వాళ్లంటే అంత భ‌యం ఎందుకు?

| సంభాషణ

వాళ్లంటే అంత భ‌యం ఎందుకు?

- పావ‌ని | 28.08.2019 07:09:33pm

భీమా కోరేగావ్ కుట్ర‌కేసులో వ‌ర‌వ‌ర‌రావు అరెస్టై స‌రిగ్గా ఏడాది. అస‌లు ఈ కుట్ర‌కేసు మొద‌లై.. తొలివిడుత అరెస్టులు జ‌రిగి 15 నెల‌లు కావొస్తోంది. దేశ వ్యాప్తంగా సామాజిక కార్య‌క‌ర్త‌ల‌ను, న్యాయ‌వాదుల‌ను, క‌వుల‌ను అరెస్టు చేసి అక్ర‌మంగా నిర్భంధించి ఒక కుట్ర కేసు బ‌నాయించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న నిందితుల స‌హ‌చ‌రులు, కుటుంబ‌స‌భ్యులు, వాళ్ల లాయ‌ర్లు కాకుండా.. ఒక వేళ ఎవ‌రికైనా అస‌లు ఈ కేసు ఎంత వ‌ర‌కూ వ‌చ్చింద‌ని కుతూహల ప‌డితే.. తేలేది ఏంట‌య్యా అంటే.. కేసు మొద‌లైన‌ప్పుడు చెప్పిన అబ‌ద్దాలే ఇంకా చెబుతూ.. అలాంటి అసంబ‌ద్దమైన వాద‌నలే చేస్తూ.. ఈ దేశ ప్ర‌జ‌ల‌ను, మీడియానే కాదు.. న్యాయ వ్య‌వ‌స్త‌ను కూడా అవ‌హేళ‌న చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆగ‌ష్టు 27న జ‌రిగిన వాయిదా నాటికి కూడా అటు ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ కానీ, ఇటు విచార‌ణా అధికారులు కానీ ఎటువంటి కాంక్రీట్ ఎవిడెస్స్ కోర్టు వారి ముందు పెట్ట‌కుండానే.. నిందితుల‌కు ఈ దేశ న్యాయ శాస్త్ర ప్ర‌కారం, చ‌ట్టం ప్ర‌కారం రావాల్సిన బెయిలును విజ‌య వంతంగా అడ్డుకున్నారు. ఈ కేసులోని అసంబ‌ద్ద‌త‌ల గురించి, అబ‌ద్దాల గురించి, హాస్యాస్ప‌ద వాద‌న‌ల గురించి వివ‌రాలు ప‌క్క‌న పెడితే.. ఈ కుట్ర‌కేసు కుట్ర వెన‌క ఉన్న క‌థ ఏంట‌నే ఆలోచ‌న ఎవ‌రికైనా వ‌స్తే.. కాస్త ఆలోచిస్తే., నిజంగానే... ఈ అరెస్టై జైల్లో ఉన్న ఈ 10 మందో.. లేదంటే.. ఎఫ్ఐఆర్ లోపేర్కోన్న ఆ యిత‌రులో నిజంగానే కుట్ర‌ప‌న్నారా? అల్ల‌ర్ల‌ను రెచ్చ‌గొట్టారా? అస‌లు జ‌రిగిన భీమాకోరేగావ్ హింస‌కు వీరికి ఏమైనా ప్ర‌త్య‌క్ష, ప‌రోక్ష సంబంధం ఉందా? దేశాన్ని అస్తిర‌ప‌ర‌చాల‌నుకుంటున్నారా? మ‌హ‌రాష్ట్ర పోలీసులు అంటున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రిని చంపాల‌నుకుంటున్నారా? ఇవ‌న్నీ చెయ్య‌క‌పోతే.. ఏలిన‌వారికి, పోలీసుల‌కు వీళ్లంటే ఎందుకు అంత క‌క్ష‌. చ‌ట్టాన్ని త‌న ప‌ని తాను చేసుకు పోనీకుండా ఎందుకు అడ్డుకుంటారు. ప‌దే ప‌దే వీళ్లంతా అత్యంత ప్ర‌మాద‌క‌ర వ్య‌క్తుల‌ని ఎందుకు ప్ర‌చారం చేస్తున్నారు?

వీళ్లంతా మావోయిస్టు సానుభూతి ప‌రుల‌నీ, అర్బ‌న్ మావోయిస్టులు అనీ చెబుతున్నారు కానీ.. వీళ్లంద‌రికీ ఉన్న స‌బంధం ఒక్క‌టే ఉద్య‌మం. ఎక్క‌డ అన్యాయం జ‌రిగినా.. త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేసి.. ప్ర‌జ‌ల ప‌క్షాన నిలిచిన వారు. వారి వారి కార్య‌రంగాల్లో.. జీవితంలో ప్ర‌ధాన భాగం అందుకోసం వెచ్చించే వారు. నోరులేని వారి ప‌క్షాననిల‌బడి అటు కోర్టుల్లోనూ, ఇటు ప్రజ‌రంగంలోనూ వాద‌న‌ల‌ను వినిపిస్తున్న వారే. ఈ దేశ సంప‌ద‌ను దోచుకునే కుట్ర‌ల‌ను అడ్డుకుంటున్న వారు. అందుకే.. దేశంలోని సంప‌ద‌నంతా అబానీల‌కు, అదానీల‌కు దోచిపెట్టాల‌నుకుంటున్న ఏలిన‌వారికి, వారి బంటుల‌కు వీరంటే కోపం.

ఈ వ్యాసం రాసేప్పుడు నాకేమ‌నిపించింది అంటే.. ఈ నిందితులు అరెస్టు కాక‌పోయి ఉంటే.. లేదా బెయిలుపై బ‌య‌ట ఉంటే ఏం చేస్తూ ఉండి ఉండే వాళ్లు. న‌ల్ల‌మ‌ల చెంచుల గురించో.. అడ‌విమీద తాము కోల్పోయిన హ‌క్కుల కోసం పోరాడుతున్న దండ‌కార‌ణ్య ఆదివాసుల గురించో, అన్యాయంగా జైలు శిక్ష అనుభ‌విస్తున్న సాయిబాబాను విడిపించ‌డం గురించో అలుపెర‌గ‌నిపోరాటంలో ఉండి ఉండేవారు వ‌ర‌వ‌ర రావు.

అట‌వీ చ‌ట్టాల‌గురించి చెప్పుకుంటూ గూడె గూడేనికీ తిరుగుతూ ఉండి ఉండేవాడు మ‌హేశ్. అభివృద్ది పేరిట చ‌త్తీస్ ఘ‌డ్లో అదానీలు చేస్తున్న దాష్టీకం గురించి కోర్టుల్లో త‌ల‌మున‌కలుగా పోరాడుతూ ఉండి ఉండేది సుధాభ‌ర‌ద్వాజ్. అత్యంత ప్రొడ‌క్టివ్ పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో చేసిన దుర్మార్గ చ‌ట్టాల గురించి, వాటి నుంచి అమాయ‌కుల‌ను కాపాడే ప‌నిలో ఉండి ఉండేవారు సురేంద్ర గాడ్లింగ్. ఫ‌డ్న‌వీస్ ప్ర‌భుత్వ అవినీతిని, ద‌ళితుల మీద అత్యాచారాల‌ను ఎండ‌గ‌డుతూ ఉండి ఉండేవాడు సుధీర్ ధావ‌లే. రాజ‌కీయ ఖైదీల హ‌క్కుల కోసం, అన్యాయంగా జైళ్ల‌లో మ‌గ్గిపోతున్న అమాయ‌కుల కోసం దేశ‌మంతా తిరిగి మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతూ ఉండి ఉండే వారు రోనా విల్స‌న్, అరుణ్ ఫెరేరా. మ‌హిళా ఉద్య‌మాల‌కు త‌న పూర్తికాలం స‌మ‌యం వెచ్చిస్తూ ఉండి ఉండేవారు సోమా దీదీ.

అంతా త‌ప్ప‌కుండా క‌శ్మీర్ లో జ‌రుగుతున్న దుర్మార్గాన్ని గురించి నిర‌సించి ఉండేవారు. ఈ ఏడాది కాలంలో ప్ర‌భుత్వం ఎలాంటి నిర‌స‌న, వ్య‌తిరేక‌తా లేకుండా దుర్మార్గాల‌ను చేస్తూ పోయిందో.. వాట‌న్నిటిని గురించి వీళ్లు త‌ప్ప‌కుండా మాట్టాడి ఉండేవారు. నిర‌స‌న వ్య‌క్తం చేసి ఉండేవాళ్లు. త‌మ త‌మ ప‌ద్ద‌తుల్లో ఈ అన్యాయాల‌ను ఎదిరించి ఉండేవాళ్లు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప్ర‌జామ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టి ఉండేవాళ్లు. అందుకే.. వాళ్లంతా ప్ర‌మాద‌క‌ర వ్య‌క్తులు. వాళ్లు బ‌య‌ట తిరిగితే.. నిర్భ‌యంగా, నిర్మోహ‌మాటంగా ఈ కార్పోరేట్ల‌, హిందూత్వ వాదుల అస‌లు రంగు బ‌య‌ట పెట్టే వాళ్లు. అఖండ భార‌త్ గురించో, ఆవు మూత్రం గురించో.. భ్ర‌మ‌ల్లో ఉండ‌వ‌ద్ద‌ని ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించి ఉండేవాళ్లు. మునిగిపోతున్న ఆర్ధిక నావ‌ను గురించి అంద‌రికీ అర్ధ‌మ‌య్యేలా చెప్పి ఉండేవాళ్లు. మూక దాడుల గురించి, మ‌నువాదం గురించి, మ‌నుషుల మ‌ధ్య పెడుతున్న మ‌తాల చిచ్చుగురించి వివ‌రించి ఉండేవాళ్లు. అందుకే.. ఏలిన‌వారికి వీళ్లంటే భ‌యం.

మ‌త‌మో.. దేశ‌మో ఏదో ఒక మూఢ‌భ‌క్తిలో ఉన్న జ‌నాన్ని నిద్ర‌లేపుతారేమో అని భ‌యం. అలాంటి ప్ర‌మాదం వీళ్ల వ‌ల్ల పొంచి ఉంది. అందుక‌ని.. వీళ్ల‌ను భ‌ద్రంగా జైలు గోడ‌ల మ‌ధ్య ఉంచేస్తే.. ఏలిన వారు హాయిగా.. ఎటువంటి ఇబ్బ‌దులు.. అడ్డ‌కుంలూ లేకుండా.. అడ్డ‌గోలుగా దేశ సంప‌ద అంతా త‌మ అనుంగుల‌కు దోచి పెట్ట‌వ‌చ్చు. ఎవ‌రైనా నోరు మెదిపేందుకు సాహసించాల‌నుకుంటే.. అదిలించి, బెదిరించి లొంగ‌దీసుకోవ‌చ్చు. అందుక‌ని ఈ ప్ర‌మాదక‌ర వ్య‌క్తుల‌ను బ‌య‌టికి రానీయ‌కుండా కుట్ర‌ప‌న్నారు.

No. of visitors : 467
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నాపేరు శూర్పణఖ

పావని | 17.03.2019 11:23:38pm

నాకు వంటి రంగు గురించి మరో రకం బాధ మొదలైంది. నేను మరీ అంత చిక్కటి నలుపులో లేననీ.. నా జుట్టు వత్తుగా, నల్లగా ఉన్న మాట నిజమే కానీ.. అది రింగులు రింగులుగా లే.....
...ఇంకా చదవండి

హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ

నవల్ కిషోర్ కుమార్ | 19.11.2019 02:50:44pm

జాతీయ‌త పేరుతో, ఎవ‌రైనా (బ్రాహ్మనీయ శక్తులు) నా సంస్కృతిని చంపేందుకు చూస్తే, పంతి, సువా, క‌ర్మ‌, నా ప్ర‌జ‌ల‌పై మావి కానీ (ఛతీస్ఘడ్ కు సంబంధం లేని) నాట్యం.....
...ఇంకా చదవండి

రాజ్యానికెదురు రాజీలేని పోరు

పి. పావ‌ని | 17.05.2019 12:18:50pm

మావోయిస్టు విముక్తి ప్రాంతంగా పేర్కొనే అబుజ్ మడ్ నుంచి (బుద్ధర్ డివిజన్ నారాయణ్పూర్, బీజాపూర్ జిల్లాల) వేలాది ఆదివాసీలు ఇంద్రావ‌తి వైపు సాగిపోయారు. దారిలో వ...
...ఇంకా చదవండి

ఆ చిరునవ్వుల్ని చిదిమేశారు

పావని | 01.04.2019 01:35:31pm

రాష్ట్రంలో హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను మావోయిస్టుల పేరుతో వేధించ‌డం.. కొన్ని సార్లు ప్రాణాలు తీయ‌డం కొత్త కాద‌ని ఇక్క‌డి హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు చెబుతారు......
...ఇంకా చదవండి

అతడి ఆలోచనలు అక్షరాలకే పరిమితం కాలేదు

అరుంధతి ఘోష్ | 16.06.2019 10:44:24am

చాలా మంది మేధావుల లాగా.. గిరీష్ క‌ర్నాడ్ వాద‌న‌లు, చ‌ర్చ‌లు, టెలివిజ‌న్ పానెల్ లు, సెమినార్ల‌కు ప‌రిమితం కాలేదు. ఆయ‌న త‌ను న‌మ్మిన విలువ‌ల కోసం వీధుల్లోకి.....
...ఇంకా చదవండి

ఢిల్లీ నుండి ప్రేమతో

పావ‌ని | 18.12.2019 12:56:37am

ఎలా ఉన్నారు? జైల్లో ఉన్న వాళ్ల‌ను ఇలాంటి ప్ర‌శ్న వేయ‌టం బాలేదు కానీ... ఉత్త‌రం ఎలా మొద‌లు పెట్టాలో తెలీదు. మీ ఆరోగ్యం ఎలా ఉందో అని చిన్న బెంగ‌. అంత‌కంటే......
...ఇంకా చదవండి

ఆట‌లూ - దేశ‌భ‌క్తి ప్ర‌ద‌ర్శ‌న‌

పి.పావని | 16.07.2019 07:19:53pm

దేశ‌భ‌క్తి ప్ర‌ద‌ర్శిచ‌డంలో... మహేంద్ర సింగ్ ధోనీ, మేగ‌న్ రెపీనోల మ‌ధ్య ఎంత తేడా ఉందో ఆలోచిస్తే.. ఆశ్చర్యం క‌లుగుతుంది. ప్ర‌జాస్వామ్య విలువ‌ల ప‌ట్ల స‌మాజ.....
...ఇంకా చదవండి

నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు

| 18.12.2019 10:18:58pm

మ‌తం జాతీయ‌త‌ను, పౌర‌స‌త్వాన్ని నిర్ణ‌యించ‌డం ఆమోదించ త‌గిన చ‌ర్య కాదు. శ‌ర‌ణార్తుల‌ను మ‌త‌ప్రాతిప‌దిక‌న విభ‌జించ‌టం స‌రైన‌ది కాదు. ఇది భార‌తీయులు అటే ఎవ‌.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •