యాభై ఏండ్ల విర‌సం - ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాలు

| సంపాద‌కీయం

యాభై ఏండ్ల విర‌సం - ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాలు

- క్రాంతి | 02.10.2019 08:44:27am

సాహిత్య రంగంలో వర్గ పోరాటానికి యాభై ఏండ్లు. 1970 జూలై 4 రోజువారి తేదీ కాదు. సాహిత్యంలో విప్లవం మొద‌లైన రోజు. చ‌రిత్ర సాహితీకారుల‌పై మోపిన బాధ్య‌త అది. సాంఘిక, సాంస్క తిక అణచివేతలకు వ్య‌తిరేకంగా మొద‌లైన వ‌ర్గ‌పోరాటాన్ని సాహిత్య‌, క‌ళా రంగాల్లో ఎత్తి ప‌ట్టిన విర‌సం తెలుగు స‌మాజంపై చెర‌గ‌ని ముద్ర‌వేసింది.

అది నక్సల్బరీ ఇచ్చిన చూపు. ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచనకు విప్ల‌వోద్య‌మం ఇచ్చిన స్ఫూర్తి. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మ‌ళ్లీ మ‌ళ్లీ ఫీనిక్స్‌లా పైకిలేస్తున్న విప్ల‌వోద్య‌మం అది. అలా... తిరిగి తిరిగి వచ్చిన నక్సల్బరీ శ్రీకాకుళాన్ని రగిలించింది. తెలంగాణను మండించింది. దండకారణ్యంపై రెప‌రెప‌లాడింది. ఈ న‌డుస్తున్న చ‌రిత్ర వెంట అక్ష‌రాలై క‌లిసి సాగిన ప్ర‌యాణం విర‌సంది.

పార్ల‌మెంట‌రీ రాజ‌కీయాల‌తో తెగ‌దెంపులు చేసుకున్న న‌క్స‌ల్బ‌రీ ఉద్య‌మం బూర్జువా రాజకీయాల స్థానంలో ప్రజా ప్రత్యామ్నామంగా వర్గ పోరాట రాజకీయాలను తెచ్చింది. మావోయిస్టు పార్టీగా రూపొంది 15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆ పోరాటం ఇవాళ దేశానికి మిగిలిన ఏకైక ఆశ‌. సాంస్కృతిక రంగంలో ఆ ప్రజా విముక్తి రాజకీయాలను ఎత్తిపట్టడంలో విర‌సం త‌నదైన పాత్ర పోషిస్తోంది.

విర‌సం నక్సల్బరీకి సాంస్కృతిక ప్రతినిధిగా సాహిత్యంలో ధిక్కారానికి ప్రతీకగా నిలిచింది. భారత రాజకీయాల్లో ప్రత్యామ్నాయాలను ప్రతిపాధించిన న‌క్స‌లైట్ రాజ‌కీయాల‌ను ప‌దునైన క‌లంతో సాహిత్య‌, మేధోరంగంలో ప్ర‌చారం చేసింది. చ‌రిత్ర‌ను నిర్మిస్తున్న విప్ల‌వోద్య‌మం వెంట గ‌తితార్కికంగా మ‌మేక‌మై న‌డ‌క సాగించింది. అందుకే... సాహిత్యాన్ని ప్ర‌జ‌ల ప‌రం చేసింది. ప్ర‌జా పోరాటాల‌ను ఉద్య‌మాల‌ను సాహిత్యీక‌రించింది. పాట‌, క‌విత‌, క‌థ‌, విమ‌ర్శ‌, నాటిక ఇలా అన్ని ప్ర‌క్రియ‌ల్లోనూ ప్ర‌జా రాజ‌కీయాల‌ను ఎత్తిప‌ట్టింది. సృజ‌న‌కారుడు ఎప్పుడూ ప్ర‌జ‌ల ప‌క్ష‌మే అని నిర్ధ్వంధంగా ప్ర‌క‌టించింది.

సామాజిక వైరుద్యాలను విశ్లేషించ‌డంలో మార్క్సిస్టు లెనినిస్టు దృక్ప‌థంతో ముందుకు సాగింది. అడివిని మైదానానికి అనుసంధానం చేసింది. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఆకాశ‌పు దారులెంట ప‌య‌నించే సాహిత్యాన్ని భూమార్గం ప‌ట్టించింది. తెలుగు నేల‌పై ఎగిసిన అన్ని అస్థిత్వ సాహిత్యోద్య‌మాల‌పైనా విరసం ప్రభావం ఉంది. ఒక్క తెలుగు నేలపైనే కాదు విరసం దేశం దేశమంతా తన ప్రభావాన్ని వేయగలిగింది. సమకాలీన స‌మాజంలో వైరుద్యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు శాస్త్రీయంగా విశ్లేషించ‌డంలో విర‌సం ముందు నిలిచింది.

సాహిత్య, మేధో రంగాల్లో భావ సంఘ‌ర్ష‌ణ‌కు విర‌సం కేంద్ర‌గా నిలిచింది. నిత్య నూత‌నంగా విస్త‌రించుకుంది. సృజ‌నాత్మ‌క ధిక్కారానికి ప‌తాక అయిన విర‌సానికి నూత‌న మాన‌వుడి ఆవిష్క‌ర‌ణ‌ను క‌ల‌గంటున్న విప్ల‌వోద్య‌మ‌మే నాడీ మండ‌లం. శ్రీకాశుళం నుంచి ఉత్త‌ర తెలంగాణ మీదుగా దండ‌కార‌ణ్యానికి విస్త‌రించిన మావోయిస్టు ఉద్య‌మ నాయ‌క‌త్వంలో న‌డుస్తున్న ప్ర‌త్యామ్నాయ ప్ర‌జా రాజ్యమే ఈ సాహిత్యోద్య‌మాన్ని నిత్య జ్వ‌లింప‌జేస్తోన్న ఇంద‌నం.

ప్ర‌జాస్వామ్య‌మంటే మెజారిటేరియ‌నిజంగా మారిన వ‌ర్త‌మాన సంద‌ర్భంలో, బ్రాహ్మ‌ణీయ హిందూ ఫాసిజం వేయి ప‌డ‌గ‌ల విష‌పు నాగులా బుస‌లు కొడుతున్న వ‌ర్త‌మాన సంద‌ర్భంలో అధికారాన్ని, ఆధిప‌త్యాన్ని ధిక్క‌రించే త‌న ప‌రంప‌రను నేటికీ కొన‌సాగిస్తోంది విర‌సం. క‌ష్ట‌జీవికి ఇరువైపులా నిల‌బ‌డేది వ‌ర్గ‌పోరాట రాజ‌కీయాలే అని రుజువు చేస్తోంది.

ఈ యాభై ఏండ్లలో ఎన్నో నిర్భందాలను ఎదుర్కొన్న విర‌సం.. ప‌దునెక్కుతున్న సృజనాత్మక ధిక్కార ప‌రంప‌ర‌ను ఎత్తిప‌డుతూ 2020 జనవరి 11, 12 తేదీల్లో హైదరాబాదులో 50 ఏళ్ల మహా సభలు జ‌రుపుకోనుంది. ఈ సంద‌ర్బంగా ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాల కేంద్రంగా ఈ ప్ర‌త్యేక సంచిక‌ను పాఠ‌కుల‌కు అందిస్తోంది.





No. of visitors : 196
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

సంఘ‌ర్ష్‌ | 18.11.2016 12:59:34pm

అక్క‌డ‌ బాల్యం భ‌యంలో... య‌వ్వ‌నం నిర్బంధంలో గ‌డిచిపోతుంది. ఇంటి నుంచి బ‌య‌ట‌కెళ్లిన పిల్ల‌లు తిరిగి వ‌స్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక‌...
...ఇంకా చదవండి

బోధ‌నా హ‌క్కు కోసం మ‌రో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్‌.సాయిబాబా

ఇంట‌ర్వ్యూ : క్రాంతి | 01.06.2016 12:44:47pm

1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట...
...ఇంకా చదవండి

దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజం

సుబోజిత్ బాగ్చీ (అనువాదం : క‌్రాంతి) | 17.06.2016 09:33:33am

సామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే........
...ఇంకా చదవండి

మ‌రో ఆదివాసీ యువ‌కుడు...

క్రాంతి | 03.09.2016 03:22:46pm

17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువ‌కుడిగా త‌ప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జ‌వాన్లు చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన అంబులెన్స్ ........
...ఇంకా చదవండి

పొట్ట‌కూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారు

| 20.10.2016 03:21:04pm

తాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్ట‌య్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన‌ మ‌నోహ‌ర్ శ‌వ‌మై తిరిగి వ‌చ్చాడు. "ఎన్‌కౌంటర్" క‌థ రిపీట్ అయ్యింది....
...ఇంకా చదవండి

వెలివాడే తొలిపొద్దై పుస్త‌కావిష్క‌ర‌ణ‌

ఫొటోలు : క‌్రాంతి | 17.07.2016 12:15:31pm

రోహిత్ వేముల స్మృతిలో విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం వెలువ‌రించిన వెలివాడే తొలిపొద్దై పుస్త‌కాన్ని రోహిత్ త‌ల్లి వేముల రాధిక ఆవిష్క‌రించారు. మార్చి ...
...ఇంకా చదవండి

సంత‌కు వెళ్లిన వాళ్లు.. శ‌వాలై వ‌చ్చారు

సంఘ‌ర్ష్‌ | 20.02.2017 11:52:50am

ఏకంగా ఇర‌వై రోజుల నుంచి మృత దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌కుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళ‌న చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క అధికారి కూడా ఈ విష‌యంలో స్పందించ‌క‌పోవ...
...ఇంకా చదవండి

అధికారం నీడ‌లో.... అంతులేని హింస‌

క్రాంతి | 05.10.2016 03:32:08pm

మోదీ ప్ర‌భుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను వేదాంత‌, ఎస్సార్‌, టాటా, జిందాల్ వంటి బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడుతోంది. అందుకు......
...ఇంకా చదవండి

ఆ చెట్టుకు నోరుంటే ..

క్రాంతి | 03.01.2017 09:49:29am

ఆట‌పాట‌ల్లో మురిసిపోయే ప‌సివాడు ఉట్ట‌న్న‌ట్టుండి న‌క్స‌లైట‌య్యాడు. క‌సిగా గుచ్చుకున్న బ‌యోనెట్ మొన వాడి మొర ఆల‌కించ‌లేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల...
...ఇంకా చదవండి

ఆర‌ని మంట‌లు...

| 02.11.2016 09:05:19am

2011 మార్చిలో చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జ‌రిగిన మార‌ణ‌హోమం పోలీసుల ప‌నే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెష‌ల్ పోలీస్...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌
    భారత విప్లవోద్యమంలో చారుమజుందార్ శతజయంతి సదస్సు
    విరసం నాయకుడు జగన్‌పై అక్రమంగా పెట్టిన ఉపా కేసు ఎత్తివేయాలి
    అరుణతార అక్టోబర్ 2019
    మనమూ తేల్చుకోవాల్సిందే
    ఏవోబీ నెత్తురు చిందుతోంది
    అసహజ మరణాలు సమాజానికి హెచ్చరికలు అంటున్న కథ ʹ డోలిʹ
    ఎవరామె?
    స్వైర విహారం
    హిందూత్వసాంస్కృతిక దాడికి వ్యతిరేకంగా సాంస్కృతిక ప్రతిఘటనా దినాన్ని జరుపుకుందాం
    నీకు నేనంటే కోపమెందుకు ?
    రేయి బంగారు మధుపాత్రలు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •