మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ

| సాహిత్యం | క‌థ‌లు

మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ

- పలమనేరు బాలాజీ | 05.09.2019 01:00:59pm

ప్రపంచం మొత్తం మార్కుల వెంటబడుతున్న సందర్భంలో , వంద మార్కులకు కూడా విలువ లేకుండా పోయిందన్న వ్యంగ్యం తో , అసలు చదువుకు, మార్కులకు ఉన్న , ఉండాల్సిన సంభందం ఏమిటో చిక్కగా-నిక్కచ్చిగా, పదునుగా చెప్పిన కథ జొన్న విత్తుల శ్రీరామచంద్రమూర్తి గారు రాసిన ʹనూటొకటో మార్కుʹ.

ʹవలసదేవర, జంగమ దేవర,అంతర్యామి , సాక్షాత్కారం ʹ నవలలు, ʹ ది డెత్ ఆఫ్ లాస్ట్ ఇండియన్ , ఈ కథకు శిల్పం లేదుʹ కథా సంపుటాల ద్వారా విలువైన రచయితగా , సుపరిచితులైన మూర్తి గారు రాసిన ఈ కథ మొదట ఆదివారం ఆంధ్ర జ్యోతి లో ప్రచురితమైంది. జొన్నవిత్తుల శ్రీరామచంద్ర మూర్తి ʹచదువు కథలు 2019 ʹ లో ఉంది.

పైకి కనపడని సమాజం లోపలి కల్లోలాలను, ఇతరులందరికన్నా ముందుండాలి అనే మనిషి తాపత్రయాన్ని, చదువుకు, జీవితానికి ఉన్న, ఉండాల్సిన సంబంధాన్ని , సమాజపు రుగ్మతుల్ని బయట పెట్టిన చదువు కథల్లో ఈ కథ ఒకటి. హాస్యం , వ్యంగ్యం , పదునైన నిక్కచ్చి కథనం ఈ కథకున్న బలాలు. మానవ స్వభావం లోని వైరుధ్యాలను చూపే కథలు ఎప్పుడూ పాఠకుల్ని ఆకట్టుకుంటాయి.

ఈ కాలం పిల్లలు పిల్లలు కారు. పిల్లలు నిజానికి పెద్దవాళ్ళే ఇప్పుడు !

పిల్లల ఆలోచనల్లో, ప్రవర్తనలో వచ్చే మార్పు సాధారణమైంది కాదు. పిల్లల్లో ప్రతిభా పాటవాలకు కొరత లేదు. పిల్లలందరికీ సమాజం లో చదువుకునేందుకు సమానమైన విద్యావకాశాలు లేకపోవడం , ఒకే రకం ప్రమాణాలతో కూడిన చదువు లేకపోవడం , విద్యా ప్రమాణాలు మారిపోవడం, సమాజం లో చదువుకు అర్థం మారిపోవడం, మార్కులే పరమావధి కావడం , సమాజం లోని అసమానతలు, వైరుధ్యాలు పిల్లల్లో అనేక రుగ్మతలకు కారణమవుతున్నాయి.అయితే నిరంతరం మారుతున్న సమాజం మనిషి స్వభావాన్ని తీవ్రంగా, అత్యంత వేగం గా మారుస్తోంది. విలువలే కాదు, మనుషులే తలక్రిందులవుతున్నారు. ఏదీ సక్రమంగా లేకపోవడం నిజమైనా , అంతా బావున్నట్లు రాజ్యం భ్రమ కలిపిస్తూ ఉంటుoది.అసత్యాలు, మోసాలు, నటనలు, కుట్రలు చెల్లుబాటు అవుతున్నట్లు పైకి అనిపిస్తూ ఉంటుంది. అయితే సాహిత్యం ఎప్పటికప్పుడు సమాజం లోని మనుషుల్ని జల్లెడ పట్టి, వడకట్టి మనుషుల్ని వేరు చేసి ఎవరు మనిషి ?ఎవరు కాదు , ఏది సత్యం , ఏది భ్రమ అని వేరు చేసి చూపిస్తూ ఉంటుంది వాస్తవం.మనిషి సంపాదించాల్సింది సంపదల్నా , పిల్లలు సంపాదించాల్సింది మార్కుల్నా, తల్లి తండ్రులు ఆరాట పడాల్సింది పిల్లల ర్యాంకుల కోసమేనా ? ఇంతకూ మనిషి సంపాదించాల్సింది ఏమిటి అన్నది ఈ కథ!

ఈ కథలో సంభాషణ మాత్రమే ఉంటుంది, వర్ణనలు,ఉపోద్ఘాతాలు , విశ్లేషణలు, ఉపన్యాసాలు ,శైలీ విన్యాసాలూ వుండవు.నిరలంకారం ఒక శిల్ప లక్షణంగా , ఇద్దరి సంభాషణ లో కథ మొత్తం నడుస్తుంది.ఒక కుర్రవాడు చూపిన పరిణితి ఈ కథ లోని కొసమెరుపు, కొస మలుపు.పిల్ల వాడు సంపాదించలేకపోయిన నూరో మార్కు కాదు, అతడు సాధించాడని తండ్రి చెపుతున్న నూట ఒకటో మార్కే ఈ కథలోని కొస మలుపు. ఆ మార్కు ఆ కుర్రాడికి చదువు వల్ల వచ్చింది కాదు. ఆ కుర్రాడి విజ్ఞత, సంస్కారం ,పరిణితి వల్ల వచ్చింది. తండ్రి ఆలోచనల్లో , అభిప్రాయాల్లో ఆ కుర్రవాడు తీసుకు వచ్చిన మార్పు. ఎట్లా తండ్రి మారదు అనడానికి ఈ కథలోని ప్రతి మాటను అర్థం చేసుకుంటూ చదవకపోతే సాధారణ పాఠకుడికి ఈ మార్పుకు కారణం తెలియదు.

సమాజం లోని సంక్షోభాలన్నిటికీ ఆర్ధిక అసమానతలు కారణమైయినట్లు, పిల్లల చెడు ప్రవర్తనకు తల్లితండ్రుల వైఖిరే , సమాజం లో చెల్లుబాటు అవుతున్నట్లు భ్రమలు కలిపిస్తున్న విలువల రాహిత్యమే కారణం అవుతుంది.పెద్దలు భావించే విలువలనే పిల్లకు నేర్పించాలని అనుకోవడం, మూస ధోరణిలో పిల్లలని మార్కుల తయారీ కోసమే వాడడం . ఒక మార్కు లేదా ర్యాంకు సైతం జీవితాలని తలకిందులు చేస్తూ వుండటం ఒక సామాజిక రుగ్మత. చదువులు చాల చోట్ల పిల్లల ఇష్టం ప్రకారం జరగటం లేదు.చదువులో, సిలబస్ లో , స్కూలు ఎంపికలో స్వేచ్చ లేకపోవడం పిల్లలు సంతోషంగా లేక పోవడానికి కారణమవుతోంది.

చాల మంది పిల్లలు ఇష్టంగా చదువుకోవడం లేదు అన్నది గమనార్హం. ఒత్తిడి తట్టుకోలేక, పరిక్షల భయంతో, మార్కులు తగ్గాయనే ఆవేదనతో ఆత్మహత్యలతో మరణించింది పిల్లలు మాత్రమే కాదు, మానవీయ విలువలు, మానవ సంబంధాలు మరణించాయి. కుటుంభాలు మరణించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సమాజం మరణించింది. పిల్లల ఆత్మహత్యల్లో మానవుడు మరణిoచాడు. సంభాషణల ద్వారా కథ నడుపుతున్నప్పుడు పాత్రల కంఠస్వరం ముఖ్యo . బాష , పాత్రల మాటల మధ్య వుండాల్సిన వైవిధ్యం , సంభందం , మాటల ద్వారా కొనసాగే కథనo కథ పట్ల పాఠకుల్లో ఆసక్తిని కలగచేయటమే కాక , కథ పట్ల నమ్మకాన్ని కలిగించాల్సి వుంటుంది. సంభాషణలో దొర్లే పదాలు, మాటతీరు, యాస పాత్రలు మన ముందు నిలుచుని మాట్లాడుతున్నట్లు కథ రాయడం లో ఈ రచయిత విజయవంతమయ్యాడు.

బిడ్డకు తల్లిపట్ల నమ్మిక వుండటం, తన వ్యక్తిత్వం పట్ల స్పష్టత వుండటం, నిజాయితీ గా ఉండాల్సిన ముఖ్యమైన సందర్భం లో ఆ కుర్రవాడు నిజాయితీ గా వుండటం, తన తప్పు తను తెలుసుకోవడం, ముఖ్యంగా తనను తానూ సరిదిద్దుకోవడం , మెరుగుపరచుకోవడమే ఈ కథాంశం . ముందు రోజు ఒక ప్రశ్నకు సమాధానాన్ని తండ్రికి చెప్పగలిగిన కొడుకు, అదేప్రశ్నకు జవాబు గుర్తుండి పరీక్షలో కావాలనే జవాబు రాయకుండా వుండి పోతాడు. అందుకే అతడు నూరు మార్కులు తెచ్చుకోలేక పోతాడు. తండ్రి తన స్నేహితుడైన సైకాలజిస్టు వద్ద రెండ్రోజులు ప్రయత్నించి మరీ అప్పాయింటుమెంటు తీసుకుంటాడు. కుర్రాడి గురించి తనకున్న ఫిర్యాదులు చెప్పుకొస్తాడు.

ʹ మా వాడు రానురానూ ఉత్త వేస్తూ బాడిలా తయారవుతున్నాడు ʹ అని తన బాధల్ని చెప్పటం ద్వారా కథ మొదలవుతుంది.

కాసేపటి సంభాషణ తర్వాత సైకాలజిస్టు ʹ సరే చెప్పు.ఏమిటి వాడి ప్రాబ్లం...బాగా చదవట్లేదా ...మంచి మార్కులు తెచ్చుకోవడం లేదా.. చదివిందాన్ని అర్థం చేసుకోవట్లేదా,,, లేక చదివింది గుర్తుండట్లేదా ? ʹ

ʹ అవన్నీ ఒకే కానీ ఒకటే ప్రాబ్లం ʹ

ʹ..కొంపదీసి గాళ్ ఫ్రెండ్స్ తో తిరగడం, లవ్వులో పడ్డం లాంటి ప్రాబ్లమ్సా ఏంటి ? ʹ

ʹ అబ్బే అలాంటిదేమీ లేదు.ʹ

ʹ పోనీ అబదాలు చెప్పడం, క్లాసులు ఎగ్గొట్టడం ..సినిమాలు..షికార్లు..ʹ

ʹ ఉహూ ʹ

ʹ మరింకేట్రా అoత పెద్ద ప్రాబ్లం ? ʹ

ʹ వీడికి వందకి వంద మార్కులు రావలసింది , కానీ తొoతొమ్మిదే వచ్చాయిʹ

అప్పుడు ఒకే ఒక్క మార్కు కోసం ఇంత హైరానా పడి రావాలా అని ? అని అడుగుతాడు సైకాలజిస్టు. ముందు రోజు ఒక ప్రశ్నకు సమాధానాన్ని తండ్రికి చెప్పగలిగిన కొడుకు, అదేప్రశ్నకు జవాబు గుర్తుండి పరీక్షలో కావాలనే జవాబు రాయకుండా వుండి పోతాడు. అందుకే అతడు నూరు మార్కులు తెచ్చుకోలేక పోతాడు.అదే విషయం చెప్పుకొస్తాడు.

ʹ అయితే ఇది సిరియస్ ప్రాబ్లమే.ఈ ఒక్క సమస్యేనా .ఇంకా ఏమైనా సమస్యలున్నాయా ..? ʹ

ఆ ప్రశ్నకు జవాబుగా అడ్డమైన విషయాలన్నీ అవసరానికి మించి పట్టించుకుని బంగారం లాంటి టైముని వేస్ట్ చేసుకుంటున్నాడని ఆ తండ్రి చెప్పుకొస్తాడు.

తను ప్రేమించిన అబ్బాయితో కులాంతర వివాహానికి రెండేళ్ళు కష్టపడి తల్లితండ్రుల్ని ఒప్పించిన తర్వాత పెళ్లి రేపనగా యాక్సిడెంటు అయి, ఆ కుర్రాడు పోవడం తో వీణ అనే అమ్మాయికి పిచ్చెక్కి పిచ్చాసుపత్రిలో ఉన్నప్పుడు యధాలాపంగా ఆమె పరిస్థితి చూసి చలించిన ఆ కుర్రాడు అమెను పరిచయం చేసుకుని ఆమె పిచ్చి తగ్గించడానికి అక్కా అని పిలుస్తూ, ఆమె కోసం సమయం వెచ్చించడం ఆ తండ్రికి విడ్డూరంగానే ఉంటుంది.జ్ఞానాన్ని దానం చేయాలే కానీ క్యాష్ చేసుకో కూడదనే ఉద్దేశ్యం తో టివి లో క్విజ్ ప్రోగ్రాం లో జవాబులు అన్నీ తెలిసి పోనీ ఆ కుర్రాడి పై తండ్రికి కోపం ఉంటుంది.

అంతకు ముందే సైక్రియాటిస్ట్ దారి మధ్యలో ఆ కుర్రాడి తల్లిని కలసి మాట్లాడి వచ్చి ఉంటాడు. ఆమె తన కొడుకు తనతో మాట్లాడటం లేదని కంప్లైంటు చేసి ఉంటుంది. అల మాట్లాడక పోవడానికి కారణం కూడా ఆ తల్లే అని ఆ తండ్రికి ఇప్పుడు సైక్రియాటిస్ట్ చెప్పగానే ʹ మా ఆవిడా ? నో ఛాన్స్. వాడికి తనంటే ప్రాణం ʹ అంటాడు తండ్రి.
ʹ కేవలం ప్రాణం మాత్రమే కాదు. వాడికి తన తల్లంటే విపరీతమైన గౌరవం కూడా .తల్లిని తానెప్పుడూ స్నేహితురాల్లాగానే చూశాడు. అలాంటి స్నేహితురాలు తనకోసం .., కేవలం తనని గెలిపించడం కోసం మరొకర్ని ఓడించగలదని ఊహించలేకపోయాడు. తన కళ్ళ ఎదుటే తన స్నేహితుడిని తన కారణంగా ఓడిoచడాన్ని సహించ లేకపోయాడు. అందుకే ఆవిడతో మాట్లాడ్డం మానేశాడు. ʹ

అసలు విషయం కనుక్కోవడానికి సైక్రియాటిస్ట్ అప్పటికప్పుడు ఆ కుర్రాడిని కాలేజి నుండి ఇంటికి పిలిపించి మాట్లాడి ఉంటాడు .

ʹ ఆ రోజు . అంటే వాడు వందో మార్కు ఆన్సర్ చెయ్యకుండా వదిలేసినా రోజు ఇన్విజిలేటర్ గా వచ్చింది వేరెవరో కాదు .వాళ్ళమ్మే. వీడు పరీక్ష రాస్తుంటే కనీసం వాడి దగ్గరక్కుడా వెళ్ళలేదు. ఏం రాస్తున్నాడో గమనించలేదు.చివరికి పేపర్ ఈజీగా వుందా టఫ్ గా వుందా అని కూడా అడగలేదు. ʹ అమెది అలాంటి స్వభావం కాదు. ఆ కుర్రాడిది తల్లినుండి పరీక్షలో పలకరింపు కానీ , సహాయం కానీ ఆశించే స్వభావం కాదు.

ఆ కుర్రాడి స్నేహితుడు, మంచి చదువరి, సమానమైన తెలివితేటలు గల ఇంకో అబ్బాయికి ఏదో సందేహం వచ్చి అడిగితే ఇన్విజిలేటర్ గా వచ్చిన వాళ్ళమ్మ సమాధానం చెపుతుంది. అది తప్పు జవాబు అని ,కొడుకు కంటే మార్కులు ఆ అబ్బాయికి తక్కువ రావాలనే దురుద్దేశ్యం తోనే అమ్మ తన స్నేహితుడికి కావాలనే తప్పుడు సమాధానం చెప్పిందని భావించిన కుర్రాడు వాళ్ళమ్మ తో మాట్లాడటం మానేస్తాడు. ఉద్దేశ పూర్వకంగానే తనకు బాగా తెలిసినా ఒక ప్రశ్నకు సమాధానం రాయకుండా విడిచిపెడతాడు. తన తల్లి ద్వారా తన స్నేహితుడికి అన్యాయం జరిగిందని భావించిన ఆ కుర్రాడు , తనకు ఒక మార్కును తెలిసీ తనే తగ్గించుకుంటాడు.నిజానికి అది వాళ్ళమ్మ తప్పు కాదని, టెక్స్ట్ బుక్ లోనే జవాబు తప్పుగా ప్రింట్ కావడమే అని, ఆమె దాన్నే సరైన జవాబు అని భావించింది అని తర్వాత తెలుస్తుంది.

వాళ్ళమ్మ తప్పు లేదు అని తెలియచెప్పటానికి సైక్రియాటిస్ట్ అమ్మ కొడుకులకు పరీక్షా పెట్టి ఇద్దరినీ జవాబులు రాయమంటాడు. కుర్రాడికి వంద, తను టీజ్ చేసే సబ్జెక్టు లోనే ఆ తల్లికి తొoభై తొమ్మిది వస్తాయి. కారణం ఏమిటంటే , ఏ ప్రశ్నకైతే తల్లి కావాలని తన స్నేహితుడికి తప్పు జవాబు చెప్పిందని ఆ కుర్రాడు భావించాడో, ఆ ప్రశ్నకు ఆమెకు తెలిసిన జవాబు తప్పు, ఆ కుర్రాడికి తెలిసింది సరైన జవాబు. అప్పుడు తెలుస్తుంది ఆమె టెక్స్ట్ బుక్ లో తప్పుగా అచ్చయిన జవాబునే సరైనదని భావించే, ఆ కుర్రాడి స్నేహితుడికి జవాబు చెప్పింది తప్ప, తన కొడుకు కన్నా తక్కువ మార్కులు రావాలనే దురుద్దేశ్యం ఏది ఆమె కు ఏ కోశాన లేదని, ఆమె నిజాయితి అప్పుడు కొడుక్కు అర్థం అవుతుంది. తన తప్పు తెలుసుకున్న కొడుకు తక్షణమే తల్లికి క్షమాపణ చెపుతాడు.

ఇంతకూ వాడికి తన తల్లి తండ్రుల పైన అంత దురభిప్రాయం కలగటానికి కారణం ఏమిటంటే ఎప్పుడూ వాళ్ళు కొడుకుతో కేవలం మార్కుల గురించి మాత్రమే మాట్లాడుతూ మార్కులే సర్వస్వం అనే భావన కలుగ చేయటమే అని తేలుస్తాడు ఆ కుటుంభానికి సన్నిహితుడైన సైక్రియాటిస్ట్.

ʹ మార్కుల చట్రం లోంచి బయటకి వచ్చి ఆలోచించి చెప్పు. వాడికిప్పుడా వందో మార్కు అవసరమంటావా ? ʹ అని అడుగుతాడు.అప్పుడా తండ్రి ఇచ్చిన జవాబే ఈ కథలో ముగింపు.

ʹ అవసరం లేదు. ఎందుకంటే వాడు సంపాదించుకున్నది నూట ఒకటో మార్కు .నువ్విoదాకా అన్నావు చూడు,కొడుకుని గెలిపించుకోవడం కోసం తన తల్లి కావాలనే ప్రత్యర్థికి రాంగ్ ఆన్సర్ చెప్పినట్లుగా భావించాడని. వాడలా భావించడం వల్ల మీ చెల్లితో మాట్లాడక పోవడం మా ఇద్దరికీ ఎంతో బాధ కలిగించిన మాట నిజమే కావచ్చు.కానీ మేం పడ్డ బాధ కంటే వాడు అనుభవించిన మధనం గొప్పది.మనం దాన్ని కొనసాగనివ్వాలి.ఒక వేళ నువ్వు పరీక్షా రాయించి ఉండక పోతే టెక్స్ట్ బుక్ లోని ప్రింటింగ్ మిస్టేక్ గురించి తెలిసిసేదీ కాదు, తల్లిపట్ల వాడిలో ఏర్పడిన దురభిప్రాయం తొలిగేదీ కాదు.వాడికి సమాధానం తెలిసినా రాయకుండా వదిలెయ్యడం ద్వారా చూపిన పరిణితి ఉంది చూడూ అదే వాడు సంపాదించుకున్న నూట ఒకటో మార్కు . ʹ

కథలోని ముగింపుని చక్కగా అర్థం చేసుకోక పోతే కథ లో కథకుడు చెప్పదలచుకున్న మార్పు పాఠకులకు అర్థం కాదు. కథ మొదట్లో తన కొడుకు గురించిన తండ్రి పడిన ఆవేదన, మార్కులకై అతడి ఆరాటం, కొడుకు పై అతడు చూపించిన ఒత్తిడి, కథ చివరికి వచ్చేసరికి మారిపోతుంది. తండ్రి తన ధోరణిని మార్చుకోవడమే ఈ కథలో రచయిత చూపించదలచుకున్న మార్పు.

నిజానికి పరీక్ష రాసింది ఈ కథ లో కుర్రాడు కాదు. తల్లి తండ్రులే అని , పరీక్షలో పాస్ కావాల్సింది కూడా పిల్లలు మాత్రమే కాదని తల్లి తండ్రులు కూడా పిల్లలు పెట్టే పరీక్షలో పాస్ కావాలని అనిపిస్తుంది.

మనిషి మరింత ఉన్నతంగా ఎదగడానికి చదువులు ఉపయోగపడాలనే రచయిత ఉద్దేశ్యం తండ్రి మాటల ద్వారా పాఠకుడు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రతి కథకు ప్రత్యేకమైన శ్రద్ధతో విభిన్నమైన పేర్లు పెట్టడం మూర్తి గారి ప్రత్యేకతల్లో ఒకటి.రచయిత ఒక దశలో తన జీవనం కోసం కొనసాగించిన ఉపాధ్యాయ వృత్తి, పిల్లల్లో , తల్లితండ్రులలో మార్కులకై పడే ఆరాటం చేసే పోరాటాలు, ఉరుకులు పరుగులు కథకుడ్ని కలవర పరచిన కారణం గానే ఎన్నో చదువు కథల్ని అయన రాయగలిగాడు. వృత్తి లోని అనుభవాలు, సంఘర్షణలు , ఆలోచనలు కథకుడ్ని కదిలిస్తే వాస్తవ జీవితాల్లోని వాస్తవాలు ఇట్లా కథలవుతాయని చెప్పిన మాటలతో నడిచిన మంచి కథ ʹనూటొకటో మార్కుʹ
No. of visitors : 965
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


పరిమళం , పదును రెండూ వున్నకవిత్వం – చేనుగట్టు పియానో

పలమనేరు బాలాజీ | 04.02.2017 02:37:03am

కవి పాలక పక్షం, రాజ్యం పక్షం, వహించకుండా ప్రజా పక్షం వహిస్తున్నాడని ప్రజల ఆగ్రహాన్ని,ఆవేదనల్ని, ప్రశ్నల్ని,నిరసనల్ని తన గొంతుతో వినిపిస్తున్నాడని .......
...ఇంకా చదవండి

ʹనారుమడిʹ మళ్ళీ మళ్ళీ చదివించే మంచి క‌విత్వం

పలమనేరు బాలాజీ | 18.01.2017 11:47:15pm

కాలం గడచినా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి చదవాలని అనిపించే మంచి కవితా సంపుటాల్లో ʹ నారుమడి ʹ ఒకటి. యెన్నం ఉపేందర్ ( డాక్టర్ వెన్నం ఉపేందర్ )అటు కథకుడిగా , యిటు కవి...
...ఇంకా చదవండి

సాహిత్య విమర్శకు కొత్త బ‌లం

పలమనేరు బాలాజీ | 04.03.2017 09:54:02am

ఈ పుస్తకం లో వ్యక్త పరచిన అభిప్రాయాల్లో రచయిత ఎక్కడా సహనం కోల్పోలేదని, సాహిత్య అంశాల పట్ల రచయితకు గల ఆసక్తి ,నిబద్దత,స్పష్టతే ఇందుకు కారణాలని, విభేదించే...
...ఇంకా చదవండి

ఖాళీ ఇల్లు,ఖాళీ మనుషులు

పలమనేరు బాలాజీ | 01.06.2016 11:57:12am

నమ్ముకున్న కలల్ని గాలికొదలి ఇల్లు వదిలి, ఊరు వదిలి పిల్లల్ని వదిలి, సహచరుల్ని వదిలి...
...ఇంకా చదవండి

మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ

పలమనేరు బాలాజీ | 03.08.2019 11:39:20pm

మనిషికి, మట్టికి మధ్య వున్న అనుభందం విడదీయరానిది . మట్టి మనిషిని చూస్తున్నాం, విoటున్నామని అనుకుంటాం కానీ, నిజానికి మట్టి మనిషిని నిజంగా సంపూర్ణంగా ......
...ఇంకా చదవండి

స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ

ప‌ల‌మ‌నేరు బాలాజీ | 03.05.2019 03:22:15pm

ఆశావాద దృక్పథంతో మంచి సమాజం కోసం ఒక ఆధునిక స్త్రీ పడే తపనను ఈ కవిత్వం తప్పక చెపుతుంది. పసిబిడ్డల నుండి ముసలివాళ్ళు వరకు అన్ని ప్రాంతాల్లో స్త్రీలపై జరుగ...
...ఇంకా చదవండి

ఒక మంచి రాజనీతి కథ

పలమనేరు బాలాజీ | 16.07.2019 09:19:27pm

వ్యవస్థలో, మనిషిలో పేరుకుపోతున్న రాజకీయాన్ని దళారీ తనాన్ని వ్యాపార తత్వాన్ని నగ్నంగా చూపించిన ఈ కథలో ప్రతి పదం ముఖ్యమైనది, అనివార్యమైనది. ఆయా పదాలు......
...ఇంకా చదవండి

మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ

పలమనేరు బాలాజీ | 16.08.2019 09:24:03pm

సాధారణంగా బిడ్డల వల్ల తల్లులు బాధలు పడే కథలు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి . తల్లి, బిడ్డలకు సంబందించిన కథలు కొన్ని వేల సంఖ్యలో వచ్చింటాయి. వృద్ధాప్యదశకు చేర.....
...ఇంకా చదవండి

కథల గూటి లోని ఒక మంచి కథ నల్లూరి రుక్మిణి గారి "ఎవరిది బాధ్యత"

పలమనేరు బాలాజీ | 02.12.2019 11:35:29pm

థను శ్రద్ధగా చదివే వాళ్ళకి మానవ మనస్తత్వం లోని వైరుధ్యాలను, సంఘర్షణలను రాజీతత్వాన్ని, ప్రశ్నించే గుణాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. వ్యక్తిగత సంపద పట్ల.....
...ఇంకా చదవండి

అసహజ మరణాలు సమాజానికి హెచ్చరికలు అంటున్న కథ ʹ డోలిʹ

పలమనేరు బాలాజీ | 17.09.2019 08:46:21am

భారతదేశంలో స్థల కాలాలను బట్టి కులాన్ని బట్టి సామాజిక స్థితిగతులను బట్టి చావుకు అర్థం, విలువ మారిపోతూ ఉంటుంది. అంతో ఇంతో ఉన్నవాడి చావుకి ,గొప్ప వాడి .....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •