సోనీ సోరి నిరసన దీక్షకు సంఘీభావం ప్రకటించండి! ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, రచయితలకు విజ్ఞప్తి

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

సోనీ సోరి నిరసన దీక్షకు సంఘీభావం ప్రకటించండి! ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, రచయితలకు విజ్ఞప్తి

- వరవరరావు | 17.06.2016 12:32:46pm

బస్తర్‌లో ఆదివాసులపై ముఖ్యంగా ఆదివాసీ మహిళలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దాడులు, ఎన్‌కౌంటర్లు, స్త్రీలపై లైంగిక అత్యాచారాల గరించి సోనీ సోరి చేస్తున్న పోరాటాన్ని కొత్తగా ఇవాళ వివరించనక్కర్లేదు. ఇందుకోసం ఆమె ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చిందో ఆమె చెప్పినట్లు ఆసిడ్‌తో దహింపబడి, లోకానికి కనిపిస్తున్న ఆమె ముఖం కన్న, ఆమె చూపలేని సున్నిత శరీర భాగాలే ఎన్నో ఉన్నాయనేవి మనందరికీ తెలుసు. ఈ ఏప్రిల్‌ 30 వరకు బస్తర్‌లో ఆపరేషన్‌ 2016లో గ్రీన్‌హ్‌ంట్‌ ఆపరేషన్‌ మూడవ దశలో భాగంగా జరిగిన హింసాకాండ, విధ్వంసాల గురించి మనందరం ఆమె నోట స్వయంగా సిడిఆర్‌ఒ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సభలో విన్నాం.

ఇప్పుడు మళ్లీ తాజాగా సుకుమా జిల్లా గున్పాడ్‌ గ్రామంలో మడ్కం హిడ్మె అనే ఒక ఆదివాసీ మహిళపై స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ జిల్లా రిజర్వ్‌ గార్డ్‌లు చేసిన లైంగిక అత్యాచారం, హత్య గురించి తనను వెళ్లి నిజనిర్ధారణ చేయనివ్వాలని ఆమె సుకుమా జిల్లా ఎస్‌పి ఆఫీసు ముందు జూన్‌ 16వ తేదీ సాయంత్రం నుంచి తన మేనల్లుడు లింగా, ఇతర ఆదివాసీ కార్యకర్తలతో పాటు నిరసన దీక్ష నిర్వహిస్తున్నది. ఈ విషయం తెలిసి గున్పాడు పరిసర గ్రామాల నుంచి జనం కూడ అక్కడికి తరలివస్తున్నారు.

బస్తర్‌ రేంజ్‌ ఐజి ఎస్‌ఆర్‌ ల్లూరి మడ్కం హిడ్మె అనే ఒక మావోయిస్టు దళ సభ్యురాలు, ఎన్‌కౌంటర్‌లో మరణించిందని, ఆ ఎన్‌కౌంటర్‌లో జిల్లా రిజర్వ్‌ గార్డ్స్‌, ఎస్‌టిఎఫ్‌ పాల్గొన్నాయని, అది సుక్మా జిల్లాలోని గున్పాడ్‌ అడవుల్లో జరిగిందని ఒక ప్రకటన ఇచ్చాడు. ఆమె కిష్టారం ఏరియా కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ప్లటూన్‌ నం. 8 దళ సభ్యురాలు అని కూడా ప్రకటించాడు. కాని ఆ గ్రామస్థులూ, ఇరు పొరుగు గ్రామస్థులు కూడా ఇదంతా కట్టుకథ అని అంటున్నారు. ఆ విషయమై సోనీ సోరికి ఫోన్‌ చేసి చెప్పిన వాళ్లున్నారు, స్వయంగా వెళ్లి చెప్పిన వాళ్లున్నారు. గున్పాడ్‌ గ్రామంలోని మడ్కం హిడ్మె ఇంటికి అర్ధరాత్రి వెళ్లి ఆమెను బలవంతంగా లాక్కుని వెళ్లి, పరిసరాల్లోని అడవుల్లో అత్యాచారం చేసి చంపారని ప్రత్యక్షంగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్లు, తీసుకుపోవడం చూసినవాళ్లు చెబుతున్నారు. ఇంటి నుంచి తీసుకెళ్లేటప్పుడు ఆమె సాదా దుస్తుల్లోనే ఉన్నదని, అత్యాచారం చేసి చంపిన తర్వాత ఆమెకు పిఎల్‌జిఎ దుస్తులు వేసి పక్కన తుపాకి పెట్టారని ఆదివాసులు చెబుతున్నారు. అత్యాచారం చేసి చంపివేసిన చోట ఆమె బట్టలు, ఆమె ఒంటి మీది కొన్ని నగలు దొరికాయని ఆమె బంధువులు చెప్పారు. ఈ విషయం తెలిసి లింగా, మరికొందరు కార్యకర్తలతో కలిసి సోనీ సోరి ఆ గ్రామానికి వెళ్లడానికి జూన్‌ 15న ప్రయత్నం చేయగా పోలీసులు రోడ్డు మీదనే తనను దోర్నాపాల్‌ - ఎర్రబోడు దగ్గర ఆపేసి, ఇంజారం గ్రామం నుంచి వెనక్కి పంపారు. ఆమె వెనక్కి తిరిగిపోకుండా వచ్చి సుకుమా జిల్లా ఎస్‌పి ఆఫీసు ముందు నిరాహార దీక్ష చేస్తున్నది. తనతో గున్పాడు గ్రామ ఆదివాసీ ప్రజలు కలిసి చెప్పిన విషయాలు, ఫోన్‌లో మాట్లాడిన విషయాలు, తన విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు, మొత్తం ఆమె ఎస్‌పి ఆఫీసు ముందు నిరసన దీక్ష చేస్తున్న సందర్భంలో 16వ తేదీ సాయంత్రం సిఎల్‌సి నాయకులు నారాయణరావు, కుమారస్వామి దృష్టికి కూడా తెచ్చింది. ఆ ఇద్దరూ ఆమె తమతో మాట్లాడిన ఆడియోను మీడియా దృష్టికి కూడా తెచ్చారు.

మేం ఆమెనేమీ ఆపలేదు, ఆమెను ఆపడానికి పోలీసు బలగాలను కూడ నియోగించలేదు, అటువైపుగా మా బలగాలు పోతున్నాయి కాబట్టి మేం ఒక ముప్పై నిమిషాలు ఆగిపోవలసినదిగా మాత్రమే చెప్పాం, ఆమె వినలేదని జిల్లాకు కొత్తగా ఎస్‌పిగా వచ్చిన కళ్యాణ్‌ ఎలిసా అంటున్నాడు. అట్లాగే లైంగిక అత్యాచారం అంటూ జరిగితే అది దాచగలిగేది కాదు, అది పోస్టుమార్టమ్‌ రిపోర్టులో బయటికి వస్తుందని, అప్పుడు పోలీసులను ఎవరు కాపాడలేరని కూడా అంటున్నాడు. తమ మీద చేస్తున్న ఇతర ఆరోపణలన్నిటినీ విచారణ చేస్తున్నాం అంటున్నాడు. కాని, ఎవరి మీదనైతే స్థానిక ఆదివాసీ ప్రజలు, ముఖ్యంగా స్త్రీలు ఈ ఆరోపణ చేస్తున్నారో వాళ్లే విచారణ చేస్తామని, స్వతంత్రంగా విచారించడానికి వెళ్లే వాళ్లను, ముఖ్యంగా సోనీ సోరి వంటి ఆదివాసీ కార్యకర్తలను ఆపడం ఏమి న్యాయమని ప్రజలు అడుగుతున్నారు.

వాస్తవంగా గున్పాడ్‌ గ్రామం హిడ్మె అనే ఆదివాసీ మహిళ విషయంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెళుతున్న సోనీ సోరినయినా, ఏ ప్రజాస్వామివాదినైనా, ఏ ప్రజాసంఘాల వారినైనా, మీడియానైనా నిరోధించకుండా స్వేచ్ఛగా వెళ్లనివ్వాలని విజ్ఞప్తి. సోనీ సోరి, ఆమె సహచరులు సుకుమా జిల్లా ఎస్‌పి ఆఫీసు ముందు చేస్తున్న నిరసన దీక్షకు సంఘీభావం ప్రకటించి, న్యాయం జరగడానికి సహకరించాల్సిందిగా ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు విజ్ఞప్తి.

జూన్‌ 17, 2016


No. of visitors : 3739
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నిజమైన వీరులు నేల నుంచి వస్తారు

వరవరరావు | 16.07.2016 11:10:44am

1980ల నుంచి కూడా విప్లవ ఉద్యమానికి ఆదిలాబాద్‌ ‌జిల్లా బలమైన కేంద్రంగా ఉంది. ఇంద్రవెల్లి మారణకాండ నుంచి అది దండకారణ్య ఉద్యమానికి ఒక ఆయువుపట్టుగా ఉన్నది.......
...ఇంకా చదవండి

చరిత్ర - చర్చ

వరవరరావు | 15.05.2016 01:23:23pm

భగత్‌సింగ్ ఇంక్విలాబ్‌కు ` వందేమాతరమ్‌, జనగణమనకే పోలిక లేనపుడు హిందూ జాతీయ వాదంతో ఏకీభావం ఎట్లా ఉంటుంది? ఆయన ʹఫిలాసఫీ ఆఫ్‌ బాంబ్‌ʹ గానీ, ఆయన ʹనేను నాస్తికుణ...
...ఇంకా చదవండి

ముగ్గురు దేశద్రోహుల వలన సాధ్యమైన ప్రయాణం

వరవరరావు | 01.06.2016 12:30:00pm

ఆ కూలీ నిస్సందేహంగా దళితుడు, అంటరానివాడు. రోహిత్ వేముల రక్తబంధువు. ముజఫర్‌నగర్ బాకీ హై... అంటూ యాకూబ్ మెమన్‌ను స్మరించుకున్న దేశద్రోహి,...
...ఇంకా చదవండి

దండ‌కార‌ణ్య ఆదివాసీల స్వ‌ప్నాన్ని కాపాడుకుందాం : వ‌ర‌వ‌ర‌రావు

| 21.08.2016 10:46:12am

18 జూలై 2016, అమ‌రుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ స‌భ సంద‌ర్భంగా వ‌ర‌వ‌ర‌రావు ఉప‌న్యాసం......
...ఇంకా చదవండి

నోటీసుకు జ‌వాబుగా చాటింపు

వ‌ర‌వ‌ర‌రావు | 22.05.2016 04:22:41pm

నిన్న‌టి దాకా ఊరు ఉంది వాడ ఉంది/ వాడ అంటే వెలివాడ‌నే/ అంట‌రాని వాళ్లు ఉండేవాడ‌/ అంట‌రాని త‌నం పాటించే బ్రాహ్మ‌ణ్యం ఉండేది/ ఇప్పుడ‌ది ఇంతింతై ...
...ఇంకా చదవండి

రచయితలారా, మీరెటువైపు? వేదాంత వైపా? స్వేద జీవుల వైపా?

వరవరరావు | 03.07.2016 01:08:08am

అరుంధతీ రాయ్‌ ‌మావోయిస్టు పార్టీ ఆహ్వానంపై దండకారణ్యానికి వెళ్లినపుడు ఆమె బస్తర్‌లో ప్రవేశించగానే వేదాంత క్యాన్సర్‌ ఆసుపత్రి కనిపించిందట. దగ్గర్లోనే లోపల......
...ఇంకా చదవండి

రచయితలేం చేయగలరు?

వ‌ర‌వ‌ర‌రావు | 16.07.2016 09:58:28am

1948లో భారత సైనిక దురాక్రమణకు గురయిన నాటి నుంచి కశ్మీరు ఆజాదీ కోసం పోరాడుతున్నది. ఆర్టికల్‌ 370 ‌మొదలు రాజ్యాంగం నుంచి ఎన్ని ప్రత్యేకమైన హామీలైనా ఆ సూఫీ.......
...ఇంకా చదవండి

వాగ్ధాటి కాశీపతి

వరవరరావు | 16.08.2016 01:29:44pm

1972లో విరసంలో ఆయన ప్రవేశం సాంస్కృతిక రంగంలో విప్లవోద్యమం నిర్వహించాల్సిన పాత్ర గురించి ఒక ప్రత్యేకమైన ఆలోచన ప్రవేశపెట్టినట్లైంది. అప్పటికే కొండప‌ల్లి.... ...
...ఇంకా చదవండి

రాజకీయ ఖైదీలు - చావు బతుకుల్లో కె. మురళీధరన్‌ (అజిత్‌)

వరవరరావు | 11.09.2016 10:16:25am

అజిత్‌గా విప్లవ శిబిరంలో ప్రసిద్ధుడైన కె. మురళీధరన్‌ 61వ ఏట అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు 2015, మే 9న మహారాష్ట్రలోని పూనెకు దగ్గరగా ఉన్న తాలేగాకువ్‌ ధబాడే.....
...ఇంకా చదవండి

ప్ర‌శ్నించాల్సింది రాజ్యాన్ని : వ‌ర‌వ‌ర‌రావు

వ‌ర‌వ‌ర‌రావు | 17.08.2016 12:26:16am

2016 జ‌న‌వ‌రి 9, 10 తేదీల‌లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విర‌సం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల ముగింపు సంద‌ర్భంగా బ‌హిరంగ‌స‌భ‌లో కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు ఉప‌న్యాసం...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •