నీకు నేనంటే కోపమెందుకు ?

| సాహిత్యం | క‌విత్వం

నీకు నేనంటే కోపమెందుకు ?

- హబ్బా ఖాతూన్ | 16.09.2019 06:15:58pm

నిన్ను నా నుంచి దూరం చేసిన నా విరోధి ఎవరు?
నీకు నాపై కోపమెందుకు?
కోపాన్ని , అలకని విడిచి పెట్టు.
నా ఏకైక ప్రియునివి నువ్వు
నాపై నీకెందుకు కోపం?.
నాతోటలో రంగురంగుల పూలు పూసాయి
నానుంచి దూరంగా ఎందుకు వెళ్లావు?
ప్రియతమా, నా ఏకైక ప్రియతమా,
నా మదినుండా నువ్వే.
నాపై నీకు కోపమెందుకు?

నడిరేయి దాకా నా తలుపులు తీసి ఉంచాను.
రా, నా వాకిట్లో అడుగు పెట్టు , నా బంగారమా
నా ఇంటిదారి ఎలా మరచిపోయావు?
నాపై నీకు కోపమెందుకు?
ప్రమాణం చేసి చెబుతున్నాను,
సఖుడా, రంగురంగుల దుస్తులు ధరించి నేను నీకోసమే వేచిఉన్నాను.
నా యవ్వనమిప్పుడు నిండుగా విరిసింది.
నాపై నీకు కొపమెందుకు?
విలుకాడా, నువ్వు విసిరే బాణాలకోసం
నా హృదయం తెరచి ఉంది.
ఆ బాణాలు హృదయాన్ని చీల్చివేస్తున్నాయి.
నాపై నీకు ఎందుకు కోపం

వేసవి వేడికి మంచులాగా కరిగిపోతున్నాను
నా యవ్వనమిప్పుడు వికసించింది
ఇది నీ తోటనే , వచ్చి విహరించు.
నాపై నీకు కోపం ఎందుకు?
నేను కోసం కొండల్లో లోయల్లో వెతుకుతున్నాను
నేను నీ కోసం వేకువను నుండి చీకటి దాక గాలిస్తున్నాను.
నేను నీకోసం పసందైన వంటకాలు చేశాను.
నేను నీ కోసం చిక్కిపోతున్నాను
ప్రియతమా, ఏమిటి నా అపరాధం?
నువ్వు నాకోసం ఎందుకు చూడవు?
నాపై నీకు కోపమెందుకు?

నీ వియోగ దుఖం నన్ను బాదిస్తున్నది
కఠీనుడా, నేనా నొప్పిని భరిస్తూనే ఉన్నాను.
నీకు నాపై కొపమెందుకు?
వసంతకాలపు చిరుగాలికి కూడా
నా వేదనని విప్పి చెప్పలేదు
ఎందుకు నన్ను మరచి పోయావు.
నాన్ను ఎవరు చూసుకుంటారు.
నాపై నీకు కోపమెందుకు?

నీపైన ఆన నేనిక బయటకు రాను
వసంతాన్ని చూడను
నా దేహం దహిస్తోంది
వచ్చి ఒదార్చవా?
నాపై నీకు కోపమెందుకు?

లోలోన మూలుగులలోని వేదన ఇది. నేనెవరికీ ఫిర్యాదు చేయను.
నేను నీ కోసం వ్యర్ధమయ్యాను.
అంతులేని కాంక్షలను అణచివేశాను.
నాపై నీకు కోపమెందుకు?

నేను, హబ్బా ఖాతూన్ ని
దుఖిస్తున్నాను.
ప్రియతమా, నేను నిన్ను ఇంకా ఎందుకు కలవలేదు?
రోజు ముగిసిపోతున్నది
అయినా నిన్ను ఎలుగెత్తి మళ్ళీ మళ్ళీ పిలుస్తూనే ఉన్నాను
నాపై నీకు కోపమెందుకు?.

అనువాదం : కరుణాకర్

(కాశ్మీర్ కోయిలగా ప్రసిద్ది చెందినా హబ్బా ఖాతూన్ ఒక పేద రైతు కుటుంబంలో పుట్టింది. ఈమెను జున్ అనికూడా అంటారు. జూన్ అంటే కాశ్మీరీలో వెన్నెల. ఒక ముల్లా సాయంతో చదవడం రాయడం నేర్చుకుంది. చిన్ననాటే ఒక రైతుతో పెళ్లయింది. అది సరిగ్గా నడవలేదు. చివరికి విడాకులతో ముగిసింది. అ సమయంలోనే కాశ్మీర్ యువరాజు యూసఫ్ ఝా చక్ వేటకోసం వచ్చి చినార్ చెట్టుకింద కూర్చుని పాడుకుంటున్న ఖాతూన్ ను చూసాడని, తరవాత వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారనీ ప్రచారంలో ఉన్న ఒక మౌఖిక గాధ. 1570 ప్రాంతంలో ఆమె రాజభవనంలో అడుగు పెట్టింది. యూసఫ్ ఝా కు భార్యగా ఆమె స్తానంపై భిన్నాభిప్రాయాలున్నా మొత్తం మీద వాళ్ళు సంతోషంగానే ఉన్నట్టు తెలుస్తుంది. 1579 లొ అక్బర్ యూసఫ్ ఝాను బీహార్ లో ఖైదు చేశాడు. ఇంక తిరిగి రాలేదు. హబ్బాఖాతూన్ విరాగి అయ్యింది. కాశ్మీర్ లోయ అంతా తిరిగుతూ తన పాటలు కట్టి పాడుకుంది. తన పాతలన్నిటా వియోగ దుఖం , ఎదురు చూపుల విషాదం ధ్వనిస్తాయి. ఆమె కాశ్మీరీ సాహిత్యానికి ʹలోల్ʹ ప్రక్రియను పరిచయం చేసింది. లోల్ ఇంగ్లీష్ ʹలిరిక్ ʹవంటిది. ప్రస్తుతం వేలాది మంది కాశ్మీరీలు ఖాదు చేయబడుతున్న సందర్భంలో హబ్బా ఖాతూన్ ఒట్టి చరిత్ర కాదు వర్తమానం. )

No. of visitors : 499
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌
  భారత విప్లవోద్యమంలో చారుమజుందార్ శతజయంతి సదస్సు
  విరసం నాయకుడు జగన్‌పై అక్రమంగా పెట్టిన ఉపా కేసు ఎత్తివేయాలి
  అరుణతార అక్టోబర్ 2019
  మనమూ తేల్చుకోవాల్సిందే
  ఏవోబీ నెత్తురు చిందుతోంది
  అసహజ మరణాలు సమాజానికి హెచ్చరికలు అంటున్న కథ ʹ డోలిʹ
  ఎవరామె?
  స్వైర విహారం
  హిందూత్వసాంస్కృతిక దాడికి వ్యతిరేకంగా సాంస్కృతిక ప్రతిఘటనా దినాన్ని జరుపుకుందాం
  నీకు నేనంటే కోపమెందుకు ?
  రేయి బంగారు మధుపాత్రలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •