ఎరవాడ జెయిలులో ఈ వేకువ

| సాహిత్యం | వ్యాసాలు

ఎరవాడ జెయిలులో ఈ వేకువ

- పాణి | 28.08.2019 07:07:06pm

ఈ ఉదయాన వివి ఎలా మేల్కొని ఉంటారు?

ఈ విడత జెయిలు జీవితంలో ఆయనకు ఇది మూడు వందల అరవై ఐద‌వ వేకువ. ఏ పురా జ్ఞాపకాల, భవిష్యదాశల వెలుగు రేఖల చిరు సవ్వడి ఆయన చీకటి గదిలోకి ప్రసరించి మేల్కొలుపు పాడిందో. జెయిలే ఆయన అస్తిత్వంగా మారిపోయిందా ! అనంతంగా సాగుతున్న ఆయన జెయిలు జీవితంలోకి మరో ఏడాది చేరిపోయింది.

వివి అంటే నడుస్తున్న చరిత్ర కదా. తేదీలు, సంవత్సరాలు, ఘటనలు, కల్లోలాలు, వీటన్నిటిలో వందల వేల మంది మనుషులు, వాళ్ల కలలు, కాల్పనిక ఊహలు, వాస్తవ ఆచరణలు, అన్నిటినీ గుదిగుచ్చే భవిష్యత్‌ స్వప్నాలు.. వివిని కదిలిస్తే ఇలా ఎన్నెన్నో మన మధ్యలోకి వస్తాయి. వివి మాటల్లో మనకు తెలిసేది వివరాలు మాత్రమే కాదు. చరిత్ర మాత్రమే కాదు. ఆయన మాటల్లో చరిత్ర పదే పదే పునర్నిర్మాణమవుతుంటుంది. అందుకే ఆయన మాట ఎన్నడూ జ్ఞాపకాల తలపోత కాదు. ఎల్లప్పుడూ గత వర్తమానాలపై సరికొత్త వెలుగు పుంజాలను అద్దుతూ ఉంటుంది.

పూనా జెయిలు గదిలో ʹఈ రోజుకు ఏడాది అయింది కదా?ʹ అని స్పురించిన మరుక్షణమే సాయి జైలు జీవితాన్ని ఆయన గణించి ఉంటారు. తన తోటి ఎనిమిది మంది జెయిలు జీవితాన్ని స్పృశించి ఉంటారు. ఆధునిక చరిత్రలో విశ్వాసాల కోసం జెయిలు జీవితం గడిపిన ఎందరో సాహసిక మానవులను ఆయన తలపోసుకొని ఉంటారు. అక్షరాల కోసం చీకటి గదుల్లో చిక్కుకపోయిన ఎందరో సృజనకారుల ఊహల్లోకి తొంగి చూసి ఉంటారు.

అనుభవం నుంచి చారిత్రక సంచారం చేయడం ఆయనకు పట్టుబడ్డ మేధో విద్య. ఇది వివి మాటల్లోని ఇంకో అద్భుతం. బహుశా అది మాటల ప్రత్యేకతే కాదు. ఆయన వ్యక్తిత్వంలోని ప్రత్యేకత. కవి కదా. మానవానుభవం నుంచి అనంతమైన చారిత్రక యుగావధిలోకి ఆయన అనుక్షణం ప్రయాణిస్తుంటారు. అందుకే ఆయనకు విశ్వాసాలేగాని అపనమ్మకాలు ఉండవు. వ్యక్తిగతంగాకానీ, సామాజికంగా కానీ ఓర్వలేని కల్లోలాలు చెలరేగినా ఆయన దిటవు గుండె చెదిరిపోదు. ఏ ఉత్థాన పతనాలూ ఆయన చారిత్రక స్వప్నాలను భంగపరచలేవు.

మానవులపై ఆయనకున్న నమ్మకం అలాంటిది. సంక్షోభాలన్నీ ఆయనకు దివారాత్రాల వెంట కాసేపు నిద్రపోయి తిరిగి మేల్కొనడం వంటివే. నిద్రలోనూ వేకువను వెంటేసుకొనే ఉంటారు. వేకువ వెలుగులను తన వ్యక్తిత్వంలో గాఢంగా సంలీనం చేసుకొని కాసేపటి కోసం అలా విశ్రమిస్తారు. అంతే. దీపాలు ఆర్పిన చేతులేవో, వెలిగించే చేతులేవో ఆయన ఎలాంటి స్థితిలోనైనా పోల్చుకోగలరు. అది చెప్పడం కోసమే ఆయన మనతో సంభాషిస్తుంటారు. మన కోసం రచిస్తుంటారు. ఒక చిన్న ఊహతో బయల్దేరి లలితమూ, కఠినమూ అయిన వాస్తవాన్ని మనకు ఎత్తి చూపిస్తుంటారు. ʹఈ సత్యాన్ని చూడండి..ʹ అని మనకు చెప్పడానికి ఎన్ని తీర్ల కవిత్వం అల్లుతారో.

ఆయన మనతోనే కాదు, ఉదయించే సూర్యుడితోనూ ఇలాంటి సంభాషణే చేయగలరు. బహుశా ఇప్పుడు ఎరవాడ జెయిలు గోడలను ఎగబాకి వస్తున్న లేత సూర్యుడితోనూ ఇలా మాట్లాడుతూనే ఉంటారు కావచ్చు. ప్రకృతికి వెలుగునిచ్చే సూర్యుడితో సమాజానికి వెలుగునిచ్చే సూర్యుల గురించే ఆయన సంభాషిస్తుంటారు.

1974లో ఆయన ʹఉదయించే సూర్యుడా!ʹ అని మొదలు పెట్టి

ఐదూ ఖండాల నుంచి
నాల్గూ సంద్రాల మీంచి
ఉరికురికి వచ్చినాము
ఉదయించే సూర్యుడా
ఉప్పెనలా లేచినాము
ఉదయించే సూర్యుడా
ఉద్యమాలు తెచ్చినాము
ఉదయించే సూర్యుడా
ఉత్తేజం నీవె మాకు
ఉదయించే సూర్యుడా.. అని రాశారు (స్వేచ్ఛ కవితా సంపుటి)

జీవితం కఠినమైనదే కావచ్చు. వివి దానిలోని సున్నితత్వాన్ని తరచి తరచి చూస్తారు. బహుశా ఆయన కవిత్వం అదేనేమో. కవిత్వానికి వెన్నెముకలాంటి తన ఆచరణ అదేనేమో. పై కవితలోనే ఆయన సూర్యుడితో ఏమంటారంటే ʹనీ మెత్తని చేయితాకి పువ్వులమై పూసినాము, వెచ్చని నీ చూపు సోకి మంచువలె కరిగినాము, నీవల్లనే నేలంతా జల్లులమై కురిసినాము..ʹ అంటారు. ప్రకృతికీ సమాజానికి మధ్య ఈ గతితర్కాన్ని చూస్తారు కాబట్టి మనుషుల ఆలోచనల్లోంచి, పనుల్లోంచి, నమ్మకాల్లోంచి ఎడతెగని జీవధారను ఆయన పోగు చేసుకుంటుంటారు.

ఇది జెయిలను ధిక్కరించే కవి ప్రతివ్యూహం.

సాయి ఒక చోట..

మళ్లీ నేను చనిపోవడానికి నిరాకరించినప్పుడు
నా జీవితంతో విసుగుచెంది
నను బంధించిన వాళ్లు నన్ను వదిలేస్తారు
నేను బయటికి నడిచాను
ఉదయించే సూర్యకాంతి పరుచుకున్న
నవనవలాడే ఆకుపచ్చ లోయల్లోకి

గడ్డి కొసల చురకత్తులు చూసి నవ్వుతూ.. అంటాడు. బహుశా జెయిలనే రాజ్య వ్యూహానికి ఏ విప్లవ కవి ప్రతివ్యూహమైనా ఇదే కావచ్చు.

ఆస్తి, అధికారం ప్రజలపై నేరారోపణలు చేస్తునే ఉంటాయి. అంత దాకా జెయిలు బతికే ఉంటుంది. ఈ విషయంలో వివికి అపారమైన స్పష్టత ఉంది. 1986-89 జెయిల్లో ఉన్నప్పుడు వివి ఇలా రాశారు.

ఆస్తి
మనుష్య ప్రపంచాన్ని
కాపలాదారులుగా, నేరస్తులుగా విభజించింది
నేను అసలు దానినే రద్దు చేస్తానని ప్రకటిస్తే
ఆస్తి బోనులో ముద్దాయిని సరే
కామందు కళ్లకు నేను కమ్యూనిస్టును
అంతకన్నా పెద్ద నిందారోపణ లేనట్లు
అతడు నన్ను నక్సలైట్‌నంటాడు

అదే నిజమయ్యేలా నిరీక్షిద్దాం మనం
ప్రజల కోసం ʹరాజద్రోహంʹ చేద్దాం మనం.

ఈ నిస్సంశయ ద్పక్పథం వివి సొంతం. ఈ ఉదయాన ఆయన ʹఏడాదైందʹని గుర్తు చేసుకోవడమంటే కాలాన్ని లెక్కించుకోకవడమే కాదు. ఈ కాలానికి ఉన్న అర్థాన్ని మననం చేసుకోవడమే. బహుశా ఆ జెయిలు ఆవరణలో మొక్కలో, పిట్టలో, కూనలో, పువ్వులో ఉండి ఉంటే, వివి వాటి పర్యావరణంలోకి సుతిమెత్తగా ప్రవేశించి ఇలాంటి సంభాషణ చేస్తుంటారేమో. అక్కడి నుంచే మనందరితో ఇలాంటి గుసగుసలుపోతుంటారేమో. దేనికంటే ఊహాశక్తి అపారమైనది. అది జెయిలు గోడల్లో చిక్కుకొనిపోయేది కాదు. అనంత మానవ జీవితాన్ని ముట్టుకొని వర్ణరంజితం చేస్తూ ఉంటుంది.

No. of visitors : 487
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
  జీవితం పరిమళించిన కథలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •