దళిత భక్త కవి రవిదాస్‌ సంత్‌ ఆలయం కూల్చివేత హిందూ ఫాసిజంలో భాగమే

| సాహిత్యం | వ్యాసాలు

దళిత భక్త కవి రవిదాస్‌ సంత్‌ ఆలయం కూల్చివేత హిందూ ఫాసిజంలో భాగమే

- పాణి | 24.08.2019 06:59:56pm

మసీదులనే కాదు, ఆలయాలనూ కూల్చేయగలరు
దళిత భక్త కవి రవిదాస్‌ సంత్‌ ఆలయం కూల్చివేత హిందూ ఫాసిజంలో భాగమే

ఢిల్లీ సమీపంలో తుగ్లకాబాద్‌లో ఒక ఆలయాన్ని ప్రభుత్వం కూల్చేసింది. ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అధారిటీ ఆగస్టు 10న ఈ పని చేసింది. అది రామాలయమో, కృష్ణాలయమో అయితే డీడీఏ ఈ పని చేసేది కాదు. ఈ ఆలయం రవిదాస్‌ అనే ఒక దళిత భక్త కవిది. ఈ ఆలయాన్ని ప్రభుత్వం గత కొద్దికాలంగా వివాదం చేస్తోంది. అప్పట్లోనే దళిత ప్రజాస్వామిక శక్తులు ఈ ప్రయత్నాన్ని నిరసించాయి. ఢిల్లీ కోర్టులో వ్యవహారం నడుస్తుండేది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఢిల్లీ అభివృద్ధికి ఆలయం అడ్డం వచ్చిందని, రిజర్వ్‌ ఫారెస్టు ఏరియాలో ఉన్నదనే సాకుతో కూల్చేశారు.

1450-1520 మధ్య కాలంలో జీవించిన రవిదాస్‌ చర్మకార వృత్తితో జీవించాడు. తన బోధనలతో ఆయన దళితులకు ʹభగవత్‌ʹస్వరూపుడయ్యాడు. భగవంతుడైతే బ్రాహ్మణీయ శక్తులకు పర్వాలేదు. తమ దేవుళ్లలో ఒకరిని చేసుకునేవారు. కానీ ఆయన కులవ్యవస్థకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా పాటలు పాడి జనానికి వినిపించాడు. బ్రాహ్మణ్యాన్ని నిరసిస్తూ సమానత్వాన్ని ప్రచారం చేశాడు. మనిషి ప్రేమగా, మానవీయంగా జీవించాలని ఉద్బోధించాడు. వీటికి కుల ఆధిపత్యం వ్యతిరేకమని చాటి చెప్పాడు.

ఉత్తర దక్షిణ భారతదేశాల్లో 11వ శతాబ్దం నుంచే భక్తి ఉద్యమాలు ఆరంభయ్యాయి. దీని వెనుక బలమైన రాజకీయార్థిక సాంస్కృతిక కారణాలు ఉన్నాయి. ఆనాటి పరిస్థితుల్లో వ్యవస్థ తీరుపట్ల విమర్శనాత్మకంగా చెప్పే ఏ మాట అయినా ʹభక్తిʹ రూపంలోనో, ʹమతంʹ రూపంలోనే వ్యక్తం కావడం సహజం. అయితే అది బ్రాహ్మణీయ శక్తులు ప్రవేశపెట్టిన భక్తి కాదు. అలాంటి మతం కాదు. వాటికి వ్యతిరేకంగా బయల్దేరిన నూతన భావధార భక్తి ఉద్యమ రూపంలో వచ్చింది. సూఫీ తాత్వికత ప్రభావం ఉత్తర భారతదేశంలోని భక్త కవుల మీద ఉన్నది. వీళ్లందరూ మనిషి కేంద్రంగా జీవితాన్ని, సమాజాన్ని చూశారు. అంతే కాదు, భగవద్భావనను కూడా అట్టడుగు మనిషి కేంద్రంగా రూపొందించారు. అందుకే మనిషి, సమానత్వం కోసం భక్త కవులందరూ సాంఘిక బంధనాల మీద విమర్శ పెట్టారు. వీళ్ల రచనల్లో, భావనల్లో ఆధ్యాత్మిక ప్రపంచానికంటే సాంఘిక ప్రపంచమే ప్రధానంగా ఉంటుంది. అందులోనూ కింది కులాల నుంచి భక్త కవుల సాంఘిక దృక్పథం చాలా లోతైనది. జీవితాన్ని సమానత్వమనే తాత్వికత మీద పునర్నిర్మించాలనే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఉత్పత్తి కులాల నుంచి వచ్చిన భక్త కవులందరూ తాము శ్రమ చేస్తూ జీవితతత్వాన్ని చాటి చెప్పారు.

అలాంటి వారిలో సంత్‌ రవిదాస్‌ చాలా ప్రముఖుడు. ఆయన కబీర్‌ కాలానికి చెందిన అంటరాని కులాల తాత్విక, సాంఘిక సమతావాది. తన సందేశాన్ని అట్టడుగు ప్రజల దగ్గరికి తీసికెళ్లడానికి అత్యద్భుతమైన వాగ్గేయకార సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. సహజంగానే భక్తి ఉద్యమానికి చెందిన వాళ్లు తర్వాతి కాలంలో ప్రజలకు ఆరాధనీయులయ్యారు. అలా ఉత్తర భారతదేశంలో సంత్‌ రవిదాస్‌ ఒక ఆరాధనా మార్గమయ్యాడు. ముఖ్యంగా దళిత, ఉత్పత్తి కులాల ప్రజలు ఆయన్ను పూజించడం మొదలు పెట్టారు. పంజాబీ సిక్కు సంప్రదాయంలోని దళితులకు రవిదాస్‌ పూజనీయుడు.

రవిదాస్‌ ప్రభావం పంజాబ్‌, హర్యాణా, ఉత్తరప్రదేశ్‌ లాంటి ప్రాంతాల్లో బలంగా ఉంది. ఇక్కడి దళితులకు రవిదాస్‌ కేవలం ఆధ్యాత్మిక ప్రతీక మాత్రమే కాదు. ఉత్పత్తి కులాల సాంఘిక, సాంస్కృతిక తాత్విక పరంపరాగత వారసత్వంలో భాగం. అలాంటి రవిదాస్‌ ఆలయాన్ని పడగొట్టడానికి గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఆయనను హిందుత్వలో కలిపేసుకొనే ప్రయత్నాలు జరిగినట్లు కూడా తెలుస్తోంది. రవిదాస్‌ వివరాలు తెలుసుకుంటుంటే చాలా అద్భుతమనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలో బసవేశ్వరుడు, వేమన, వీరబ్రహ్మంలాంటి వాళ్లు నిర్వహించిన పాత్ర గుర్తుకు వస్తుంది. భక్తి ఉద్యమం, లేదా ఆనాటి ఉత్పత్తి కులాల సాంఘిక తాత్వికతల్లో ఒక్కొక్కరిది ఒక్కో రకమైన వ్యక్తిత్వం. అన్నిటి సారాంశం మాత్రం మూఢనమ్మకాలు, కులవ్యవస్థ, అసమానతలపై నిరసన.

సంఘ్‌ పరివార్‌కు ఇది చుక్కెదురు. బ్రాహ్మణీకరించి తమలో కలిపేసుకోవడం, లేదా నిర్మూలించడం రెండే దానికి తెలుసు. ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ, ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం- అన్నిటిలో జడలు విప్పుతున్న హిందుత్వకు రవిదాస్‌ ఆలయ కూల్చివేత ఉదాహరణ. సాకులు ఎన్ని చూపినా ఇది వాస్తవం. అఖండ హిందూ సంస్కృతి కోసం సంఘ్‌ రాజ్యం ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో రవిదాస్‌ ఆలయ విధ్వంసం మరో ప్రమాద ఘంటిక.

ఈ ప్రమాదాన్ని పంజాబ్‌ మొదలు ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల దళితులు సరిగానే గుర్తించారు. ఆలయం కూలిపోయినప్పటి నుంచి పంజాబ్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. విచిత్రమేమంటే దేశవ్యాప్తంగా లక్షలాది మంది దళితులు కలిసి ఢిల్లీలో 21వ తేదీన మిలిటెంట్‌ ఆందోళన చేపట్టాక, అణచివేత, అరెస్టులు, అక్రమ కేసులతోగాని పత్రికల్లో వార్త రాలేదు.

ఈ ఆందోళనలకు చంద్రశేఖర్‌ రావణ్‌ నాయత్వంలోని భీం సేన ముందుంది. ఢిల్లీ ఆందోళనలపై దారుణమైన అణచివేత ప్రయోగించి చంద్రశేఖర్‌తోపాటు అనేక మందిని అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారు. దేశంలో మిలిటెంట్‌ దళిత ఉద్యమానికి భీం సేన నాయకత్వం వహిస్తున్నందున సహజంగానే సంఘ్‌ పోలీసులు ఈ ఆందోళనను ఆడ్డుకున్నారు. వాళ్లు రవిదాస్‌ ఆలయాన్ని కూల్చి ఆయన ప్రబోధాలను దాచేయలేరు. నిజానికి ఇన్ని శతాబ్దాలుగా రవిదాస్‌ ఒక భగవత్‌ స్వభావానికంటే కూడా తన సాంఘిక భావాలతోనే ప్రజల్లో జీవిస్తున్నాడు. ఆ భావాలు ఎలా ఆలయం కూల్చివేతతో రద్దుకావో, భీం సేన కార్యకర్తల అరెస్టులతో దేశంలో సంఘ్‌పరివార్‌కు వ్యతిరేకంగా పెరుగుతున్న మిలిటెంట్‌ దళిత ఉద్యమం ఆగిపోదు.

కాకపోతే ఈ దుర్మార్గ ఘటన వల్ల ఒక విషయం సంఘ్‌పరివార్‌ నిరూపించుకుంది. ఈ మూక మసీదులనే కాదు, ఆలయాలను కూడా కూల్చేయగలదు. మసీదయినా, ఆలయమైనా ఈ దేశంలో ఎవరికి చెందినదనేదే దానికి ముఖ్యం. ఒక అంటరానికులంలో పుట్టిన రవిదాస్‌ ఆలయాన్ని కూల్చేయడానికి అటవీ చట్టాలు, అభివృద్ధిలాంటివి ఎన్నో సాకుగా వాడుకుంది. ఈ ప్రమాణాలను హిందూ దేవాలయాలకు వర్తింపజేయగలరా? అని ఇప్పుడు దళితులు అడుగుతున్నారు. దేనికంటే దేశంలోని అనేక హిందూ ఆలయాలు రోడ్లకు అడ్డంగా, రక్షిత అడవుల పరిధిలో ఉన్నాయి.

ఆలయాలు సమస్య కాదు. ఉద్దేశాలు అసలు సమస్య. రవిదాస్‌ ఆలయం కూల్చివేత వెనుక స్పష్టంగా హిందుత్వ రాజకీయాలు ఉన్నాయి. అందువల్ల ఆలయాన్ని అక్కడే పునర్నిర్మించాలని ప్రగతిశీలవాదులు డిమాండ్‌ చేయాలి. ముఖ్యంగా అఖండ హిందూ బ్రాహ్మణీయ సంస్కృతి పేరుతో సంఘ్‌ చేస్తున్న దుర్మార్గాలను ఎదిరించాలంటే మనకు ఆధునిక రాజకీయార్థిక సాంఘిక దృక్పథంతోపాటు పరంపరాగతంగా ఈ నేల మీద బ్రాహ్మణ్యానికి, కులవ్యవస్థకు వ్యతిరేకంగా సమానత కోసం కృషి చేసిన అలనాటి రవిదాస్‌ సంత్‌లాంటి వాళ్ల స్ఫూర్తిని వెంట తీసుకొని నడవాలి.

అయోధ్య రామాలయం కోసం నడుస్తున్న కేసు విచారణలో భాగంగా ఈ మధ్య అత్యున్నత న్యాయస్థానం రాముడి వారసులు ఎవరైనా ఉన్నారా? ఉంటే ʹవివాదాస్పదʹ అయోధ్య బాబ్రీ మసీదు-రామజన్మభూమిని క్లయిమ్‌ చేసుకుంటారా? అని అడిగింది. రాముడు పౌరాణిక పాత్రనా, చారిత్రక వ్యక్తా.. అనే సందేహం కూడా లేకుండా రాముడి మూలాల దగ్గరికి వెళ్లి, వారసులెవరు? అని అడిగింది. రామాలయం కోసం రాముడి వారసులను సాక్షులుగా ఆహ్వానించిన న్యాయస్థానానికి రవిదాస్‌ సంత్‌ ఒక చారిత్రక వ్యక్తి అని తెలియదనుకోవాలా? ఆయన వారసులు ఈ దేశంలోని కోట్లాది మంది దళితులని తెలియదనుకోవాలా? ఒక వేళ న్యాయస్థానానికి తెలియకపోతే రవిదాస్‌ ఆలయం పునర్నిర్మాణం కోసం ఉద్యమించి దళితులు ఆ సంగతి తెలియజేస్తారు. దేనికంటే దళితులు రవిదాస్‌ ఆలయం కోసం చేస్తున్న ఉద్యమంలో సాంఘిక విముక్తి కాంక్ష ప్రతిధ్వనిస్తోంది.

No. of visitors : 350
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
  అరుణతార నవంబర్ 2019
  ఒక చిన్న అమ్మాయి రాసిన మంచి కథ " భూమి "
  నేను జీవితాన్ని అమితంగా ప్రేమిస్తాను
  సముద్రం ఇంకా బతికేవుంది
  డెన్ ఆఫ్ లైఫ్
  వాళ్ళు
  ప్రజా కళాకారుడా
  వసంతమేఘగర్జన - కార్మికోద్యమాలు
  తెలుగు రాష్ట్రాల వ్యవసాయరంగం - 50 ఏళ్ళ విప్లవోద్యమం
  సీమకవి వినూత్ననిరసన ʹʹలైఫ్‌హాలిడేʹʹ
  పడగ కింద పండు వెన్నెల!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •