మేఘాలొస్తాయి

| సాహిత్యం | స‌మీక్ష‌లు

మేఘాలొస్తాయి

- కేక్యూబ్ | 02.09.2019 03:06:01pm

Poetry is about the grief. Politics is about the grievance. Robert Frost.

రైతు ఈ దేశానికి వెన్నెముక అని చాలా ఏళ్ళుగా ప్రవచనాలు వల్లిస్తూనే వున్నారు. కానీ ఆ వెన్నెముకను విరిచే కుట్రదారులెప్పుడూ ఈ దేశాన్ని వాళ్ళే పాలిస్తూ వస్తున్నారు. తనకు తెలియకుండానే తన కాలికింద నేలను అపహరిస్తున్న తీరుతో రైతు మెడకు ఉరితాడే మిగులుతోంది. ఇటీవలి రెండు దశాబ్ధాలుగా వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సరే ప్రభుత్వాలు కంటి తుడుపు చర్యలు మాత్రమే అదీ ఎన్నికలలో గెలవడానికి వారిని మోసపుచ్చే వాగ్ధానాలతో ముంచెత్తుతూ చివరికి మొండి చేయే చూపుతున్నాయి. ఇదంతా మనకెరుకలోనే వుంటోంది. వందల కిలోమీటర్లు అరికాళ్ళు పుండ్లు పట్టి రక్తమోడుతున్నా పిడికెడు అటుకుల మూటలతో నడిచి తమ బతుకు వెతలను చెప్పుకున్న రైతుల పట్ల కనీసం కన్నెత్తి కూడా చూడలేదు రాజ్యం. ఢిల్లీ నడివీధుల్లో అర్థ నగ్నంగ నిరసన ప్రదర్శన చేసిన రైతు పట్ల అదే చిన్న చూపు. ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడిన దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చిన కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్ల రూపాయలు రిజర్వు బాంకు నిధులు నుండి ఇచ్చి ఆదుకునే ప్రభుత్వం రైతుల దీనస్థితి పట్ల కనీస బాధ్యతను నెరవేర్చ లేకపోవడం ప్రజల దౌర్భాగ్యం. దీనికి తోడుగా ప్రకృతి విపత్తులు అతివృష్టి అనావృష్టి రైతును కోలుకోలేని దెబ్బతీస్తూనే వున్నాయి. పంట పొలాలను వివిధ ప్రాజెక్టుల పేరుతోను, నగరాల నిర్మాణాల పేరుతోను రైతుల నుండి కొల్లగొట్టి కార్పొరేట్ బడా పెట్టుబడిదారులకు కారుచౌకగా పారిశ్రామిక అభివృద్ధి పేరుతో అప్పనంగా దోచిపెడుతోంది ప్రభుత్వం. స్వదేశంలోనే కాందిశీకులుగా మారి భూమిని కోల్పోయి ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నాయి వేలాది రైతు కుటుంబాలు. కోట్ల రూపాయలు అప్పులు చేసి ఐపీ చూపించి ఎగ్గొట్టడమో, లేక విదేశాలకు పారిపోయి విలాసాలు చేసే వ్యాపారవేత్తలను ఏమీ చేయలేని బ్యాంకులు, ప్రభుత్వాలు వేల రూపాయలు అప్పు వున్న రైతుపై మాత్రం విరుచుకుపడతాయి. తన కాళ్ళపై తను నిలబడి నలుగురికీ తిండిపెడుతున్నాను అనే మానసిక ధైర్యంతో బతికే రైతు అవమానం భరించలేక అభిమానాన్ని చంపుకోలేక ఆత్మహత్యే శరణ్యంగా శాశ్వతంగా దూరమవుతున్నాడు. ఇదంతా తెలుస్తూనే వున్నా వారికి మద్ధతుగా ఎవరూ కదలిరారు. ఇది ఈ దేశంలోని రైతు చిత్రం.

ఉత్తరాంధ్ర ప్రధానంగా రైతు కూలీల అడ్డా. ఇక్కడి నీరు ఇక్కడి వారికి చెందదు. ఇక్కడి భూములపై పెత్తనం వేరే వర్గానిది. ప్రాజెక్టుల పేరుతో నిర్వాసితులైన ప్రజలు పూర్తిగా జీవనోపాధి కోల్పోయి తమ ఉనికిని కోల్పోతున్నారు. ఈ జీవన అతలాకుతలాన్ని తన కవితల ద్వారా కథల ద్వారా గంటేడ గౌరునాయుడు మాస్టారు మనకు పరిచయం చేస్తూనే వున్నారు. తన కలం పేరు లాంగుల్యతో ఇటీవల రాసిన కవిత మేఘాలొస్తాయి కవితలో రైతు పట్ల ప్రకృతి కూడా ఎంత నిర్దయగా వుంటుందో ఆవిష్కరించారు. ఎంతో ఆశగా వాన కోసం ఎదురు చూసే రైతు చాలీ చాలని నీటితో ఉభాలు (నాట్లు) కానిచ్చిన తరువాత పంట చేతికొచ్చే సమయానికి తుఫానులతో తుడుచుకు పోయే తీరును తనదైన శిల్ప రీతిలో సరళమైన పదాల అల్లికతో హృదయాన్ని తాకేట్టు చెప్పారీ కవితలో. ప్రత్యేకంగా ఎంచుకున్నట్లు లేని ఉపమానాల మధ్య ఇటీవలి సామాజిక సంఘటనలనే పద చిత్రాలుగా పొందికగా అమర్చడంతో కవిత మనకు ఆలోచనలను రేకెత్తిస్తుంది.

మేఘాలొస్తాయి ..వొచ్చి
ఇళ్ళ అరుగుల మీద ఉరుములై మెరుపులై
మహా సందడి చేస్తాయి పెళ్ళి వారింటి ముందు
బేండు మేళం మోగించినట్టు.

మేము నక్కూ నాగలీ సంగరించుకునే లోపల, తుపాకీ
శబ్దం విన్న పిట్టల గుంపులాగ రివ్వు రివ్వుమని
ఎగిరిపోతాయి.

సేద్యం ఒక యుద్ధ సన్నాహంలా మారిన సమయం ఇది. తనకున్న కొద్దిపాటి పొలంలో రైతు వ్యవసాయం చేయాలంటే ఎంతో కష్టంతో పనిముట్లను కూడ బెట్టుకోవాల్సి వస్తోంది. అంతా యంత్రాల మయమై ఆధునికత సంతరించుకుంటున్న వ్యవసాయ రంగంలోంచి బీదా బిక్కీ రైతు దూరంగా నెట్టివేయబడుతున్నాడు. పై పద చిత్రాలలో కవి ఈ నేపథ్యాన్ని ఒడుపుగా చెప్పారు. తనకున్న అతి కొద్ది కుంట్ల భూమిని సేద్యం చేయలేకపోగా దానిని అమ్ముకోవడమో లేక తాకట్టుపెట్టి ధనిక రైతు దగ్గర కూలీగా మారడమో తప్పదు నేడు. మదుపులు పెట్టలేక పెట్టినా తిరిగి వస్తుందన్న నమ్మకం లేకపోవడం భూమి నుండి దూరం కాబడుతున్నారు. అలా రోజు రోజుకీ కార్పొరేట్ వ్యవసాయం వైపు మరలి పోతోంది.

మేఘాలొస్తాయి... వొచ్చీ
పచ్చగా నవ్వులు చిందే మా ఉడుపుమడిలో హాయిగా
మఠమేసి కూర్చుంటాయి, పార్టీ నాయకులు మందు పార్టీ
పెట్టుకున్నట్లు...

ఇన్ని రైతు వెతల మధ్య రాజకీయ క్రీనీడలను కలగలిపి చెప్పడం కవి సామాజిక దృక్పధాన్ని తెలియ చేస్తుంది. ఓట్ల రాజకీయాలలో ఇది సర్వ సాధారణంగా మారింది నేడు. కవితా నిర్మాణంలో ఎక్కడా అతుకులుగా కనబడని పద చిత్రాలతో వస్తువును మాయం చేయకుండా రాయడం ఈ కవిత ద్వారా మనకు తెలుస్తుంది. ఉత్తరాంధ్ర యాసలో చెప్పడం వలన కవిత నేటివిటీ మనకు చేరువవుతుంది. అలాగే కవితాంతరాత్మలో దాగిన నేకెడ్ బ్యూటీ చిరిగిన తువాలు తలపాగాతో రైతు మన కనుల ముందు నిలుస్తాడు. చివరాఖరకు రైతుకు దుఃఖాన్నే మిగులుస్తోంది వ్యవసాయం అని తేల్చి చెపుతారు కవి తన చివరి చరణాలలో.

Poetry is the deification of reality. Edith Sitwell

ఈ మాట కరెక్టుగా ఈ కవితకు సరిపోతుంది. వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్లు చెప్పడమే కవితకు జీవకళను ఇస్తుంది. ఇది మాస్టారి రచనలలో మనకు ప్రస్ఫుటమవుతుంది. పూర్తిగా ఒకసారి ఈ కవితను చదువుదాం.

మేఘాలొస్తాయి..

మేఘాలొస్తాయి ..వొచ్చి
ఇళ్ళ అరుగుల మీద ఉరుములై మెరుపులై
మహా సందడి చేస్తాయి పెళ్ళి వారింటి ముందు
బేండు మేళం మోగించినట్టు.

మేము నక్కూ నాగలీ సంగరించుకునే లోపల, తుపాకీ
శబ్దం విన్న పిట్టల గుంపులాగ రివ్వు రివ్వుమని
ఎగిరిపోతాయి.

మేఘాలొస్తాయి ..వొచ్చి

మా పగుళ్ళుదేలిన పొలంగట్ల మీద ముద్ధులెట్టుకుని
ముచ్చట్లాడుకుంటాయి, ఎడంగా వున్న ప్రేమికులిద్దరు
అప్పుడే కలుసుకున్నట్టు,

మేము పలుగూ పారా సర్దుకునే లోగా, పిల్లాడు పలక నుండి
చెరిపేసిన అక్షరాల్లాగా హఠాత్తుగా మాయమైపోతాయి.

మేఘాలొస్తాయి ..వొచ్చి
మా దుక్కుల్లేని మడిసెక్కల్లో సకుటుంబ సపరివారంగా
సభ చేస్తాయి, కట్నాల బేరాలకు కుదురుగా కూర్చున్నట్టు,

మేము ఎరువులకీ పురుగు మందులకీ ఏమి చెయ్యాలా.. అని
యాతన పడుతుండగా, బెత్తం మాష్టారికెదురైపోయిన
బడిదొంగ పిల్లల్లాగా బెదిరి ఎక్కడికో పారిపోతాయి.

ఆకాశమ్మీద ఆశ చాలించీసి అప్పో సప్పో చేస్తాం,
ఆయిలింజన్తోనో, మోటారు పంపుతోనో మడికి
నీరు పెట్టి, ఎలాగోలాగ ఉభాలయ్యాయనిపిస్తాం.
ఉడుపుల మంగళవారాలు చేసుకుంటామో లేదో
మేఘాలొస్తాయి ..వొచ్చీ
పచ్చగా నవ్వులు చిందే మా ఉడుపుమడిలో హాయిగా
మఠమేసి కూర్చుంటాయి, పార్టీ నాయకులు మందు పార్టీ
పెట్టుకున్నట్లు...
రాత్రంతా ఉరుముల అరుపులు, పిడుగుల భీభత్సం,
ఉదయమే ఆత్రంగా వెళ్ళి చూస్తామా... ఇంకేముంది
ఏనుగుల మంద కుమ్మి వొదిలిన బురద గుమ్మిలాగా,
ముష్కర మూకల సామూహిక దాడికి బలైపోయిన
పసిడి మొగ్గలాగా, నెత్తుతి చుక్కలై రాలిన మా
ఏడాది కలల మడిసెక్క,

ఏమీ ఎరగనట్టుగా, ఏమీ జరగనట్టుగా, మరింత
అమాయకంగా మేఘాలొస్తాయి....
వొచ్చి... మా కళ్ళమళ్ళలో ఇళ్ళుగట్టుక్కూర్చుంటాయి.

No. of visitors : 150
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆకు క‌ద‌ల‌ని చోట వ‌ర్షించిన క‌విత్వం

కేక్యూబ్ వ‌ర్మ‌ | 20.10.2016 12:53:32am

ఒకమారుమూలపాఠశాలఉపాధ్యాయుడు ఈ నిశ్శబ్దాన్నిభరించలేక ఈ ఉక్కపోతనుధిక్కరిస్తూతనచుట్టూవున్నఆకుకదలనితనాన్నికవిత్వంగామనముందుఆవిష్కరించినదే ఈ సంకలనం.......
...ఇంకా చదవండి

ఆ పావురాలు!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 02.01.2017 11:39:40pm

ఒలికిన నెత్తురు అద్దిన జెండానందుకుంటూ గుంపుగా ఆ పావురాలు! ...
...ఇంకా చదవండి

తెలవారని ఆకాశం!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 07.12.2016 11:52:30am

కొన్ని మంచు బిందువులేవో రాతిరి కురిసిన వాన చివుళ్ళ నుండి రాలుతూ రెక్కల చాటున ముఖం దాచుకున్న పక్షి టపటప రెక్కలల్లారుస్తూ ఎగరబోతూ...
...ఇంకా చదవండి

నమస్కరిస్తూ..

కేక్యూబ్ వ‌ర్మ‌ | 04.09.2017 11:18:59am

కళ్ళకు గంతలు కట్టుకొన్నదని మీ న్యాయ దేవత ముందు నగ్నంగా నిలబడిన ఆ పదముగ్గురూ విడిచిన లజ్జను మీ మఖంపై నెత్తుటి ఉమ్ముగా ఊసి!...
...ఇంకా చదవండి

మస్వాల్..

కెక్యూబ్ వ‌ర్మ‌ | 03.09.2016 12:37:26am

మరుగుతున్న మంచు తెరలుగా విడిపోతూ రాలిపోతున్న మస్వాల్ పూలెన్నో ఇప్పుడిక్కడ ఒకటే హృదయ ఘోష ఆజాదీ ఆజాదీ .......
...ఇంకా చదవండి

గులాబీ!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 17.04.2017 11:32:19am

వాడెంత విధ్వంసం చేసినా నీ పసివాడి చేతిలో గులాబీ విచ్చుకుంటూ వాడిని భయపెడుతూనే వుంది!!...
...ఇంకా చదవండి

దక్షిణ యాత్ర

కెక్యూబ్ వర్మ | 04.06.2017 01:12:22pm

నీ ఒంటి రంగును హేళన చేసి నిన్ను బానిస చేసుకో చూస్తున్నాడు నీకంటూ మిగిలిన ఆఖరి అవకాశం నిన్ను నువ్వు జెండాగా ఎగురవేయడమే!!...
...ఇంకా చదవండి

ఒంటరి వెన్నెల

కేక్యూబ్ వ‌ర్మ‌ | 07.05.2016 08:29:33am

ఈ ఇప్ప పూల వనం రాలిపోతూ నిబ్బరాన్ని వదిలి నివురు కప్పుకుంది తూరుపింకా తెలవారక నీ పేరు తలుస్తూ పొలమారుతొంది...
...ఇంకా చదవండి

కుందాపన

కెక్యూబ్ వర్మ | 04.01.2018 01:31:58pm

ఈ కవిత్వం నిండా పరచుకున్న దాహం ఒంటరితనం.సమూహంలో తను నిలబడ్డ చోటు ఒంటరిగా ఒక దీపపు సమ్మెకింద నీడలా వెంటాడడాన్ని మనకనుభవంలోకి తెస్తుంది.కలసి నడవాల్సిన దారు......
...ఇంకా చదవండి

జీవ‌సూత్రాన్ని చెప్పే చింతా అప్పలనాయుడు ʹదుక్కిʹ

కెక్యూబ్‌ వర్మ | 16.06.2018 09:22:29am

కవితలనిండా రైతు జీవన చిత్రమే. ఒక దు:ఖార్తితో కొనసాగుతుంది. కురవని వానలు కలసిరాని కార్తెలు అప్పుల ఊబిలు కాడెద్దులను దూరం చేసే యంత్రాల దాష్టీకం అక్కరకు రాని ప...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార సెప్టెంబర్ 2019

  దళిత భక్త కవి రవిదాస్‌ సంత్‌ ఆలయం కూల్చివేత హిందూ ఫాసిజంలో భాగమే
  The Destruction of Kashmir is a Deathblow to Democracy in India
  నల్లమల యురేనియం గని కాదు, జీవవైవిధ్య కేంద్రం
  అతడు ఆమె అడవి
  మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ
  కన్ ఫామ్... !
  బందిష్
  రాంగూడ ప్రాంతంలో సమిష్టితత్వం, సహకార పద్ధతి
  కళలన్నా, సాహిత్యమన్నా ఫాసిజానికి భయం
  కవులకు సమర స్ఫురణ

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •