విప్లవ ప్రత్నామ్నాయం - వర్గపోరాటం

| సాహిత్యం | వ్యాసాలు

విప్లవ ప్రత్నామ్నాయం - వర్గపోరాటం

- విక‌ల్ప్‌ | 02.10.2019 09:07:43am

సమాజం చాలా సంక్షోభంలో ఉన్నమాట నిజం. పాలకవర్గం, సామ్రాజ్యవాదం సృష్టించిన సంక్షోభాలను ప్రజలు అనుభవిస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ప్రత్యామ్నాయం ఏమిటి? అని ఆలోచించేవాళ్లంతా దండకారణ్యంలో విప్లవోద్యమం నాయకత్వంలో జరుగుతున్న ప్రత్యామ్నాయ ప్రయత్నాలను పరిశీలించాలి. వర్గపోరాటాల ద్వారా ప్రజలు ఈ ప్రయోగాలు చేస్తున్నారు. సమాజంలోని అన్ని రంగాలకు విప్లవ ప్రత్యామ్నాయం ఎలా ఉండగలదో బీజరూపంలో ఆచరిస్తున్నారు. ఏకంగా ప్రత్నామ్నాయ ప్రజా రాజ్యం గురించిన నమూనా కోసం ప్రయత్నం జరుగుతోంది.

నూతన ప్రజాస్వామిక రాజ్యయంత్రం-రాజ్యాంగం కార్మికవర్గ నాయకత్వాన కార్మిక-కర్షక పునాదిపై ఆధారపడి కార్మిక, కర్షక, పట్టణ మధ్యతరగతి, దేశీయ పెట్టుబడిదారుల, పీడిత సామాజిక సెక్షన్ల, పీడిత జాతుల ప్రజాస్వామిక రాజ్యయంత్రంగా-రాజ్యాంగంగా ఉంటుంది. ఇది ఈ నాలుగు వర్గాల, పీడిత సామాజిక సెక్షన్ల, పీడిత జాతుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వాటి పురోభివృద్ధికీ, ఉన్నత పరివర్తనకు ప్రధాన సాధనంగా ఉంటుంది. ఇందుకు మొట్టమొదట నేటి దోపిడీ పీడనలకు మూలమైన ఉత్పత్తి సంబంధాలను రద్దు చేసి, నూతన ప్రజాస్వామిక రాజ్యానికి పునాదిగా ఉండే ఉత్పత్తి సంబంధాలను నెలకొల్పడంతో పాటు గత ఉత్పత్తి సంబంధాల పునాదిపై ఏర్పడిన, దోపిడీ వర్గాలకు సేవ చేస్తూ వాటికి ప్రాతినిధ్యం వహించిన రాజకీయాలను, సంస్థలను రద్దు చేస్తుంది. సామాజిక అణచివేత- వివక్షలను రద్దు చేస్తుంది. సాంస్కృతిక రంగంలో నిరంతరం విప్లవాన్ని కొనసాగిస్తుంది. ఇది దోపిడీ వర్గాల అవశేషాలను, కూలదోయబడిన దోపిడీ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే శక్తులను అదుపు చేస్తూ, విద్యావంతం చేస్తూ పరివర్తన చెందించడానికి వారిపై, సామ్రాజ్యవాద ఏజెంట్లపై, విప్లవ ప్రతీఘాతకులపై, దేశద్రోహులపై నూతన ప్రజాస్వామిక నియంతృత్వాన్ని అమలు చేస్తుంది. అశేష ప్రజల, దేశ సర్వతోముఖాభివృద్ధికీ దేశ స్వాతంత్య్రాన్ని-సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికీ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సైనిక, సాంస్కృతిక, పర్యావరణ తదితర కార్యక్రమాలన్నింటిలోనూ రాజ్య వ్యవహారాలన్నింటిలోనూ ప్రజల చైతన్యపూర్వక, క్రియాశీల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి కృషి చేస్తుంది. దేశంలోని వివిధ పీడిత వర్గాల, సామాజిక సెక్షన్ల, జాతుల మధ్య వివిధ రంగాలలో గల అంతరాలను తొలగిస్తూ మార్క్సిజం-లెనినిజం-మావోయిజం మార్గదర్శకత్వంలో సమాజాన్ని నూతన ఉన్నత దిశగా-సోషలిజం దిశగా నడిపించడానికి అన్ని రంగాల్లో ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వపరంగాను, ప్రజలపరంగానూ కృషి చేస్తుంది.

****

నూతన ప్రజాస్వామిక రాజ్యం వ్యవసాయంలో దోపిడీ ఉత్పత్తి సంబంధాలను రూపుమాపుతుంది, వ్యవసాయం సామ్రాజ్యవాదంపై, బహుళజాతి కంపెనీలపై ఆధారపడేతత్వాన్ని అంతం చేసి, వ్యవసాయాన్ని వాస్తవికంగా అభివృద్ధి చేస్తుంది. ప్రస్తుతం దేశంలో మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూమి 30 శాతం పైగా జనాభాలో 5 శాతంగా ఉన్న భూస్వాముల చేతుల్లో ఉంది. మొత్తం రైతుల్లో 65 శాతంగా ఉన్న భూమిలేని పేద రైతులచేతుల్లో ఉన్న భూమి ఒక హెక్టారు కంటే కూడా చిన్నది. నూతన ప్రజాస్వామిక రాజ్యం భూస్వాముల, మత సంస్థల భూమినంతటినీ జప్తు చేసుకుంటుంది, ʹదున్నేవారికే భూమిʹపై ఆధారపడి భూమిలేని, పేద రైతులకు, రైతుకూలీలకు అదనపు భూమిని పంపిణీ చేస్తుంది, ఇది భూమిలేని, పేద రైతుల ప్రభుత్వ, సహకార, ప్రైవేటు రుణాలను, రద్దు చేస్తుంది. రైతాంగాన్ని దోపిడీ చేసే రుణ వ్యాపార సంస్థలను తన నియంత్రణలోకి తీసుకుంటుంది. ఇది సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రజల శ్రమ, పెట్టుబడే ఈ సహకారానికి ముఖ్య ఆధారంగా ఉంటాయి, ఇందులో కీలకమైన అంశం శ్రమ. ఇది వినియోగదారుల-రుణదాతల సహకార సమితులను ప్రోత్సహిస్తుంది. ఇది పెట్టుబడిదారీ రైతుల పెద్ద వ్యవసాయ క్షేత్రాలను, కార్పొరేట్‌ రంగాలకు చెందిన వ్యవసాయ క్షేత్రాలను, ఫారం హౌసులను, ప్లాంటేషన్లు, తోటలు మొదలైన వాటి భూమినంతటినీ జప్తు చేసుకొని వాటిలో సమిష్టిగా వ్యవసాయం చేయించేందుకు ప్రాముఖ్యత ఇస్తుంది.

ఇది నీటిపారుదల, విద్యుదుత్పాదన కోసం భారీ నదీ లోయల్లో ప్రాజెక్టులను నిర్మించడం కాకుండా భూమి ఆకృతికి అనుగుణంగా, చిన్న-చిన్న ప్రాజెక్టులను, అంటే, చెక్‌డ్యాములు, చిన్న నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తుంది. తద్వారా పర్యావరణం దెబ్బతినకుండా చేస్తుంది, ప్రజలను విస్థాపన నుండి కాపాడుతుంది. ఏదేనీ భారీ ప్రాజెక్టును అనివార్యంగా నిర్మించాల్సిన పరిస్థితి ముందుకు వస్తే స్థానిక ప్రజల ఆమోదంతో, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే నిర్మిస్తుంది.

ఇది మార్కెట్‌ ఎగుడు-దిగుళ్లు, అప్పుల భారం నుండి రైతులను విముక్తి చేస్తుంది. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి బయటకు వస్తుంది. రైతుకు వ్యతిరేకమైన ప్రతీ విధానాన్ని తిరస్కరిస్తుంది. వ్యవసాయంలో బహుళజాతి కంపెనీల దోపిడీ చొరబాటును అడ్డుకుంటుంది. వ్యవసాయంలో నపుంసక, సంకర విత్తనాలను, భూమిని బంజరుగా మార్చే వ్యవసాయ ఉత్పాదితాలను (ఇన్‌పుట్లు) నిషేధిస్తుంది. మట్టిని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని దేశవాళీ విత్తనాలను, ఎరువులను వినియోగిస్తుంది, వాటిపై పరిశోధనలను ప్రోత్సహిస్తుంది. ఇది వ్యవసాయంలో సహకార సమితులకు, చిన్న రైతులకు అవసరమైన వస్తువులపై సబ్సిడీ ఇస్తుంది. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తుంది. ఇది మొట్టమొదటగా ఆహారం విషయంలో, పోషకాహారం విషయంలో దేశాన్ని స్వయంసంపూర్ణం చేస్తుంది, సబ్సిడీలు ఇచ్చి చౌక ధరలకు ఆహార పంపిణీని గ్యారంటీ చేస్తుంది. ఇది ప్రభుత్వ పథకాలలో వ్యవసాయంపై ఖర్చుని పెంచుతుంది, దీనికి ప్రాధాన్యతనిస్తుంది. ఈ విధంగా ఇది ʹʹవ్యవసాయాన్ని పునాదిగా తీసుకొని పరిశ్రమను నాయకత్వంలో ఉంచేʹʹ సూత్రాన్ని, ʹʹరెండు కాళ్ల మీద నడిచేʹʹ వరుస విధానాలనూ అనుసరిస్తుంది.

****

నూతన ప్రజాస్వామిక రాజ్యం పరిశ్రమలను, వ్యాపారాలను సామ్రాజ్యవాద నియంత్రణ నుంచి దళారీ నిరంకుశ పెట్టుబడిదారుల నియంత్రణ నుంచి పూర్తిగా విముక్తి చేస్తుంది. దానిని స్వావలంబనపై ఆధారపడినదిగా పునర్నిర్మాణం చేస్తుంది. ఇది సామ్రాజ్యవాదులకు, దళారీ బడా పెట్టుబడిదారులకు చెందిన యావత్తు పారిశ్రామిక, బ్యాంకు పెట్టుబడిని, సట్టా వ్యాపారుల పెట్టుబడిని, వారి భూమిని, భవనాలను, తోటలు మొదలైన వాటిని, ఉన్నతాధికారుల అపరిమితమైన సంపదను, బ్యాంకులలో ఉన్న వారి డబ్బును జప్తు చేసుకుంటుంది. ఇది బడా పెట్టుబడిదారులకు, విదేశీ పెట్టుబడిదారులకు చెందిన యావత్తు ఫ్యాక్టరీలను, బ్యాంకులను, ఇన్సూరెన్స్‌ కంపెనీలను, ఇతర ద్రవ్య సంస్థలను, పరిశోధన-అభివృద్ధి విభాగాలు మొదలైన వాటిని జాతీయం/దేశీయం చేస్తుంది. ఇది బడా పరిశ్రమల్లో దళారీ నిరంకుశ పెట్టుబడిదారుల, విదేశీ పెట్టుబడిదారుల పెట్టుబడి ఉనికిని పూర్తిగా రూపుమాపుతుంది. ఇది పాలకవర్గాల ద్వారా సామ్రాజ్వవాద ద్రవ్య సంస్థల నుంచి, దేశాల నుంచి తీసుకున్న రుణాలను రద్దు చేస్తుంది. ఇది మన పరిశ్రమలను ఆధారపడేలా చేసే/పరాధీనం చేసే ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ మొదలైన సామ్రాజ్యవాద సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేస్తుంది. ఇది సామ్రాజ్యవాద ప్రాయోజిత ఉదారీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను తిరస్కరిస్తుంది. ఇది సాధారణంగా ప్రభుత్వ పెట్టుబడిని బలోపేతం చేస్తూ పట్టణ, గ్రామీణ రంగాలలో పెట్టుబడి సంచయనంపై సీలింగును విధిస్తుంది.

ఇది వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకోవడం ద్వారా పరిశ్రమల స్థాపన-అభివృద్ధి జరుగుతాయి. ఇది శ్రమ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ప్రస్తుత అసమతుల్యతను దూరం చేస్తుంది. గ్రామీణ ప్రాంతాలను తగిన విధంగా అభివృద్ధి చేయడం, అక్కడ పరిశ్రమలను, వ్యాపారాలను అభివృద్ధి చేయడం ద్వారా పట్టణాలలో పెరుగుతున్న జనాభా వత్తిడిని తగ్గిస్తుంది. గ్రామీణ ప్రాంతాల నుండి పని-వ్యాపారం కోసం పట్టణ ప్రాంతాలకు వలసపోయే స్థితిని క్రమంగా అంతం చేస్తుంది.

నేడు సంఘటిత రంగంలో కేవలం 7 శాతం మంది పనిచేస్తున్నారు. నూతన ప్రజాస్వామిక రాజ్యం పరిశ్రమలలో ఉపాధి కల్పించేందుకు ప్రాధాన్యతనిస్తుంది తప్ప లాభాలకు కాదు. ఇది కాంట్రాక్టు కార్మి పద్ధతిని అంతం చేస్తుంది. ఇది ఆరు గంటల పని విధానాన్ని అమలు చేస్తుంది. ఇది మహిళలు, పురుషుల కోసం సమాన పనికి సమాన వేతనాన్ని గ్యారంటీ చేస్తుంది. ఇది బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా రూపుమాపుతుంది. కార్మికులకు సామాజిక భద్రతనూ, భద్రమైన పని పరిస్థితులనూ కల్పిస్తుంది. ఇది పని చేసే హక్కును మౌలిక హక్కుగా గుర్తిస్తుంది. నిరుద్యోగ నిర్మూలన వైపుగా పురోగమిస్తుంది. నూతన ప్రజాస్వామిక రాజ్యం సెజ్‌ (ప్రత్యేక ఆర్థిక జోన్లను)లను రద్దు చేస్తుంది.

నూతన ప్రభుత్వం చిన్న, మధ్యతరహా పరిశ్రమలను కాపాడుతుంది. దేశీయ పెట్టుబడిదారీ పరిశ్రమలను, వ్యాపారాలను పరిమితం చేసి నియంత్రిస్తుంది. పరిశ్రమల, వ్యాపార వాణిజ్యాల, గృహ పరిశ్రమల, చేతివృత్తుల బహుముఖ అభివృద్ధి కోసం సహకార ఉద్యమాన్ని పూర్తిగా ప్రోత్సహిస్తుంది.

****

నూతన ప్రజాస్వామిక రాజ్యం భూస్వాముల రాజకీయ అధికారాన్ని ధ్వంసం చేయడం ద్వారానూ, దున్నేవారికే భూమి ప్రాతిపదికన వారి భూమిని పంపిణీ చేయడం ద్వారానూ, భూమిలేని, పేద రైతుల నాయకత్వం కింద ఉండే కొత్త అధికారం ద్వారానూ (వీరిలో పెద్ద సెక్షన్లు దళితులు, ఆదివాసులు, ఇతర పీడిత కులాల నుండి వచ్చినవారే అయి ఉంటారు), సమాజంలో కుల ఆధారిత భూస్వామ్య పునాదిలో పాతుకుపోయి ఉన్న కులవ్యవస్థను రూపుమాపే క్రమాన్ని ఆరంభిస్తుంది. ఇందుకు ప్రత్యేక నిర్మాణ, పోరాట రూపాలను ఎంచుకోవడం ద్వారా శాస్త్రీయ సోషలిస్టు దృక్పథాన్ని పెంపొందించడం ద్వారా బ్రాహ్మణవాద భావజాలాన్నీ, కులవివక్షనూ, అసమానతలనూ నిర్మూలించి, అంటరానితనాన్ని, మొత్తంగా కులవ్యవస్థనూ సంపూర్ణంగా నిర్మూలించే వైపు కృషి చేస్తుంది. ఇది కులవివక్ష పాటించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. అప్పటి వరకూ దళితులకూ, ఇతర సామాజిక పీడిత కులాలకు ఊతమివ్వడానికి రిజర్వేషన్లతో సహా ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తుంది.

****

ఇది మహిళలకు వ్యతిరేకంగా అన్ని రకాల వివక్షను రూపుమాపే దిశగా పురోగమిస్తుంది. ఇది పురుషాధిపత్యాన్నీ, పితృస్వామ్యాన్నీ రూపుమాపేందుకు పోరాడుతుంది. ఇది భూమితో పాటు ఆస్తిపై వారి సమాన హక్కును కూడా గ్యారంటీ చేస్తుంది. ఇది సతీసహగమనం, బాల్య వివాహాలు, వరకట్నం, లింగ వివక్ష మొదలైన మహిళా వ్యతిరేక తప్పుడు రుగ్మతలపై నిషేధం విధిస్తుంది. ఇందుకు ఒడిగట్టిన దోషులకు శిక్ష విధిస్తుంది. ఇది వినియోగవాదాన్నీ (కన్‌జ్యూమరిజం), మహిళలను అంగడి సరుకుగా వాడుకునే - అశ్లీల సాహిత్యం, నగ్న విజ్ఞాపనలు, అందాల పోటీలు మొదలైన ప్రతీ ఒక్క సామ్రాజ్యవాద-పెట్టుబడిదారీ రుగ్మతలను నిషేధిస్తుంది. ఈ రాజ్యం వేశ్యావృత్తిలో కూరుకుపోయిన మహిళలకు పునరావాసం కల్పిస్తుంది. వారికి సామాజిక గుర్తింపును కల్పిస్తుంది. ఇది మహిళలను ఇంటిపని అనే జైలు నుంచి విముక్తి చేస్తుంది, సామాజిక ఉత్పత్తి, ఇతర కార్యకలాపాలలో వారి భాగస్వామ్యాన్ని గ్యారంటీ చేస్తుంది. స్త్రీలు ఎదుర్కొనే అణచివేత, వివక్షలను వేగంగా నిర్మూలించడానికి ప్రత్యేక విధానాలను ప్రోత్సహిస్తుంది. వారికి రిజర్వేషన్లతో సహా ప్రత్యేక సదుపాయాలను ఖాయం చేస్తుంది.

****

ఇది జల్‌-జంగల్‌-జమీన్‌పై ఆదివాసుల-మూలవాసుల సమిష్టి యాజమాన్యాన్ని గుర్తిస్తుంది. వాటిని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించడం కోసం, ఆ సముదాయాలను ప్రోత్సహిస్తుంది. ఇది యావత్తు ఆదివాసీ సముదాయాల సంపూర్ణ అభివృద్ధి కోసం, వాటికి వివిధ స్వావలంబన అధికారాలను గ్యారంటీ చేస్తుంది. దానికి అనుగుణంగా ప్రత్యేక విధానాలను అమలు చేస్తుంది.

****

రాజ్యాంగం లౌకికమైనదని ప్రకటించినప్పటికీ, భారత రాజ్యం ʹహిందీ, హిందు, హిందుస్తాన్‌ʹ అనే బ్రాహ్మణవాద, జాతీయోన్మాద భావజాలంతో కూడుకొని ఉంది. నూతన ప్రజాస్వామిక రాజ్యం రాజ్యానికి మతం రంగు పులమడానికీ, అన్ని రకాల మత ఛాందసత్వాలకూ వ్యతిరేకమైనది. ఇది మత మైనారిటీలపై అత్యాచారాలను, మత ప్రాతిపదికతో కూడిన సామాజిక అసమానతలను రూపుమాపుతుంది. ఇది మత మైనారిటీల సామాజిక-ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక విధానాలను అమలు చేస్తుంది. ఇది మత వ్యవహారాలలో రాజ్యం జోక్యాన్ని రూపుమాపుతుంది. దీంతో పాటు, ఇది రాజకీయ లక్ష్యాల కోసం మతాన్ని వినియోగించడాన్ని అడ్డుకుంటుంది. ఇది మతాన్ని పాటించడంలో, పాటించకపోవడంలో వ్యక్తిగత స్వేచ్ఛకు గ్యారంటీ కల్పిస్తుంది.

****

భారత సమాజం వేలాది యేళ్లుగా కులపరంగా విభజించబడిన బ్రాహ్మణవాద కుల, సామాజిక అంతరాలు, వివక్ష, ఆచారాలు, అంధవిశ్వాసాలపై ఆధారపడిన సమాజంగా ఉంది. బ్రాహ్మణవాదం ఇక్కడి భూస్వామ్య విధానానికి సాంస్కృతిక వెన్నెముక లాంటిది. నూతన రాజ్యం ఉన్మాదపూరిత కులతత్వాన్నీ, పుట్టుకపై ఆధారపడి సామాజికంగా ఉన్నత, నీచ భేదాలు, అంటరానితనం, వివక్షలను పూర్తిగా రూపుమాపే వైపు పురోగమిస్తుంది.

ఇది ఆదివాసుల పట్ల వివక్షను రూపుమాపుతుంది. ఇది దేశంలో బ్రాహ్మణవాద హిందూ మతోన్మాద భావజాల ప్రభావంతో మతమైనారిటీల పట్ల వ్యాప్తి చెందిన అణచివేత-వివక్షను నిర్మూలిస్తుంది. సమాజంలో శాస్త్రీయ, హేతువాద దృక్పథాన్ని ప్రోత్సహిస్తుంది.

ఇది శిథిలమవుతున్న భూస్వామ్య, వలసవాద, సామ్రాజ్యవాద సంస్కృతి స్థానంలో నూతన ప్రజాస్వామిక, ప్రగతిశీల సంస్కృతిని స్థాపిస్తుంది. మార్క్సిజం-లెనినిజం- మావోయిజం మార్గదర్శకత్వంలో సోషలిస్టు-కమ్యూనిస్టు సంస్కృతి సాధన దిశలో పురోగమిస్తుంది.

****

ఇది ఉపాధి, విద్య, వైద్యం హక్కులను మౌలిక హక్కులుగా గ్యారంటీ చేస్తుంది. నిరుద్యోగాన్ని నిర్మూలించే వైపుగా పురోగమిస్తుంది. ఇది నిరంకుశ కేంద్ర, దేశ-విదేశీ బడా పెట్టుబడికి సేవ చేసే లక్ష్యంతో రూపొందించబడిన విద్యా విధానాన్ని రూపుమాపుతుంది. కార్మిక, కర్షక తదితర శ్రమజీవి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా, దేశ ప్రయోజనాలు, ప్రత్యేకతలను దృష్టిలో పెట్టుకునే, ఉత్పత్తితో సంబంధాన్ని కలిగి ఉండే ప్రజాస్వామిక, శాస్త్రీయ విద్యా విధానాన్ని అభివృద్ధి చేస్తుంది. ఈ రాజ్యం నిరుద్యోగ భృతిని, సామాజిక బీమాను అమలు చేస్తుంది. ప్రజల జీవనస్థాయిని మెరుగుపరిచేలా గ్యారంటీ ఇస్తుంది.

ఇది శారీరక వికలాంగులకు, మానసిక అసమర్థులు-వికలాంగులకు, వృద్ధులకు, అనాధలకు, అంగలోపంతో బాధపడే ఇతర ప్రజలకు తగిన ఆర్థిక, సామాజిక భద్రతను, ఆరోగ్యకరమైన సామాజిక-సాంస్కృతిక వాతావరణాన్ని కల్పిస్తుంది.

ఇది యావత్తు ప్రజల కోసం, ప్రత్యేకించి, కార్మికులు, రైతులు, ఇతర శ్రమజీవి ప్రజల కోసం ఉన్నత ఆరోగ్య, ఉచిత వైద్య సేవలకు గ్యారంటీ కల్పించే ఒక ప్రజా వైద్య విధానాన్ని అమలు చేస్తుంది. యావత్తు దేశ ఆరోగ్య రంగం ప్రజా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. వైద్యులు ఆసుపత్రికి వెళ్లడం అనివార్యం చేస్తుంది.

ఇది తాగునీరు, కరెంటు, రవాణా, కమ్యూనికేషన్‌, ఇతర ప్రజోపయోగ రంగాలలో లాభం కోసం పనిచేసే ప్రైవేటు వ్యవస్థలను రూపుమాపుతుంది. యావత్తు రంగాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తుంది. ఇది మానసిక, శారీరక శ్రమకు మధ్య అంతరాన్ని క్రమంగా తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. ఇది యావత్తు భారీ పన్నులను రూపుమాపుతుంది. ప్రస్తుత పన్నుల విధానాన్ని రద్దు చేస్తుంది, సరళమైన, ప్రగతిశీల పన్నుల విధానాన్ని అమలు చేస్తుంది.

****

ఇది ప్రజా అనుకూల ప్రగతిశీల, ప్రజాస్వామిక దృక్పథాన్ని అవలంబిస్తూ అందరినీ సంస్కరించడం కోసం హేతబద్ధ న్యాయాన్ని గ్యారంటీ చేసే న్యాయ విధానాన్నీ, న్యాయ వ్యవస్థను అమలు చేస్తుంది. ఈ దిశలో ఇది అధిక ఖర్చుతో కూడిన నేటి న్యాయ విధానాన్ని తొలగించి ప్రజలకు అందుబాటులో ఉండే న్యాయ విధానాన్ని తయారు చేస్తుంది.

****

లాభాల వేటలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు, ప్రత్యేకించి అమెరికా, ఇతర సామ్రాజ్యవాద దేశాల పెట్టుబడిదారులు పర్యావరణానికి ఎంతగా ధ్వంసం చేసారంటే భూమి అస్తిత్వమే సంక్షోభంలో పడిపోయింది. నూతన ప్రజాస్వామిక రాజ్యం ప్రపంచంలో భావజాలపరంగా సమానమైన ఇతర దేశాలతో కలిసి కాలుష్యాన్ని తగ్గించే విధంగా, దానికి అయ్యే ఖర్చు భరించే విధంగా సామ్రాజ్యవాద దేశాలపై ఒత్తిడి తీసుకువస్తుంది. ఇది పెద్ద నదీలోయ ప్రాజెక్టులను, అడవుల నరికివేతను, ఇతర పర్యావరణ వ్యతిరేక ప్రాజెక్టులను నిరుత్సాహపరుస్తుంది, అవసరమైతే వాటిని నిషేధిస్తుంది.

భారతదేశంలో వివిధ ప్రాజెక్టులలో 1947 నుంచి ఇప్పటి వరకు 6 కోట్ల మందికి పైగా ప్రజలు విస్థాపితులయ్యారు. ఇందులో ఎక్కువగా ఆదివాసులు ఉన్నారు. ఈ రాజ్యం ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండా, పర్యావరణానికి నష్టం కలిగిస్తూ, ఏ ప్రదేశంలోనూ అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టదు. ప్రజా ప్రయోజనం కోసం చేపట్టే ఏ ప్రాజెక్టు వలన అయినా విస్థాపన జరిగే స్థితిలో సంపూర్ణ పునరావాసానికీ, ఉపాధికీ గ్యారంటీ ఇచ్చిన తర్వాతే ప్రాజెక్టును ప్రారంభించడం జరుగుతుంది.

ఇలా అనేక రంగాల్లో ప్రత్నామ్నాయ ప్రయత్నాలు వర్గపోరాటాల ద్వారా జరుగుతున్నాయి. వీటిని విశ్లేషించడమే కాదు. ఆచరణలోకి తీసుకొస్తున్న ప్రజలకు మద్దతుగా మేధావులు, రచయితలు ఉండాలి

No. of visitors : 384
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •