రాజ్య‌మే కుట్రదారు అయిన‌ప్పుడు

| సంపాద‌కీయం

రాజ్య‌మే కుట్రదారు అయిన‌ప్పుడు

- క్రాంతి | 28.08.2019 07:04:05pm

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హ‌త్య‌కు మావోయిస్టుల‌తో క‌లిసి దేశంలోని ప‌లువురు సామాజిక‌, హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు కుట్ర ప‌న్నార‌నే ఆరోప‌ణ‌ల‌తో ప్ర‌శ్నించే గొంతుల‌పై దాడికి దిగిన ప్ర‌భుత్వం... ఏడాదిన్న‌ర కాలంలో దేశాన్ని ఓ బంధీఖానాగా మార్చేసింది. స‌రిగ్గా సంవ‌త్స‌రం క్రితం 2018 ఆగ‌స్టు 28న హైద‌రాబాద్, ముంబై, రాంచీ, ఢిల్లీ, గోవా, ఫ‌రీదాబాద్‌ న‌గ‌రాల్లో దాదాపు స‌ది మంది హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల ఇళ్ల‌పై దాడులు జ‌రిపిన పూణే పోలీసులు వ‌ర‌వ‌ర‌రావు, సుధా భ‌ర‌ద్వాజ్‌, అరుణ్ ఫెరీరా, వెర్న‌న్ గోంజాల్వెజ్‌ల‌ను అరెస్టు చేశారు. కోర్టు జోక్యంతో గౌత‌మ్ న‌వ‌లాఖ‌, స్టాన్‌స్వామీ, ఆనంద్ తేల్‌తుంబ్డేల అరెస్టు తాత్కాలికంగా నిలిచినా... ఏ క్ష‌ణానైనా వారిని అరెస్టు చేసే అవ‌కాశాలు లేపోలేదు.

2017 డిసెంబర్ 31న‌ బీమా కోరేగావ్‌లో ఎల్గార్ ప‌రిష‌త్ భారీ స‌భ‌ను నిర్వ‌హించింది. ఆ మ‌ర్నాడు ఆర్ ఎస్ ఎస్ నేత‌లు శంబాజీ భీడే, మిళింద్ ఎక్బోటేల నాయ‌క‌త్వంలో ద‌ళితుల ర్యాలీపై దాడి జ‌రిగింది. ఈ దాడిలో ముగ్గురు ద‌ళితులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌లో నిందితులను వ‌దిలేసిన పోలీసులు స‌భ నిర్వాహ‌కుల‌పై కేసులు న‌మోదు చేశారు. ఇక్క‌డే అస‌లు మొద‌లైంది. బీమా కోరేగావ్ అల్ల‌ర్ల కేసులో నిందితులుగా పేర్కొంటు ప‌లువురు సామాజిక కార్య‌క‌ర్త‌ల పేర్ల‌ను ముందుకు తెచ్చిన మ‌హారాష్ట్ర పోలీసులు.. క్ర‌మంగా వారికి మావోయిస్టుల‌తో సంబంధాలున్నాయ‌నే ఆరోప‌ణ‌లు ముందుకు తెచ్చారు. ఆ వెంట‌నే.. వారు మావోయిస్టుల‌తో క‌లిసి ప్ర‌ధాని మోదీని హ‌త్య చేసేందుకు కుట్ర ప‌న్నారంటూ న‌కిలీ లేఖ‌ల‌ను సృష్టించి... ఆ పేరుతో 2018 జూన్‌లో సుధీర్‌ ధావ్లే, సురేంద్ర గాడ్లింగ్‌, ప్రొఫెస‌ర్‌ షోమాసెన్‌, రోనా విల్సన్‌, మహేశ్‌ రౌత్‌ల‌ను అరెస్టు చేసింది. ఈ అరెస్టుల ప‌రంప‌ర వ‌ర‌వ‌ర‌రావు, సుధా భ‌ర‌ద్వాజ్‌, అరుణ్ ఫెరీరా, వెర్న‌న్ గోంజాల్వెజ్‌ల‌తో క‌లిపి తొమ్మిది మందికి చేరింది.

ప్ర‌ధాని హ‌త్యకు కుట్ర ప‌న్నార‌నే సాకుతో... దేశ వ్యాప్తంగా ప‌లువురు సామాజిక కార్య‌క‌ర్త‌ల ఇళ్ల‌పై దాడులు జ‌రిపి వారి వ‌ద్ద నుంచి ఎల‌క్ట్రానిక్ డివైజ్‌లు, సాహిత్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇప్ప‌టి వ‌ర‌కూ... వాటిని కోర్టులో ప్ర‌వేశ పెట్ట‌లేదు. త‌మ ఆరోప‌ణ‌ల‌కు సాక్ష్యాల‌ను కూడా లేదు. కానీ... వ‌ర‌వ‌ర‌రావు, సురేంద్ర గాడ్లింగ్‌, రోనా విల్స‌న్‌ల‌కు మావోయిస్టుల‌తో సంబంధాలున్నాయంటూ మీడియాకు లీకులు ఇస్తూ వ‌చ్చారు. పూణే ఎర‌వాడ జైల్లో మ‌గ్గుతున్న ఈ తొమ్మిది మందిపై రాజ్యం రోజుకో కొత్త ఆరోప‌ణ చేస్తూ వ‌స్తోంది. వ‌ర‌వ‌ర‌రావుపై మావో్యిస్టు పార్టీ పూర్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గ‌ణ‌ప‌తితో సంభాషించాడ‌ని ఆరోపించిన పోలీసులు, 2016 డిసెంబ‌ర్‌లో గడ్చిరోలి జిల్లా అహెరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుర్జాగడ్ ప్రాంతంలో లాయిడ్స్‌ మెట‌ల్ అండ్ ఎన‌ర్జీ లిమిటెడ్‌కు చెందిన 75 వాహ‌నాల‌ను త‌గ‌ల‌బెట్టిన కేసును వ‌ర‌వ‌ర‌రావుపై మోపారు. తాజాగా.. 2005లో జ‌రిగిన మావోయిస్టు పార్టీ క‌ర్ణాట‌క కార్య‌ద‌ర్శి సాకేత్ రాజ‌న్ ఎన్‌కౌంట‌ర్ సంద‌ర్భంగా న‌మోదు చేసిన కేసులోనూ వ‌ర‌వ‌ర‌రావును నిందితుడిగా పేర్కొన్నారు. మ‌రోవైపు... బీమాకోరేగావ్ కేసులో క‌నీసం బెయిల్ కూడా ఇవ్వ‌కుండా.. విచార‌ణ‌ను జాప్యం చేస్తుండ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. డెబ్బై, ఎన‌బై సంవ‌త్స‌రాల పైబ‌డిన వ‌య‌సులో తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న వీరిని జైలులో క‌నీస వ‌స‌తులు కూడా క‌ల్పించ‌కుండా తీవ్ర హింస‌ల‌కు గురిచేస్తున్నారు.

ఈ అరెస్టుల వెన‌క గ‌ల అస‌లు కుట్ర‌ను అర్థం చేసుకోకుంటే... రాజ్య నీతి అర్థం కాదు. భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదాన్ని ఏకైకంగా మార్చే కుట్ర ఇది. భిన్న మ‌తాలు, కులాలు, భాష‌లు, అస్థిత్వాలు గ‌ల దేశాన్ని ఒకే ఒక‌ అస్థిత్వంలోకి మార్చే కుట్ర ఇది. ద‌ళితులు, ఆదివాసులు, మైనార్టీల అస్థిత్వాల‌ను ర‌ద్దు చేసి హిందుత్వ‌ను స్థిర ప‌రిచే కుట్ర‌. అందుకోసం బ్రాహ్మ‌ణీయ ఫాసిజం దేశ ప్ర‌జ‌ల‌పై చేస్తున్న దాడుల‌ను ఎవ‌రు ప్ర‌శ్నించినా రాజ్యం స‌హించ‌దు. ఆ ప్ర‌శ్న‌ను అణ‌చివేసేందుకు రాజ్యం ఓ కుట్రదారు పాత్ర‌ను పోషిస్తోంది ఇక్క‌డ‌.

దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను కొల్ల‌గొట్టేందుకు ఆదివాసుల నెత్తురు పారిస్తున్నా ప్ర‌శ్నించే గొంతులు ఉండ‌కూడ‌దు. ఆత్మ‌గౌర‌వం కోసం, అధికారంలో వాటా కోసం నిన‌దిస్తున్నదళితుల‌ను ఊచ‌కోత‌కోస్తున్నా ఎదిరించే వాళ్లుండ‌కూడ‌దు. ల‌వ్ జిహాద్ పేరిట‌, గో ర‌క్ష‌ణ పేరిట తెగ‌న‌రికినా అడిగే వాళ్లుండ‌కూడ‌దు. అందుకోసం.... ప్ర‌శ్న‌ను ఉరి తీసేందుకు సిద్ధ‌మైన రాజ్యం స‌రికొత్త కుట్ర‌కు తెర‌తీసింది. ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు ప్ర‌య‌త్నించార‌నే ఆరోప‌ణ‌ల‌తో ప్ర‌జా ఉద్య‌మ‌కారుల‌ను చెర‌సాల పాలు చేసింది.

య‌దేచ్ఛ‌గా త‌మ హ‌త్యాకాండ‌ను అమ‌లు చేసేందుకు... అభివృద్ధి ముసుగేసి అడ‌విపై యుద్ధం ప్ర‌క‌టించింది. దేశ‌భ‌క్తి పూన‌కాన్ని జ‌నం మెద‌ళ్ల‌లోకి చొప్పించేందుకు టెర్ర‌రిజం సాకు చూపి ఆర్టిక‌ల్ 370, 35(ఎ)ను ర‌ద్దు చేసింది. క‌శ్మీర్‌ను ఓ బ‌హిరంగ చెర‌సాల‌గా మార్చి బ‌ల‌వంతంగా భార‌త్‌లో క‌లుపుకుంది. రాజ్య‌మే కుట్ర దారుగా మారిన‌ప్పుడు ప్ర‌జ‌ల జీవితాల్లో నెల‌కొనే బీభ‌త్సాన్ని ఇప్పుడు ప్ర‌త్య‌క్షంగా అనుభ‌విస్తున్న సంద‌ర్భం ఇది. బ్రాహ్మ‌ణీయ హిందూ ఫాసిజం బ‌రితెగింపు ప‌తాక స్థాయికి చేరిన ప్ర‌స్థుత సంద‌ర్భం ఇది. ఫాసిజానికి వ్య‌తిరేకంగా గొంతెత్తాల్సిన సంద‌ర్భం ఇది. ప్ర‌జాస్వామిక శ‌క్తుల‌ను కాపాడుకోవ్స‌లిన‌ సంద‌ర్భం.





No. of visitors : 204
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

సంఘ‌ర్ష్‌ | 18.11.2016 12:59:34pm

అక్క‌డ‌ బాల్యం భ‌యంలో... య‌వ్వ‌నం నిర్బంధంలో గ‌డిచిపోతుంది. ఇంటి నుంచి బ‌య‌ట‌కెళ్లిన పిల్ల‌లు తిరిగి వ‌స్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక‌...
...ఇంకా చదవండి

బోధ‌నా హ‌క్కు కోసం మ‌రో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్‌.సాయిబాబా

ఇంట‌ర్వ్యూ : క్రాంతి | 01.06.2016 12:44:47pm

1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట...
...ఇంకా చదవండి

దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజం

సుబోజిత్ బాగ్చీ (అనువాదం : క‌్రాంతి) | 17.06.2016 09:33:33am

సామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే........
...ఇంకా చదవండి

మ‌రో ఆదివాసీ యువ‌కుడు...

క్రాంతి | 03.09.2016 03:22:46pm

17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువ‌కుడిగా త‌ప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జ‌వాన్లు చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన అంబులెన్స్ ........
...ఇంకా చదవండి

పొట్ట‌కూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారు

| 20.10.2016 03:21:04pm

తాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్ట‌య్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన‌ మ‌నోహ‌ర్ శ‌వ‌మై తిరిగి వ‌చ్చాడు. "ఎన్‌కౌంటర్" క‌థ రిపీట్ అయ్యింది....
...ఇంకా చదవండి

వెలివాడే తొలిపొద్దై పుస్త‌కావిష్క‌ర‌ణ‌

ఫొటోలు : క‌్రాంతి | 17.07.2016 12:15:31pm

రోహిత్ వేముల స్మృతిలో విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం వెలువ‌రించిన వెలివాడే తొలిపొద్దై పుస్త‌కాన్ని రోహిత్ త‌ల్లి వేముల రాధిక ఆవిష్క‌రించారు. మార్చి ...
...ఇంకా చదవండి

సంత‌కు వెళ్లిన వాళ్లు.. శ‌వాలై వ‌చ్చారు

సంఘ‌ర్ష్‌ | 20.02.2017 11:52:50am

ఏకంగా ఇర‌వై రోజుల నుంచి మృత దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌కుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళ‌న చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క అధికారి కూడా ఈ విష‌యంలో స్పందించ‌క‌పోవ...
...ఇంకా చదవండి

అధికారం నీడ‌లో.... అంతులేని హింస‌

క్రాంతి | 05.10.2016 03:32:08pm

మోదీ ప్ర‌భుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను వేదాంత‌, ఎస్సార్‌, టాటా, జిందాల్ వంటి బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడుతోంది. అందుకు......
...ఇంకా చదవండి

ఆ చెట్టుకు నోరుంటే ..

క్రాంతి | 03.01.2017 09:49:29am

ఆట‌పాట‌ల్లో మురిసిపోయే ప‌సివాడు ఉట్ట‌న్న‌ట్టుండి న‌క్స‌లైట‌య్యాడు. క‌సిగా గుచ్చుకున్న బ‌యోనెట్ మొన వాడి మొర ఆల‌కించ‌లేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల...
...ఇంకా చదవండి

ఆర‌ని మంట‌లు...

| 02.11.2016 09:05:19am

2011 మార్చిలో చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జ‌రిగిన మార‌ణ‌హోమం పోలీసుల ప‌నే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెష‌ల్ పోలీస్...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార సెప్టెంబర్ 2019

    దళిత భక్త కవి రవిదాస్‌ సంత్‌ ఆలయం కూల్చివేత హిందూ ఫాసిజంలో భాగమే
    The Destruction of Kashmir is a Deathblow to Democracy in India
    నల్లమల యురేనియం గని కాదు, జీవవైవిధ్య కేంద్రం
    అతడు ఆమె అడవి
    మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ
    కన్ ఫామ్... !
    బందిష్
    రాంగూడ ప్రాంతంలో సమిష్టితత్వం, సహకార పద్ధతి
    కళలన్నా, సాహిత్యమన్నా ఫాసిజానికి భయం
    కవులకు సమర స్ఫురణ

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •