కన్ ఫామ్... !

| సాహిత్యం | క‌విత్వం

కన్ ఫామ్... !

- ఇక్బాల్ | 16.08.2019 09:13:18pm

మిత్రుడా...
మేరీజాన్...
సెల్లు పాడయింది !

స్పందనలిచ్చే
దానిగొంతూ మూగబోయింది...

రిపేరర్ బల్లమీద
క్యూలో కూలబడి గడచిపోయిన క్షణాల్ని
గుర్తుచేసుకోవడంలో...
స్పృహా తప్పింది !!

మనసు పాడయ్యింది
మున్నూటాడెబ్భై ద్రోహాల సెగలతో
సొమ్మసిల్లిoదీ దేహం...

నాచుట్టూ
ఊపిరాగిపోయిందనుకుని
సంతాప ప్రకటనల కోసం
కమ్ముకున్న ఆత్మీయతలూ...

చెలిమలైన కనురెప్పల్లో
శోకాన్ని దఫన్ చేసుకున్న
స్నేహ స్పర్శలూ...

చెవుల్లో పోటెత్తిన నినాదాలహోరు
హిందుస్తాన్ జిందాబాద్
హిందుస్తాన్ జిందాబాద్

ఆఖరి కోరిక అనుకోకండి
దయతో ఆపేయండీనాదాలు
హిందుస్తాన్ కాదు
పాకిస్తాన్ కాదు

మీ అందరి అనురాగ
ఆశీర్వాదాలవల్ల
నాముందు పరిచి ఉంది
విప్పారిన బాహువులతో
ఖబరస్థాన్...

మీతో కలిసున్నరోజులకు
లెక్కేసి ఇచ్చిన నజరానా కదూ...
ఇది నాకోసమే!!!

ఏడుపదుల
సెక్యూలర్ ఎకసోపుల
ఎదురీతల ఎత్తిపొడుపుల
సహగమన జ్వాలల్లోచిక్కి

సహచర్య చూపులగాట్లతో
సైగల నిశానాలుగా
శిబిరంలోంచే లోడయ్యే
మంద్రస్థాయి ఏహ్యతలూ

బుసకొట్టకుండానే
భుజంమీదచెయ్యేసి
పారాడే పాములు చేసే
నాలుకల రెపరెపల
పరిచర్యలూ
తట్టుకోలేకపోయిందీ మనస్సు...

ప్రమాదమూ... ప్రమత్తత...
సఫ్రాన్ తోనేఅనే భ్రమలో ఉన్నానేమో ఇంతకాలమూ

ఇక్కడిప్పుడు
ఏరంగు జెండా అయినా
ఒక్కటే...

ఏ పార్టీ ఎజెండా అయినా ఒక్కటే
ఇవన్నీ
నన్ను కౌగిలించుకోడానికి
కలలుకంటున్న కఫన్లే అని
కన్ ఫామ్ అయిపోయిందిప్పుడు...!

ఇది నాసొంతిల్లనుకున్న
నా జన్మభూమిలో
నా సహోదరులందరూ
నాఅంతాన్ని సెలెబ్రేట్ చేసుకునే శాంతిదూతలే...!!

తోడేళ్ళ వేటలో
రక్తమోడిన గొర్రెపిల్లల గుండెగాయాల గుర్తుల్ని
మటుమాయం చేసిన ప్రజాస్వామ్య ప్రవక్తలే...!!!





No. of visitors : 170
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


కార్పోరేట్ వ్య‌వ‌సాయం - రైతుల‌ ఆత్మ‌హ‌త్య‌లు

ఇక్బాల్ | 06.08.2016 08:59:57pm

ఇక్బాల్ | 9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో ʹకార్పోరేట్ వ్య‌వ‌సాయం - రైతుల‌ ఆత్మహ‌త్య‌లుʹ అంశంపై కామ్రేడ్ ఇక్బాల్ ఉప‌న్యాసం.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
  అరుణతార నవంబర్ 2019
  ఒక చిన్న అమ్మాయి రాసిన మంచి కథ " భూమి "
  నేను జీవితాన్ని అమితంగా ప్రేమిస్తాను
  సముద్రం ఇంకా బతికేవుంది
  డెన్ ఆఫ్ లైఫ్
  వాళ్ళు
  ప్రజా కళాకారుడా
  వసంతమేఘగర్జన - కార్మికోద్యమాలు
  తెలుగు రాష్ట్రాల వ్యవసాయరంగం - 50 ఏళ్ళ విప్లవోద్యమం
  సీమకవి వినూత్ననిరసన ʹʹలైఫ్‌హాలిడేʹʹ
  పడగ కింద పండు వెన్నెల!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •