అతడేమన్నాడు
ఉన్నదేదో ఉన్నట్లు
కుండబద్దలు కొట్టినట్లు
ముక్తకంఠమయ్యాడు
నక్సల్బరీ దివిటీ నెత్తికెత్తుకొని
శ్రీకాకుళం, తెలంగాణ మీదుగా
పిడికిలి కాగడా వెలిగించుకొని
దేశమంతా చీమలబూరై తిరిగాడు
అడవి
అదివాసి పుట్టినిల్లని ప్రకటించాడు
అడవి సిగలో తురిమిన
మోదుగ పూలను ఆలింగనం చేసుకున్నాడు
అతడేం చేశాడు
కారంచేడు చుండూరు
నీరుకొండ పదిరికుప్పం
వేంపెంట లక్షింపేటల
కన్నీటి జడిలో తడిసి పోయాడు
చీకటి చరిత్ర మీద
వెలుగు సంతకం చేసి
సూర్యుడి చేతుల్లో చెయ్యేసి నడిచాడు
దేశం దేహం మీద స్రవిస్తోన్న
గుజరాత్ గాయాల్ని స్పృశించాడు
అక్కడి మట్టిలో
నాలుగు ఎర్ర మందారాలు పూయించాడు
మనిషితనం ప్రవహిస్తున్న
నదిలాంటి మనిషి కదా
యుద్ధ మేఘాలు కమ్మిన ఆకాశం మీద
శాంతి దీపాలు వెలిగించాడు
నువ్వతడ్ని
కుల చిలుక్కొయ్యను చేసి గోడకు దొగ్గొట్టొచ్చు
అతడు మాత్రం
వాడల్లోంచి వెలివాడల్లోంచి
నడిచి వచ్చిన మానవుడతను
మనుషులు కనిపిస్తే
అల్లుకపోయే మల్లెచెట్టు
మాటల్లో పూచే మల్లె పూలు
ఎప్పుడూ తన ఉనికిలోనే మోదుగ పూలై పూస్తాడు
ఎల్లప్పుడూ చీమల బారై తిరుగాడుతాడు
అతని కనుల మహా సముద్రాల్లోంచి
తుఫాను చెలరేగుతుందనే
అధికార పీఠం గజగజ వణుకుతోంది
అతని మాటల ఈటెల వాడి
వాడి గుండెలను గురి చూసే ఉంటుంది
అందుకే వాడి గుండో జారి బేజారవుతోంది
అతని చూపుల సూర్యుడు
వాడి కుర్చీ మీద సండ్రనిప్పులు చల్లే ఉంటాడు
ఢిల్లీ గద్దె కమురు వాసన వేస్తోంది
ఇప్పుడతని మీద
కుట్రలు చిమ్మిన చీకటి రాజ్యం పీటేసుకొని కూర్చొంది
చరిత్రలో కుట్రల కుంటికాళ్ల అధికారం చివరంటా నిలిచిన దాఖలా లేదు
జెయిల్లో ఉంటేనేం
వెలుగుల జడివాన అతడు.
Type in English and Press Space to Convert in Telugu |
అతడూ అర్బన్ నక్సలైటేఅతడిప్పుడు
భౌతికంగా మన కళ్లముందుంటే
అతడూ అర్బన్ నక్సలైటే
దేశ అంతర్గత భద్రతకు
అత్యంత ప్రమాధకారే
... |
ఇల్లుమూటనిండా
ముల్లెవుందని
కారుకూతల నోరు జారారు
రాజ్యం కోడై కూసింది
ఆ తల్లి
మూట ముడివిప్పి చూస్తే
పిడికిళ్ళెత్తి
జేజేలు పలుకుతూ
జనమే జనం
... |
చెడగొట్టు వానఐదేండ్లకోసారి కురిసే వాన
అప్పుడప్పుడు ముందస్తు అకాల వర్షమై కుమ్మరిస్తుంది
మధ్యంతరం కుండపోత వానవుతుంది
అన్నీ వడగండ్లవానలే... |
అర్హత
అతడు
తన గొంతునూ వెంటబెట్టుకెళ్ళాడు
గొంతు అతని నిరసన గళం... |
యురేనియమంఅడవికి
ఆదివాసికి
అతికిన బొడ్డుతాడు పుటుక్కున తెంపుదాం
నోటికాడి
పోడు బువ్వ బుక్కను
కాకులై తన్నుకుపోదాం
దూపబుడ్లు
ఊటచెరువుల
కడుపెండబెడదాం
నల్లమల నిండ... |
"దేశభక్తి"మనలో దేశభక్తి ఊటలు ధారలుగడుతుంటే
వాడు ధరల అడుగులు
ఒక్కోమెట్టు ఆకాశం మేడెక్కించే పనిలో ఉంటాడు
మనం దేశభక్తి శిగాలొచ్చి ఊగుతుంటే
పెట్టుబడి చుట్టాల నెత్తిమీది
... |
కరోనా కర్ఫ్యూనీకూ నాకూ మధ్య
మాస్క్ ములాఖత్ గోడ కట్టుకోవాల్సిందే... |
అడవి - నదిఅమరులు
ఆకాశ దీపాలు
అలల అరచేతుల మీదుగా
బిడ్డల్ని
ఒడ్డుకు చేర్చిన ఇంద్రావతి గుండెల మీద నిద్రపుచ్చి
ఆకుల
చీరంచు కప్పిన గడ్చిరోలి... |
పూల పరిమళం వాళ్ళువాళ్ళు
మా ఇంటి పెరట్లో ఎర్రమందారాలు
మా చేను సెలకల్లో నవ్వే గోగుపూలు... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |