అది వొక బడి! కాదు, దేశం!
వారు పిల్లలు! కాదు, ప్రజలు!
బడిని దేశంగా పిల్లల్ని ప్రజలుగా చూశారు ప్రధాన వుపాధ్యాయులు! ఆయన పాలనా పర్యవేక్షణలో భక్తీ దేశభక్తీ పోటీ పడ్డాయి!
దేశంలో అనేక జాతులున్నట్టే ఆ బడిలోనూ వున్నాయి! కాని ʹమనదంతా వొకే జాతి... అదే భారత జాతిʹ అని జాతిని వుద్దేశించి అదేనండీ పిల్లలని వుద్దేశించి వుపాధ్యాయులవారు ప్రసంగించారు! కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకూ మనబడే సారీ మనదేశమే-నని ఆయన మరోసారి ప్రజలకు సారీ పిల్లలకు వల్లె వేయించారు!
ఇది పరీక్షా కాలమన్నారు! ఈ పరీక్షల్లో వుత్తమ పౌరులుగా అంటే వుత్తమ విద్యార్థులుగా నిలబడి తీరాలన్నారు! పిల్లలు కూడా పెట్టిన పరీక్షలకు సిద్ధమయ్యారు! ఒంట్లో రక్తం లేకపోయినా నష్టం లేదని... దేశభక్తి లేకపోతే మటుకు కష్టమని నూరిపోసి వుగ్గుపాలలా పిల్లలచేత తాగించారు! పిల్లలూ హుషారుగా తాగినట్టు తెలీకుండా తాగేశారు!
ʹమిమ్మల్ని మీరు గుర్తించండి... మీ దేశాన్ని మీరు గుర్తించండి...ʹ అని పిల్లలూ వుపాధ్యాయులూ తేడా లేకుండా అందరికీ దేశ పటాల్ని పంచిపెట్టారు ప్రధాన వుపాధ్యాయులవారు! అంతేకాదు, ఈ పరీక్ష పాసయినవాళ్ళే బళ్ళో వుండాలని, లేనివాళ్ళు బడి విడిచిపెట్టి వేరే బడికి వెళ్ళిపోవాలని కూడా ఆజ్ఞలు జారీ చేశారు!
ఇదంతా చూసి పిల్లల తలిదండ్రులు కూడా విద్యార్థులయిపోయారు! ఉత్సాహంగా తాముకూడా యీ పరీక్షలు రాస్తామని ముందుకు దూకి మరీ వచ్చారు!
ʹమేప్ పాయింటింగ్ʹ అని పిల్లలు దేశ పటాల్ని అందుకున్నారు! తలిదండ్రులూ మిగతా వుపాధ్యాయులూ కూడా పటాల పత్రాల్ని అందుకున్నారు! ఎందుకొచ్చిందో గాని అది రాస్తేనే పాసయితేనే పౌరసత్వం అని లేదంటే దేశ బహిష్కారమని అంతా ఘాడంగా నమ్మేశారు!
ʹకాశ్మీరును గుర్తించండిʹ
ʹదేశానికి తలపాగాʹ అని క్లూ కూడా యిచ్చారు!
పిల్లలూ తలిదండ్రులూ వుపాధ్యాయులూ అందరితో పాటు ప్రధాన వుపాధ్యాయులూ తానొక పత్రం అందుకొన్నారు! కాశ్మీరుని అప్పుడే కనుగొన్నట్టు అంతకు ముందది లేనట్టు చాలామంది వెంటనే మార్క్ చేసి యిచ్చేశారు! పౌరసత్వం నిలుపుకున్నంత ఆనందపడ్డారు!
కొందరు బేల ముఖాలు వేశారు! ఇంకొందరు పక్కవాళ్ళని చూసి కాపీ కొట్టి కాశ్మీరును గుర్తించి పాసయ్యారు!
ʹమీరు ఎప్పుడైనా కాశ్మీరు చూశారా?ʹ
ʹచూశాంʹ అన్నారు కొద్దిమంది!
ʹచూడలేదుʹ అన్నారు చాలా యెక్కువ మంది!
ʹపర్లేదు... చూసినా చూడకపోయినా పర్లేదు... మీరు కాశ్మీరుని గుర్తించండి... దేశం మిమ్మల్ని గుర్తిస్తుంది... మేం గుర్తిస్తాంʹ
ఉత్సాహంగా కొందరు వారి పత్రమే కాక పక్కవాళ్ళ పత్రాల్ని తామే రాసి దేశానికి సారీ పిల్లలకు సాయపడ్డారు! పెద్దలకూ తేడా చూపలేదు!
మరికొందరు నిజాయితీగా మీలాంటివాళ్ళు చెపితే వినడమే తప్ప తమకి కాశ్మీరు గురించి అస్సలు తెలియదని చెప్పారు!
తెలియాల్సిన అవసరం లేదని కొందరు విసుక్కున్నారు!
మాకు మాత్రం తెలిసేమిటి?- అని యింకొందరు పోట్లాటకు దిగారు!
వాక్ స్వేఛ్చ వుండడం పేద్ద తలకాయ నొప్పయి పోయిందని నొచ్చుకొని పోట్లాటకు దిగారు!
మొత్తానికి కొందరు కాశ్మీరుని గుర్తించకుండానే పత్రాల్ని తిరిగి ఇచ్చేశారు! అలా యిచ్చేసిన వాళ్ళని అంతా దేశాద్రోహుల్ని చూసినట్టు చూశారు! తక్షణమే బడిని విడిచిపెట్టి బయటకు పోవాలని కళ్ళెర్రజేశారు!
ʹమేం కాశ్మీరుని చూడలేదు, కాశ్మీరు గురించి మాకు తెలీదు...ʹ చెప్పబోతే- ప్రధాన వుపాధ్యాయులవారు కల్పించుకొని ʹమీరు కాశ్మీరుని చూడకపోయినా పర్లేదు, కాశ్మీరు గురించి తెలీకపోయినా పర్లేదు... కాని కాశ్మీరు యెవరిదో చెప్తే చాలుʹ అన్నారు!
ʹకాశ్మీరు యెవరిది? కాశ్మీరీలది!ʹ
అలా చెప్పిన విద్యార్థిని తక్షణమే టీసీ యిచ్చి బళ్ళోనుంచి బయటకు పంపేశారు! ʹలేదు, ఆ విద్యార్థిని అతని తలిదండ్రుల్ని తక్షణమే అరెస్టు చెయ్యాలʹని కొందరు ఆవేశపడ్డారు! వెంటనే ఉపా చట్టం కింద కేసులు పెట్టారు!
దాంతో మిగతావాళ్ళు అనుకున్న దానికంటే యెంతో బాగా తోవకు వచ్చేశారు!
ʹకాశ్మీరు మనది! మన భారతీయులది!ʹ
ఆ మాట అన్నవాళ్ళు కాశ్మీరుని మెప్పాయిన్టింగులో గుర్తించలేకపోయినా సరే- అత్యుత్తమ శ్రేణిలో పాసయిపోయారని ఆ విషయాన్ని ప్రధాన వుపాధ్యాయులవారు అక్కడికక్కడే గర్వంగా ప్రకటించేశారు!
Type in English and Press Space to Convert in Telugu |
ప్లీజ్.. ʹనోట్ʹ దిస్ స్టోరీ!ʹమేం దొంగలం కాదు..ʹ అని నిరూపించుకోవడానికి మా దగ్గరున్న ʹఆధార్ʹలన్నీ చూపించాం. గుడ్డా గోచీ విప్పి మొలతాడు తెంపి దిసమొలలతో నిల్చున్నాం. మా పుట్టుమచ్చలు సయితం... |
పిట్ట కథ!ఇంతలో ఆకులు రాలాయి!? లేదు.. అవి ఆకులు కావు! పిట్టలు! పిట్టల్లా రాలుతున్నాయి!
అతడు వొక పిట్టని చేతుల్లోకి తీసుకున్నాడు. సిద్ధార్థుడిలా నిమిరాడు. పైకి యెగరేసా... |
ఆల్ హేపీస్!కొత్తగా యేర్పడిన రాష్ట్రం మాది. రెండేళ్ళే అయితాంది. అగ్గువచేసి అలుకగా చేసి చూడొద్దు తమ్మీ.. క్రిమినల్ మంత్రులను మేము ఎంకరేజు గట్లా చేస్తున్నం. అన్ని ....... |
గణిత గుణింతము!ʹపవర్లో వుండి సంపాదించుకోకపోతే సంపాదించుకోవడం రాని యెధవ అని అనేస్తారు. చేతకాని దద్దమ్మ.. చవట అని కూడా అనేస్తారు. నాకు మాట పడడం అస్సలు యిష్టం లేదు. సరే, ఈ ల్... |
సమాన స్వాతంత్ర్యం!అన్నిప్రాంతాలకీ సమాన ప్రాతినిధ్యం యివ్వడమంటే స్వాతంత్ర దినాలు జరపడం కాదు, పోలీసు మిలటరీ కవాతులు జరపడం కాదు, తుపాకీలు తిప్పడం కాదు, బూట్ల కాళ్ళని నేలకు తన్నడ... |
పడగ కింద పండు వెన్నెల!చెదిరిన చీమలు పాముల్ని కరవబోయాయి! అంతే... ఫిరంగులు పేలాయి! మట్టి రేగింది! మూడురంగులుగా ముచ్చటగా!
రాజు యెగరేసిన పావురం కత్తిరించిన రెక్కలతో యెగరలేక ఫల్టీకొట్... |
నిలబడిన జాతి గీతం!పౌరుల్లో దేశభక్తి యింకా ప్రబలాలి! ప్రబలిపోవాలి! నార నరాన నాటుకు పోవాలి! అసలు పుట్టగానే వేసే టీకాతో కూడా మన దేశభక్తిని చాటుకోవచ్చు! టీకాగా అశోకచక్రం కలిగిన మ... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |