ఎవరామె?

| సాహిత్యం | క‌విత్వం

ఎవరామె?

- కేక్యూబ్ | 16.09.2019 07:18:25pm

Poetry is thoughts that breathe, and words that burn. Thomas Gray.

కవిత్వం కవి జీవన నేపథ్యంలోంచి రూపుదిద్ధుకున్నప్పుడు అది జీవితపు పచ్చదనంతో పాటుగా అందులోని సంఘర్షణను సజీవంగా శ్వాసిస్తుంది.

పాతికేళ్ళయినా యింకా ఆ పోరాట స్ఫూర్తి, ఆ నెత్తుటి గాయం నెల్లిమర్ల నుండి సజీవంగా మనలని తాకుతూనే వుంటుంది. జూట్ మిల్లు కార్మికుల సంఘటిత పోరాటానికి భయపడి ఆనాడు పోలీసులు జరిపిన కాల్పులలో అమరులయిన ఐదుగురు కార్మికులతో పాటుగా అనేక మంది గాయాలపాలయి దుర్భరమైన జీవితాన్ని ఇప్పటికీ అనుభవిస్తున్న దైన్యం మనల్ని వెంటాడుతూనే వుంది. రాజ్యమెప్పుడూ యజమాని పక్షమే అన్నది ఎప్పుడూ రుజువవుతూనే వుంటుంది.

నిత్యమూ ఆ కార్మికుల జీవితాలతో అనుబంధమున్న ఉపాధ్యాయుడుగానే కాక తన తండ్రి కూడా అదే మిల్లు కార్మికుడుగా పనిచేసి తనకు బతుకుతోవ కావడం మొయిద శ్రీనివాస్ కవిత్వంలో ఆ గాయాల సలపరం, వేడి కొనసాగుతూ వస్తోంది. దానికి తన మార్క్సిస్టు అధ్యయనం తోడు కావడంతో తన కవిత్వంలో కార్మిక వర్గ విముక్తి మార్గం ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. కవిత్వానికి సిద్ధాంత బలం తోడయితే అది ఒక దిక్సూచిగా ఎల్లవేళలా వెంటాడుతూ జీవకళనిస్తుందనేందుకు మరో ఉదాహరణ శ్రీనివాస్ కవిత్వం. కార్మిక వర్గ జీవితాలనే వారి నిత్య చలన సంబంధ పద చిత్రాలనే ఎన్నుకుంటూ కవిత్వాన్ని రూపుకట్టడం ఒక ప్రత్యేకతగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే కవిత్వం తక్కువగా వున్న సమయంలో యిది గొప్ప ఊరటనిచ్చే అంశం.

ఈనాటి దేశ ఆర్థిక సంక్షోభ సమయంలో లక్షలాదిమంది కార్మికులు పొట్ట చేత పట్టుకొని రోడ్డున పడుతున్నారు. అక్రమ లాకౌట్లు, నిర్బంధ మిల్లుల మూత, కార్మికుల హక్కులను హరించే చట్టాలతో విరుచుకుపడుతున్న ప్రభుత్వాలు, పెట్తుబడిదారులకు అనేక రకాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వాలు మూత పడ్డ పరిశ్రమలను తెరిచేందుకు ముందుకు రాకపోవడం, సంఘాలుగా ఏర్పడ్డ కార్మికులకు సమ్మె చేసే హక్కు కూడా లేకుండా చేస్తున్న సెజ్ ల ఏర్పాటు ఇలా రక రకాలుగా కార్మికుల పొట్ట గొడుతున్న ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల బారిన పడి వీధిన పడుతున్న కార్మికుల జీవితాలు అతలాకుతలమవుతున్న తీరును శ్రీనివాస్ మాస్టారు సరళమైన పద చిత్రాలతో మనముంధుంచుతారు. నిరుపేద కార్మిక స్త్రీల జీవితం ఎవరామె కవితలో చిత్రించిన తీరు హత్తుకుంటుంది. కుటుంబంలోని సంఘర్షణ బరువు బాధ్యతలను స్త్రీగా ఒకవైపు మోస్తూనే తెల్లవారి లేచి ఫ్యాక్టరీకి పరుగులెత్తే వారి జీవన క్రమాన్ని ఇందులో చూపారు.

వేకువ...
పత్తి పువ్వై విచ్చుకోక మునుపే
నిన్న ఆకాశదండెంపై...ఆరేసిన
చీకటి వస్త్రాలను చుట్టుకొని
ఆదరా బాదరాగా
బస్సెనక పరిగెడుతోంది
ఎవరామె?

తనెంతగా పరుగెత్తినా సమయానికి ఒక నిమిషం ఆలస్యమైనా దారుణమైన సూటిపోటి మాటలతో గుచ్చే యజమానుల బంటుల వైఖరిని పళ్ల బిగువున అదిమి పట్టుకొని పనిలోకి చేరే వారి యాతన యిలా వర్ణిస్తారు.

అరక్షణపు ఆలస్యం
సూటిపోటు మాటల
సూదై గుచ్చుకుంటుంటే
చిందిన దుఃఖపు బిందువులను
పంటిబిగువున భరిస్తూ
ఆగని కుట్టు మిషనై...సాగుతోంది
ఎవరామె?

ఎక్కడా జీవితాన్ని దాటిపోని పదబంధాలతో అల్లిక చేయడం కవిత్వానికి ఒక ప్రత్యేకతనిస్తుంది కదా. ఎంత అలసటకు గురైనా తనకిచ్చిన టార్గెట్ పూర్తి చేయాలన్న పట్టుదల ముందు ఆకలి ఓడిపోతుంది. నిత్య కృత్యాలకు అవకాశమివ్వని పెట్టుబడి కౄరత్వం కవితలో మనల్ని ఆవేదనకు ఆగ్రహానికి గురిచేస్తుంది.

చిరిగిన బతుకు బట్ట..కుట్టుకై
చాలని దారంలా... జీతం
పనిలో ప్రక్రృతావసరాలకు సైతం
కాలు మడుచుకొనే తీరికలేనితనం
నీరసమై ఆవహిస్తుంటే
టార్గెట్లను పూర్తిచేస్తోంది
ఎవరామె?

ఇన్ని కష్టనష్టాలకు ఓర్చుకుని యజమానికి లాభాలను చేకూర్చే కార్మికులను అక్రమ లాకౌట్లతో వీధిన పడేసే కుట్ర కొనసాగుతూనే వుంది. యిటీవల విశాఖలోని బ్రాండెక్స్ కంపెనీ దారుణాలకు వ్యతిరేకంగా మహిళా కార్మికులు చేపట్టిన సమ్మెకు సంఘీభావంగా రాసినది ఈ కవిత.

ఎవరామె...?

వేకువ...
పత్తి పువ్వై విచ్చకోకమునుపే
నిన్న ఆకాశదండెంపై...ఆరేసిన
చీకటి వస్త్రాలను చుట్టుకొని
ఆదరా బాదరాగా
బస్సెనక పరిగెడుతోంది
ఎవరామె?

నిద్ర గూటిలోని పిల్లలపై
మనసు దుప్పటిని కప్పి
ఖాళీ దారపు ఉండై
కంగారుగా కదులుతూ
ఫుట్ బోర్డ్ పై తూలి
లంచ్ బాక్సై జారిపడుతోంది
ఎవరామె?

అరక్షణపు ఆలస్యం
సూటిపోటు మాటల
సూదై గుచ్చుకుంటుంటే
చిందిన దుఃఖపు బిందువులను
పంటిబిగువున భరిస్తూ
ఆగని కుట్టు మిషనై...సాగుతోంది
ఎవరామె?

చిరిగిన బతుకు బట్ట..కుట్టుకై
చాలని దారంలా... జీతం
పనిలో ప్రక్రృతావసరాలకు సైతం
కాలు మడుచుకొనే తీరికలేనితనం
నీరసమై ఆవహిస్తుంటే
టార్గెట్లను పూర్తిచేస్తోంది
ఎవరామె?

ఆపత్కాలపు పి.ఎఫ్ ఆʹదారాన్నిʹ
కాసులను కూడగట్టడానికై
ఓ కత్తెర...ఉత్తరిస్తుంటే
అసహనమై రగిలి
సామూహికమై కదిలి
సమ్మై జండాయై ఎగురుతోంది
ఎవరామె?

మొయిద శ్రీనివాస్.

No. of visitors : 442
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆకు క‌ద‌ల‌ని చోట వ‌ర్షించిన క‌విత్వం

కేక్యూబ్ వ‌ర్మ‌ | 20.10.2016 12:53:32am

ఒకమారుమూలపాఠశాలఉపాధ్యాయుడు ఈ నిశ్శబ్దాన్నిభరించలేక ఈ ఉక్కపోతనుధిక్కరిస్తూతనచుట్టూవున్నఆకుకదలనితనాన్నికవిత్వంగామనముందుఆవిష్కరించినదే ఈ సంకలనం.......
...ఇంకా చదవండి

ఆ పావురాలు!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 02.01.2017 11:39:40pm

ఒలికిన నెత్తురు అద్దిన జెండానందుకుంటూ గుంపుగా ఆ పావురాలు! ...
...ఇంకా చదవండి

తెలవారని ఆకాశం!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 07.12.2016 11:52:30am

కొన్ని మంచు బిందువులేవో రాతిరి కురిసిన వాన చివుళ్ళ నుండి రాలుతూ రెక్కల చాటున ముఖం దాచుకున్న పక్షి టపటప రెక్కలల్లారుస్తూ ఎగరబోతూ...
...ఇంకా చదవండి

నమస్కరిస్తూ..

కేక్యూబ్ వ‌ర్మ‌ | 04.09.2017 11:18:59am

కళ్ళకు గంతలు కట్టుకొన్నదని మీ న్యాయ దేవత ముందు నగ్నంగా నిలబడిన ఆ పదముగ్గురూ విడిచిన లజ్జను మీ మఖంపై నెత్తుటి ఉమ్ముగా ఊసి!...
...ఇంకా చదవండి

జీవ‌సూత్రాన్ని చెప్పే చింతా అప్పలనాయుడు ʹదుక్కిʹ

కెక్యూబ్‌ వర్మ | 16.06.2018 09:22:29am

కవితలనిండా రైతు జీవన చిత్రమే. ఒక దు:ఖార్తితో కొనసాగుతుంది. కురవని వానలు కలసిరాని కార్తెలు అప్పుల ఊబిలు కాడెద్దులను దూరం చేసే యంత్రాల దాష్టీకం అక్కరకు రాని ప...
...ఇంకా చదవండి

దక్షిణ యాత్ర

కెక్యూబ్ వర్మ | 04.06.2017 01:12:22pm

నీ ఒంటి రంగును హేళన చేసి నిన్ను బానిస చేసుకో చూస్తున్నాడు నీకంటూ మిగిలిన ఆఖరి అవకాశం నిన్ను నువ్వు జెండాగా ఎగురవేయడమే!!...
...ఇంకా చదవండి

గులాబీ!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 17.04.2017 11:32:19am

వాడెంత విధ్వంసం చేసినా నీ పసివాడి చేతిలో గులాబీ విచ్చుకుంటూ వాడిని భయపెడుతూనే వుంది!!...
...ఇంకా చదవండి

కుందాపన

కెక్యూబ్ వర్మ | 04.01.2018 01:31:58pm

ఈ కవిత్వం నిండా పరచుకున్న దాహం ఒంటరితనం.సమూహంలో తను నిలబడ్డ చోటు ఒంటరిగా ఒక దీపపు సమ్మెకింద నీడలా వెంటాడడాన్ని మనకనుభవంలోకి తెస్తుంది.కలసి నడవాల్సిన దారు......
...ఇంకా చదవండి

మస్వాల్..

కెక్యూబ్ వ‌ర్మ‌ | 03.09.2016 12:37:26am

మరుగుతున్న మంచు తెరలుగా విడిపోతూ రాలిపోతున్న మస్వాల్ పూలెన్నో ఇప్పుడిక్కడ ఒకటే హృదయ ఘోష ఆజాదీ ఆజాదీ .......
...ఇంకా చదవండి

ఒంటరి వెన్నెల

కేక్యూబ్ వ‌ర్మ‌ | 07.05.2016 08:29:33am

ఈ ఇప్ప పూల వనం రాలిపోతూ నిబ్బరాన్ని వదిలి నివురు కప్పుకుంది తూరుపింకా తెలవారక నీ పేరు తలుస్తూ పొలమారుతొంది...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..
  ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీల జీవితాలు మారుతాయoటున్న శీలా సుభద్రాదేవి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •