హిందూత్వసాంస్కృతిక దాడికి వ్యతిరేకంగా సాంస్కృతిక ప్రతిఘటనా దినాన్ని జరుపుకుందాం

| క‌ర‌ప‌త్రం

హిందూత్వసాంస్కృతిక దాడికి వ్యతిరేకంగా సాంస్కృతిక ప్రతిఘటనా దినాన్ని జరుపుకుందాం

- హిందూత్వ ఫాసిస్టు దాడి వ్యతిరేక వేదిక | 16.09.2019 06:52:28pm

మోదీ-అమిత్ షాల ద్వయం నేతృత్వంలో బీజేపీ-ఆర్ఎస్ఎస్ రెండవసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, హిందూత్వ శక్తులు మరింత రెచ్చిపోయి అన్ని సెక్షన్ల ప్రజలపై, అన్ని రంగాలలో దాడి చేస్తున్నాయి. దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ఆర్థిక సంక్షోభాన్నీ, నిరుద్యోగాన్నీ మరుగుపరిచేందుకూ, కార్మికుల, రైతుల, ఆదివాసీల, దళితుల, మైనారిటీల హక్కులను కాలరాస్తున్న ప్రజావ్యతిరేక చట్టాల నుండి కళ్ళు కప్పడానికీ 370 అధికరణం రద్దును, ʹమనంʹ ʹవాళ్ళుʹ అనే విభజనను వాడుకొని మళ్ళీ ఒకసారి అంధ దేశభక్తిని, గొప్ప ప్రాచీన హిందూ సంస్కృతి అనే భావాలను, విశ్వాసాలను రెచ్చగొడుతున్నారు.

ఈ ఫాసిస్టు ప్రభుత్వం తన మనువాద హిందూత్వ ఫాసిస్టు దాడిని కొనసాగించడానికి సైన్యం, ఇతర సాయుధ బలగాల ప్రయోగంతో పాటు అన్ని ప్రజాస్వామిక సంస్థలలో, మీడియాలో, సోషల్ మీడియాలో, విద్యాలయాలలో ఒక పథకం ప్రకారం హిందూత్వ వాదులను అధిపతులుగా నియమించుకొని హేతువును తుంగలో తొక్కి విద్యాపరంగా, సాంస్కృతిక పరంగా హిందూత్వ, బ్రాహ్మణీయ సంస్కృతిని వ్యాపింపజేసి ప్రజల మనసులో విష సంస్కృతిని నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు.

బహుముఖీయ హిందూత్వ ఫాసిస్టు దాడిని ఎదుర్కోవాలంటే సాంస్కృతికంగా హిందూత్వ ఫాసిస్టులు చేస్తున్న పలురకాల ప్రయత్నాలను తెలుసుకోవాలి. సాంస్కృతిక ప్రతిఘటనను నిర్మించాలంటే ఏయే రూపాల్లో, ఏ విషయాలను కేంద్ర బిందువుగా తీసుకోవాలో అర్థం చేసుకోవాలి.

సాంస్కృతికంగా ప్రజల మనసులను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి దేశభక్తి భావనను, ప్రాచీన సంస్కృతి పేరుతో అంధ విశ్వాసాలను దైవభక్తి మత్తును, పితృస్వామిక విలువలను, కుల ఆధిపత్య భావజాలాన్ని, పరమత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాయి. దేశభక్తి భావనను రెచ్చగొట్టడంలో, సైన్యం పట్ల, సాయుధ బలగాల పట్ల ఆరాధనా భావాన్ని టెలివిజన్ మీడియా, సినిమాలు విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. సైన్యం, పోలీసులు ప్రజా ఉద్యమాలపై చేస్తున్న దాడులను విమర్శించే మేధావులను అర్బన్ నక్సలైట్లనే నింద మోపి ప్రచారం చేస్తున్నారు.

మన దేశంలో విభిన్నమైన, వైవిధ్యభరితమైన వివిధ జాతుల, మతాల, ప్రాంతాల సంస్కృతిని కాలరాచే విధంగా హిందీ భాషను, హిందూ సంస్కృతిని అందునా ఏకశిలా సదృశమైన సంస్కృతిని రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒకే దేశం, ఒకే జాతి పేరుతో ఈ దేశం లోని బహుళ జాతుల అస్తిత్వాన్నే నిరాకరించి ఏకోన్ముఖమైన సంస్కృతిని, అదీ ఉత్తర భారత హిందూ సంస్కృతిని మనువాద హిందూత్వ సంస్కృతిని అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అధికారాల పీఠాల నుండి చేసే దాడికన్నా సాంస్కృతికంగా చేస్తున్న దాడి మరింత ప్రమాదకరమైనది. అది ప్రజల మనసుల్లో క్రమంగా విషం నింపుతుంది. హేతువు స్థానంలో అంధవిశ్వాసాన్ని నింపుతుంది. ʹమనంʹ, ʹవాళ్ళుʹ అనే విభజనతో వివిధ రకాల కుల, మత, జాతి, పితృస్వామిక, ఆధిపత్య భావజాలాన్ని మెదళ్ళలోకి ఎక్కిస్తుంది. ʹఇతరులʹ హక్కుల పట్ల చిన్న చూపు, వారి పట్ల హీన భావనను పెంపొందించి వాళ్ళను తమ ఆధిపత్యంలోకి తెచ్చుకోవడానికి ఏమైనా సరే చేయవచ్చనే ఉన్మాదాన్ని రెచ్చగొడుతుంది. అందుకే హిందూత్వ మూకలు ఎటువంటి జంకు గొంకు లేకుండా మూకదాడులకు, హత్యలకు పాల్పడుతున్నాయి.

గుజరాత్ లోని ఉనా నుండి ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నావ్, ఉత్తరప్రదేశ్ లోని దాద్రి నుంచి రాజస్థాన్ లోని ఆల్వార్ దాకా, దళితులని బహిరంగంగా కొరడాలతో కొట్టడం నుండి పేద ముస్లింలను కొట్టి చంపడం వంటి సంఘటనలు హిందుత్వ శక్తుల పాశవిక దాడుల స్వభావానికీ, బహిరంగ దాడులు, హత్యలకు పాల్పడిన హంతకులు ఎలాంటి జంకు, గొంకులేకుండా నడయాడగలిగిన వాతావరణానికీ అడ్డంపడుతున్నాయి. దభోల్కర్, పన్సారే, కల్బుర్గి, గౌరీ లంకేష్ ల హత్యలు హేతువు పైన, హేతుబద్ద ఆలోచన పైన హంతక దాడులకి నిదర్శనంగా నిలుస్తాయి. అధికారాన్ని కైవశం చేసుకోవడంతో పాటు, పత్రికలు, దృశ్య మాధ్యమలపై నియంత్రణ ద్వారా వ్యవస్థలోని అన్ని అంగాల పైనా, సంస్థల పైనా పట్టు సాధించారు. ఇందులో కుట్ర పూరిత చర్యలతో పాటు, బెదిరింపులు కూడా పాత్ర నిర్వహించాయి. సామాజిక మాధ్యమాలలో చాలాకాలంపాటు హిందుత్వ శక్తులు చేసిన, చేస్తున్న కృషి ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. తప్పుడు వార్తలు, అబద్ధాల ప్రచారంతో సానుభూతి సంపాదించే ప్రయత్నాలు, విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రశ్నించిన వారిని ట్రోలింగ్తో నూరు మూయించడం, బెదిరించడం వంటివి ఈ సుదీర్ఘ కృషిలో భాగమే. వ్యూహాత్మకంగా, ఒక ప్రణాళిక ప్రకారం, ఓపికగా సుదీర్ఘ కాలంపాటు జరిపిన తమ కృషి ద్వారానే హిందుత్వ శక్తులు ప్రస్తుత స్థాయికి చేరుకోగలిగారని మనం అర్ధం చేసుకోవాలి. సాంస్కృతిక రంగంలో వాళ్ళు చేసిన ఈ కృషి వివిధ స్థాయిలలో పని చేస్తుందని గుర్తించాలి. తప్పుడు ప్రచారంతో సానుభూతి, సమర్ధనలు సంపాదించడం, విద్వేష ప్రచారం ద్వారా సున్నితత్వాన్ని దెబ్బతీసి, అమానుష చర్యలకి పాల్పడేలా పురికొల్పడం, ʹఇతర మతాలకి, విశ్వాసాలకి చెందిన వారిని హింసాయుత దాడులతో భయ పెట్టడం, అంతిమంగా హేతు బద్ధంగా ఆలోచించి ప్రశ్నించే వాళ్ళని అంతం చేయడం -- ఈ కృషిలో అంతర్భాగం. హిందుత్వ శక్తులను ప్రతిఘటించాలంటే, వాళ్ళ సాంస్కృతిక కృషికి సంబంధించిన వివిధ కోణాలనూ, స్థాయిలనూ మనం గుర్తించి, అర్ధం చేసుకోవాలి. . చాపకింది నీరులా ప్రజల మనస్సులలోకి హిందూత్వ భావజాలాన్ని చొప్పించడానికి సంఘ్ పరివార్ శక్తులు వివిధ హిందూ పండగలను ఉపయోగించుకుంటున్నాయి. ముఖ్యంగా నగరాల్లో కొత్త దేవుళ్ళను సృష్టిస్తున్నారు, కొత్త పండగలను కనిపెడుతున్నారు. గతంలో తమ తమ మత విశ్వాసానికి అనుగుణంగా చాలా మేరకు ప్రైవేటుగా జరుపుకునే పండగలను ప్రజలను కదిలించి పెద్ద ఎత్తున సామూహికంగా, ఆడంబరంగా చేసి వారికి తెలియకుండానే వారిలో దైవభక్తి ముసుగులో హిందూత్వ ఉన్మాద భావజాలాన్ని కొన్ని చోట్ల మత విద్వేష దాడులను రేకెత్తించడానికి ఈ సందర్భాలను ఉపయోగించుకుంటున్నాయి.

ఈ హిందూత్వ ఏకోన్ముఖ ఆధిపత్య సంస్కృతికి వ్యతిరేకంగా ప్రతి-సంస్కృతినిʹ (కౌంటర్ కల్చర్) కూడా ప్రోత్సహించాలి, ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించడానికి కృషి చేయాలి.

15-16వ శతాబ్దంలో భక్తి ఉద్యమంలో ప్రముఖ గురువు, బ్రాహ్మణీయ కుల వ్యవస్థపై ఆనాటి స్థలకాలాదులు విధించిన పరిమితుల్లో పోరాడిన వాడు, దళిత అస్తిత్వ చైతన్యానికి ఒక ప్రముఖ ప్రతీకగా ఈనాటికీ ఉన్న సంత్ రవిదాస్ ఆశ్రమాన్ని కూల్చివేయడం, దానికి నిరసన తెలిపిన వేలాది మంది దళితులకు నాయకత్వం వహించిన వారిని అరెస్టు చేయడం కూడా ఈ ఏకోన్ముఖ ఆధిపత్య సంస్కృతిలో భాగమే. ఇందులో సుప్రీం కోర్టు కూడా బ్రాహ్మణీయ భావజాలంతో రవిదాస్ ఆశ్రమాన్ని కూల్చివేయాలని ఆదేశమిచ్చి హిందూత్వ మనువాద పథకంలో ఒక భాగమైంది.

హిందువులంతా ఒకటేనంటూ ఆర్ఎస్ఎస్ పైకి ఎంత ప్రచారం చేసినా, హిందూ మతానికి మూల స్తంభమైన నిచ్చెన మెట్ల కులవ్యవస్థ మీద హిందూత్వ వాదులందరికీ ప్రగాఢ విశ్వాసం. అందుకే కులాధిపత్య హత్యలు పెరిగిపోతున్నాయి. మతాంతర వివాహాలు చేసుకునే వారిమీద లవ్ జిహాద్ అంటూ దాడులు చేస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా, కులవ్యవస్థ నిర్మూలన కోసం సమానత్వ, సమతా భావాలను పంచేలా, పెంచేలా మనం సంస్కృతీ నిర్మాణం చేయవలసి ఉంది.

అనాదిగా ప్రజా కళలు శ్రమతో అనుసంధానమై ఉండి శ్రమజీవులకు పనిలోనూ, విశ్రాంతిలోనూ, దుఃఖం లోనూ,సంతోషంలోనూ తమ భావ వ్యక్తీకరణ రూపాలుగా ఉన్నాయి. ఆ కళా రూపాలలో ఉన్న ఫ్యూడల్ సంసృతీ, భావజాలాల అంశాలను తీసివేసి ప్రజా ఉద్యమాలు, విప్లవోద్యమాలు కొన్ని దశాబ్దాలుగా బలమైన విప్లవ, ప్రగతిశీల సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించాయి. కానీ ఆ ఉద్యమాలు కొంత బలహీన పడి, సామ్రాజ్యవాద సంస్కృతి పెరుగుతున్నకొద్దీ ఈ కళారూపాల వ్యాపారీకరణ పెరిగి వాటిని టివి ఛానల్లకు, ప్రభుత్వాల ప్రచారాలకు ఉపయోగించుకుంటున్నారు. ఈ కళా రూపాలను మళ్ళీ ప్రగతిశీల భావజాలంతో, ఆ సారంతో నింపి ప్రజలకు అందుబాటులోకి తేవాలి.

హిందూత్వ విష సంస్కృతికీ, సామ్రాజ్యవాద సంస్కృతికీ వ్యతిరేకంగా అన్ని రంగాలలో ప్రతిఘటనతో పాటు సాంస్కృతిక ప్రతిఘటనను పెంపొందించకుండా, ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించకుండా, వైవిధ్యభరిత బహుళ సంస్కృతిని ఎత్తిపట్టకుండా హిందూత్వ ఫాసిస్టు దాడిని, మనువాద సంస్కృతిని ఓడించలేము.

ఆ ప్రయత్నంలో భాగంగా హిందూత్వ ఫాసిస్టు దాడి వ్యతిరేక వేదిక ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక సంఘాలు సెప్టెంబర్ 22వ తేదీన సాంస్కృతిక ప్రతిఘటనా దినంగా జరుపుతున్నాయి. సాంస్కృతిక ప్రతిఘటనా ఉద్యమం నిర్మించడంలో ఇది మొదటి అడుగు మాత్రమే. ఇందులో అందరూ భాగస్వామ్యులై విజయవంతం చేయవలసిందిగా కళాకారులందరికీ, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.

స్థలం: సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి

సమయం : ఉ. 10 గం||ల నుండి రాత్రి 9గం|| వరకు

హిందూత్వ ఫాసిస్టు దాడి వ్యతిరేక వేదిక

ప్రజా కళా మండలి, అరుణోదయ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, అరుణోదయ (ACF), రేలా, PALA, RCF, నిశాంత్ నాట్స్ మంచ్, AIM - సాంస్కృతిక విభాగం, లాల్ లాంతన్, సాంస్కృతిక్ ఉద్యోగ్

No. of visitors : 238
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?
  ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
  అరుణతార నవంబర్ 2019
  నరʹసింహం!ʹ
  విశ్వకర్మ(బ్రాహ్మల)లు-ఒక వైరుధ్యం.
  ʹబహుముఖ దార్శనికుడు - బహుజన తాత్వికుడు వీరబ్రహ్మంʹ పుస్తకం..
  గుండెలో వాన కురిపించి, మనన్సుని కలవరపెట్టే ఒక మంచి కథ "గుండెలో వాన"
  వెల్తుర్ధ్వని - మెహమూద్
  జ్ఞాపకాల సంపుటి చరిత్ర అవుతుంది
  In memory of comrade Pratap (Uday Kumar)
  పాలపుంతల దారిలో..
  టార్చిలైటు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •