మంచి కథ ఎప్పుడూ పాఠకుల ఆలోచనలకు పదును పెడుతుంది

| సాహిత్యం | స‌మీక్ష‌లు

మంచి కథ ఎప్పుడూ పాఠకుల ఆలోచనలకు పదును పెడుతుంది

- పలమనేరు బాలాజీ | 02.10.2019 10:09:58am

కల్పన కు ఊహకు దగ్గరయ్యే కొద్దీ కథ వాస్తవాలకు దూరమవుతుంది. సామాజిక స్పృహ కలిగి ,వాస్తవం తో కూడిన కథ పాఠకుల్ని అతడు ఏ స్థాయి పాఠకుడైన చప్పున ఆకట్టుకుంటుంది. పాఠకుడికి అతని భావజాలంతో ప్రాంతంతో భాషతో విద్యతో కాలంతో బాటు అతడి చైతన్య స్థాయి కథ పట్ల అవగాహనను ఏర్పరుస్తుంది. పాఠకుడిచుట్టూ కథ అల్లుకుంటుంది. కథ చుట్టూ కథ వెంట పాఠకుడు నడుస్తాడు. ఒక స్థాయి తర్వాత పాఠకుల్ని అందుకోవటానికి కథ చేసే ప్రయత్నం ఎలా ఉన్నా, పాఠకులే కథల్ని అందుకునేందుకు ముందుకు వస్తారు పాఠకుల్లో అట్లాంటి చొరవ అట్లాంటి స్పందన కలిగించే కథలు మంచి కథలు.

తనకు తెలిసిన నా జీవితాన్ని కథలో చూసుకున్నప్పుడు పాఠకుడి స్పందన వేరుగా ఉంటుంది. తనకు తెలియని జీవితాన్ని గురించి కథ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు పాఠకుడి అతడి స్పందన యొక్క భావజాలం పైన వ్యక్తిత్వం పైన, భావనా పటిమ పైన ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా పాత్రలు జంతువులు అయినప్పుడు జంతువుల ద్వారా రచయిత తను చెప్పదలచుకున్న విషయాన్ని చెబుతున్నప్పుడు జంతువుల ప్రవర్తన , జంతువుల చుట్టూ నేర్పుగా రచయిత అల్లిన కథనం కథలోని భాష కథలోని సాంద్రత పాఠకుల్ని ఆకట్టుకుంటాయి. అప్పటిదాకా తెలియని ఒక కొత్త ప్రపంచాన్ని ఒక లోతైన ప్రపంచాన్ని ఒక వినూత్న ప్రపంచాన్ని పాఠకులకు అట్లాంటి కథలు తెలియపరుస్తాయి. కొత్త ఎరుకను కలిగిస్తాయి. అట్లాంటి మంచి కథ ʹఆవైతే పేయ దూడనే కనాలి ఆడదైతే మగ పిల్లాడినే కనాలిʹ

చిత్తూరు జిల్లాకు చెందిన రచయిత్రి ఎండపల్లి భారతి ʹఎదారి బతుకులు ʹ పేరిట మార్చి 2018 లో ముప్పై కథలతో కథా సంపుటిని వెలువరించారు. రాయలసీమ గ్రామీణ దళిత జీవితాన్ని స్త్రీవాద దృష్టి కోణంలో నుంచి దళితవాద కోణంలో నుంచి పరిశీలించడానికి అనేక గొప్ప కథా వస్తువులు ఈ సంఘటంలో వున్నాయి వెలుగు చూడని చీకటి జీవితాలు కలిగించే బీభత్సం , మనవ సంబంధాల్లోని వైచిత్రి, అత్యంత వేగంగా మారిపోతున్న ప్రపంచంలో మార్పు ప్రభావానికి తట్టుకుని ఇంకా మానవులుగా నిలబడ్డ అరుదైన మానవులు నిజమైన మానవులు , కఠోరమైన జీవిత వాస్తవాలు పాఠకులకు ఆశ్చర్యాన్ని, సంతృప్తిని, అసంతృప్తిని, భయాన్ని, బాధను, ఆగ్రహాన్ని కలిగిస్తాయి. ఈ కథలు పాఠకులకు గొప్ప సంవేదన కలిగిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నిస్సందేహంగా ఇవన్నీ రాయలసీమ గ్రామీణ దళిత మహిళా రైతు జీవితం నుంచి వచ్చిన కథలు.

ఒకప్పుడు రాయలసీమ కథ అంటే కరువు కథ మాత్రమే. అటు తర్వాత రాయలసీమ కథ అంటే జీవితాన్ని తెలియ చెప్పే కథ, జీవశక్తి కలిగిన కథ అని అనిపించుకుంది. కేవలం వర్షాభావ పరిస్థితులు కరువు కారణాలవల్ల భౌగోళిక పరిస్థితుల రీత్యా రాజకీయ సాంస్కృతిక ఆర్థిక పరిణామాలు ప్రజా జీవితం పై చూపిన ప్రభావం కారణంగా వైవిధ్యభరితమైన జీవనం ఈ ప్రాంతం ప్రత్యేకత.

ఆడపిల్ల పుట్టడం గొప్ప దౌర్భాగ్యం అనుకునే సంస్కృతి కరువు ప్రాంతాల్లో కొత్త కాదు. మనుషులు అట్లా అనుకోవడం వెనకాల అనాదిగా పేరుకుపోయిన మగ దురహంకార సంస్కృతి పితృ స్వామ్య భావజాలం దారుణ ఆర్థిక పరిస్థితులు కారణమవుతాయి.

ʹఆవైతే పేయ దూడనే కనాలి ఆడదైతే మగ పిల్లాడినే కనాలిʹ అదే పేరు తో రాసిన కథ

విశాలాక్షి మాస పత్రికలో 2017 లో మొదట అచ్చయి, తర్వాత ʹఎదారి బతుకులుʹ కథా సంకలనంలో చోటు చేసుకుంది.

ఆడపిల్లలంటే ఉండే చిన్న చూపును ప్రశ్నిస్తుంది ఈ కథ. స్త్రీ ప్రసవవేదన ఎలా ఉంటుందో తెలిసిన రచయిత్రి ప్రసవిస్తున్న ఆవు పడే వ్యధను ఈ కథలో చిత్రించిన విధానం,

ఆమె వాడిన సహజమైన భాష ఉపమానాలు ... మొత్తంగా ఒక గొప్ప డాక్యుమెంటరీగా ఈ కథ పాఠకుల కళ్ళ ముందర కొత్త జీవితాన్ని ఆవిష్కరింప చేస్తుంది.

ఈ ప్రసవవేదన ఆవుది మాత్రమే కాదు .స్త్రీ ది మాత్రమే కాదు, బహుశా తనలోంచి మరొకరిని ప్రపంచంలో కి పంపడానికి చేసే ఒక గొప్ప మానవీయమైన ప్రకృతి సహజమైన ప్రసవ వేదన ప్రతి జీవికి సంబంధించినది.

ఒక మనిషి తన జీవనానికి సంబంధించిన తిండి కోసం ఎంత తాపత్రయ పడతాడో, ఎన్ని పాట్లు పడతాడో, కొత్త ఉపాధిని వెతుక్కుంటాడో చెబుతూనే కరువు ప్రాంతం లో పేద వారి కుటుంబానికి జీవనోపాధిని కల్పించే ఒక ఆవు కు సంబంధించిన ఆహార సంపాదన కోసం ఆ కుటుంబం లోని స్త్రీ పడే తపన ,ఆవేదన ,ప్రయత్నం, పోరాటం ఈ కథను గొప్ప కథను చేశాయి.

ఎంత కరువుప్రాంతమైనా, ఎంత వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆవును సంరక్షించుకోవడం, ఆవుకు అవసరమైన ఆహారాన్ని ఏర్పాటు చేయడం ఆవు సంరక్షకుల కర్తవ్యం.

స్త్రీ సంపాదించి నప్పటికి లేదా ఆవు సంపాదించి నప్పటికి ఆ కుటుంబంలో ఆ సంపదను అనుభవించేది ఆ సంపాదన పైన హక్కును కలిగి ఉండేది పురుషుడే. అయినా ఆవు కు సంబంధించి సరైన ఆహారాన్ని అందించడం లో కానీ ఆవుకు అవసరమైన వైద్యాన్ని అందించడంలో కానీ ఎంత మాత్రం బాధ్యత తీసుకోని మగవాడు ఈ కథలో విస్మయాన్ని కలిగిస్తాడు. జీవితం ఎట్లా గా ఉందో ఈ కథ అట్లాగే ఉంది జీవితం ఎంత ఘోరంగా ఉందో ఎంత విషాదంగా ఉందో ఈ కథ అంత విషాదం గానే ఉంది. అంత విషాదకరమైన జీవితంలోనూ ఎంత గొప్ప ఆశ ఉందో ఆ ఆశ ,ఆ ప్రేరణ ఈ కథలో అంతర్లీనంగా ఉంది.

కథలో ప్రత్యక్షంగా చెప్పిన విషయాల కంటే పరోక్షంగా చెప్పిన విషయాలు వాచ్యం గా చెప్పిన విషయాల కంటే సూచించిన విషయాలు పాఠకుల హృదయాలకు మెదళ్ళకు పని పెడతాయి. ఈ కథలో లో పితృస్వామ్య దురహంకార వ్యవస్థకు సంబంధించిన అనేక అంశాలు జీవితం పట్ల ఎరుకను కలిగిస్తాయి.మనల్ని హెచ్చరిస్తాయి .

ఆవు పడే ప్రసవ వేదనను ప్రసవానికి ముందు ప్రసవం అప్పుడు ప్రసవం తర్వాత ఆవు శారీరక స్థితిగతుల్ని వర్ణించే క్రమంలో రచయిత్రి వాడిన భాష ,ఉపమానాలు కళ్ళ ముందర కథ జరుగుతున్నట్లు దృశ్యాన్ని చూస్తూ, వింటున్నట్లు గొప్ప భావనను పాఠకులకు కలిగిస్తుంది.

విషాదకర అననుకూల పరిస్థితుల్లో సైతం జీవన మనుగడ కోసం రేపటి కోసం మనిషి పడే తపన కావచ్చు ప్రసరిస్తున్న ఆవు పడే వేదన కావచ్చు ఆ అవును సంరక్షించుకునే క్రమంలో లో గ్రామీణ స్త్రీ చేసిన పోరాటం కథలోని కథాంశం.

వస్తు వైవిధ్యం వాడుక భాష సహజమైన గ్రామీణ పదాల సౌందర్యం కథను మళ్లీ మళ్ళీ చదివింప చేస్తాయి.

కుటుంబానికి యజమానిగా వ్యవహరించే పురుషుడు కుటుంబానికి ఆసరాగా నిలిచే ఆవు పట్ల ఏమాత్రం శ్రద్ధ కనపరచకపోవడం, తల్లి హృదయం తో ఆమె ప్రసవ వేదనతో ఉన్న ఆవును అర్థం చేసుకోవడం ఎట్లాగైనా అవును కాపాడుకోవాలని ఆమె చేసిన ప్రయత్నం , మానవ జీవన పోరాటం లోని సౌందర్యాన్ని తెలియజేస్తుంది.

వేదన అనుభవిస్తున్న అవును కాకుండా పుట్టింది ఏ దూడ అని చూసే మగవాడు ఆవుకంటే అయితే పెయ్యి దూడ నే కనల్ల ,ఆడోల్లు కంటే మగబిడ్డ నే కనల్లా అనే దృక్పథంతో స్వార్థపరుడైన పురుషుడు ఈ కథలో జుగుప్స కలగిస్తాడు. ఆవుల బేరాల కోస్తే కొనుగోలుదారులు మచ్చలు చూస్తారు కాబట్టి దూడ నేల మీద పడితే అని దానికి ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయి అని అతడు చూడటాన్ని ఆమె ఎద్దేవా చేస్తుంది.

ప్రసవానికి ముందు , ప్రసవానంతరం ఆవుకు ఆమె ఎన్నో సపర్యలు చేస్తుంది ఎంతో జాగ్రత్త తీసుకుంటుంది .

ఈ కథలో అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో స్త్రీ తన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి చేసిన ప్రయత్నం చాలా గొప్పగా రచయిత్రి చిత్రించారు. మరణించిన దూడను తలచుకుని ఆ స్పర్శను అనుభవిస్తే తప్ప పాలు ఇవ్వలేని ఆవులు అప్పుడు.కృత్రిమ గర్భధారణ తో ఇంజక్షన్లతో దూడలని కనే ఆవులు ఇప్పుడు.

స్పర్శ తెలియని జీవులకు బిడ్డలు దూరమైనా తెలియదని, అనుబంధాలు క్రమంగా ఎలా పడతాయో సూక్ష్మంగా రచయిత్రి ఈ కథలో నేర్పుగా చిత్రించారు. దూడను ప్రసవించి , మాయని విడిచిన తర్వాత నూతన జీవన పోరాటాన్ని కొనసాగించడంతో ఆ జున్ను పాలతో ఇంట్లోనే పిల్లలు పండుగ చేసుకోవడంతో ఈ కథ ముగుస్తుంది. నిజానికి ఇది ముగింపు కాదు మరొక ప్రారంభం మాత్రమే.మంచి కథను శ్రద్ధగా చదివినప్పుడు కథలో రచయిత చెప్పిన విషయాల కంటే చెప్పని , విషయాలు సూచించిన విషయాలే కథనాన్ని సజీవంగా పాఠకుల కళ్లముందు నిలుపుతాయని , ఈ అంశాలు కథాకథనం పట్ల బలాన్ని నమ్మకాన్ని చేకూరుస్తాయని పాఠకులకు కథను సాక్షాత్కరింప చేస్తాయని తెలుస్తుంది.

ఒక పల్లెటూర్లో రైతు కుటుంబంలో జరిగే సంఘటన తీసుకొని ఆ సంఘటన ద్వారా పితృస్వామ్య భావజాలాన్ని నిరసిస్తూ స్త్రీల సమానత్వాన్ని సాధికారత దిశగా అడుగులు వేయాల్సిన అవసరాన్ని చెబుతూ, చక్కటి శిల్పంతో సహజమైన భాషతో భారతి గారు రాసిన ఈ కథ, కథను శ్రద్ధగా చదవటం వల్ల వల్ల పాఠకులు కొత్త విషయాలను నేర్పుగా గ్రహించగలుగుతారని తెలియజేస్తుంది.

చక్కటి కథనం, సహజమైన భాష ఈ కథకు వన్నె తెచ్చి మంచి కథల జాబితాలో ఈ కథను నిలిపాయని చెప్పవచ్చు.

No. of visitors : 425
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •