కాలంతో న‌డుస్తున్న‌ కవిత్వం

| సాహిత్యం | స‌మీక్ష‌లు

కాలంతో న‌డుస్తున్న‌ కవిత్వం

- శేషు కొర్ల‌పాటి | 16.09.2019 06:01:14pm


కవిత్వంలో వస్తువు ముఖ్యమా శిల్పం ముఖ్యమా అంటే నాకు సంబంధించినంతవరకు వస్తువనే అంటాను. కవి ఎన్నుకున్న వస్తువే ఆ కవిని కొన్ని కాలాల పాటు బ్రతికుండేలా చేస్తుంది, అలాంటి వస్తువులు చాలా ఉన్నాయి ఈ ʹకాలంవాలిపోతున్నవైపుʹ పుస్తకంలో.

నల్లధనం వెలికితీత అని, తీవ్రవాదం తగ్గుతుంది అని పొంతన లేని మాటలు చెప్పి పడిపోతున్న దేశ ఆర్థిక పరిస్థితి నుండి ప్రజల దృష్టిని మల్లిస్తూ రాజ్యం నోట్ల రద్దు చేసిన సమయంలో ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. ఇది అన్యాయం అని అన్న వారిపై అప్పుడు పడిన దేశద్రోహ ముద్రలు తక్కువేం కాదు. సరిగ్గా అదే సమయంలో ప్రభుత్వ విధానాలని వ్యతిరేకిస్తూ మెర్సీ రాసిన కవితలు అప్పటి పరిస్థితులకు అర్థం పడతాయి. అవే కవితలు మెర్సీని కూడా దేశ ద్రోహుల లిస్టులోకి తోసేసాయి. దీనికి తోడు శబరిమల‌లో మహిళల ప్రవేశం పైన తనదైన శైలిలో స్పందించారు కవి. సమాన హక్కులు అడగడం కూడా దేశ ద్రోహమే కదా ఈ కులమతాల కుళ్ళు సమాజంలో.

మనిషి పావురమై ఎంత ఎగరాలనుకున్న తన మెడకి ఎప్పుడూ ఓ తాడు కులం రూపంలో వెళ్ళాడుతూనే ఉంటుందని, సమాజం విధించిన‌ కట్టుబాట్లు దాటినప్పుడు అది ఉరితాడవుతుందని మెర్సీ గారు చెప్పిన విధానం నేటికి కులం పునాదులు ఎంత గట్టిగా ఉన్నాయో తెలియజేస్తుంది.

మనిషికి మనిషికీ మధ్య మొలిచిన గోడలను చూసి బాధపడిన, రద్దైన పాత నోట్లలో శ్రామికుల చెమట వాసన చూడగలిగిన, నెలసరి రోజు అంటరానివాలయ్యే స్త్రీల రక్తంలో అగ్నిపర్వతాలు చూసినా ఆమె శైలి చాల బిన్నంగా కనిపిస్తుంది ఈ పుస్తకంలో , తవ్వడం ఎంత కష్టమో తనకి తెలిసినా గతాన్ని తవ్వి ఆ భారం ఎంతో పాఠకులకి అర్థం అయ్యేలా చేసినా కవ సున్నితమైన మనస్సు ఉన్న కవయిత్రిగా గుర్తుండిపోయేలా చేస్తుంది ఈ పుస్తకం.

ఇది మొత్తానికి సామాజిక కవిత్వం మాత్రమే కాదు తనకంటూ రాసుకున్న కొన్ని కవితలు కవి లోపల మనిషిని మనకి పరిచయం చేస్తాయి, తాను దాటినా ఎన్నో సంఘర్షణలు తాను స్పందించిన తీరు కొత్తగా ఉన్న అది సామాన్య పాఠకులకు కాస్త దూరంగానే ఉంటుందనే చెప్పాలి.





No. of visitors : 240
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వారసత్వం

శేషు కొర్లపాటి | 22.09.2018 12:41:21pm

రక్తంలో తడిసిన మిత్రుడి డైరీని ఎగురుతున్న ఎర్రని జండాని వారసత్వంగా తీసుకున్నాడు ...
...ఇంకా చదవండి

వేటగాడి వల

శేషు కొర్లపాటి | 04.08.2019 12:08:27am

మిత్రమా ఒక్కరొక్కరిగా ఒరిగిపోదామా ఒక్కటై పోరాడదామా కొత్త వ్యూహం వెతుకుదామా వాడి వేటలో అమరులవుదామా!!...
...ఇంకా చదవండి

మనుషుల మాయమవుతారు

శేషు కొర్లపాటి | 16.04.2019 09:55:33am

గంటలు గడుస్తాయి రోజులు మారతాయి మనిషి మాయమైన గుర్తులు చెరిగిపోతాయి...
...ఇంకా చదవండి

పదునెక్కుతున్న కోరలు

శేషు కొర్లపాటి | 04.08.2019 12:00:46am

అన్యాయమన్న గొంతుకు టెర్రరిస్ట్ అనే బోర్డు వేల్లాడదియ్యడమే. బోర్డులు సిద్దమయ్యాయి మెడలు వొంచడం ఇక మిగిలింది...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌
    భారత విప్లవోద్యమంలో చారుమజుందార్ శతజయంతి సదస్సు
    విరసం నాయకుడు జగన్‌పై అక్రమంగా పెట్టిన ఉపా కేసు ఎత్తివేయాలి
    అరుణతార అక్టోబర్ 2019
    మనమూ తేల్చుకోవాల్సిందే
    ఏవోబీ నెత్తురు చిందుతోంది
    అసహజ మరణాలు సమాజానికి హెచ్చరికలు అంటున్న కథ ʹ డోలిʹ
    ఎవరామె?
    స్వైర విహారం
    హిందూత్వసాంస్కృతిక దాడికి వ్యతిరేకంగా సాంస్కృతిక ప్రతిఘటనా దినాన్ని జరుపుకుందాం
    నీకు నేనంటే కోపమెందుకు ?
    రేయి బంగారు మధుపాత్రలు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •