స్వైర విహారం

| సంభాషణ

స్వైర విహారం

- మెట్టు రవీందర్ | 16.09.2019 07:05:59pm


భక్తి అనే పదం హేతురాహిత్యానికి, మూఢత్వానికి సంబంధించినదే అయినా దేశభక్తి అనే పదబంధానికి ప్రజాశ్రేణుల్లో ఇంకా సానుకూలార్ధమే ఉన్నది. దేశభక్తి అనగానే దేశం పట్ల ప్రేమగానే, అభిమానంగానే ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. కనుకనే సంఘ్ పరివార్ కు దేశభక్తి అనే అస్త్రమే అన్ని అస్త్రాల్లోకెల్లా శక్తివంతమైన పనిముట్టుగా అందివస్తోంది. అది ప్రజాశ్రేణుల్లో, బౌద్ధికశ్రేణుల్లో వాళ్ళ మెదళ్లను ప్రభావిత పరిచి భ్రమల్లో ముంచెత్తుతోంది.

ప్రజల నిజజీవితంతో సంబంధం లేకుండా దేశభక్తి, జాతీయత భావనలను పవిత్రీకరించి కీర్తిస్తూ ఒక రకమైన మాయాజాలంలో పడవేయడం సంఘ్ పరివార్ కు వెన్నతో పెట్టిన విద్య. దైవ భక్తి విషయంలో భక్తులు తమతమ అస్తిత్వ, అహాలను వదులుకొని సర్వస్వాన్ని భగవంతునికి సమర్పించుకోవాలని చెప్పినట్లుగానే దేశభక్తి విషయంలో ప్రజలు కూడా తమతమ వ్యక్తిత్వాస్తిత్వాలను దేశాధి నేతలకు అర్పించుకోవాలని సంఘ్ పరివార్ చెపుతుంది. అలా అర్పించుకోవడమే అసలైన దేశభక్తి అని ఉద్బోధిస్తుంది. అంతే కాదు రాచరికంలో రాజు దైవాంశసంభూతుడు అన్నట్టుగా నేటి ఆధునిక ప్రజాస్వామ్య కాలంలోనూ రాజకీయాధినేతే దైవాంశసంభూతుడని భావిస్తుంది. ఇటువంటి అశాస్త్రీయాలోచనలకు మూలం ఒకనాడు రాచరికంలో భూస్వామ్యం కాగా నేటి కాలం లో సామ్రాజ్యవాదాధిపత్యం. ఆ సామ్రాజ్యవాదానికి బేషరతుగా తలొగ్గి మిలాఖత్ అయిన దళారీ భూస్వామిక ప్రతినిధులే ఈ దేశ పాలకులవుతున్నారు. అలాంటి వారే దేశభక్తి అనే పదబంధాన్ని రాజకీయాధికారం కోసం వాడుకుంటున్నారు.

అయితే నేటి ఆధునిక కాలంలోనూ దేశభక్తి అనే హేతురాహిత్య పదబంధం ప్రజలను ఎందుకు ఆకర్షిస్తోంది ? ఎందుకంటే స్వాతంత్ర్య పోరాటానంతర కాలం నుండి మన దేశ పాలకులకు తమదైన వెన్నెముక, సొంత వ్యక్తిత్వాలు లేవు. కనుకనే మన దేశం తనదైన స్వతంత్ర అభివృద్ధినమూనాను రూపొందించుకోలేకపోయింది. తనదైన రీతిలో ఆధునికీకరణ క్రమాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయింది. సామ్రాజ్యవాదానికి లొంగిపోయి తన స్వతంత్రత సార్వభౌమాధికారాలను వదులుకొని దళారీ పాలక వర్గాల ఏలుబడిలో ఉన్నందువల్ల మన దేశంలో నిజానికి ప్రజాస్వామ్యం లేదు, ఆధునికతా లేదు. ఉన్నదల్లా పితృస్వామిక బ్రాహ్మణీయ కుల వ్యవస్థ పునాదిగాగల దోపిడీ వర్గ వ్యవస్థే. ఇటువంటి వికృతాధునికతా వ్యవస్థలో ప్రజాస్వామ్యంతో సహా అన్నీ వికృతంగానే ఉంటాయి. ఆ వికృతత్వాన్ని కప్పిపుచ్చటానికే పాలకులు దేశభక్తిలాంటి అందమైన పదబంధాలను ముసుగుగా ఉపయోగించుకుంటారు. అందుకే దేశభక్తి, అభివృద్ధి, జాతీయతల యీ స్వైరవిహారం ! ఫలితం సమత, హేతుబుద్ధి, శాస్ర్తీయతల హననం !! మూఢత్వం, విస్థాపన, పరాధీనతల హాలాహలం !!!

No. of visitors : 434
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..
  ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీల జీవితాలు మారుతాయoటున్న శీలా సుభద్రాదేవి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •