అంబేద్కర్‌ ఆర్టికల్‌ 370ను వ్యతిరేకించారా?

| సాహిత్యం | వ్యాసాలు

అంబేద్కర్‌ ఆర్టికల్‌ 370ను వ్యతిరేకించారా?

- - రామ్‌ పునియాని | 16.09.2019 03:14:12pm

అంబేద్కర్‌ ఆర్టికల్‌ 370ను వ్యతిరేకించారా?

అధికారిక రికార్డులు దీన్ని సమర్ధించడం లేదు

జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రానికున్న ప్రత్యేక ¬దాను రద్దు చేసిన తరవాత ప్రధాని నరేంద్రమోడి, తన ప్రభుత్వం అంబేద్కర్‌ తదితర గొప్ప నాయకుల కలలను సాకారం చేసిందని జాతికి చెప్పారు.

కేంద్రమంత్రి అర్జున్‌ మేఘ్‌వాల్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులు కూడా రెండు జాతీయ వార్తాపత్రికల్లో ప్రకటితమైన వారి అభిప్రాయాల్లో ఇదే కథనాన్ని వ్యక్తీకరించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా భావించబడుతున్న అంబేద్కర్‌, వివాదాస్పదమైన ఆర్టికల్‌ 370ను రాజ్యాంగంలో పొందుపరచడాన్ని వ్యతిరేకించారని వాళ్ళు తమ అభిప్రాయంగా వ్యక్తం చేశారు.

బహుజన సమాజ్‌పార్టీ అధ్యక్షురాలు, దళిత రాజకీయ నాయకురాలైన మాయావతి ఈ మధ్య కాలంలోనే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడానికి తానిచ్చిన మద్ధతును అంబేద్కర్‌ మీద ఆధారపడి సమర్థించుకున్నారు. అయితే అంబేద్కర్‌ నిజంగానే ఆర్టికల్‌ 370ని వ్యతిరేకించారా? ఈ అంశంలో ఆయన అభిప్రాయాలను సూక్ష్మంగా పరిశీలిస్తే, చాలామంది నాయకులు వెలిబుచ్చుతున్న అభిప్రాయాలకు, ఆయన అభిప్రాయాలకు పొంతనలేదని తెలుస్తుంది.

కాశ్మీర్‌పై అంబేద్కర్‌ దృక్పథం :

అంబేద్కర్‌ ఉపన్యాసాలు, రచనలు, పార్లమెంటరీ చర్చలు విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌లో ఇప్పటికీ భద్రంగా వున్నాయి. వాటిని పరిశీలిస్తే ఆయన కాశ్మీర్‌ సమస్యకు త్వరిత పరిష్కారాన్ని కోరుకున్నారని, నిజానికి ప్రజాభిప్రాయ సేకరణను ప్రతిపాదించారని తెలుస్తోంది. విభజనే కాశ్మీర్‌ సమస్యకు సరైన పరిష్కారమని కూడా అంబేద్కర్‌ అన్నారు.

1951 అక్టోబర్‌ 10న నెహ్రూ మంత్రివర్గం నుండి రాజీనామా చేస్తూ అంబేద్కర్‌ పార్లమెంట్‌లో చేసిన ప్రసంగంలో ఇలా అన్నారు :

ʹʹభారతదేశానికి సంబంధించి మనం చేసినట్లుగానే (కాశ్మీర్‌ వ్యవహారంలో కూడా) హిందువులు, బౌద్ధులు నివసిస్తున్న ప్రాంతాన్ని భారతదేశానికి, ముస్లింలు నివసిస్తున్న ప్రాంతాన్ని పాకిస్తాన్‌కు ఇవ్వండి. కాశ్మీర్‌లో ముస్లింలు నివసిస్తున్న ప్రాంతాన్ని మనం వాస్తవంగా పట్టించుకున్నది లేదు. అది కాశ్మీరీ ముస్లింలకు పాకిస్తాన్‌కు మధ్య వ్యవహారం. వాళ్ళు వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చును.ʹʹ

ఆయన ప్రాంతాలవారీ ప్రజాభిప్రాయ సేకరణను ప్రత్యేకించి ప్రతిపాదించారు. ʹʹమీకు ఇష్టమైతే దాన్ని (కాశ్మీర్‌ను) మూడు భాగాలుగా విభజించండి. కాల్పుల విరమణ ప్రాంతం, (కాశ్మీర్‌)లోయ, జమ్ము-లడాక్‌ ప్రాంతం. ఒక్క లోయలో మాత్రమే ప్రజాభిప్రాయ సేకరణ జరపండి. మొత్తం అన్ని ప్రాంతాలలో కలిపి ప్రజాభిప్రాయ సేకరణ జరిపితే కాశ్మీర్‌కు చెందిన హిందువులు, బౌద్ధులు వారి ఇష్టానికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌లోకి బలవంతంగా నెట్టబడతారని నా భయం. అలా జరిగితే ఇప్పుడు తూర్పు బెంగాల్‌లో మనం ఎదుర్కొంటున్న సమస్యలనే అక్కడ కూడా ఎదుర్కోవలసి రావచ్చు.ʹʹ

అంటే, రాజీ ఫార్ములా అయిన ఆర్టికల్‌ 370కింద కాశ్మీర్‌ భారతదేశంలో భాగంగా వుండడాన్ని కోరుకోవడానికి బదులు అంబేద్కర్‌ ముస్లిం భాగాన్ని పాకిస్తాన్‌కు ఇవ్వడానికే అనుకూలంగా వున్నారన్నమాట. ప్రధానమంత్రి, మాయావతులు బహిరంగంగా చెప్తున్నదానికి ఇది పూర్తిగా భిన్నమైనది.

అంబేద్కర్‌ సలహాలను నెహ్రూ ప్రభుత్వం అంగీకరించకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.

భారతదేశపు విదేశాంగ విధానానికి సంబంధించిన పార్లమెంటరీ చర్చలో పాల్గొంటూ 1953లో చేసిన ప్రసంగంలో అంబేద్కర్‌ ఇలా అన్నారు.

ʹʹమన దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంకాక, ఇతర దేశాల సమస్యలను పరిష్కరించడం మన విదేశాంగ విధానానికి కీలక అంశంగా వున్నది. మనం ఇక్కడ కాశ్మీర్‌ సమస్యను ఎదుర్కొంటున్నాం. దాన్ని పరిష్కరించడంలో మనం ఎన్నడూ విజయం సాధించలేదు. అది ఒక సమస్య అని ప్రతివారూ మర్చిపోయినట్లున్నారు. అయితే ఏదో ఒకనాడు మనం అక్కడ ఒక దెయ్యం వుందని తెలుసుకోవాల్సి వస్తుందని నేను అనుకుంటున్నాను.ʹʹ

ఆర్టికల్‌ 370 గురించి అంబేద్కర్‌ :

అంబేద్కర్‌ ఆర్టికల్‌ 370కి వ్యతిరేకమని చెప్పడానికి ఎలాంటి సాక్ష్యం లేదు. 1950లో ప్రజా ప్రాతినిధ్య బిల్లుపై భారత పార్లమెంట్‌లో జరిగిన చర్చలో ఆయన వెల్లడించిన అభిప్రాయం ద్వారా ఆర్టికల్‌ 370పైన అంబేద్కర్‌ దృక్పథాన్ని మనం దగ్గరగా అర్థం చేసుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక ¬దాను ఇవ్వడం గురించి ప్రస్తావిస్తూ అంబేద్కర్‌ ఇలా అన్నారు.

ʹʹకాశ్మీర్‌ ప్రాతినిధ్యానికి సంబంధించి ఎలాంటి చట్టం చేయడానికి పార్లమెంటుకు అధికారం లేదుʹʹ ఈ విషయంలో జమ్మూ కాశ్మీర్‌ ప్రభుత్వానికే అధికారం వుందని కూడా ఆయన ప్రస్తావించారు.

ʹʹకాశ్మీర్‌కు సంబంధించిన నిబంధన ప్రకారం, కేవలం ఆర్టికల్‌ ఒకటి మాత్రమే అక్కడ వర్తిస్తుంది. కాశ్మీర్‌, భారత భూభాగాల్లో ఒకటి అని దాని అర్థం. ఆ నిబంధన ప్రకారం, రాజ్యాంగంలోని ఇతర అంశాలు కాశ్మీర్‌కు వర్తించాలంటే అది, కాశ్మీర్‌ ప్రభుత్వంతో రాష్ట్రపతి సంప్రదింపులు జరపడం మీద మాత్రమే ఆధారపడి వుంటుంది. భారత రాష్ట్రపతి కాశ్మీర్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తరవాత మాత్రమే ఇతర నిబంధనలను, ఆయన నిర్ణయించిన రీతిలో మార్పులు చేర్పులు చేసి కాశ్మీర్‌లో అమలు చేయగలరు.ʹʹ

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి మేఘవాల్‌లు ఆర్టికల్‌ 370పై, కాశ్మీర్‌పై అభిప్రాయాలను వెల్లడిచేసిన సందర్భంలో ప్రస్తావించిన ఉల్లేఖనల సంగతి ఏమిటి? వాళ్ళు అంబేద్కర్‌ ఇలా అన్నారని ఉల్లేఖించారు. ʹʹభారతదేశం కాశ్మీర్‌ను రక్షించాలని, దాని ప్రజలకు ఆహారాన్ని అందించాలని కాశ్మీరీలకు భారతదేశమంతటా సమాన హక్కులు ఇవ్వాలని మీరు కోరుతున్నారు. అయితే భారతదేశానికి, భారతీయులకు కాశ్మీర్‌లో అన్ని హక్కులూ ఇవ్వడానికి మీరు నిరాకరిస్తున్నారు. నేను భారతదేశపు న్యాయశాఖా మంత్రిని. జాతి ప్రయోజనాలకు అలా ద్రోహం చేయడంలో నేను భాగస్వామిని కాలేనుʹʹ

అయితే ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయం వుంది. వాళ్ళు చేసిన ఉల్లేఖన ఏ ప్రభుత్వ అధికారిక రికార్డులలోను భాగంగా లేదు. అయితే మరి వాళ్ళు ఆ ఉల్లేఖనను ఎక్కడి నుండి తీసుకున్నట్లు?

దీన్ని వాళ్ళు నవంబరు 14, 2004లో ఆర్‌.యస్‌.యస్‌. అధికారిక పత్రిక ఆర్గనైజర్‌లో ప్రకటితమైన ఆర్‌.యస్‌.యస్‌ నాయకుడు బలరాజ్‌ మధోక్‌ రాసిన వ్యాసం నుండి తీసుకున్నారు. మధోక్‌కు అంబేద్కర్‌కు మధ్య జరిగిన ఒక సంభాషణను ఈ ఉల్లేఖనకు ఆధారంగా చెప్తున్నారు. అయితే అందుకు సంబంధించిన సాక్ష్యమేదీ లేదు.

ఇక్కడ మనం ఒక ప్రశ్న వేయవచ్చును. కాశ్మీర్‌తో సహా జాతి ప్రయోజనాలకు సంబంధించిన అనేక అంశాలపై అంబేద్కర్‌ తన అభిప్రాయాలను ధైర్యంగానూ, స్పష్టంగానూ ప్రకటించి వున్నారు. అలాంటప్పుడు, ప్రస్తుత నాయకులు చెప్తున్నట్లుగా అంబేద్కర్‌ తన అభిప్రాయాలని ఎన్నడూ ఎందుకు బహిరంగంగా వ్యక్తీకరించలేదు?

ఆర్టికల్‌ 370 రద్దులో కొన్ని మంచి అంశాలు, కొన్ని లోప భూయిష్టమైన అంశాలు వుండి వుండవచ్చు. కాని కాశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా సృష్టించుకోవడానికి రాజకీయ నాయకులు, కొన్ని మీడియా వర్గాలు వాస్తవాల్ని తారుమారు చేస్తున్నాయి.

కాకపోతే ప్రజాభిప్రాయ సేకరణకు మద్ధతుదారుడైన అంబేద్కర్‌ ఆర్టికల్‌ 370ని వ్యతిరేకించినవాడుగా ఎలా మారిపోతాడు?

(పీపుల్స్‌ మీడియా ఎడ్వొకసి, రిసోర్స్‌ సెంటర్‌ సౌజన్యంతో, 6-9-2019)

అనువాదం : సి.యస్‌.ఆర్‌. ప్రసాద్‌


No. of visitors : 354
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ʹకాకుల్ని కొట్టి గద్దలకు వేయటమేʹ నోట్ల రద్దు

సి.ఎస్‌.ఆర్ ప్ర‌సాద్‌ | 07.12.2016 10:19:08am

జాతీయవాద ముసుగులో సామ్రాజ్యవాద పెట్టుబడులకు సేవ చేస్తున్న నరేంద్ర మోది పెద్ద నోట్ల రద్దు ప్రకటన ద్వారా మరో సారి తన ʹ ప్రభు భక్తిని ʹ చాటుకున్నాడు . సాధారణ ప...
...ఇంకా చదవండి

అమ్మభాషలో చదువుకోవడం ప్రజాస్వామిక హక్కు

సి.యస్‌.ఆర్‌. ప్రసాద్‌ | 04.03.2017 08:44:40am

భాష ఒక జాతికి చెందిన ప్రజల అస్తిత్వానికి గీటురాయి. ప్రతిభాషా సమాజానికి తనదైన గొప్ప వారసత్వ సంపద సాహిత్య రూపంలోనూ, సంస్కృతి రూపంలోనూ వుంటుంది. అయితే ఆ సమాజంల...
...ఇంకా చదవండి

గొట్టిపాడు దళితులపై పడగ విప్పిన అగ్రకుల సర్పం

సి.ఎస్‌.ఆర్ ప్ర‌సాద్‌ | 20.02.2018 12:09:16am

ఒకవైపు దళితులపై యింతటి అనాగరికమైన దాడులకు వత్తాసు పలుకుతున్న తెలుగుదేశం, జనవరి 26న దళిత తేజం పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించటం సిగ్గుచేటు.....
...ఇంకా చదవండి

కళలన్నా, సాహిత్యమన్నా ఫాసిజానికి భయం

ముకుళిక. ఆర్‌. | 16.08.2019 08:28:10pm

జె.ఎన్‌.యు.లో హాస్టళ్ళ గోడలమీదా, తరగతి గదుల భవనాలమీదా, క్యాంటీన్‌లమీదా, లైబ్రరీలమీదా కనపడే రాడికల్‌ స్వభావం కలిగిన పోస్టర్లు, నినాదాలు, బొమ్మలు వైవిధ్యభరి.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?
  ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
  అరుణతార నవంబర్ 2019
  నరʹసింహం!ʹ
  విశ్వకర్మ(బ్రాహ్మల)లు-ఒక వైరుధ్యం.
  ʹబహుముఖ దార్శనికుడు - బహుజన తాత్వికుడు వీరబ్రహ్మంʹ పుస్తకం..
  గుండెలో వాన కురిపించి, మనన్సుని కలవరపెట్టే ఒక మంచి కథ "గుండెలో వాన"
  వెల్తుర్ధ్వని - మెహమూద్
  జ్ఞాపకాల సంపుటి చరిత్ర అవుతుంది
  In memory of comrade Pratap (Uday Kumar)
  పాలపుంతల దారిలో..
  టార్చిలైటు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •