివృద్ధిలో ఈ స్వల్ప మార్పుకు కారణమయింది. దీని కొనసాగింపులో మరింత అభివృద్ధిని సాధించాలంటే, ఉత్పత్తిలో పోరాటం, వర్గపోరాటం జమిలీగా కొనసాగాల్సిందే.

No. of visitors : 284
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోనీ సోరి నిరసన దీక్షకు సంఘీభావం ప్రకటించండి! ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, రచయితలకు విజ్ఞప్తి

వరవరరావు | 17.06.2016 12:32:46pm

తాజాగా సుకుమా జిల్లా గున్పాడ్‌ గ్రామంలో మడ్కం హిడ్మె అనే ఒక ఆదివాసీ మహిళపై స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ జిల్లా రిజర్వ్‌ గార్డ్‌లు చేసిన లైంగిక అత్యాచారం, హ........
...ఇంకా చదవండి

నిజమైన వీరులు నేల నుంచి వస్తారు

వరవరరావు | 16.07.2016 11:10:44am

1980ల నుంచి కూడా విప్లవ ఉద్యమానికి ఆదిలాబాద్‌ ‌జిల్లా బలమైన కేంద్రంగా ఉంది. ఇంద్రవెల్లి మారణకాండ నుంచి అది దండకారణ్య ఉద్యమానికి ఒక ఆయువుపట్టుగా ఉన్నది.......
...ఇంకా చదవండి

చరిత్ర - చర్చ

వరవరరావు | 15.05.2016 01:23:23pm

భగత్‌సింగ్ ఇంక్విలాబ్‌కు ` వందేమాతరమ్‌, జనగణమనకే పోలిక లేనపుడు హిందూ జాతీయ వాదంతో ఏకీభావం ఎట్లా ఉంటుంది? ఆయన ʹఫిలాసఫీ ఆఫ్‌ బాంబ్‌ʹ గానీ, ఆయన ʹనేను నాస్తికుణ...
...ఇంకా చదవండి

ముగ్గురు దేశద్రోహుల వలన సాధ్యమైన ప్రయాణం

వరవరరావు | 01.06.2016 12:30:00pm

ఆ కూలీ నిస్సందేహంగా దళితుడు, అంటరానివాడు. రోహిత్ వేముల రక్తబంధువు. ముజఫర్‌నగర్ బాకీ హై... అంటూ యాకూబ్ మెమన్‌ను స్మరించుకున్న దేశద్రోహి,...
...ఇంకా చదవండి

దండ‌కార‌ణ్య ఆదివాసీల స్వ‌ప్నాన్ని కాపాడుకుందాం : వ‌ర‌వ‌ర‌రావు

| 21.08.2016 10:46:12am

18 జూలై 2016, అమ‌రుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ స‌భ సంద‌ర్భంగా వ‌ర‌వ‌ర‌రావు ఉప‌న్యాసం......
...ఇంకా చదవండి

నోటీసుకు జ‌వాబుగా చాటింపు

వ‌ర‌వ‌ర‌రావు | 22.05.2016 04:22:41pm

నిన్న‌టి దాకా ఊరు ఉంది వాడ ఉంది/ వాడ అంటే వెలివాడ‌నే/ అంట‌రాని వాళ్లు ఉండేవాడ‌/ అంట‌రాని త‌నం పాటించే బ్రాహ్మ‌ణ్యం ఉండేది/ ఇప్పుడ‌ది ఇంతింతై ...
...ఇంకా చదవండి

రచయితలేం చేయగలరు?

వ‌ర‌వ‌ర‌రావు | 16.07.2016 09:58:28am

1948లో భారత సైనిక దురాక్రమణకు గురయిన నాటి నుంచి కశ్మీరు ఆజాదీ కోసం పోరాడుతున్నది. ఆర్టికల్‌ 370 ‌మొదలు రాజ్యాంగం నుంచి ఎన్ని ప్రత్యేకమైన హామీలైనా ఆ సూఫీ.......
...ఇంకా చదవండి

రచయితలారా, మీరెటువైపు? వేదాంత వైపా? స్వేద జీవుల వైపా?

వరవరరావు | 03.07.2016 01:08:08am

అరుంధతీ రాయ్‌ ‌మావోయిస్టు పార్టీ ఆహ్వానంపై దండకారణ్యానికి వెళ్లినపుడు ఆమె బస్తర్‌లో ప్రవేశించగానే వేదాంత క్యాన్సర్‌ ఆసుపత్రి కనిపించిందట. దగ్గర్లోనే లోపల......
...ఇంకా చదవండి

వాగ్ధాటి కాశీపతి

వరవరరావు | 16.08.2016 01:29:44pm

1972లో విరసంలో ఆయన ప్రవేశం సాంస్కృతిక రంగంలో విప్లవోద్యమం నిర్వహించాల్సిన పాత్ర గురించి ఒక ప్రత్యేకమైన ఆలోచన ప్రవేశపెట్టినట్లైంది. అప్పటికే కొండప‌ల్లి.... ...
...ఇంకా చదవండి

రాజకీయ ఖైదీలు - చావు బతుకుల్లో కె. మురళీధరన్‌ (అజిత్‌)

వరవరరావు | 11.09.2016 10:16:25am

అజిత్‌గా విప్లవ శిబిరంలో ప్రసిద్ధుడైన కె. మురళీధరన్‌ 61వ ఏట అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు 2015, మే 9న మహారాష్ట్రలోని పూనెకు దగ్గరగా ఉన్న తాలేగాకువ్‌ ధబాడే.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార సెప్టెంబర్ 2019

  దళిత భక్త కవి రవిదాస్‌ సంత్‌ ఆలయం కూల్చివేత హిందూ ఫాసిజంలో భాగమే
  The Destruction of Kashmir is a Deathblow to Democracy in India
  నల్లమల యురేనియం గని కాదు, జీవవైవిధ్య కేంద్రం
  అతడు ఆమె అడవి
  మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ
  కన్ ఫామ్... !
  బందిష్
  రాంగూడ ప్రాంతంలో సమిష్టితత్వం, సహకార పద్ధతి
  కళలన్నా, సాహిత్యమన్నా ఫాసిజానికి భయం
  కవులకు సమర స్ఫురణ

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •