న్యాయ ప్రక్రియే శిక్ష అయితే!?

| సాహిత్యం | వ్యాసాలు

న్యాయ ప్రక్రియే శిక్ష అయితే!?

- పి.వరలక్ష్మి | 28.08.2019 07:25:36pm

సరిగ్గా ఏడాది క్రితం ఆగస్టు 28న దేశవ్యాప్తంగా పది మంది మేధావుల ఇళ్లపై మహారాష్ట్ర పోలీసులు దాడులుచేసి చట్టవిద్ధమైన పద్ధతుల్లో వరవరరావుతో పాటు గౌతం నవలఖా, సుధాభరద్వాజ్‌, అరుణ్‌ ఫెరేరా, వెర్నన్‌ గొంజాల్వెజ్‌లను అదుపులోకి తీసుకున్నారు. గౌతం నవలఖా అరెస్టును కోర్టు వాయిదా వేయడం వల్ల ఆయన మినహా మిగిలిన నలుగుర్ని పూణే ఎరవాడ జైల్లో నిర్బంధించారు. గౌతం నవలఖాతో పాటు ఈ కేసులో ఏ క్షణమైనా అరెస్టుకు సిద్ధంగా ఆనంద్‌ తెల్తుంబ్డే, ఫాదర్‌ స్టాన్‌ స్వామి ఉన్నారు. 79 సంవత్సరాల విప్లవ కవి, 81 సంవత్సరాల సామాజిక కార్యకర్త, పీడిత ప్రజల న్యాయవాదులు, ప్రముఖ పాత్రికేయులు, యూనివర్సిటీ ప్రొఫెసర్‌లు అంతా కలిసి ప్రధానమంత్రిని హత్యచేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణ దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని, అంతే ఆందోళనను కలిగించి, సుప్రీం కోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్‌ దాఖలై, అక్కడి నుండి నాలుగు రాష్ట్రాల హైకోర్టులకు, మళ్లీ పూణే కోర్టుకు ఇలా కింది నుండి పైకి, మళ్లీ పైనుండి కింది కోర్టుకు తిరిగివచ్చి, మొత్తమ్మీద జరిగిందేమిటంటే ఇంత వరకు ఏమీ జరగకపోవడం.

అంతకు ముందు జూన్‌లో అరెస్టు అయిన ప్రొ. షోమాసెన్‌, సురేంద్ర గాడ్లింగ్‌, సుధీర్‌ ధావ్లే, మహేశ్‌ రౌత్‌, రోనా విల్సన్‌లతో కలిపి మొత్తం తొమ్మిదిమంది మీద ఇప్పుడు పూణే సెషన్స్‌ కోర్టులో కేసు నడుస్తోంది. మాట వరసకు అది నడుస్తోంది అనుకోవాలిగాని నిజానికది ఒక్క అడుగూ ముందుకు వేయలేదు. అసలు విచారణే మొదలు కాలేదు. ఏడాదిగా దేశంలోని అత్యద్భుతమైన మేధావులు, రవ్వంత స్వార్థం లేకుండా అట్టడుగు ప్రజలకు తమ మేధస్సును అంకితం చేసిన సున్నిత మనస్కులు, దేనికీ వెరవని దృఢచిత్తులు దుర్భరమైన జైలుశిక్షను అనుభవిస్తున్నారు. వారి బెయిల్‌ విజ్ఞప్తులనూ పట్టించుకోవడం లేదు. సుదూరం నుండి చూడవచ్చే ఆత్మీయిలను కలుసుకోనివ్వక ఆంక్షలు పెడుతున్నారు. ఒక సందర్భంలో సుధాభరద్వాజ్‌ను చూడాలని కోర్టుకు వచ్చిన వ్యక్తిని పోలీసులు రోజంతా నిర్బంధించి వేధించారు. తండ్రి చనిపోతే పెరోల్‌ మీద ఇంటికి వెళ్లిన సుధాభరద్వాజ్‌ తన కుటుంబ సభ్యులతో దుఃఖాన్ని కలబోసుకునే సమయంలో కూడా అడ్డుపడి, అక్కడొక వికారమైన డ్రామా సృష్టించారు. సుధ తండ్రి రంగనాథ్‌ భరద్వాజ్‌ దేశంలోనే సుప్రసిద్ధ అర్థశాస్త్ర నిపుణులు. సుధ సౌకర్యవంతమైన జీవితాన్ని, అమెరికా పౌరసత్వాన్ని వదులుకొని ఛత్తీస్‌ఘడ్‌ కార్మికబస్తీలో అతి సామాన్య జీవితాన్ని ఎన్నుకొని, కార్పొరేట్‌ లాయర్లు కోట్లు గడిస్తున్న కాలంలో కార్మికుల కోసమే న్యాయశాస్త్రం చదివి న్యాయానికి న్యాయం చేస్తున్న అరుదైన బుద్ధిజీవి.

సురేంద్ర గాడ్లింగ్‌ సైతం అటువంటి ఒక ప్రజాన్యాయవాది. జైలు నుండి కూడా ఆయన నుంచి న్యాయ సహాయాన్ని అందుకొని విడుదలైన పేద ఖైదీలున్నారు. ఆయన వాదిస్తున్న వందలాది పీడిత ప్రజల కేసు కట్టలు ఆయన కోసం ఎదురుచూస్తున్నాయి. పరిశోధక విద్యార్థి మహేశ్‌ రౌత్‌ పనిచేసిన ప్రాంతంలోని ఆదివాసులు ఎన్నికల ప్రచారంలో తమ వద్దకు వచ్చిన నాయకులతో మహేశ్‌ను విడుదల చేస్తామని హామీ ఇవ్వమన్నారట. ఇలా ఆ తొమ్మిది మంది ప్రజాజీవితం గురించి పేజీల కొద్దీ రాయొచ్చు. సుమారు అరవై సంవత్సరాల ప్రజాజీవితం ఉన్న వరవరరావు దేశప్రజల ఉద్యమ స్వరం. ప్రజాఉద్యమ రాజకీయాలను, తాత్వికతను తన వ్యక్తిత్వంలో భాగం చేసుకొని తన కలాన్ని, గళాన్ని విరామమెరుగక వినియోగించే వివికి జీవితసాఫల్య పురస్కారంలా ఈ జైలుశిక్షను ప్రదానం చేసింది రాజ్యం. ఎన్ని కాలాల కాఠిన్యాలను చూసాడో, ఆయన చెరగని చిరునవ్వు లక్షలాది పోరాడే ప్రజల దిటవు గుండెల ప్రతిఫలనం. ఎరవాడ జైల్లో ఉండగానే ఆయన మీద మరో రెండు తప్పుడు కేసులు పెట్టి రెండు సార్లు సుదీర్ఘ విచారణలు జరిపారు. జూలైలో కర్ణాటక రాష్ట్రం పావగడ కోర్టులో ఆయన్ని హాజరుపరచడానికి తీసుకొచ్చినప్పుడు చాలా కాలం తర్వాత పత్రికల్లో ఆయన ఫోటో వచ్చింది. పీక్కుపోయిన ముఖం, లోతుకు పోయిన కళ్లు, నల్లబడిన పెదాల మధ్య అదే నవ్వు. పోలీసు సెక్యూరిటీ మధ్య ఆయన్ని దూరం నుండైనా చూడ్డానికి వందలాది గ్రామస్తులు వచ్చారు. మాకోసం మాట్లాడే మా మనిషని దళితులు చెప్పినట్లు పత్రికలు రాసాయి.

వివి అనారోగ్యం గురించి ఆందోళన చెందుతూ ఆయన సహచరి హేమలత ఇప్పటికే సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌కు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావుకు లేఖలు రాసారు. అసలు కేసే అన్యాయమైతే, బెయిల్‌ విచారణను కూడా మితిమీరి సాగదీస్తున్న కోర్టు వైఖరి అనుమానాస్పదం అనడానికి కూడా లేదు. స్పష్టంగా రాజ్యం పక్షాన ప్రజాస్వామికవాదులను హింసిచటం ఇది. మామూలుగా చార్జ్‌షీట్‌ వేయకపోతే మూడు నెలలకు రావాల్సిన బెయిల్‌ ఆరునెలలు దాటినా ఇవ్వకుండా పోలీసులు కోరిన సమయాన్ని ఇస్తూ వారిని జైల్లోనే ఉంచారు. చివరికి రెండు విడతలుగా 7,400 పేజీల చార్జ్‌షీట్‌ తయారైంది. బెయిల్‌ విచారణలో కట్టలకొద్దీ చార్జ్‌షీట్‌ను జడ్జి ముందుపెట్టి, హింసను ప్రేరేపించి దేశాన్ని అల్లకల్లోలం చేయాలనే నిందితుల ప్రయత్నం ఎంత తీవ్రమైనదో, ఏకంగా ప్రధానమంత్రినే చంపాలని కుట్ర పన్నిన వీళ్లు ఎంతటి ప్రమాదకారులో చెప్తూ ఎట్టి పరిస్థితుల్లోనే బెయిల్‌ ఇవ్వకూడదని ప్రాసిక్యుషన్‌ కొన్ని నెలలుగా వాయిదాల మీద వాయిదాలు తీసుకొని వాదిస్తోంది. ఇవన్నీ మీ ఆరోపణలు సరే.

అసలు కుట్ర చేసారనడానికి సాక్ష్యాలేమైనా ఉన్నాయా అని నిందితుల తరపున లాయర్లు అడిగితే, అసలు మీకు సాక్ష్యాలు చూపించాల్సిన అవసరం లేదని, కేసులో ఈ తొమ్మిదిమంది కాక మరికొందరు ఉన్నారని, వాటిని లీక్‌ చేస్తే వాళ్లు జాగ్రత్తపడే అవకాశం ఉంటుందని ప్రాసిక్యూషన్‌ విచిత్రమైన వాదన చేసింది. డిఫెన్స్‌ వారికి సాక్ష్యాలు చూపాలా వద్దా అని కూడా కోర్టులో వాదన జరిగి చివరికి తమ మీద ఆరోపించబడిన నేరాలకు సాక్ష్యాలు ఏమేం ఉన్నాయో అడిగి తెలుసుకునే హక్కు నిందితులకు ఉంటుందని, వాటిని కోర్టు సమక్షంలో డిఫెన్స్‌ లాయర్లకు కాపీ చేసి ఇవ్వాలని, అది అయిన తర్వాతే తదుపరి విచారణ ఉంటుందని మే 17వ తేదీన న్యాయమూర్తి తేల్చి చెప్పారు. అప్పటికే బెయిల్‌ పిటిషన్‌పై 60 సార్లు హియరింగ్స్‌ జరిగాయి.

ఇక సాక్ష్యాల నకలు నిందితుల తరపు లాయర్లకు ఇవ్వడమనే ప్రహసం మొదలైంది. బహుశా ప్రపంచంలో ఏ కోర్టులోనూ ఇటువంటి తతంగం నడిచి ఉండదు. ఫాసిజం రోజుల్లో న్యాయస్థానాలు ఎలా ఉంటాయో, ఇండియా ఉదాహరణ తీసుకొని రేపటి రోజుల్లో చరిత్ర విద్యార్థులు తెగ ఆశ్చర్యపోతూ చదువుకుంటారు.

ఇక్కడ పోలీసుల వద్ద ఉన్నదంతా ఎలెక్ట్రానిక్‌ డేటా. ఒకప్పుడు దాన్ని సాక్ష్యంగానే లెక్కించేవారు కాదు. ఇప్పుడు ఈ తొమ్మిది మందికి సంబంధించి పోలీసులు సేకరించిన వేలకొద్దీ జి.బి.ల డేటానే సాక్ష్యంగా చూపిస్తున్నారు. అంటే నిందితుల ఈమెయిల్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి మీడియా నుండి, వారి ఇళ్ల నుండి స్వాధీనం చేసుకున్న సిడిలు, హార్డ్ డిస్కుల నుండి సేకరించినవి సాక్ష్యాలయ్యాయి. ఇప్పుడు ఈ మొత్తం డేటాను కోర్టు కస్టోడియన్‌ సమక్షంలో పది కాపీలు చేసి తొమ్మిది మంది నిందితులకు తలా ఒకటి, జడ్జికి ఒకటి ఇవ్వాలి. పోలీసుల వద్ద ఉన్న 23 హార్డ్‌ డిస్కుల డేటా పదేసి కాపీలు, అంటే మొత్తం 230 హార్డ్‌ డిస్కుల డేటా కాపీ చేయడానికి, ఒక్కో దానికి 6-7 గంటల సమయం అనుకుంటే సుమారు 1500 గంటలు పడుతుంది. ఈ తతంగం కోర్టు సమక్షంలో జరగాలి కాబట్టి నిందితులను కోర్టుకు తీసుకొచ్చిన రోజు కొన్ని గంటల పని జరుగుతుంది. ఇప్పుడీ పని వారానికి రెండుసార్లు జరుగుతోంది. ఈ లెక్కన సాక్ష్యాలు కాపీచేసి ఇవ్వడానికి ఆరేళ్లు పడుతుంది! ఇదంతా నేరవిచారణ కాదు. ఆరోపణ ఏమిటో, దానికి సాక్ష్యాలేమిటో చెప్పడం మాత్రమే.

ఒక్క నిరపరాధిని కూడా శిక్షించకూడదనే న్యాయస్ఫూర్తి ఫాసిస్టు గాలుల్లో కొట్టుకుపోతుండగా, దేశంలో సుప్రసిద్ధ మేధావుల పరిస్థితి ఇది. ప్రొ.సాయిబాబా ఎంతో కాలంగా చీకటి బందిఖానాలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇక వేలాది ఆదివాసులు ఏళ్లకేళ్లుగా నక్సలైట్‌ కేసుల్లో జైళ్లలో మగ్గుతున్న విషయం కనీసం చర్చకు కూడా రావడం లేదు. మరోవైపు ఇటీవలే బాంబు పేలుళ్లలో, మూకదాడుల్లో, సామూహిక అత్యాచారాల కేసుల్లో నిందితులు బెయిల్‌ తీసుకొని స్వాగత సత్కారాల నడుమ తిరిగి రావడమే కాదు శాసనకర్తలై పార్లమెంటుకు చేరుకుంటున్నారు.

(ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక‌లో ప్ర‌చురిత‌మైన వ్యాసం)

No. of visitors : 415
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ఆపరేషన్ దేశభక్తి

వరలక్ష్మి | 04.10.2016 10:21:50pm

భారత ప్రభుత్వం కశ్మీర్ గాయాన్ని బుల్లెట్లతో, పెల్లెట్లతో కెలికి ఇప్పుడీ యుద్ధాన్ని దేశప్రజలపై రుద్దింది. కాశ్మీర్ లో జులై నుండి ఇప్పటి దాకా కనీసం 90మంది.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
  అరుణతార నవంబర్ 2019
  ఒక చిన్న అమ్మాయి రాసిన మంచి కథ " భూమి "
  నేను జీవితాన్ని అమితంగా ప్రేమిస్తాను
  సముద్రం ఇంకా బతికేవుంది
  డెన్ ఆఫ్ లైఫ్
  వాళ్ళు
  ప్రజా కళాకారుడా
  వసంతమేఘగర్జన - కార్మికోద్యమాలు
  తెలుగు రాష్ట్రాల వ్యవసాయరంగం - 50 ఏళ్ళ విప్లవోద్యమం
  సీమకవి వినూత్ననిరసన ʹʹలైఫ్‌హాలిడేʹʹ
  పడగ కింద పండు వెన్నెల!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •